21037 వార్తలు







చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ రూపురేఖలు మారుతున్నాయి మన చెరువులకు జీవం పోస్తూ భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్‌ను హైడ్రా అంకితం చేస్తోందిసిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్‌ను చూడడం తనకు ఎంతో తృప్తిని ఇస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ (ఎక్స్) వేదికగా పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని క్యూర్ చేసుకుంటూ మన చెరువులకు జీవం పోస్తూ భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్‌ను హైడ్రా అంకితం చేస్తోందని ఆయన అన్నారు. ఉప్పల్ నల్లచెరువు పునరుజ్జీవనానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు, సిబ్బందికి సిఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడం మాత్రమే కాదని భావి తరాలకు భవిష్యత్‌ను భద్రపరచడమని ఆయన తెలిపారు. ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.




స్వర్ణాలు సాధించిన మహిళా బాక్సర్లు ప్రీతి పవార్, లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ గంగావ్, అరుంధతిలు పురుషుల విభాగంలో సచిన్ సివాచ్‌కు పసిడి పతకం షార్ట్‌పుట్‌లో సోమన్‌కు గోల్డ్ మెడల్ గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు సంచలనం సృష్టించారు. ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు గెలుపొందిన తమ సత్తాను చాటుకున్నారు. మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించగా.. 57 కిలోల మహిళ విభాగంలో జస్మినే లంబోరియా, 51 కిలోల మహిళల విభాగంలో సాక్షి చౌదరీ, 60 కిలోల విభాగంలో ప్రియా గంగావ్, 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరీ పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. 60 కిలోల పురుషుల విభాగంలో సచిన్ సివాచ్‌కు స్వర్ణం దక్కింది.శనివారం జరిగిన ఫైనల్లో కెనడా చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోతో తలపడిన ప్రీతి తనదైన ఆటరుతో ప్రత్యర్థిని మట్టికపించింది. 54 కిలోల విభాగంలో ఓటమెరుగకుండా ఫైనల్లో అగుపెట్టిన ప్రీతి తిరుగుని పంచులతో చెలరేగింది. 50 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 57 కిలోల విభాగంలో జస్మినే లంబోరియా అద్భుత ఆటతో విజేతగా నిలిచింది. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ వాల్ష్‌కు ఏమా

జిఎస్‌టి వృద్ధి రేటులో హర్యానా తరువాత రెండోస్థానంలో తెలంగాణ 19 శాతం పెరిగిన జిఎస్‌టి దేశవ్యాప్తంగా సగటు జిఎస్‌టి వృద్ధిరేటు 10 శాతం మాత్రమే ఎగవేతలపై కఠిన చర్యలతోనే సత్ఫలితాలువాణిజ్య పన్నుల కమిషనర్ రఘునందన్‌రావు వెల్లడిమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది జూలైలో వాణిజ్య పన్నుల శాఖ చరిత్రలోనే అత్యధికంగా రూ.7,865 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కలిపి ఈ ఆదాయం సమకూరగా, గత ఏడాది జూలైతో పోలిస్తే 19 శాతం వృద్ధి నమోదు అయింది. గతంలో ఏప్రిల్ 2026లో నమోదైన రూ.7,598 కోట్ల రికార్డును కూడా ఈ వసూళ్లు అధిగమించాయని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై నెలలో జీఎస్టీ ద్వారా మాత్రమే రూ.4,452 కోట్ల ఆదాయం లభించగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం అధికంగా వసూలైందని తెలిపారు. తెలంగాణ నుంచి మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.5,819 కోట్లకు చేరగా, రాష్ట్రాల వారీగా వృద్ధి రేటులో హర్యానా తర్వాత రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వృద్ధి సగటు 10 శాతంగా నమోదైందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక క

ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్ట స్థాయిలో సాగునీరు అందిస్తాం ఇందుకోసమే గోదావరి జలాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నాంఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ మన తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి/గోదావరిఖని/అంతర్గాం: ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్ఠంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్ర వాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చే స్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమశాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వ రం భద్రతే మా తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశా

కాళోజీ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో త్వరలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్మన తెలంగాణ/హైదరాబాద్: నీట్ యుజి 2026లో అర్హత సాధించిన తెలంగాణ వి ద్యార్థుల జాబితాను కాళోజీ నారాయణరా వు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్) శనివారం విడుదల చేసింది. కటాఫ్ పర్సంటైల్, కటాఫ్ స్కోరుతో పాటు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల పేరు, కేటగిరీ, ర్యాంకు, నీట్ యుజి స్కోరు తదితర వివరాలతో ప్రత్యేక జాబితాను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలో రాష్ట్రంలో అర్హత సాధించిన 38,021 మంది అభ్యర్థుల నీట్ రోల్ నెం బర్, ఆలిండియా ర్యాంకు, నీట్ స్కోర్ పొం దుపరిచారు. తాము విడుదల చేసిన ఈ జా బితా అభ్యర్థులు, తల్లిదండ్రులకు కేవలం స మాచారం కోసమే అని, దీనిని మెరిట్ జాబితాగా పరిగణించరాదని కాళోజీ వర్సిటీ స్ప ష్టం చేసింది. దరఖాస్తు చేసుకొనే ముందు వి ద్యార్థులు వర్సిటీ విడుదల చేసే నోటిఫికేష న్, ప్రాస్పెక్టస్‌ను జాగ్రత్తగా చదవాలని విజ్ఞ ప్తి చేసింది. త్వరలో కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.టాప్ ర్యాంకర్లలో అబ్బాయిల హవా ఆలిండియా ర్యాంకుల్లో అర్హత సాధించిన రాష్ట్రాని కి చెందినవారిలో 1000 లోపు ర్య

‘సర్’ దర్ద్ తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. తెలంగాణలో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు మరొకసారి పొడిగించినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నట్టుగా అర్హులైన వారందరి ఓట్లకు ఢోకా ఉండదన్న గ్యారెంటీ మాత్రం లభించడం లేదు. నిన్న మొన్నటి వార్తల ప్రకారమే చూసినట్లయితే ఎన్నికల సంఘం నియమించిన బిఎల్‌ఒలు నూటికి నూరుశాతం ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేసాం కానీ అవన్నీ తమ వద్దకు తిరిగిరాని కారణంగా దాదాపు 40 లక్షల ఓట్లు అన్ కలెక్టబుల్ కింద తొలగించే పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల 38 వేలకు పైగా ఓటర్లు ఉంటే ఇప్పటివరకు రెండు కోట్ల 60 లక్షలకు మించి ఓటర్ల పత్రాలు డిజిటలైజేషన్ కానట్టు తెలుస్తోంది. అంటే ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు 20 శాతానికి పైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఎన్యుమరేషన్ పూర్తయి ముసాయిదా జాబితా వెల్లడించిన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఎంత సముదాయించ చూస్తున్నా, సమర్ధించుకో చూస్తున్నా ప్రజలలో, రాజకీయ పార్టీలలో సందేహాలు మాత్రం నివృత్తి కావడం లేదు.

పేదల భూములను కాజేసిన వారిని వదిలిపెట్టం నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమి కూడా చేర్చలేదుభూముల ధరల సవరణతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 20 శాతం పెరుగుదల త్వరలో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తాంరెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెడతామని ఆయన హెచ్చరించారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుగా చేసుకొని భారీ స్థాయిలో భూ అక్రమాలు, అక్రమ మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు జరిగాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతి వ్యవహారాన్ని ఆధారాల

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలుగాంధీ భవన్‌లో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్, మంత్రి తుమ్మల, ఎంపీ వేం భేటీ నేడు జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేల మంతనాలుపిసిసికి ఆశావాహుల పేర్లు పంపించండి: తుమ్మల సూచనమన తెలంగాణ/హైదరాబాద్‌ః త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. శనివారం గాంధీ భవన్‌లో పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పార్టీ కోసం నిరంతరం పని చేసిన వారికీ గుర్తింపునిచ్చే విషయంపై వారు ప్రధానంగా చర్చించారు. గాంధీ భవన్‌కు వచ్చి కనిపించే వారికి, సిఫార్సులకు అవకాశం లేకుండా నిజమైన నాయకులను, కార్యకర్తలను గుర్తించే అంశంపై చర్చించారు. అయితే ఈ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు తమ జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీ కమిటీలను, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుని వడపోసి జాబితా రూపొందించి పిసిసికి నివేదించాల్సిందిగా సూచన చేయాలని నిర్ణయించారు.కొత్త, పాత వారి ఎంపిక సీఎం, పిసిసి చీఫ్‌దే బాధ్యతఇదిలాఉండగా రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్

20వేల డాలర్ల బాండ్ సమర్పిస్తేనే వ్యాపార, పర్యాటక వీసాలు 50 దేశాలకు వర్తింపు.. భారత్‌కు మినహాయింపు నిర్ణీత సమయంలో తిరిగి వెళ్తే మొత్తం వాపస్ వాషింగ్టన్: వ్యాపార, పర్యాటక వీసాల జారీకి శాశ్వత విధానాన్ని అమెరికా తీసుకువచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచంలోని 50 దేశాలకు వర్తింప చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఇకపై అమెరికాకు వ్యాపార, టూరిజం వీసాల పేరిట తాత్కాలికంగా అమెరికా వచ్చి వెళ్లే ఆయా దేశాల ప్రజలు 20వేల డాలర్లతో కూడిన బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. తాజా నిబంధనలను ఈ నెల 3 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. వ్యాపార, టూరిస్ట్ వీసాలపై వచ్చే వారు 20వేల డాలర్ల బాండ్ సమర్పించి తిరిగి నిర్దేశిత సమయంలో స్వదేశానికి వెళితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని ట్రం ప్ సర్కార్ ప్రకటించింది ఈ వీసా బాండ్‌ను ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరి కా ఖండాలకు చెందిన దేశాలకు వర్తింప చేశారు. ఈ జాబితాలో భారత్‌ను చే ర్చకపోవడం విశేషం. ఈ పథకాన్ని తొలుత పైలట్ పథకంగా అమలు చేసిన అమెరికా అది విజయవంతం కావడంతో దానికి మరిన్ని మార్పులు చేర్పులు చేసి శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. వ్యాపార, పర్యాటక వీ స

కొలీజియం తీరుతోనే ఈ దుష్పరిణామాలు ఇలాంటి వారే ప్రజా సమూహాన్ని చీమలతో పోల్చుతారుసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం ప్రతిపాదనల్లో కారణాలను వెల్లడించకపోవడం న్యాయమూర్తులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. ‘కొలీజియం గత మూడు రిజల్యూషన్లలో ఎలాంటి కారణాలను వెల్లడించకపోవడం గుర్తించాను. ఇది జవాబుదారీతనం నుంచి ఒక అడుగు వెనక్కి మళ్లడంగా అనుకోవచ్చా’ అని జస్టిస్ భూయాన్ ప్రశ్నించారు. లీగల్ థింగ్-ట్యాక్ విధి జల్దీ ఇనీషియేటివ్ శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ప్యానల్ డిస్కషన్‌లో ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తుల పదోన్నతులకు కారణాలను వెల్లడించకపోవడం వల్ల న్యాయవ్యవస్థలోకి అవాంఛనీయ వ్యక్తులు ప్రవేశించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. వారు ఆ తర్వాత ప్రజాసమూహాన్ని చీమలతో పోల్చవచ్చని, రా జ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేయవచ్చని వివరించారు. అలాంటి వ్యక్తులను న్యాయవ్యవస్థలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు

మేషంమేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారాంతంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గ్రహగతులు ఉన్నాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి. శుక్రవారం రోజున విష్ణుమూర్తికి తులసీమాల సమర్పించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.వృషభంవృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది దానికి తగినట్టుగా


