24518 వార్తలు

న్యూఢిల్లీ: జాతీయ గీతం వందే మాతరంను అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జాతీయ గౌరవ అవమానాల నివారణ (సవరణ) బిల్లు2026ను సోమవారం రాజ్యసభ కార్యాచరణ జాబితాలో చేర్చారు. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ గౌరవ అవమానాల నివారణ చట్టం1971 ప్రకారం జాతీయ జెండా, భారత రాజ్యాంగం, జాతీయ గీతం జనగణమన వంటి జాతీయ చిహ్నాలను అవమానించడం నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.తాజా సవరణ బిల్లు ద్వారా వందే మాతరంకు కూడా జనగణమనకు ఉన్న చట్టబద్ధమైన రక్షణను కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వందే మాతరం ఆలాపనకు ఎవరైనా అడ్డంకులు కల్పించినా, ఏ రూపంలోనైనా జాతీయ గీతాన్ని అవమానించినా అది శిక్షార్హ నేరంగా పరిగణించబడుతుంది. వందే మాతరం రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహిస్తున్న వేళ, జ


దుబాయ్: ఇరాన్ ఆదివారం జోర్డాన్ వైపు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ పరిణామాలతో యుద్ధ ప్రభావం పొరుగు దేశాలకు మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పలు వారాల విరామం తర్వాత మళ్లీ వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. జోర్డాన్‌లోని కీలక నౌకాశ్రయ నగరం అకాబాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది.అమెరికాతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై వైమానిక దాడులతో యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్, అనంతరం తిరిగి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండా దూరంగా ఉంది. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గత వారం విఫలమైన తర్వాత, ఇరాన్ తన దాడులను ప్రధానంగా అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ అరబ్ దేశాలు, జోర్డాన్‌పైనే కేంద్రీకరించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోలేదు. అయితే ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే, ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఈ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది.

హైదరాబాద్: బల్కంపేట బోనాల సందర్శంగా ఆర్‌టిసి అధికారులు నగరంలోని 18 డిపో నుంచి భక్తుల సౌకర్యం కోసం 80 బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌టిసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు మంగళవారం భక్తుల సౌకర్యం కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.రాణి గంజ్ డిపో నుంచి6, కంటోన్మెంట్ డిపో నుంచి 6, బర్కత్‌పురా డిపో నుంచి 4, మిధాని డిపో నుంచి 6, హెచ్‌సియు డిపో నుంచి 6, కుషాయిగూడ నుంచి 4, మెహదీపట్నం డిపో నుంచి 8, కాచిగూడ నుంచి 5, హయాత్‌నగర్ డిపో నుంచి 2 ,దిల్‌షుక్‌నగర్ డిపో నుంచి 5,ఫరూక్‌నగర్ డిపో నుంచి 4, జీడిమెట్ల డిపో నుంచి 4, ఉప్పల్ డిపో నుంచి 4, మియాపూర్ డిపో2 నుంచి 4, ముషీబాద్ డిపో నుంచి 4,కంటోన్మెంట్ డిపో నుంచి 3, కూకట్ పల్లి డిపో నుంచి 5 బస్సులు మొత్తం 80 బస్సులను బల్కం పేట బోనాల సందర్భంగా భక్తుల సౌకర్యం ఉపయోగిస్తున్నామంటున్నారు.

మనతెలంగాణ / సిటిబ్యూరోః ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజ్(17) అలియాస్ అజాన్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి ఫైజ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు, స్థానికంగా ఉంటున్న రౌడీషీటర్ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

న్యూఢిల్లీ: జులై 20న చేపట్టనున్న పార్లమెంట్ ముట్టడిని దేశానికి ‘రెండో స్వాతంత్య్ర ఉద్యమం’గా సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అభివర్ణించారు. అన్యాయం నుంచి విముక్తి, భయం నుంచి స్వేచ్ఛ కోసం ఈ ఉద్యమం జరుగుతోందని పేర్కొంటూ, భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్, తన భార్య గీతాంజలి జే. ఆంగ్మో ద్వారా చేతిరాత సందేశాన్ని విడుదల చేశారు. ఆ సందేశాన్ని ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ సందేశంలో.. ‘జులై 20, భారతదేశ రెండో స్వాతంత్య్ర ఉద్యమం. ప్రశ్నపత్రాల లీకేజీల వంటి అన్యాయాల నుంచి స్వేచ్ఛ... నా అక్రమ నిర్బంధం వంటి భయం నుంచి విముక్తి. పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించండి. దీన్ని ఘన విజయవంతం చేయండి’ అని పేర్కొన్నారు. అలాగే, ‘సఫ్దర్‌జంగ్‌లో నా అక్రమ నిర్బంధం నుంచి గీతాంజలి ద్వారా పంపిస్తున్న సందేశం’ అంటూ తన సందేశాన్ని ముగించారు. తాను కోరుకోకపోయినా జంతర్‌మంతర్ నిరసన స్థలం నుంచి బలవంతంగా తీసుకెళ్లి, తన ఇష్టానికి విరుద్ధంగా సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఉంచారని వాంగ్‌చుక్ గతంలో చేసిన ఆరోపణలను ఈ సందేశం మరోసార

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రైలు నం. 07787 కాచిగూడ - తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23న నడుపనున్నారు. రైలు నం. 07788 తిరుచానూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 24న నడుపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లోనూ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట్ల స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ రైలులో ఎసి II టైర్, ఎసి III టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగాన్ని అందులో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌నకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర, సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి వంటి అన్నిరకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటు ట్రస్టునకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలపాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అందులోని సభ్యులందరినీ ప్రభుత్వమే నియమించిందని రాహుల్, ఖర్గే ప్రస్తావించారు. ట్రస్టు సభ్యులంతా ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి వాటి అనుబంధ సంస్థలకు చెందినవారని తెలిపారు. ఈ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రెటరీ మీకు అత్యంత సన్నిహితుడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు త

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కరోనా విజృంభిస్తోంది. రాజమహేందవరంలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. దీంతో ఎపిలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 16కు చేరినట్లైంది. ఆదివారం రాజమండ్రిలో 21ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్దారించారు. యువకుడిని రాజమండ్రి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎపిలోని వివిధ ఆస్పత్రుల్లో ఐదు గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. నలుగురు బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండగా ముగ్గురు కరోనా నుంచి కోలుకున్నారు. ఎపిలో ఇప్ప టివరకు కోవిడ్‌తో నలుగురు మృతి చెందారు. ఎపిలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమో దవుతున్న కేసు ఒమిక్రాన్ ఆర్5 వేరియంట్‌గా గుర్తించారు. ఈ వేరియంట్ సోకినవారిలో గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, అల సట, బాడీపెయిన్స్, లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చికిత్స తీసుకుంటే నయం అవుతుందని వైద్యులు అంటున్నారు.

నవతెలంగాణ-ఆలేరు టౌను లో వెంటేజీ విద్యుత్ సమస్యతో రైతులకు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ ఆలేరు పట్టణంలో ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కరెంట్ కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. అప్పులు చేసి మరీ పంటలు వేసిన రైతును విద్యుత్ సమస్య వేధిస్తోందన్నారు. తెలంగాణలో వర్షాభావం, విద్యుత్ సమస్యలు అన్నదాతలను తీవ్రంగా వేధిస్తున్నాయని, ఎల్-నినో ప్రభావంతో వర్షాలు లేక, మరోవైపు కరెంటు కోతలు, లో-వోల్టేజ్ సమస్యల వల్ల బోరుబావులు నడవడం కష్టమై పంటలు ఎండిపోతున్నాయని […] The post లో-వోల్టేజ్ సమస్యలతో తీవ్ర నష్టాల ఊబిలోకి రైతాంగం appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్ : విశాఖపట్నం జిల్లా ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గండిగుండం సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపుతప్పి, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జవగా, అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు వీరంతా కారులో వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా, నలుగురు చనిపోగా.. పల్నాడు జిల్లా నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ (పర్సనల్ అసిస్టెంట్) చంద్రశేఖర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విష మంగా ఉండటంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చంద్ర శేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలన


నవతెలంగాణ-ఆలేరు టౌన్ క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఆలేరు పట్టణానికి చెందిన వందలాది మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి పరారైన ప్రధాన నిందితుడు ఎం.డి. గౌస్‌ను వెంటనే అరెస్టు చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆలేర్ పట్టణంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు బాధితులు వినతి పత్రం అందజేశారు. రామంతాపూర్‌కు చెందిన ఎం.డి. గౌస్, అతని భార్య వజీద కలిసి యూనిటీ మెటా (యూనిటీ మేట) కంపెనీ పేరుతో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని […] The post క్రిప్టో స్కీమ్‌లో రూ.10 కోట్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి appeared first on Navatelangana.

– పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యూపీ మహిళ– 108 సిబ్బందిని అభినందించిన జిల్లా అధికారులు నవతెలంగాణ-సత్తుపల్లిసత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవి అనే గర్భిణికి ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి హుటాహుటిన ఆమె ఉంటున్న నివాస స్థలానికి చేరుకున్నారు. అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు(ఈఎంటీ) ప్రవీణ్, పైలట్ కట్టం మహేష్ స్థానిక ఆశా వర్కర్ సహాయంతో బాధితురాలిని సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ […] The post 108 అంబులెన్స్‌లో మహిళకు ‘ప్రసవం’ appeared first on Navatelangana.

– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి– ప్లకార్డులతో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన నవతెలంగాణ-సత్తుపల్లినీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా కోరుతూ సీపీఐ(ఎం) […] The post సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం appeared first on Navatelangana.

• సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ • ఎలోని కుంట మరమ్మతు పనులు ప్రారంభం నవతెలంగాణ -పెద్దవంగర గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చొరవ చూపుతానని సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అన్నారు. ఆదివారం పెద్దవంగర గ్రామంలోని ఎలోని కుంట కట్ట మరమ్మతు పనులను సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ […] The post గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ appeared first on Navatelangana.

• బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో నవతెలంగాణ – పెద్దవంగరఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి సాగునీటి జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, వెలిగొండ -తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సాగునీరు అందక రైతులు […] The post సాగునీటి జలాలను విడుదల చేయాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-రెంజల్ రెంజల్ మండలం సాటాపూర్ ఉప సర్పంచ్ వికార్ పాషా ను రెంజల్ మండల ఉప సర్పంచ్ లందరూ ఆయనకు శలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రెంజల్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎప్పటికైనా తరువాత ఆయన రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం తమకు గర్వకారణమని ఉప సర్పంచులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు సర్దార్ చరణ్ సింగ్, శ్రీకాంత్, అఫ్జల్, శ్రీనివాస […] The post ఉప సర్పంచుల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులకు ఘన సన్మానం appeared first on Navatelangana.

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ కు.. ఓపెనర్లు డకెట్, బెతెల్ లు 192 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. డకెట్(135 బంతుల్లో 141 పరుగుల) సూపర్ సెంచరీ అలరించాడు. ఇక, బెతెల్ (91) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత జో రూట్ (74 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగగా.. చివర్లో జోస్ బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే అజేయంగా 41 పరుగులతో విజృంభించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోరు చేసింది. మరికాసేపట్లో భారత్ 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత భౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని సుభాష్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ ఫుట్‌వేర్ షాపును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వ్యాపారంలో నిరంతరం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన పాదరక్షలను సరసమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు. “కస్టమర్ల సంతృప్తే వ్యాపార విజయానికి మూలం. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడం ద్వారా […] The post రామ్ ఫుట్‌వేర్ షాపును ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి appeared first on Navatelangana.

– అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం లో పర్యావరణ.. పరిరక్షణకు ప్రతిజ్ఞ– రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు నవతెలంగాణ – కామారెడ్డి“ప్రకృతికి జీవం పోదాం”- ప్లాస్టిక్ ను నిషేదిద్దాం నినాదంతో అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం పర్యావరణ. పరిరక్షణ కు ప్రతిజ్ఞ చేద్దామని రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వివిధ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కలిసి అవగాహన […] The post ప్రకృతికి జీవం పోద్దాం – ప్లాస్టిక్ ను నిషేదిద్దాం appeared first on Navatelangana.

– మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం – సర్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ – తొగుట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్య క్షులు పంది రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన […] The post కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి appeared first on Navatelangana.
