24284 వార్తలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ భూముల వివాదంలో రాష్ట్ర హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేస్తూ నలుగురు రైతులకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బహదూర్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని, గత 30 ఏళ్లుగా ఆ భూముల్లో సాగు చేస్తున్నామని పేర్కొంటూ నలుగురు రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మూడు దశాబ్దాలుగా ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని, ఇటీవల ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల సాగు హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని వాదించారు. వివాదాస్పద భూముల్లో అధికారులు జోక్యం చేసుకోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రా

బొగ్గు, గనుల రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కలిసి ఈ మేరకు బొగ్గు, గనుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. అస్సాం రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు, గనుల (Coal & Mines) రంగం అభివృద్ధి, ఇతర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, కొత్త గనుల ఎక్స్‌ప్లోరేషన్, వనరుల సద్వినియోగం, గనుల రంగంలో పెట్టుబడులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.అస్సాంలో బొగ్గు, గనుల రంగానికి సంబంధించిన పలు అంశాలు, ఎదురవుతున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీసుకురాగా, వాటిపై సానుకూలంగా స్పందించారు.సంబంధిత సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కృషన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా చేపట్టిన రాకెట్ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించినట్లుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే ఉన్న యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి చెందిందని, ‘56 ఏళ్ల యువకుడికి చెందినది కాదు’ అని వ్యంగ్యంగా అన్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సంప్రదాయ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ.. దేశ యువత అంతరిక్ష రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. స్కైరూట్ స్టార్టప్‌లో పనిచేస్తున్న బృందం సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని తనకు తెలియజేశారని చెప్పారు. అలాంటి యువతే ఈ ఘనతను సాధించిందని, తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని నేరుగా రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీ స్కైరూట్ విజయాన్ని ప్రస్తావిస్తూ .. ప్రపంచంలో చాలా కొద్ది దేశాల్లోనే ప్రైవేట్ రంగం ఇలాంటి విజయాలను నమోదు చేస్తోంద



పూంచ్: జమ్మూ కాశ్మీర్ లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా పూంచ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిపోవడంతో ఏడుగురు మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. లోరాన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని.. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు.కాగా, పూంచ్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి పలు చోట్ల ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించాయి. దీంతో పూంచ్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాలింపు కోసం ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.సీఎం అబ్దుల్లా ఎక్స్‌గ్రేషియా ప్రకటనకుండపోత వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా, మరణించిన వారిలో ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి అదనంగ



అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. లెక్కింపు విదానాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ కానుకల లెక్కింపు బాధ్యతలను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించనుంది. విరాళాల లెక్కింపు మొత్తం నిపుణులైన ఎస్‌బిఐ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో, పూర్తి భద్రత నడుమ జరుగుతుందని వెల్లడించింది. పెరిగిపోతున్న కానుకల నిల్వలను దృష్టిలో ఉంచుకుని, రోజుకు 12 గంటల పాటు లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. ఈ 12 గంటల లెక్కింపు నిరంతరాయంగా సాగేందుకు వీలుగా సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించినట్లు తెలిపారు. పకడ్బందీగా ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

న్యూఢిల్లీ: నీట్ యూజి పేపర్ లీక్ కు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) సోమవారం 'చలో పార్లమెంట్' ర్యాలీ చేపట్టింది. దీంతో ఢిల్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాను సిజెపి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ లేఖ అందించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.ఈ మీటింగ్ అనంతరం ఎక్స్ వేదికగా సిజెపి ప్రతినిధి సౌరవ్ దాస్.. తమ డిమాండ్లను పరిశీలిస్తామని నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. "నేను, అశుతోష్ రంకా మధ్యాహ్నం 12 గంటలకు జె.పి. నడ్డా నివాసంలో ఆయనను కలిశాము. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి లేదా పదవి నుంచి తొలగించాలి అనే అంశంతో సహా మా డిమాండ్లన్నింటినీ ఆయనకు తెలియజేశాము. దీనిపై తగిన స్థాయిలో చర్చిస్తానని మంత్రి మాకు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట హామీలు లభించలేదు. మా డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత నిరసనలు కొనసాగుతాయి" అని దాస్ అన్నారు.ప్రధానంగా మూడు డిమాండ్లతో కూడిన లేఖను దాస్

సినిమాలకు ధీటుగా ఒటిటిలో వచ్చే వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నాయి. ప్రముఖ ఒటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్ నుంచి వస్తున్న మరో ఆసక్తికర వెబ్‌సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వార్ యాక్షన్ డ్రామా ఆగస్టు 7 నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సిరీస్ ట్రైలర్‌ని విడుదల చేశారు. అభిజీత్ సింగ్ ఫార్మార్, కుషాల్ శ్రీవాత్సవ తీర్చిదిద్దిన ఈ సిరీస్‌కు ఓనీ సేన్ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజాగా నటిస్తున్నారు. ఆయనతో పాటు జమ్మి షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్గిల్ యుద్ధం సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌ని రూపొందించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నేతృత్వంలో నేతలు కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ‘సర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పాతబస్తీలో సర్ నిర్వహణకు సీనియర్లకు బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిజెపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ సిఇవొకు ఆయన ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై అనర్హులను చేరుస్తున్నారని ఆరోపించారు. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వారికి ఓటు హక్కు లేకుండా చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.


యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇటీవల చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఫ్యాన్స్‌ని మరింత ఖుషి చేస్తోంది. అదేంటంటే.. ఇందులో ప్రభాస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైనికుడిగా కనిపించనున్నారట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశమని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తొలుత బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా చేరి ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరుతారట. అయితే దీనిపై ఇప్పటికైతే ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కానున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. పనులు మాత్రం గడప కూడా దాటడం లదేని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బిఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. మోటార్లు కాలిపోతున్నాయి. రైతులకు యూరియా అందించలేకపోతున్నారు. కెసిఆర్ హయాంలో రైతులకు అన్నీ ఇళ్ల వద్దకే వచ్చేవి. రూ.2లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. 30-40 శాతమైనా పూర్తి చేశారా? ఒక్క ఊరిలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలని సిఎం రేవంత్‌కు అసెంబ్లీలోనే వాల్ విసిరా. కెసిఆర్ హయాంలో 11సార్లు రైతుబంధు వేశారు. కాళేశ్వరంపై మాట్లాడినవన్నీ అబద్ధాలే అని ప్రజలకు తెలిసిపోతుందనే రేవంత్ నీళ్లు వదలడం లేదు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన రెండు పిల

ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ఫీచర్ ఎట్టకేలకు గూగుల్ తీసుకొసతోంది. బీటా అప్‌డేట్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ స్పీడ్ లిమిట్ మీటర్‌ను రోల్ అవుట్ చేసత్ోంది. దీంతో, ఇక నుంచి వాహన స్పీడ్ లిమిట్ సలువుగా తెలుసుకోవచ్చు. చాలా కాలం నంచి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనర్ యూజర్లకు దర్శనమిస్తోంది. 2024లో యాపిల్ కార్‌ప్లేకు తీసుకురాగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో యూజర్లకూ అందుబాటులోకి రానుంది. ఇకపై ఆండ్రాయిడ్ ఆటోపై గూగుల్ మ్యాప్స్ ఇంటర్‌ఫేస్‌లో నేరుగా వాహన స్పీడ్ దర్శనమిస్తుంది. లైవ్ స్పీడో మీటర్ ద్వారా వాహన ప్రస్తుత వేగాన్ని తెలుసుకోవచ్చు. కారు ఇన్‌స్ట్రుమెంట క్లస్టర్ను స్విచ్ చేయకుండానే వాహన వేగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. మలుపుల వద్ద దిశానిర్దేశాలను గమనించొచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఆటో లేటెస్టు బీటా వర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫీచర్ ఇప్పటికే పరిమిత యూజర్లకు అందుబాటులోకి రాగా, దశలవారీగా త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.




టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 ప్రపంచకప్ వరకూ వన్డే జట్టులో కొనసాగుతారా? లేదా? అనే విషయంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరి భవిష్యత్తుపై వారికి పూర్తి స్పష్టత ఇవ్వాలని బిసిసిఐ, జట్టు యాజమాన్యాన్ని భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కోరాడు. 2027 ప్రపంచకప్ కోసం టీం ఇండియా ప్రణాళికల్లో తాము ఉన్నామో, లేదో తెలుసుకునే హక్కు వారికి ఉందని అన్నాడు. రో-కో విషయంలో నెలకొన్ని అనిశ్చితి తన అంతర్జాతీయ కెరీర్ చివరి రోజులను గుర్తు చేసిందని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ ప్రస్తుతం ఉన్నట్లువంటి పరిస్థితి నేను కూడా గతంలో ఎదుర్కొన్నా. వారు ఆడాలా? వద్దా అని నిర్ణయించే అధికారం అభిమానులకు లేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది జట్టు యాజమాన్యం, కోచ్, సెలక్టర్లు. రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటే.. ‘మిత్రురాలా.. మీరు ప్రపంచకప్ ఆడాలని కోరుకుంటున్నాం. మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మైదానంలోకి వెళ్లి మీ సహజశైలిలో ఆడండి. ఒకవేళ ఏదైనా సిరీస్ సరిగా ఆడకపోతే జట్టులో స్థఆనం కోల్పోతామనే ఒత్తిడిని అస్సలు పెట్టుకోవద్దు’’ అని చెప్పాలని యువరాజ్ పేర్కొన్నాడు.


