24265 వార్తలు

గ్యాంగ్‌టక్: సిక్కింలోని నమ్చి జిల్లాలో సమర్ధుంగ్ సొరంగంలో భారీ కొండచరియలు విరిగిపడి చిక్కుకున్న 12 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. కొండచరియలు విరిగిపడడంతోపాటు గ్యాస్ లీక్ కావడంతో పరిస్థితి విషమించింది. అయితే అధికారులు అప్రమత్తమై వారిని రక్షించ గలిగారు.

ఇస్లామాబాద్ : సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణలో కెనడా సాయాన్ని పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ సోమవారం అభ్యర్థించారు. దార్ పాక్ విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో సంయుక్త పాత్రికేయ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈమేరకు విజ్ఞప్తి చేశారు. కెనడా మంత్రి అనితా ఆనంద్ పాక్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం 1960లో భారత్‌పాక్ మధ్య కుదిరింది.సింధు నదీ లోయలోని ఆరు నదుల జలాల పంపకం కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదుల జలాలు భారత్‌కు, పశ్చిమవైపున్న నదుల జలాలు పెద్దమొత్తంలో పాకిస్థాన్‌కు కేటాయింపు చేశారు. అయితే 2025లో పహల్గాం ఉగ్రదాడి వల్ల భారత్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ తగిన చర్యలు తీసుకునేవరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు భారత్ ప్రకటించింది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న భద్రతా పరిస్థితి లోకి కొత్త పరిమాణాన్ని భారత్ తీసుకు వచ్చిందని దార్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తమ మిత్రదేశాలైన కెనడా వంటి దేశాల మద్దతు తాము కోరుతున్నా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఓ పాత్రలో కనిపిస్తోందట. ఈ చిత్రంలో ఆమె నెగటివ్ పాత్రలో నటించనుందని తెలిసింది. ఇది ఆమె కెరీర్‌లో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె నటనలో కొత్త కోణాన్ని చూడవచ్చు. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నాడు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. కథపై కొరటాల బాగా కసరత్తులు చేశాడట. ఇక ఈ నిమాలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్య


దేశ రాజధానిలో నిరసన చేపట్టిన విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. దేశ చరిత్రలోనే మోదీ అంతటి విద్యార్థి వ్యతిరేక ప్రధానమంత్రి లేరని ఆరోపించారు. యువత సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా అవకతవకలను ఎత్తిచూపించిన వారిపై పోలీసు బలగాలను ఉపయోగించి అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకువెళ్లడం, బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జి జరిపారు. దీనిపై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ యువతకు వ్యతిరేకి అని, బాధ్యతల నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడంలో విఫలమయ్యారని అన్నారు. 152 పేపర్ లీక్‌లు జరిగి 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులుగా మారారు. ఇందుకు బాధ్యులైన ఒక్కరిని కూడా శిక్షించలేదు. అహరహం శ్రమంచి చదువుకున్న విద్యార్థులనే శిక్షిస్తున్నారు అని అన్నారు. విద్యకు సంబంధించిన న్యాయబద్ధమైన ప్రశ్నలు అడిగిన


ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరున తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ సోమవారంనాడు ఒక అధికారిక ప్రకటనలో ఖండించింది. గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన్ లియో నౌకపై జూలై 19న ఈ దాడి జరిగిందని, ఇందులో 5 మంది భారతీయులతో సహా 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని,ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది.వాణిజ్య నౌకలను, పౌర సిబ్బందిని టార్గెట్ చేసుకోవడం, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటకం కలిగించడం ఎంతమాత్రం సరికాదని ఎంఈఏ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. పరిస్థితిని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నిశితంగా గమనిస్తోందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది.


భారత డ్రగ్ కంట్రోల్ జనరల్ (డిసిజిఐ) డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాకు అనుమతి ఇచ్చింది. టకేడా బయోఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన ఈ వ్యాక్సీన్‌ను 4 నుండి 60 ఏళ్ల వయస్సు వారు తీసుకోవచ్చు. ఇది డెంగ్యూలోని 4 రకాల వైరస్‌ల నుండి రక్షణనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసుల్లో 3వ వంతు భారత్‌లోనే నమోదవుతుండగా, 2025 లో 1,13,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 43 దేశాల్లో 3.2 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు, 7 ఏళ్ల డేటా ప్రకారం ఇది ఆసుపత్రి పాలయ్యే ప్రమాదాన్ని సమర్థవంతంగా అడ్డుకుటుందని డాక్టర్ మహేందర్ నాయక్ తెలిపారు. 28,000 మందిపై జరిపిన ప్రయోగాల్లో 2 డోసుల తర్వాత ఇది 80.2% పనితీరు చూపించింది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఓ కార్యక్రమంలో కాస్త సన్నగా, అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్‌లో స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను షేర్ చేసి ’మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ పోస్ట్ తో ఆయన ఆరోగ్యంపై వస్తున్నా వదంతులకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని అభిమానులకు హింట్ ఇచ్చారు. దీనికి బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ... పలువురు నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్లు చేయగా, మరికొందరు మీరిలాగే ఫిట్‌గా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం... అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆస్తకికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరుసగా సమావేశమయ్యారు. ఒకవైపు ఢిల్లీలో తన రాజీనామాకు పట్టుబడుతూ ఆందోళనలు వెల్లువెత్తున్న తరుణంలో ఆయన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంట్‌లోని అమిత్ షా కార్యాలయంలో ప్రధాన్ ఆయనతో సమావేశమయ్యారు. అయితే వారిద్దరి ఏం అంశాలపై చర్చి జరిగిందన్నది వెల్లడి కాలేదు. తొలుత అమిత్ షాతో సమావేశమైన ప్రధాన్, సాయంత్ర కల్లా పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. నీట్ యూజీలో అవకతవకల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో కొంత కాలంగా కాక్రోచ్ జనతా పార్టీతో పాటు పర్యావరణ ఉద్యమకారుడు వాంగ్‌చుక్ దీక్ష నేపథ్యంలో దీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమావేశాలతో ఆయన రాజీనామాపై పెద్ద ఎత్తున్న ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.


కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం కూడా బిఆర్‌ఎస్సేనని రాష్ట్ర నీటిపారుదల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పాలనలో జరిగిన చారిత్రక వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ పార్టీ బురద జల్లడం, అధికారులను బలిపశ-వులుగా చూపించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం చేస్తుందని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రస్తుతం నిర్మాణపరంగా అసురక్షిత స్థితిలో ఉ-న్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, వెంటనే కన్నెపల్లి పంపులను నడిపి వాటిలో నీటిని నిల్వ చేయాలని బిఆర్‌ఎస్ డిమాండ్ చేయడం అత్యంత ప్రమాదకరమని ఆయనహెచ్చరించారు. 2023, అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన సమయంలో సీఎం కేసీఆర్ ఉ-న్నారని, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు. 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే నాటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని గుర్తుచేశారు. 2019లో ప్రారంభించిన కొద్ది కాలానికే మేడిగడ్డ బ్యారేజీలో లీకేజీలు,

లేబర్ పార్టీకి కొత్తగా ఎన్నికైన ఆండీ బర్న్ హ్యామ్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా సోమవారంనాడు ప్రమాణ స్వీ కారం చేశారు. బ్రిటన్ రాజకీయాల్లో దేశాన్ని ఒక కొత్త దిశ వైపు నడిపిస్తానని వాగ్దానం చేశారు. సమస్యల పరిష్కారం దిశగా తన రాజకీయాలు ఉంటాయని అన్నారు. ఏభై ఆరేళ్ల బర్న్ హామ్ తన ముందున్న ప్రధానులు సంప్రదాయంగా అనుసరించిన పోడియం నుంచి కాకుండా తన కొత్త హెడ్ క్వార్టర్స్ నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత నలభై ఏళ్లలో చేపట్టని అతిపెద్ద సంస్కరణలు ముందుకు తీసుకురానున్నామని, ఒక కొత్త రాజకీయ నమూనా, ఆర్థిక నమూనాతో ముందుకు వెళ్తామని చెప్పారు. కీర్ స్మార్టర్ ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. దీంతో లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేసంలో లేబర్ పార్టీ పక్షనేతగా ఆండీ బర్న్‌హోమ్ను ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ షబానా మహ్మద్ అధికారికంగా ప్రకటించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బర్న్‌హ్యామ్‌ను కింగ్ ఛార్లెస్-- -౩ సోమవారంనాడు ఆహ్వానించారు.


నిరసనకారులపై లాఠీచార్జీ, టియర్‌గ్యాస్ ప్రయోగంఅడ్డంకులు దాటుకుని పార్లమెంట్‌వైపు ఆందోళనకారులు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత 20వేల మందికిపైగా తరలివచ్చిన సిజెపి మద్దతుదారులు తోపులాటల్లో పోలీసులు, నిరనసకారులకు గాయాలు పలువురిని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) చలో పార్లమెంట్ ఉద్రిక్తతకు దారితీసింది. నీట్‌లో అవకతవకలు, కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా సహా పలు డిమాండ్లతో సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజే సుమారు 20వేల మందికిపైగా సిజెపి మద్దతుదారులు అటువైపుగా దూసుకెళ్లారు. తొలుత జంతర్‌మంతర్ వద్దే ఆందోళనకారులను అడ్డుకునేందుకు అడుగుడుగనా భద్రతా దళాలు, బారికేడ్లను మోహరించారు. పోలీసులు పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి ఇవ్వకపోయినా విద్యార్థులు, నిరసనకారులు లెక్కచేయకుండా ముందుకే కదిలారు. పోలీసులు ఎంత అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించండంతో పోలీసులు లాఠీలు ఝలిపించారు. టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలకు, నిరసనకారులకు నడుమ జరిగిన ఘర్షణలు, తోపులాటల్లో ఇరు పక్షాల్లో కొందరి

ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. న్యూజెర్సీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో స్పెయిన్ 10 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి ప్రపంచకప్ టైటిల్‌ను దక్కించుకుంది. స్పెయిన్‌కు ఇది రెండో వరల్డ్‌కప్ ట్రోఫీ కావడం విశేషం. 2010లో స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకుంది. తాజాగా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగిన తుది పోరు చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. ఇటు స్పెయిన్ అటు అర్జెంటీనా గోల్ కోసం సర్వం ఒడ్డి పోరాడాయి. కానీ తొలి హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో కూడా ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేక పోయింది. దీంతో ఆట ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుత గోల్ సాధించాడు. దీంతో స్పెయిన్ చారిత్రక విజయాన్ని అందుకుంది.కల చెదిరిన అర్జెంటీనా.. ఈ వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా అంచనాలకు తగినట్టు రాణిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన నాకౌట్ మ్యాచుల్లోనూ అసాధారణ ఆటను కనబరిచి


నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ ఢిల్లీలో శాంతియుత పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, హింసాత్మకంగా మారడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. సోమవారం సాయంత్రం సచివాలయం రాజీవ్ గాంధీ చౌక్ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకూ కాగడాలతో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోత రోహిత్ ఇతర నాయకులు కార్యకర్తలూ పాల్గొన్నారు. మంత్రులు కూడా కాగడాలు చేతపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నీట్ పరీక్షపై మౌనం వీడాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు శాంతియుత పార్లమెంటు మార్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడ హింసా పద్ధతి చేయలేదన్నారు. విద్యార్థులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం దుర్మార్గమని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానిక

బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణోత్సవ, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అధికారులు ఆలయ సమీపం ప్రాంతాల్లో మంగళ,బుధవారాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాహన దారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం,ఫతేనగర్ ఫ్లై ఓవర్,ఫతేనగర్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను ఎస్సార్ నగర్ టి జంక్షన్ వద్ద నుంచి ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్,అభిలాష టవర్స్,బికె. గుడా ఎక్స్ రోడ్ శ్రీరామ నగర్ ఎక్స్‌రోడ్ నుంచి సనత్‌నగర్,ఫతేనగర్ రోడ్దు వైపు మళ్ళించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపువచ్చే ట్రాపిక్‌ను అనుమతించడం లేదన్నారు. ఈ వాహనాలన్నీ న్యూ బ్రిడ్జి ( హైదరాబాద్ కిచెన్ మార్గ్)వద్ద ఆర్‌యుబి ద్వారా కట్టమైసమ్మ ఆలయం, బేగం పేట వైపు మళ్ళించనున్నట్లు చెప్పారు. గ్రీన్ ల్యాండ్స్ ,బకుల్ ఆపార్ట్‌మెంట్స్,పుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపునకు వచ్చే వాహనాలకు అనుమతించరని చెప్పారు. వీటిని పుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్,

వరంగల్ మామనూరు విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.86 కోట్లను కేటాయించినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ లిఖీత పూర్వకంగా రాజ్యసభకు తెలియచేశారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని ఎంపి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వివరాలను రాజ్యసభకు వెల్లడించారు. వరంగల్ మామనూరు విమానాశ్రయం కోసం రన్‌వే, ఆఫ్రాన్, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణం వంటి పనుల కోసం ఇప్పటికే టెండర్‌లను పిలిచినట్టు రాజ్యసభకు ఇచ్చిన లేఖలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి తెలియచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్,పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేసే అంశంపై ఏఏఐ టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ స్టడీ పూర్తి చేసినట్టు కేంద్రం తెలిపింది. పెద్దపల్లి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం ప్రతిపాదిత స్థలంపై ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు కేంద్రం పేర్కొంది. భద్రాద్రి క


మంగళవారం నుంచి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎడ్యుకేషన్ హబ్ పనులను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎస్‌ఐఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌ను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సిఎం సమీక్షిస్తారు. నేడు రాత్రి కొడంగల్‌లోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. 22వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, బిఎల్‌ఓలతో ఎస్‌ఐఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు సిఎం రేవంత్‌రెడ్డి చేరుకుంటారు.