
3762 వార్తలు



కోల్‌కతా: బుధవారం పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో మధ్యాహ్నం ఒంటి గంటకే 61.11 శాతం పోలింగ్ నమోదైంది. హావ్‌డా ఉత్తర్లో 63.16 శాతం ఓటింగ్ రికార్డయింది. బారక్‌పుర్‌లో 61 శాతం మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డైమండ్ హార్బర్, భవానీపుర్, సందేశ్‌ఖాలీ, దమ్దమ్లోనూ 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.





హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఎస్‌ఎస్‌సి బోర్డ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 5,17,760 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,16,534 మంది(99.76 శాతం) హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పరీక్ష ఫలితాల కోసం కింద క్లిక్ చేయండి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొంటారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే, ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు త్వరగా ఫలితాలను అందించాలనే ఉద్దేశంతో పరీక్షలు పూర్తికాకముందే ఈనెల 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో పదో తరగతి ఫలితాల కో


హీరోయిన్ రష్మిక నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మైసా’. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమాకు సంబంధిచి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది, ఈ సినిమా కోసం రష్మిక ఓ భారీ యాక్షన్ సన్నివేశంలో ఎలాంటి డూప్ లేకుండా చేసిందని డైరెక్టర్ రవీంద్ర పుల్లె చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘‘రష్మిక పోషిస్తున్న పాత్ర పేరు ‘మైసా’. చాలా ప్రభావవంతమైన పాత్ర. ఆమె ప్రదర్శించే కోపం, ఆవేశం ఈ సినిమాకు హైలైట్. ఇటీవలే కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద ఓ క్లిష్టమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరించాం. రష్మిక డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. ఆ సమయంలో ఆమె చేతులకు, కాళ్లకు గాయాలయ్యయ. అయినా కూడా విరామం తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆమె నిబద్ధత చూసి చిత్ర బృందమంతా ఆశ్చర్యపోయింది’’ అని రవీంద్ర తెలిపారు.




పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించాడు. 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. దీంతొ ఆతడక ప్రాతినిధ్యం వహిస్తున్న పెషావర్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి.. 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలలో ఇస్లామాబాద్ బోల్తా పడింది. 151 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ విజయంతో పెషావర్ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఇక బాబర్ ఆజామ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో పాటు అనితర సాధ్యమైన రికార్డు సాధించాడు. టి-20 క్రికెట్‌లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఈ సెంచరీతో కలిపి టి-20ల్లో బాబార్ కెప్టెన్‌గా 9 సెంచరీలు చేశాడు.విఆ తర్వాతి స్థానాల్లో డెప్లెసిస్ (8 సెంచరీలు), క్లింగెలర్ (7 సెంచరీలు), కోహ్లీ (5 సెంచరీలు), విన్స్ (5 సెంచరీలు) ఉన్నారు.

కోల్‌కతా: మామిడి పండ్లు ఇస్తానని చెప్పి ఇంట్లో తీసుకెళ్లి బాలికపై జవాన్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెస్ట్ బుర్దాన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అసనన్‌సోల్ ప్రాంతంలో పదేళ్ల బాలిక తన స్నేహితురాలు బాలికతో కలిసి మామిడి పండ్ల కోసం సిఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్‌లోకి వెళ్లింది. రమాకాంత్ విశ్వకర్మ అనే జవాన్ బాలికలకు మామిడ పండ్లు ఇస్తానని ఆశ చూపాడు. అనంతరం పదేళ్ల బాలికను తన రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. అక్కడి నుంచి జవాన్ తప్పించుకున్నాడు. బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో స్థానికలతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సీతల్ పూర్ గేట్ నం3 వద్ద నిందితుడు రమాకాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుంట్లూరులో ప్రజయ్ గుల్మహార్ గ్రేటెడ్ కమిటీలో రోడ్డు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ప్రజయ్ గుల్మహార్ గ్రేటెడ్ కమిటీలో రోడ్డు కబ్జా చేశారంటూ బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు అడ్డుకున్నారు. ఎలాగైనా కూల్చి వేస్తామంటూ హైడ్రా అధికారులు భీష్మించుకొని కూర్చోవడంతో రెండు గంటల పాటు హై డ్రామా చోటుచేసుకుంది. పోలీసులు భారీగా చేరుకొని కాలనీ వాసులను బయటకు పంపించారు. వెంటనే హైడ్రా సిబ్బంది బుల్డోజుర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు.

ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించిన సినిమా జన నాయగన్. విజయ్ ఆఖరి సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా విడుదలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మే 8న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానున్నట్టు తెలిసింది. అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సినిమా రానుందని సమాచారం. ఇంకోపక్క సూర్య నటించిన ‘కరుప్పు’ మే 15న రానుందట. కానీ ‘జననాయగన్’ సినిమాను మే 8నే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి దీనిపై మేకర్స్ ఏమన్నా క్లారిటీ అందిస్తారో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో రీల్స్ చేసిన ఫేక్ పోలీసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రీల్స్ చేసిన ఫేక్ పోలీసు నిఖిల్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు యూనిఫాంతో సచివాలయంలో నిఖిల్ అనే యువకుడు రీల్స్ చేశాడు. పరారీలో ఉన్న నిఖిల్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు కేసులు ఉన్నట్లు సమాచారం. రీల్స్ కోసం పాత బస్తీలో పోలీస్ డ్రెస్ కొని సిఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానని, ఐపిఎల్ టికెట్స్ ఇప్పిస్తామంటూ నిఖిల్ వీడియోలు చేసినట్టు సమాచారం. ఏకంగా సిఎంనే కల్పిస్తానని ఇలాంటి చీటర్లు సెక్రటేరియట్ లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎత్తిచూపే వరకు ప్రభుత్వ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సెక్రటేరియట్లో భద్రతా లోపం అనేది ఇది మొదటిసారి కూడా కాదు అని, ఫేక్ ఐడెంటిటీతో సెక్రటేరియట్లోకి ప్రవేశించిన సంఘటనలు చాలానే ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రియాన్ డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ కాలుస్తూ.. కెమెరా కంటికి చిక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో 16వ జరుగుతున్న సమయంలో తోటి టీం మేట్స్ ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ పక్కన ఉండగానే రియాన్ ఈ పని చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపిఎల్ నిబంధనల ప్రకారం.. స్టేడియంలో, డ్రెస్సింగ్ రూమ్‌ల్లో ధూమపానానికి అనుమతి లేదు. నిర్దిష్టమైన ప్రదేశాల్లో మాత్రమే పొగ తాగాలని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాక.. 2019 నుంచి భారత్‌లో ఈ-సిగరెట్లను నిషేధించారు. ఒకవేళ రియాగ్ ఈ-సిగరెట్ తాగాడని తేలితే.. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) 2019 కింద అతడికి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అంతకంటే ముందే ఈ ఘటనపై బిసిసిఐ విచారణ చేపట్టి పరాగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఛాన్స
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ రెండు విడత అసెంబ్లీ ఎన్నికలు(West Bengal Assembly Elections) జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. మొత్తం 142 స్థానాలకు ఇవాళ తుది విడుత పోలింగ్ జరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో 18.39 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే కొన్ని చోట్ల ఉదయమే విధ్వంసకర సంఘటనలు జరిగాయి. చాప్రా, శాంతిపుర్, భాంగర్‌లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎంటలీ నియోజకవర్గంలో పోలింగ్ ఆఫీసర్లు, సెక్యూర్టీ […] The post రెండో విడత పోలింగ్.. బెంగాల్‌లో ఘర్షణలు appeared first on Navatelangana.

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సిబి ఆరింటిలో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో బెంగళూరు అసాధారణ రీతిలో చెలరేగి పోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆర్‌సిబి బౌలర్లు చుక్కలు చూపించారు. హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లు అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయారు. వీరి ధాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐపిఎల్ చరిత్రలోనే ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. పవర్ ప్లేలో ఆడిన ఆరు ఓవర్లలో ఢిల్లీ 13 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో ఏకంగా ఆరు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఐపిఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా పవర్ ప్లేలో ఇంత తక్కువ స్కోరు సాధించలేదు. కానీ ఆర్‌సిబి బౌలర్లు ధాటికి ఎదురు నిలువలేక ఢిల్లీ ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో బెంగళూరు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకొంటోంది. విరాట్ కోహ్లితో పాటు కెప్టెన్

