22411 వార్తలు

నూతన హాల్ట్ స్టేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హైదరాబాద్ నుంచి రూ.20 ఛార్జి త్వరలో రూ.౩౦౦ కోట్లతో విద్యుద్ధీకరణ తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్రమంత్రులు భక్తుల ఏండ్లతరబడి ఎదురుచూపులకు తెరమన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/కొమురవెల్లి: ప్రసిద్ధ శైవక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి భక్తుల దశాబ్దాల కల సాకారమైంది. క్షేత్రానికి చేరుకునేందుకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతనం గా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసుకోవచ్చన్నారు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఈ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి స్వామివారి సన్నిథిలో భక్తులకు అంకితం చేయడం ఆనందంగా ఉందన్నారు. ‘హైదరాబాద్ నుంచి కేవలం 20 రూపాయల ఛార్జీతో భక్తులు నేరుగా కొమురవెల్లికి చేరుకోవచ్చ’న్నారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ రైలు త్వరలోనే 300

మూడో టి20లోనూ జింబాబ్వే చిత్తు3-0తో సిరీస్ కైవసం హరారే: భారత్ కుర్ర జట్టు అతిధ్య జింబాబ్వేను వైట్‌వాష్ చేసింది. మూడు టి20ల సిరీస్‌ను 30తో జింబాబ్వేను చిత్తుచేసిన శ్రేయాస్ సేన తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో 35 పరుగులు తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష ఛేదనలో జింబాబ్వే 157 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో అతిధ్య జట్టు సొంత గడ్డపై ఘోర పరాభావాన్ని ఎదుర్కొవలసి వచ్చింది. ర్యాన్ బార్ల్(54) రాణించినా.. వెస్లీ మద్వైరా(28), కర్రన్(20), మైయ్యర్స్(19) తప్ప మరెవరూ రాణించలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు టీనేజ్ స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్య వంశీ(81 ) శుభారంభాన్ని అందించాడు. జింబాబ్వే బౌలర్ల ధాటికి ఇతర భారత ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నా వైభవ్ తనదైన స్టైల్లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసి ఉంటే టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించి ఉండేవాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(2) మరోసారి నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ









జూరాలకు వరద.. సీజన్‌లో తొలిసారి ప్రాజెక్ట్‌కు ఫ్లడ్.. లోయర్ గోదావరిలోనూ పెరిగిన వరద


జంతర్ మంతర్ వద్ద పరిస్థితి అదుపుతప్పుతున్నందునే లాఠీచార్జివిద్యార్థులను రెచ్చగొట్టి కొన్ని పార్టీల రాజకీయ లబ్ధిత్వరలో బయటికి విచ్ఛిన్నరకర శక్తుల వివరాలుఎంపిలు కొండా, అరుణ సంచలన వ్యాఖ్యలుమన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బిజెపి ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో జరిగినట్లు విదేశాల్లో ఎవరైనా చేస్తే పోలీసులు కాల్చి వేస్తారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి పోలీసులు కేవలం లాఠీలకే పని చెప్పారని ఆయన అన్నారు. జంతర్-మంతర్ వద్ద పరిస్థితి అదుపు తప్పుతున్నందునే పోలీసులు లాఠీ ఛార్జి చేశారని ఆయన తెలిపారు. సిజెపికి విదేశీ నిధులు అందాయన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎంపీ అరుణ మాట్లాడుతూ విద్యార్థుల ఆందోళనల వెనుక విచ్ఛిన్నకర శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. ఆ శక్తుల వివరాలూ త్వరలో బయటకు వస్తాయని ఆమె హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులు ధర్నా చేస్తే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో గ్రూ


పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కార్యసాధక బృందంఇస్రో మాజీ ఛైర్మన్ సోమ్‌నాథ్ సహా ఐదుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కఠిన నిబంధనలతో నేడు పార్లమెంట్‌లో కొత్త బిల్లు నీలేకని నివేదిక ఆధారంగా భవిష్యత్తులో భరోసా కల్పించే చర్యలుప్రధాని మోడీ మరో వీడియో సందేశంన్యూఢిల్లీ: దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్ఠంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సి న సంస్కరణలపై ఈ బృందం అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని తెలిపా రు. ఆ నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల వి శ్వసనీయతకు భరోసా కల్పించే చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఆదివా రం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వి ద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారు జైళ్లలో ఉన్నారని, వారి కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులన

ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి హైకమాండ్ పెద్దలతో నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం మంత్రివర్గ విస్తరణపైనా మంతనాలు?మన తెలంగాణ/హైదరాబాద్‌ః నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసిసి అగ్ర నేతలతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం మంతనాలు జరపనున్నారు. ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ చర్చలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇందులో భాగంగానే ఏఐసిసి పెద్దలతో నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు. రెండేళ్ళ క్రితం ముప్పై కార్పొరేషన్లకు చైర్మన్ల పదవులను, వాటికి డైరెక్టర్లను నియమించారు. వీటిలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్నింటి పదవీ కాలం పూర్తయ్యింది. పదవీ కాలం పూర్తయిన వారిలో ఎంత మందికి తిరిగి వారి పదవుల కాలాన్ని పొడిగించడం (రీ-అపాయింట్‌మెంట్), కొత్తగా ఎవరెవరికి ఛాన్స్ కల్పించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మీనాక్షి

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయో పరిమితిని 21కి తగ్గించాలియువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి ఈ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం ‘నీట్’ ఆందోళనలు, నమోదైన కేసులపై కేంద్రం సమీక్షించాలి నష్టపోయిన కుటుంబాలకు సాయం చేయాలి జాతీయ మీడియాతో సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలుమన తెలంగాణ/హైదరాబాద్: ‘జై జవాన్ జై కిసాన్ - జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరా రు. హైదరాబాద్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో ఆదివారం జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. యువశక్తే దేశ భవిష్యత్‌కు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రం గాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యు వతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని

హన్మకొండలోని నివాసంలో ఉదయం మాజీ ఎంఎల్‌ఎ సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. పలుమార్లు సిపిఆర్ తొమ్మిదోసారికి ఫలించిన వైద్యురాలు మమత ప్రయత్నం కెసిఆర్ ఆదేశాలతో హన్మకొండకు కెటిఆర్, హరీశ్‌రావు మెరుగైన వైద్యం కోసం గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలింపుసికింద్రాబాద్ యశోదలో కొనసాగుతున్న చికిత్సమనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, పార్టీ నేతలు హుటాహుటిన వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రికి తీసుకురాగానే చికిత్స మొదలు పెట్టామని

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశారు. 2028 ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. వయసు పైబడటం, రాజకీయాలు అవినీతిమయం కావడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయకున్నా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సంక్షేమం కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోసారి ఎన్నికల్లో పోటీచేయాలని మైసూరులోని వరుణ నియోజకవర్గం ప్రజలు తనను కోరారని, అయితే ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని సిద్ధరామయ్య తెలిపారు.గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గం ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు సమకూర్చేవారని, విజయాన్ని చేకూర్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 79 ఏళ్లని, తమ (కాంగ్రెస్) ప్రభుత్వం పదవీకాలం మరో ఏడాదిన్నర మిగిలి ఉందని చెప్పారు. అప్పటికి తన వయస్సు 81-82 ఏళ్లకు చేరుకుంటుందన్నారు. ఆరోగ్యం బాగోలేకపోవడ

‘సర్’కు మరో వారం రోజులే గడువు 74.38 శాతం డిజిటలైజేషన్ పూర్తిజిల్లాల్లో 80 శాతం పైనే ఫారాల సమర్పణహైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 60 శాతం లోపే డిజిటలైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల నుంచి సుమారు కోటి వరకు ఓట్లు తగ్గే అవకాశం ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితామన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్..సర్) గడువు మరో వారం రోజులే మిగిలింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉంది. సర్ ప్రక్రి య జిల్లాల్లో మెరుగ్గా కనిపిస్తుండగా, హై దరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మాత్రం మందకొడిగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఆదివారం సాయం త్రం వరకు 2,51,61,783 (74.38 శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన ట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. చాలా జిల్లాలో 80 శాతానికి పైగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్‌లో 51.85 శాతం, మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా

జంతర్ మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల అమానవీయ దాడులపై నిలదీసేందుకు సిద్ధమవుతున్న విపక్షం ప్రధాని మోడీ క్షమాపణకు పట్టుపట్టే అవకాశం హోంమంత్రి అమిత్ షాకు విపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటైన లేఖ నిరసనకారులపై పెల్లెట్ గన్స్‌కు మీరే అనుమతించారా? అని నిలదీత బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్న్యూఢిల్లీ: ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పో లీసులు దారుణంగా వ్యవహరించారన్న ఆ రోపణలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర తిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టనున్నట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపా యి. అయితే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రెండేళ్ల కిందటి ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై వైఖరిని సోమవారం ఖరారు చేయనున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పార్లమెంటు కార్యాలయంలో సోమవారం ఉదయం జరి గే ఇండియా కూటమి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్న ట్లు సమాచారం. విద్యార్థులపై ‘అమానవీయ దాడి’కి బాధ్యులెవరో తే

తాత్కాలిక టెంట్లు కనుమరుగు, ఇళ్లకు మళ్లిన విద్యార్థులు 53 మెట్రిక్ టన్నుల వ్యర్ధ పదార్ధాలను తొలగించిన ఎన్‌డీఎంసీ నినాదాలున్న గోడలకు పెయింటింగ్, ఫుట్‌పాత్‌ల రిపేర్ టైఫాయిడ్ నుంచి కోలుకుంటున్న దీప్కే ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేసిన సిజెపి నేత ఈ పోరాటం ముగింపు కాదు, ఆరంభం మాత్రమేనని స్పష్టీకరణన్యూఢిల్లీ: నినాదాలు, ప్రసంగాలు, ఆందోళనలతో అట్టుడికిన జంతర్ మంతర్ వద్ద తిరిగి ప్రశాం త పరిస్థితి నెలకొంటోంది. మంత్రి పదవికి ధర్మేం ద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆందోళనలకు సారథ్యం వహించిన సిజెపితో కేంద్రం జరిపిన చ ర్చలు విజయవంతం కావడంతో 36 రోజుల జెన్ జీ, సిజెపి నిరసలకు శనివారంనాడు తెరపడింది. సిజెపి విజ్ఞప్తి మేరకు విద్యార్థులు ఇళ్లముఖం ప ట్టారు. దీంతో ఆదివారంనాడు జంతర్‌మంతర్ వ ద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే టైఫాయిడ్ నుంచి కోలుకోగా, పర్వావరణవేత్త సోనం వాంగ్‌చుక్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. విద్యార్థుల నిరసనలకు ముగియడంతో జంతర్ మంతర్ వద్ద మునిసిపల్ కార్మికులు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసే పనుల ను వేగవంతం చేశారు. సుమారు 100 మందికి పైగా పారిశుధ్

మేషంప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెరిగి ఇబ్బంది పెడతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృషభం ఆర్థికంగా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కీలక పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మిధునం ఉద్యోగస్తులకు అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం అదృష్టం కలిసివస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పితృస్వామ్య ఆస్తుల లేదా పాత వివాదాల విషయంలో అనుకూల నిర్ణయాలు వస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సింహం ఆరోగ్య విషయంలో మిక్కిలి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. బంధువులతో