24274 వార్తలు

నిరసనకారులపై లాఠీచార్జీ, టియర్‌గ్యాస్ ప్రయోగంఅడ్డంకులు దాటుకుని పార్లమెంట్‌వైపు ఆందోళనకారులు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత 20వేల మందికిపైగా తరలివచ్చిన సిజెపి మద్దతుదారులు తోపులాటల్లో పోలీసులు, నిరనసకారులకు గాయాలు పలువురిని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) చలో పార్లమెంట్ ఉద్రిక్తతకు దారితీసింది. నీట్‌లో అవకతవకలు, కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా సహా పలు డిమాండ్లతో సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజే సుమారు 20వేల మందికిపైగా సిజెపి మద్దతుదారులు అటువైపుగా దూసుకెళ్లారు. తొలుత జంతర్‌మంతర్ వద్దే ఆందోళనకారులను అడ్డుకునేందుకు అడుగుడుగనా భద్రతా దళాలు, బారికేడ్లను మోహరించారు. పోలీసులు పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి ఇవ్వకపోయినా విద్యార్థులు, నిరసనకారులు లెక్కచేయకుండా ముందుకే కదిలారు. పోలీసులు ఎంత అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించండంతో పోలీసులు లాఠీలు ఝలిపించారు. టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలకు, నిరసనకారులకు నడుమ జరిగిన ఘర్షణలు, తోపులాటల్లో ఇరు పక్షాల్లో కొందరి

ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. న్యూజెర్సీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో స్పెయిన్ 10 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి ప్రపంచకప్ టైటిల్‌ను దక్కించుకుంది. స్పెయిన్‌కు ఇది రెండో వరల్డ్‌కప్ ట్రోఫీ కావడం విశేషం. 2010లో స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకుంది. తాజాగా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగిన తుది పోరు చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. ఇటు స్పెయిన్ అటు అర్జెంటీనా గోల్ కోసం సర్వం ఒడ్డి పోరాడాయి. కానీ తొలి హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో కూడా ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేక పోయింది. దీంతో ఆట ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుత గోల్ సాధించాడు. దీంతో స్పెయిన్ చారిత్రక విజయాన్ని అందుకుంది.కల చెదిరిన అర్జెంటీనా.. ఈ వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా అంచనాలకు తగినట్టు రాణిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన నాకౌట్ మ్యాచుల్లోనూ అసాధారణ ఆటను కనబరిచి


నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ ఢిల్లీలో శాంతియుత పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, హింసాత్మకంగా మారడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. సోమవారం సాయంత్రం సచివాలయం రాజీవ్ గాంధీ చౌక్ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకూ కాగడాలతో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోత రోహిత్ ఇతర నాయకులు కార్యకర్తలూ పాల్గొన్నారు. మంత్రులు కూడా కాగడాలు చేతపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నీట్ పరీక్షపై మౌనం వీడాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు శాంతియుత పార్లమెంటు మార్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడ హింసా పద్ధతి చేయలేదన్నారు. విద్యార్థులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం దుర్మార్గమని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానిక

బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణోత్సవ, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అధికారులు ఆలయ సమీపం ప్రాంతాల్లో మంగళ,బుధవారాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాహన దారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం,ఫతేనగర్ ఫ్లై ఓవర్,ఫతేనగర్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను ఎస్సార్ నగర్ టి జంక్షన్ వద్ద నుంచి ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్,అభిలాష టవర్స్,బికె. గుడా ఎక్స్ రోడ్ శ్రీరామ నగర్ ఎక్స్‌రోడ్ నుంచి సనత్‌నగర్,ఫతేనగర్ రోడ్దు వైపు మళ్ళించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపువచ్చే ట్రాపిక్‌ను అనుమతించడం లేదన్నారు. ఈ వాహనాలన్నీ న్యూ బ్రిడ్జి ( హైదరాబాద్ కిచెన్ మార్గ్)వద్ద ఆర్‌యుబి ద్వారా కట్టమైసమ్మ ఆలయం, బేగం పేట వైపు మళ్ళించనున్నట్లు చెప్పారు. గ్రీన్ ల్యాండ్స్ ,బకుల్ ఆపార్ట్‌మెంట్స్,పుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపునకు వచ్చే వాహనాలకు అనుమతించరని చెప్పారు. వీటిని పుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్,

వరంగల్ మామనూరు విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.86 కోట్లను కేటాయించినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ లిఖీత పూర్వకంగా రాజ్యసభకు తెలియచేశారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని ఎంపి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వివరాలను రాజ్యసభకు వెల్లడించారు. వరంగల్ మామనూరు విమానాశ్రయం కోసం రన్‌వే, ఆఫ్రాన్, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణం వంటి పనుల కోసం ఇప్పటికే టెండర్‌లను పిలిచినట్టు రాజ్యసభకు ఇచ్చిన లేఖలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి తెలియచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్,పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేసే అంశంపై ఏఏఐ టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ స్టడీ పూర్తి చేసినట్టు కేంద్రం తెలిపింది. పెద్దపల్లి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం ప్రతిపాదిత స్థలంపై ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు కేంద్రం పేర్కొంది. భద్రాద్రి క


మంగళవారం నుంచి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎడ్యుకేషన్ హబ్ పనులను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎస్‌ఐఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌ను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సిఎం సమీక్షిస్తారు. నేడు రాత్రి కొడంగల్‌లోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. 22వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, బిఎల్‌ఓలతో ఎస్‌ఐఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు సిఎం రేవంత్‌రెడ్డి చేరుకుంటారు.


ఏన్కూరు మండల పరిధిలోని ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు ఈ ఘటనకు దారితీసినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిని తన పుట్టింట్లో ఉంటోంది. ఇదిలా ఉంటే గ్రామంలొ సంఘం ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని సంఘ సభ్యులు ఒత్తిడి చేయడంతో రజినిని ఏన్కూరులోని ఎస్‌బిఐ బ్యాంకుకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు బ్యాంకు వద్దకు వచ్చి రజినితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో అంతకు ముందు రజిని కుమార్తె తన తల్లిపై ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, విచారణ నిమిత్తం పోలీసులు రజినిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌కు రజిని వెళ్లడాన్ని గమనించిన రాంబాబు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రజినికి తీవ్ర రక్తస్రావమైంది. పోలీసులు వెంటనే ఆమెను ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తర


న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలకు సంబంధించి కేసులో 23 ఏళ్ల భారత వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌కు కలకత్తా హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో పోరెల్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. బాధితురాలు గోప్యతను కాపాడేందుకు, పోరెల్ కు చెందిన అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేసింది.కాగా, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పోరెల్‌పై... పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అలాగే జూన్ 2026లో ఆమెపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో హుగ్లీ జిల్లాలోని మగ్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను బయటపెడతానని పోరెల్ బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన పోరెల్.. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ పోరెల్ కెరీర్ అభిషేక్ పోరెల్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపి

సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం పక్కా ఫ్యామిలీమ్యాన్‌లా మారిపోతుంటారు. ముఖ్యంగా తన పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన ముద్దుల కుమార్తె సితార పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ స్పెషల్ పిక్‌లో మహేష్ బాబు తన కుమార్తె సితారను ఎంతో ప్రేమగా ముద్దాడుతూ కనిపించారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “నువ్వు ఎంత ఎదిగినా ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే.. హ్యాపీ 14 సితార! ఈ ఏడాది నీకు ఎంతో అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను.నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను”అని మహేష్ బాబు పేర్కొన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఈ అందమైన బంధాన్ని చూసి ఘట్టమనేని అభిమానులు ఫిదా అవుతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటోకు వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. సితారకు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా సితారకు శుభా


రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ భూముల వివాదంలో రాష్ట్ర హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేస్తూ నలుగురు రైతులకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బహదూర్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని, గత 30 ఏళ్లుగా ఆ భూముల్లో సాగు చేస్తున్నామని పేర్కొంటూ నలుగురు రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మూడు దశాబ్దాలుగా ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని, ఇటీవల ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల సాగు హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని వాదించారు. వివాదాస్పద భూముల్లో అధికారులు జోక్యం చేసుకోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రా

బొగ్గు, గనుల రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కలిసి ఈ మేరకు బొగ్గు, గనుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. అస్సాం రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు, గనుల (Coal & Mines) రంగం అభివృద్ధి, ఇతర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, కొత్త గనుల ఎక్స్‌ప్లోరేషన్, వనరుల సద్వినియోగం, గనుల రంగంలో పెట్టుబడులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.అస్సాంలో బొగ్గు, గనుల రంగానికి సంబంధించిన పలు అంశాలు, ఎదురవుతున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీసుకురాగా, వాటిపై సానుకూలంగా స్పందించారు.సంబంధిత సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కృషన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా చేపట్టిన రాకెట్ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించినట్లుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే ఉన్న యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి చెందిందని, ‘56 ఏళ్ల యువకుడికి చెందినది కాదు’ అని వ్యంగ్యంగా అన్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సంప్రదాయ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ.. దేశ యువత అంతరిక్ష రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. స్కైరూట్ స్టార్టప్‌లో పనిచేస్తున్న బృందం సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని తనకు తెలియజేశారని చెప్పారు. అలాంటి యువతే ఈ ఘనతను సాధించిందని, తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని నేరుగా రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీ స్కైరూట్ విజయాన్ని ప్రస్తావిస్తూ .. ప్రపంచంలో చాలా కొద్ది దేశాల్లోనే ప్రైవేట్ రంగం ఇలాంటి విజయాలను నమోదు చేస్తోంద



పూంచ్: జమ్మూ కాశ్మీర్ లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా పూంచ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిపోవడంతో ఏడుగురు మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. లోరాన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని.. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు.కాగా, పూంచ్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి పలు చోట్ల ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించాయి. దీంతో పూంచ్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాలింపు కోసం ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.సీఎం అబ్దుల్లా ఎక్స్‌గ్రేషియా ప్రకటనకుండపోత వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా, మరణించిన వారిలో ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి అదనంగ



అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. లెక్కింపు విదానాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ కానుకల లెక్కింపు బాధ్యతలను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించనుంది. విరాళాల లెక్కింపు మొత్తం నిపుణులైన ఎస్‌బిఐ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో, పూర్తి భద్రత నడుమ జరుగుతుందని వెల్లడించింది. పెరిగిపోతున్న కానుకల నిల్వలను దృష్టిలో ఉంచుకుని, రోజుకు 12 గంటల పాటు లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. ఈ 12 గంటల లెక్కింపు నిరంతరాయంగా సాగేందుకు వీలుగా సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించినట్లు తెలిపారు. పకడ్బందీగా ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.