24517 వార్తలు

పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగ్రామం నుంచి మహానగరం వరకు నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గూడు లేని ప్రతి అర్హులైన నిరుపేద కుటుంబానికి చివరి లబ్ధిదారుని వరకు గౌరవప్రదమైన సొంతింటిని నిర్మించి అందించే వరకు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన సొంత నివాసం కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించిందన్

సొంతూళ్లలోనే ఎన్యూమరేషన్ ఫారాలుఓటరు ఫొటో అతికింది, ఫారం నింపి ఇవ్వాలి ఎవరికైనా చెబితే ఫారాలు నింపి ఇస్తారో ఇవ్వరో..?అనే సందేహంఒకసారి స్వగ్రామంలో ఓటు తొలగిస్తే మళ్లీ ఓటు వస్తుందో..లేదో..? అనే ఆందోళనసొంతూరిలో ఓటు లేకపోతే విలువ ఉండదనే భావన భారమైనా సొంతూరిలో ఓటును కాపాడుకోవాలనే తపన అటు రోజువారీ కూలీ నష్టం.. ఇటు ప్రయాణ ఖర్చులు ఉపాధి పనులు వదులుకుని ప్రయాణాలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ క్షేత్రస్థాయిలో వలస కూలీల పాలిట తీవ్ర భారంలా మారుతోంది. ఓటు హక్కును కాపాడుకునేందుకు, బూత్ లెవెల్ ఆఫీసర్ (బిఎల్‌ఒ) ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను తీసెకుని, వాటిని నింపి ఇవ్వడానికి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు విధిలేని పరిస్థితుల్లో సొంతూళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. బతుకుదెరువు కోసం సొంతూళ్లను వదిలి నగరాలకు వలస వెళ్లి అక్కడ ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలు రెండు మూడు రోజులు తమ పనులు వదులుకుని సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. నగరాల్లో రోజువారీ కూలీ పనులకు చేసుకునే వారికి ఒక్క రోజు పని లేకపోయినా ఆ కుటుంబం గడవడం కష్టమవుతుంది. అలాంటిది, ఎ

ఎనిమిది బిల్లులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వం నేడు పార్లమెంట్ ముందుకు రెండు కీలక బిల్లులు అయోధ్య విరాళాల దుర్వినియోగం, నీట్ ప్రశ్నపత్రం లీక్, పెట్రోల్‌లో ఇథనాల్, వాంగ్‌చుక్ దీక్ష భగ్నంతదితర అంశాలపై నిలదీసేందుకు సిద్ధమైన విపక్షాలు అఖిలపక్షం నుంచి విపక్షాల వాకౌట్ శివసేన సభ్యుల విలీనం, టిఎంసి ఎంపిలకు ప్రత్యేక సీట్ల కేటాయింపుపై నిరసనన్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ప్రతిపక్షాల నిరసనతో ఉద్రిక్తంగా మారింది. తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలను సమావేశానికి ఆహ్వానం పలకడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ లు ప్రతీకాత్మకంగా వాకౌట్ చేశాయి. అనంత రం నిరసన వ్యక్తం చేసిన తర్వాత తిరిగి సమావేశంలో పాల్గొన్నప్పటికీ, రానున్న వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపించాయి. అధికారవిపక్షాల్లో సంఖ్యాపరమై న మార్పులు, కీలక బిల్లుల నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. మారిన పరిస్థితు ల్లో ఇవి వాడీవేడిగా జరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడుగా శనివారం మరో రెండు పరిణ

తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డిఎంపీలు పార్లమెంటుకు వెళ్ళినా సమీక్షించాల్సిందే ‘సర్’ పూర్తయ్యేంత వరకూ నేతలు గాంధీ భవన్‌కు రావొద్దు ‘జూమ్’లో పాల్గొన్న మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలుమన తెలంగాణ/హైదరాబాద్‌ః ఓట్ల సవరణ ప్రక్రియ(సర్) పర్యవేక్షణ బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు వెళ్ళినా అక్కడి నుంచే సమీక్షించాల్సిందేనని ఆయన కఠినంగా అన్నారు. ఆదివారం పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ‘సర్’ సమన్వయకర్తలు పాల్గొన్నారు. జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ‘సర్’ను ఇన్‌చార్జి మంత్రులు పూర్తిగా పర్యవేక్షణ చేయాల్సిందేనని అన్నారు. అన్నింటికీ వారిదే బాధ్యత అని చెబుతూ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పట

జమ్మూ కశ్మీర్‌లో 13మంది, నాగాలాండ్‌లో 8 మంది మృతి పలువురు గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలైన రాజౌరి, పూంచ్ జిల్లాలను ఆకస్మిక వరదలు బెంబేలెత్తించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ధాటికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనావాసాల్లోకి నీరు చేరింది. దీంతో పలుచోట్ల నివాస భవనాలు దెబ్బతినగా, మరికొన్ని చోట్ల రహదారులు తెగిపోయి, వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నూతనంగా నిర్మించిన బస్టాండ్ నీటమునిగింది. జమోలా, దార్హలి, ఖాండ్లీ తదితర నదులు ఉపొంగి ప్రవహిస్తోంది. చీనాబ్ నదికి వరదలు పోటెత్తడంతో గేట్లు ఎత్తి అధికారులు వరద జలాలను దిగువకు వదులుతున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున

తక్షణ విచారణ జరపండినిధుల వినియోగంపై ఆడిట్‌కు డిమాండ్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బండి సంజయ్ లేఖ మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధుల మళ్లిస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్‌కు లేఖ రాశారు. నిర్దేశిత లక్ష్యాలకు విరుద్దంగా ఆర్ధిక సంఘం నిధులను ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయడం లేదని, కరెంట్ బిల్లులు, డీజిల్ బిల్లులు, శానిటేషన్ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలకు నిధులను మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ల పాత బకాయిలను కూడా ఈ నిధుల నుండే చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. 73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243జి అధికరణం, 11వ షెడ్యూల్, అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఇది విరుద్ధం అని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం రూ.2,293.74 కోట్ల ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేసిందని, మరో రూ.729.41 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత

కెసిఆర్‌కు పేరు వస్తుందనే.. గోదావరి జలాలు ఎత్తిపోయడం లేదు రాష్ట్రంలో మళ్లీ బోరుబండ్లు తిరిగే పరిస్థితి వచ్చింది రైతులు కన్నెర్రజేస్తే కాంగ్రెస్ పని ఖతమే మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న సిద్దిపేట ఎంఎల్‌ఎమన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్రంలో నెలకొన్న ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం రైతులు ఆదివారం అనంతగిరి పోచమ్మ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్ వరకు చేపట్టిన మహా పాదయాత్రలో ఆయ న పాల్గొన్నారు. అనంతరం రంగనాయకసాగర్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతోనే కాలంతో పనిలేకుండా భూమికి బరువైనంత పంటలు పండాయన్నారు. మళ్లీ కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు పంట పొలాలకు అందితే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందన్న అక్



ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై గ్రామ గ్రామానా చైతన్యంతాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు యాక్షన్ ప్లాన్‘మిషన్ మోడ్’లో ఉమ్మడి కరీంనగర్ కార్యాచరణ :మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్లూరికరీంనగర్ కలెక్టరేట్ సమీక్షలో మంత్రుల దిశా నిర్దేశం!నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ‘మిషన్ మోడ్’లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి […] The post మిషన్ మోడ్‌లో ‘ఎల్‌నినో’ ఎదుర్కొందాం appeared first on Navatelangana.

ఐక్యపోరాటాలతోనే హక్కులు సాధించగలంఆత్మ గౌరవంతో ఉద్యోగం చేసే పరిస్థితి ఉండాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులునవతెలంగాణ – మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధిసమస్యలు లేని విలీనం, సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ను బలపరచాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఏలాంటి సమస్యలు లేకుండా జరగాలన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు డిపోల ఆర్టీసీ కార్మికుల గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హజరైన వీరాంజనేయులు […] The post సమస్యల్లేని విలీనం, ఉద్యోగ భద్రత కావాలి appeared first on Navatelangana.

ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపు.. ఫెర్రాన్ టోరెస్ సూపర్ గోల్2010 ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచిన తర్వాత ఏ వరల్డ్‌కప్‌లోనూ స్పెయిన్ నాకౌట్ మ్యాచ్‌లో నెగ్గలేదు.సమిష్టితత్వంతో బలమైన జట్టుగా ఎదిగిన స్పెయిన్ 2024 యూరో చాంపియన్‌గా నిలిచి.. ప్రపంచకప్‌పై కన్నేసింది.ప్రపంచకప్ వేటలో వరుసగా 37 మ్యాచ్‌ల్లో అజేయ రికార్డుతో ఫైనల్లోకి ప్రవేశించింది.ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను స్పెయిన్ వెనక్కి నెట్టేసింది. సూపర్ ఎటాకింగ్‌తో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయినా, అర్జెంటీనా డిఫెన్స్‌తో స్పెయిన్‌ను అడ్డుకుంది. ఎట్టకేలకు,106వ నిమిషంలో […] The post చాంపియన్ స్పెయిన్ appeared first on Navatelangana.

‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఉచిత సౌర విద్యుత్ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ :ఇల్లందు విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కనవతెలంగాణ-ఇల్లందుఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకూ విస్తరించిన గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోడు భూముల హక్కులు పొందిన గిరిజన రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ […] The post గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్ appeared first on Navatelangana.

వృత్తిదారులకు రూ.10 లక్షల సాయం ఏమాయే?దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం తేవాలి:రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఇచ్చిన హామీలు అమలు చేయాలినవతెలంగాణ- వంగూరుకామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రతి వృత్తిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం తేవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి […] The post బీసీ డిక్లరేషన్‌లో రజకులకు appeared first on Navatelangana.


టోక్యో: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించి నయా చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 2117, 2117 తేడాతో చిరకాల ప్రత్యర్థి అకానె యమగూచి (జపాన్)ను ఓడించింది. 2022 తర్వాత ఓ ప్రధాన టోర్నమెంట్‌లో సింధు టైటిల్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. యమగూచితో జరిగిన తుది పోరులో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు ఏ దశలోనూ యమగూచికి పైచేయి సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. నిలకడైన ఆటతో లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకుంది. తర్వాతి సెట్‌లోనూ భారత షట్లర్‌కు ఎదురు లేకుండా పోయింది. అద్భుత ఆటతో అలరించిన సింధు ప్రత్యర్థిని హడలెత్తించింది. తీవ్ర ఒత్తిడికి గురైన అకానె వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సింధు సఫలమైంది. చివరి వరకు నిలకైడన ఆటను కనబరుస్తూ వరుసగా రెండో సెట్ గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జపాన్ ఓపెన్ టైటిల్ సాధించి తొలి భారత షట్లర్ నయా రికార్డును నెలకొల్పింది. ఫైనల్లో గెలిచిన అనం

చారిత్రక లార్డ్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దంచికొడుతున్నాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్, శుభ్ మన్ గిల్ లు మంచి శుభారంభాన్ని అందించారు. గిల్(77) అర్ధ శతకంతో రాణించగా.. రోహిత్ శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సూపర్ సెంచరీ సాధించాడు. రోహిత్ భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ప్రస్తుతం భారత్ 34 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్(117), విరాట్ కోహ్లీ(26)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 161 పరుగులు కావాల్సి ఉంది.


మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిలో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి అందజేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు నెలల కోటా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఫెయిర్ ప్రైస్ దుకాణాల ద్వారా అర్హులైన రేషన్ కార్డుదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందజేయనున్నారు. గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.

బండి-ఈటల చేతులు కలిపితే బిజెపి అధికారంలోకి వస్తుందా?ముగ్గురు కమలనాధుల అహం సంగతేమిటీ ? మళ్ళీ ఫైర్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బిజెపి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ చేతులు కలపడంతోనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందా? అని ఇదివరకే పార్టీ నుంచి సస్పెనన్‌కు గురైన ఎమ్మెల్యే రాజా సింగ్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ మంచి ఆలోచనతో వారిని కూర్చొబెట్టి నచ్చజెప్పడం బాగానే ఉంది కానీ ఇద్దరు ముగ్గురు నేతల అహం (ఇగో)తో పార్టీకి ఎంత నష్టం జరిగిందో జాతీయ నాయకత్వానికి చెప్పండి అని సూచించారు. ఆదివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమిటీ?, వారిని ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతంలో చాలామంది మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలుపొందారని, వారి సమస్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అని ఆయన ప్రశ్నించారు.గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్లో మూడు మేయర్ పదవులు గెలుస్తామని పార్టీ నేతలు అంటున్నా

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సభను చూసి జనం నవ్వుకుంటున్నారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అసలు సంగ్రామ సభ ఎందుకు నిర్వహించారో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పాలని ఏలేటి ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.బిఆర్‌ఎస్ బాటలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని, ప్రజలను మోసగించడంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇద్దరు కలిసి జగన్నాటకం ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒకరిది అధికార దాహం.. మరొకరిది ధన దాహం అని ఆయన విమర్శించారు. సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం బిఆర్‌ఎస్ నిర్వహించిన సభలో కెటిఆర్ మొసలి కన్నీరు కార్చారని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ళల్లో 4 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీలూ సింగరేణి దివాళా తీసేలా చేశాయని ఆయన విమర్శించారు. విద్యార్థులకు ఫీ-రీయంబర్స్‌మెంట్ చేయలేదని, పదవీ విరమణ చేసిన వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని ఏలేటి తూర్పారపట్టారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డీఎంకే కోరింది. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య ఆధారంగానే మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని పార్టీ స్పష్టం చేసింది. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివ ఈ అంశాన్ని ప్రస్తావించారు.సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత లోక్‌సభ బలాన్ని ఆధారంగా తీసుకుని మహిళల రిజర్వేషన్ బిల్లుకు డీఎంకే పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఆ ప్రక్రియ దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడితే, నియోజకవర్గాల పునర్విభజనను 25 సంవత్సరాల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు. మహిళల రిజర్వేషన్ అమలుతో పాటు డీలిమిటేషన్‌పై ప్రభుత్వం తన వైఖరిని స్ప
