19938 వార్తలు


అమరావతి: పోగాకు అంశాన్ని రాజకీయం చేసేందుకు వైసిపి యత్నిస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. పోగాకు రైతులకు వడ్డీ లేకుండా రూ. 50 వేల రుణం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన పొగాకు కొనుగోలు చేస్తామని ఎగుమతి దారులు రోజుకు 2 మిలియన్ కిలోల పొగాకు కొనేందుకు హామీ ఇచ్చారని తెలియజేశారు.వడ్డీలేని రుణాల వల్ల సుమారు 40 వేల మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరుతుందని పెమ్మపాని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాలని 2015 లో సిఎం చంద్రబాబు ఆలోచించారని, 2,700 ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించేందుకు జిఎంఆర్ అంగీకరించిందని అన్నారు. 2019 నాటికే సిఎం చంద్రబాబు 2,200 ఎకరాలు భూసేకరణ చేశారని, వైసిపి నేతలు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల మిగతా 500 ఎకరాలు సేకరించలేదని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి కొన్ని కేసులు విత్ డ్రా చేసుకుందని, వైసిపి సేకరించింది కేవలం 300 ఎకరాలు మాత్రమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టులో అవినీతి జరిగిందని జగన్ రీటెండర్ చేశారని, జగన్ రీటెండర్ చేయడంవల్ల భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం





ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్థిక్ పాండ్యాను ఆ జట్టు వదలుకుంటుందని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సంప్రదింపులు జరిపిందనే వార్తలు బయటకు వచ్చాయి. శివమ్ దూబెతో పాటు.. మరొకరిని తమ జట్టులోకి తీసుకొని ముంబై హార్థిక్‌ను చెన్నైకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. ‘‘మేం ఇప్పుడు పోస్ట్ సీజన్ రివ్యూ నిర్వహిస్తున్నాం. అన్ని కోణాల్లో సమీక్షించి నివేదికను సిద్ధం చేసుకుంటాం. ఇప్పటి వరకైతే ఆటగాళ్ల ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదు. రివ్యూ పూర్తైన తర్వాతనే ట్రేడింగ్ గురించి ఆలోచిస్తాం. అందుకు ఇంకా సమయం పడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం’’ అని ముంబై ఇండియన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు.




లిమా: పెరూలో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా నగర శివారులో విమానం కూలిపోవడంతో 13 మంది పర్యాటకులు మృతి చెందారు. ఏరోడియాన అనే ఎయిర్ లైన్ కంపెనీకి చెందిన సెస్నా కారవాన్ సి208 విమానంలో ఇటలీ, జర్మన్, స్పానిష్‌కు చెందిన 11 మంది పర్యాటకులు పిస్కో విమానాశ్రయం నుంచి నాజ్కో లైన్స్ విహార యాత్రకు బయలు దేరారు. టేకాఫ్ అయిన ఐదు నిమిషాల వ్యవధిలో సోకోస్ ప్రాంతంలో ఎటిసితో సంబంధాలు తెగిపోయాయి. నాజ్కా నగర శివారులో విమానం కూలినట్టు అధికారులు గుర్తించారు. 11 మంది పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది చనిపోయారని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని విమానయాన అధికారులు పేర్కొన్నారు.


అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి భోగాపురం ఎయిర్ పోర్టుని వేదికగా వాడుకున్నారని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శనివారం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం లో దేశ ప్రధాని ముందు కూడా అబద్ధాలు ఆడారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాల క్లియరెన్స్ లు వచ్చింది జగన్ హయాంలోనేనని, 2026లో ఎయిర్ పోర్టుని ప్రారంభిస్తామని ఆనాడే జగన్ చెప్పారని అమర్నాథ్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందని విమర్శించారు. చేయని పనికి క్రెడిట్ కొట్టేసే ఉద్దేశాలు తమకు లేవని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చేసింది కొబ్బరికాయ కొట్టడం.. గుమ్మడికాయ కట్టడం మాత్రమేనని, దారినే పోయే వాళ్లు ఎవరైనా కొబ్బరికాయ కొడతారని, గుమ్మడికాయ కడతారని ఎద్దేవా చేశారు. మిగతా పనంతా చేసింది జగనేనని అమర్నాథ్ పేర్కొన్నారు.


హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పరాశక్తి, జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకున్నారు. ఈ పవిత్ర బోనాల మహోత్సవం ప్రతి భక్తుని జీవితంలో ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యం, శుభసంకల్పాలు నింపాలని కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో సమర్పించే ప్రతి బోనం అమ్మవారికి ప్రీతికరమై, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.

తిరుపతి: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడంతో స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు.



గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్ ఘోర తప్పిదానికి పాల్పడింది. నాప్‌కిన్‌పై అసంపూర్తిగా భారత మ్యాప్‌ను ముద్రించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత బాక్సర్ లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదరు రెస్టారెంట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లవ్లీనాతో పాటు పలువురు భారత అథ్లెట్లు రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లారు. ఆ సమయంలో ‘మిస్టర్ సింగ్స్ ఇండియా’ అని అసంపూర్తిగా ఉన్న భారత మ్యాచ్‌ను లవ్లీనా గమనించారు. భారత మ్యాప్‌లో కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేకుండా ముద్రించారని పేర్కొన్నారు. ‘‘మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఆ మ్యాప్‌లో ముద్రించలేదు. భారత్‌లోని ప్రతి భాగం ముఖ్యమైందే’’ అని లవ్లీనా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆమెకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఈశాన్య రాష్ట్రాలే కాదు.. ఆ మ్యాప్‌లో కశ్మీర్ కూడా అసంపూర్తిగా ఉందని తెలిపారు. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని రెస్టారెంట్ ప్రతినిధులను డిమాండ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకూ ఆ రెస్టారెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

లక్నో: సోషల్ మీడియాలో ఓ యువతిని ఎస్‌ఐ పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. అతడిపై ఫిర్యాదు చేయడంతో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో పాటు విడాకులు తీసుకుంటానని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సత్యేంద్ర గౌతమ్ అనే ఎస్‌ఐ కాన్పూర్‌లోని సేన్ పాశ్చిమ్ పారా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బిటెక్ చదివిన ఓ యువతి 2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని రూమ్‌కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో సదరు ఎస్‌ఐపై పిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఆమె శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు విడాకులు ఇస్తానని బెదిరించడంతోపాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్‌ఐ తనని మళ్లీ చేసుకున్నాడని, ఇప్పుడు తనపై దాడి చేయడంతో పాటు ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేస


