23572 వార్తలు

అమరావతి: ఎంఆర్‌ఒ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలో సిద్దంపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ పిజిఆర్‌ఎస్ విభాగంలో శ్రీనివాసులు అనే వ్యక్తి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. అతడి భార్య అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో ఎంపిడిఒగా విధులు నిర్వహించారు. కూతురు అమెరికాలో చదువుకుంటుండగా కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. 2024 ఎన్నికల సమయంలో రామాపురంలో ఎంఆర్‌ఒగా విధులు నిర్వహించారు. పిజిఆర్‌ఎస్ అర్జీపై వచ్చి అభియోగాల కారణంగా విఆర్‌ఒ వెంటకరమణను సస్పెండ్ చేయడంతో పాటు శ్రీనివాసులను కలెక్టరేట్‌లోని కెఆర్‌ఆర్ సి విభాగానికి బదిలీ చేశారు. ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేయగా శ్రీనివాసులు అవకతవకలు చేసినట్టు అభియోగాలు వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయనకు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతడి భార్య అనారోగ్యం కారణంగా సెలవుల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు విధుల్లో అభియోగాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాడు. గురువారం సాయంత్రం సిద్దం పల్లెలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూర

జెరూసలేం: ఓ భారతీయుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐలాట్ నగరంలో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. తన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రక్తస్రావంలో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం భారతీయుడిగా గుర్తించారు. 31 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడికి, నిందితుడి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

లండన్: అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నిషేధం విధించాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆన్‌లైన్ వేదికగా పోరాటం చేస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్‌లో నిర్వాహకులు అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలతో జట్టుపై నిషేదం విధించాలనే డిమాండ్‌తో ఆన్‌లైన్ లీగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం 2.50 కోట్ల మంది అభిమానుల సంతకాలతో కూడిన పిటిషన్ దాఖలైంది. కోట్లాది మంది ఆన్‌లైన్ పిటిషన్‌కు మద్దతు పలికి సరికొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఈ సంఖ్యను ఐదు కోట్లకు పెంచాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేశారు. మరోవైపు ఇటీవల ముగిసిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

హరారే: జింబాబ్వేతో జరిగిన తొలి టి20లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మూడు కొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు పార్మాట్‌లలో కలిపి అతి చిన్న వయసులోఅర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా వైభవ్ నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వైభవ్ (15 ఏళ్ల 118 రోజులు) హాఫ్ సెంచరీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (భారత్) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. సచిన్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో (16 ఏళ్ల 213 రోజులు) అర్ధ సెంచరీ సాధించిన అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాజాగా జింబాబ్వే మ్యాచ్‌లో వైభవ్ దీన్ని బద్దలు కొట్టాడు. అంతేగాక అంతర్జాతీయ టి20లో అత్యంత చిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా కూడా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో 2021లో గిబ్రాల్టర్ బ్యాటర్ లూయిస్ సాధించిన రికార్డును అధిగమించాడు. లూయిస్ 16 ఏళ్ల 58 రోజుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. జింబాబ్వే మ్యాచ్‌లో వైభవ్ దీన్ని తిరగరాశాడు.

తొలి టి20లో జింబాబ్వేపై గెలుపు హరారే: జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 13.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. జింబాబ్వే బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సూర్యవంశీ స్కోరును పరిగెత్తించాడు. దూకుడుగా ఆడిన వైభవ్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. 24 బంతుల్లలో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు

సెప్టెంబర్ 15 వరకు ‘ఇన్‌స్పైర్’ దరఖాస్తులు..ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేల ప్రోత్సాహకం











గ్లోబరీనా సంస్థ విషయంలో నిజాయితీని నిరూపించుకోవాల్సింది కెటిఆరేబిఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఇంటర్ మూల్యాంకనం తప్పిదాలకు 27 మంది విద్యార్థులు బలిఇందుకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలిచిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నిలదీసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికెటిఆర్‌కు ధర్నాచౌకే దిక్కయిందని వ్యాఖ్యమన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కెటిఆర్‌కు లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని బిఆర్‌ఎస్ ఖండించలేదని, బిజెపిని ప్రశ్నించే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదని ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో కెటిఆర్ మహాధర్నా చేపట్టడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని, కానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోమెట్ సంస్థ తెలంగాణలోనే పుట్టిందని, ఆ సంస్థతో కెటిఆర్‌కు సంబంధాలున్నా యని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఆ సంస్థ నిర్మించ

యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిని వదిలిపెట్టం లీక్‌లకు పాల్పడినవారికి వేగంగా కఠిన శిక్షలు పడేలా విచారణ జరిపిస్తాంయువత భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏది మరొకటి లేదు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటనన్యూఢిల్లీ: దేశ యువత సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నీట్ పరీక్షలో అవకతవకలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు నిర్వహించిన సంసద్ చలో మార్చ్ అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ నిరసనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఆందోళనను అడ్డుకునే క్రమంలో 100 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని మోదీ స్పందిస్తూ, ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా, కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద

కాంగ్రెస్, వామపక్షాల పన్నాగాలు ‘కాక్రోచ్ జనతా పార్టీ‘ వంటి వేదికల వెనుక దేశ వ్యతిరేక శక్తుల హస్తం ‘నీట్’పై తక్షణమే స్పందించి 31 మందిని అరెస్ట్ చేశాం యుపిఏ పాలనలోనే రికార్డు స్థాయి లీకేజీలు n బిజెపి చీఫ్ రాంచందర్ రావు మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అశాంతిని సృష్టించి, యువతను రెచ్చగొట్టడం ద్వా రా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని బిజె పి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదే శ్ తరహాలో భారతదేశంలో కూడా అశాంతిని, హింసను సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ శక్తులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఎస్‌ఏ వంటి పాత సంఘాల నాయకులు కొత్త పేర్లతో ‘కాక్రోచ్ జనతా పార్టీ‘ వంటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. పుణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల వెనుక ఈ దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందన్నారు. ఈ ఉద్యమాలకు ఖలిస్తాన్ శక

విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపుసెలవు ప్రకటించిన యాజమాన్యాలు ఒయు, జెఎన్‌టియు పరీక్షలు వాయిదామనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న (శుక్రవారం) పాఠశాలలు, కాలేజీల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్‌ఎన్‌యుఐ, ఎస్‌ఎఫ్‌ఐ,ఎఐఎస్‌ఎఫ్,పిడిఎస్‌యు, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎస్‌బి, ఎఐపిఎస్‌యు సంఘాల నాయకులు కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు యాడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రజాస్వామ్యవాదులు బంద్‌కు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. ప్రజాస్వామ్య నిరసనలకు లాఠీలు కాదు, సంభాషణే సమాధానమని పేర

రాబోవు నెలల్లోను ఎల్‌నినో ప్రభావం ప్రస్తుత వర్షాలను చూసి నాట్లు వేయకండి వరి సాగుపై రైతులు పునరాలోచించుకోవాలి 23 జిల్లాల్లో లోటు వర్షపాతం ఎల్‌నినోపై జిల్లాల సూచనలతో సిఎంకు సమగ్ర ప్రణాళిక సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మలమన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే నెలల్లోనూ ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని, దీంతో రైతులు వరి సాగుపై పునరాలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. గురువారం సచివాలయంలో జిల్లాల వారీగా వచ్చిన సూచనలు, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులు, రానున్న నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల వారీగా వచ్చిన సూచనలతో సమగ్ర ప్రణాళిక సిద్దం చేసి సిఎంకు అందచేస్తామన్నారు. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వచ్చే నెలలో కూడా ఎల్-నినో పరిస్థితులు కొనసాగనున్నాయని, సెప్టెంబర్ నాటికి దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, డిసెంబర్ నాటికి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌పై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్ర

ఆగని విపక్షాల నిరసనలు.. కదలని ఉభయసభలుముందస్తు షరతులు లేకుండా చర్చకు సిద్ధమేనన్న కిరణ్ రిజిజుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చకు సిద్ధమన్న ఖర్గేలోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అమిత్‌షాన్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే విపక్షాల డిమాండ్ల మధ్య పార్లమెంటు ఉభయసభలు నాలుగోరోజైన గురువారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలకు నోచుకోలేదు. తొలుత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వరుసగా సభ రెండు సార్లు వాయిదా పడి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైంది. సభ్యులు నిబంధనలను పాటించాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలను తప్పుపడుతూ, ముందస్తు షరతులతో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ నుంచి విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మాన్ ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ఆయన సమాధానమిచ్చారు. వ

సిఐడి విచారణకైనా సై..ఆరోపణలు రుజువు చేయాలి.. లేదా క్షమాపణ చెప్పాలి సిఎం రేవంత్ కు కెటిఆర్ సవాల్మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సిఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవు అని స్పష్టం చేశారు. గ్లోబరీనా తన బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్‌ఇ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయ లబ్ధికోసమే తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గడువులోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.