23789 వార్తలు

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ’చలో సంసద్’ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు వ్యహరించిన తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పోలీసు చర్యపై తక్షణం జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని, వీడియోలు చూసే సమయం తమకు లేదని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించడంతో సీజేఐ సూటిగా స్పందించారు. వీడియోలపై తమకు అసక్తి లేదని, చూసే సమయం కాడా లేదని అన్నారు. ’మా సమయం వృథా చేయొద్దు, మీ సమయం కూడా వృథా చేసుకోకండి’ అని ఆయన సూచించారు.నీట్-యూజీ 2026 పేపర్ లీక్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో పరీక్షల నిర్వహణ, సంస్కరణలతో సహా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై విద్యార్థులు నిరసనలు చేపట్టినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా ’థాంక్యూ వెరీ మచ్’ అంటూ సీజేఐ అన్నారు. పోలీసుల దమనకాండపై వీడియోలను తిరిగి న్యాయవాది ప్రస్తావించగా, తమకు అంత సమయం లేదని, విడియోలు చూడాలని అనుకోవడం లేదని సీజ

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీఢిల్లీ జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, ఉద్యమకారులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం విశ్వవిద్యాలయాల విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ నిరసన ర్యాలీ, కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ […] The post కేంద్ర ప్రభుత్వ నిర్భంధ చర్యలను ఖండిస్తూ ఓయూ లో భారీ నిరసన, ర్యాలీ appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ: ఢిల్లీ జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై, ఉద్యమకారులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను ఖండిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం విశ్వవిద్యాలయాల విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ తీశారు.అనంతరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థి నాయకులు […] The post ఓయూలో భారీ ర్యాలీ appeared first on Navatelangana.

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్న ప్రముఖ సినీనటి రష్మిక మందన్నకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో ఆమె ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆగస్టు 2న జరిగే క్లోజింగ్ సెర్మనీలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌తో కలిసి రష్మిక గ్రాండ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. ఈ గ్రాండ్ సెర్మనీలో భారతీయ కళా వైభవం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆకట్టుకునే నృత్య, సంగీత ప్రదర్శనలు ఉండనున్నాయి. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతీయ కళా సంస్కృతిని ఆవిష్కరించే ఈ కార్యక్రమంలో రష్మిక భాగస్వామ్యం కావడం ఆమె అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గేమ్స్ అధికారిక ఫ్లాగ్‌ను భారత్‌కు అందించనున్నారు. 2030లో 100 ఏళ్ల శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.

నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఈనెల 28న ఉదయం 10 గంటలకు వరంగల్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ, తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆలేరు పట్టణంలో బుధవారం తెలంగాణ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. సభకు అధిక సంఖ్యలో సబ్బండ వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రైతు కూలి సంఘం […] The post రైతు కూలీ సంఘం కరపత్రాల ఆవిష్కరణ appeared first on Navatelangana.

భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మోత్కుపల్లి రవినవతెలంగాణ-ఆలేరు టౌన్ అసైన్డ్ భూములకు, లావన్ పట్టా, ఇనాం భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని , భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మోత్కుపల్లి రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామన్న హామీ, ప్రస్తుతం అధికారంలో ఉండగానే అసైన్డ్ భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరారు. యాజమాన్య హక్కు కోసం ఈ నెల 24న భువనగిరిలోని ఎస్వీ హోటల్ […] The post అసైండ్ భూములకు యాజమాన్య హక్కు కల్పించాలి appeared first on Navatelangana.

తిరుమలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి వద్ద భక్తులు నిత్యం పూజలు చేసే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తి ఒకరు అక్కడ కొలువై ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని అపహరించుకుపోయాడు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఒక కాషాయ గుడ్డలో చుట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుండి తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో విగ్రహం మాయం అవ్వడంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించలేదు. వెంటనే వారు టిటిడి అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

– వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్నవతెలంగాణ – రాయపోల్ రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో సమగ్ర ఓటర్ నమూనా (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వంద శాతం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గ్రామంలోని బూత్ లెవల్ అధికారులును ఘనంగా సన్మానించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్ తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేసిన బిఎల్వో లకు, అధికారులకు సన్మానం చేశారు. ఈ […] The post బిఎల్ఓ లకు ఘన సన్మానం appeared first on Navatelangana.

– సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్నవతెలంగాణ – రాయపోల్ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న నిరుద్యోగ యువత, ప్రజాస్వామ్యవాదులు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జి ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి […] The post నిరుద్యోగ యువతపై కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి appeared first on Navatelangana.

నవతెలంగాణ-బెజ్జంకిమండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ శివారులో ప్రధాన రోడ్డుపై బుధవారం కారు బీభత్సం సృష్టించింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఆటోను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డుకిరువైలా బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల పోచయ్య, ఆటో డ్రైవర్ ఐలయ్యకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 సిబ్బంది కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న […] The post ముత్తన్నపేట శివారులో కారు బీభత్సం.. appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: గత దశాబ్దకాలంలో 152 ప్రశ్నాపత్రాల లీకయ్యాయని, దీంతో 7.5 కోట్ల మంది (750 లక్షలమంది) విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సీజేపీ ర్యాలీపై పోలీసుల చర్యలను ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానాల్లో ఒకటిగా నిలిచిన మనదేశ విద్యావ్యవస్థ నేడు ఒక అక్రమ వ్యవస్థగా మారిందన్న విషయం […] The post 152 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.


బిహార్ రాజధాని పాట్నాలో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బిజెపి చేపట్టిన నిరసన సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాల్లో ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పాటు రాళ్లు రువ్వుకుంటూ కనిపించారు. ఈ ఘటనలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరులు గురువారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద

బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటీష్ జాహిల్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రపం చం ముందు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. బుధవారం ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు. పరీక్షలు ఫెయిర్‌గా నిర్వహించా లని నిరసన తెలిపితే సిసి కెమెరాలు ఆపేసి, ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థుల వీపులపై లాఠీలు ఝళిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మనపై ఏ విధంగా దాష్టీకాలకు పాల్పడిందో ఇప్పుడు బిజెపి కూడా సొంత ప్రజలపై అదే విధంగా దాష్టీకాలు చేస్తుంద న్నారు. విద్యార్థులపై పాశవికంగా చేసిన దాడికి బిజెపి ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ నిర్వహించడం చేతకాని కేంద్రం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జులుం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కారణంగా 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమా



న్యూఢిల్లీ: 'ఛలో పార్లమెంటు' పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) చేపట్టిన పాదయాత్ర సందర్భంగా నిరసనకారులపై జరిగిన హింసాత్మక ఘటనపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. సిజెపి ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈనేపథ్యంలో విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ఘటనపై నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని, పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈలోగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, బాడీ క్యామ్ ఫుటేజ్, ఇతర సంబంధిత రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు న్యాయస్థానం వాయిదా వేసింది.

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజా ఓ షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బుధవారం డాక్టర్లు ఆయన హెల్త్ బులిటిన్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడం, వాపు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బాలకృష్ణ మోకాలి కండరాల్లో చీలిక ఏర్పడి ఉండొచ్చని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ‘‘ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో బాలకృష్ణకు విస్తృతస్థాయిలో క్లినికల్, డయోగ్నస్టిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’’ అని అసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నాయి.



న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రానికి లేఖ రాశారు. బుధవారం ఆస్పత్రి నుంచి సోనమ్ పలు డిమాండ్లను లేఖ ద్వారా తెలియజేశారు. తన డిమాండ్లపై హమీ ఇస్తే..నిరసన దీక్షను విరమిస్తానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు వాంగ్‌చుక్‌ను కలిశారు. ఆయనను దీక్ష విరమించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సోనమ్ కేంద్రానికి లేఖ రాశారు.ఆసుపత్రిలో తనను పరామర్శించి, దీక్ష విరమించాలని కోరినందుకు వాంగ్‌చుక్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, జవాబుదారీతనంపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని.. కేసులు పెట్టి వేధించొద్దని.. అలాగే, నీట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. తన డిమాండ్లపై కేంద్రం స్పష్టమైన హామి ఇస్తే.. వెంటనే దీక్ష విరమిస్తానని సోనమ్ వెల్లడించారు.
