20035 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్ గూడాలో దారుణం చోటు చేసుకుంది. రాజేశ్వరి అనే మహిళ తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువులో ముంచి చంపేసింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post హైదరాబాద్ లో దారుణం..9 నెలల చిన్నారిని నీటిలో ముంచి చంపిన తల్లి appeared first on Navatelangana.

నవతెలంగాణ – పెద్దవంగర ఆర్ఎంపీ, పీఎంపీ మండల నూతన అధ్యక్షుడిగా బొమ్మకల్ గ్రామానికి చెందిన పొడిశెట్టి సైదులు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల మండల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా సుధగాని రామ్మూర్తి, ఉపాధ్యక్షుడిగా పులుగుజ్జ రామచంద్రు, కోశాధికారిగా కనుకుంట్ల సంపత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సైదులు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు అర్హతలు, నిబంధనలకు లోబడి మాత్రమే వైద్య సేవలు అందించాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో […] The post ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడిగా సైదులు గౌడ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త, రామేశ్వర్‌పల్లి వాస్తవ్యులు ముద్దసాని రాజు – మాలతి దంపతులు, వారి కుమార్తె వర్షిత, కుమారుడు రోహన్ కలిసి ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం గ్రానైట్‌తో పాటు గర్భగుడికి అవసరమైన టైల్స్‌ను విరాళంగా అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంత్రి చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.3,36,000 అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో […] The post రామ మందిర నిర్మాణానికి విరాళం appeared first on Navatelangana.

నవతెలంగాణ – మునిపల్లి మండలంలోని బొడిశేట్పల్లి గ్రామ సర్పంచ్ పొట్టిగారి మల్లేశ్వరి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితురాలై అదేవిధంగా గ్రామ అభివృద్ధికి గాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సర్పంచ్ మల్లేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ నాయకులు రాంరెడ్డి తదితరులు ఉన్నారు. The post కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బొడిశేట్పల్లి సర్పంచ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – మునిపల్లి మండల పరిధిలోనిమల్లికార్జున్ పల్లి గ్రామంలో బోనాల పండుగను గ్రామ సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎస్ఐ అరవింద్ పాల్గొని పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా బోనాలను మహిళలు ఎత్తుకొని పురవీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు. The post మల్లికార్జున్ పల్లిలో బోనాల పండుగ appeared first on Navatelangana.

ఘనంగా 1990 బ్యాచ్ స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం నవతెలంగాణ-ఆలేరు టౌన్ఆలేరు మండలంలో భావోద్వేగాల వెల్లువ మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదని ఆలేరు పట్టణానికి చెందిన 1990 బ్యాచ్ స్నేహితులు మరోసారి నిరూపించారు. జీవిత ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో స్థిరపడినా, చిన్ననాటి జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్న మిత్రులు ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ పాఠశాల రోజుల సంఘటనలను ఒకరితో ఒకరు […] The post తరాలు మారిన తరగని స్నేహబంధం appeared first on Navatelangana.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని , ఉన్నది ఒకటే కేసీఆర్ గ్రూప్ మాత్రమే అని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. పత్రికా సమావేశంలో ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపులు ఉన్నాయంటూ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. […] The post బీఆర్ఎస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు తగవు appeared first on Navatelangana.


నవతెలంగాణ-ఆలేరు టౌన్ భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా 4వ మహాసభలు విజయవంతం చేయాలని, మహిళా సమైక్య మండల నాయకురాలు, మాటూరు జానమ్మ అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య 1931లో ఏర్పడి , నాటి నుండి దేశంలో రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, అసమానతలు, అత్యాచారాలు, అన్యాయాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతు ఉద్యమ చరిత్ర లిఖించిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూనే 2023 పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఉద్యమించామన్నారు. సిపిఐ జిల్లా […] The post భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా 4వ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ appeared first on Navatelangana.

ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు అఖిలపక్ష కమిటీ విజ్ఞప్తి నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేర్ రెవెన్యూ డివిజన్ ఈ లిమిటేషన్ తో సంబంధం లేకుండా వెంటనే ఏర్పాటు చేస్తూ గెజిట్ ప్రకటించాలని, ఆలేర్ రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ, అఖిలపక్ష కమిటీ సభ్యులు ముక్త కంఠంతో, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆలేరు రెవెన్యూ డివిజన్ విషయంపై చర్చించడానికి ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అఖిలపక్ష […] The post వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ గెజిట్ ను ప్రకటించాలి appeared first on Navatelangana.

నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లను బిఆర్‌ఎస్ నేతలు ఆదివారం సందర్శించారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బిఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, టిజిబికెఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సుంకే రవిశంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ తదితరులకు ధర్మారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ధర్మారం అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. నంది మేడారంలోని నంది పంపుహౌస్‌ల వద్ద నీటిని ఎత్తిపోస్తున్న విధానాన్ని నేతలు పరిశీలించారు. అనంతరం బోయిన పల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. సిఎం రేవంత్‌రెడ్డికి నీటిపై అవగాహన లేదని అన్నారు. ఢిల్లీలో ఎన్డీఎస్ అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి నీటిపారుదుల శాఖపై ఏ మాత్రం అవగాహన లేదని, నీటి గురించి, ప్రాజెక్టుల గురించి కనీసం ఎ,బి,సి,డిలు తెలవని.. ఉత్త మంత్రిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆదివారం ఫలాంబరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లతో అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించారు. వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకొని భోజనాలు చేశారు.

లష్కర్ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్‌ను గతంలో ఎవరూ పట్టించుకోలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కెసిఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కెటిఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వెళ్లిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కెటిఆర్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని అన్నారు. బోనాలు కులాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కెసిఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 1800 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అద్భతంగా నిర్మించామని తెలిపారు. బోనాల సందర్భంగా ప్రతి ఆలయ కమిటీకి నిధులు కేటాయించి, పండుగలను ఘనంగా నిర్వహించామని చె

సూరత్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విదేశాల్లో ఉన్నత విద్య ఎలా అభ్యసించారనే అంశంపై విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన అభిజీత్ తండ్రి భగవన్‌రావు దిప్కే తన కుమారుడి విదేశీ విద్యకు నిధులు ఎలా సమకూర్చారనే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను కోరారు. అదే సమయంలో, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన ఆందోళనల్లో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటున్న సీజేపీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించిన రూ.1 కోట్ల నిధిపైనా ఎన్నికల సంఘం, పన్నుల శాఖలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కాక్రోచ్ జనతా పార్టీ చట్టబద్ధంగా నమోదు కానప్పటికీ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ విరాళాలు స్వీకరించడం సరైనదేనా అనే అంశాన్ని కూడా ఎన్నికల సంఘం పరిశీలించాలని అమిత్ తివారీ కోరారు. “కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల సంఘంలో నమోదు కాని సంస్థ. అయినప్పటికీ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని న్యాయ సహాయ నిధికి ర

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే ఇద్దరు సినీ నటులపై విరుచుకుపడ్డారు. బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్‌లపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించే వారు విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారని ప్రశ్నించారు. ముంబైలో ఎంఎన్‌ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ ఠాక్రే... దేశంలో అన్నీ బాగున్నాయని, దేశాన్ని మోడీ అభివృద్ధి చేస్తున్నారని చెబుతున్న వివేక్ ఒబెరాయ్, మాధవన్ తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు? అని ప్రశ్నించారు. అయితే తన కుమారుడు వేదాంత్ ఈత శిక్షణ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు మాధవన్ వెల్లడించారు. భారత్‌లో టాక్స్‌లు చెల్లిస్తున్నానని, తన వృత్తిపరమైన అనుబంధం కూడా భారతదేశంతోనే కొనసాగుతోందన్నారు. వ్యాపార కార్యకలాపాల కోసమే దుబాయ్‌లో నివసిస్తున్నట్టు వివేక్ ఒబెరాయ్ గతంలో ప్రకటించారు.

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ని మదురా ద్వీపం సమీప సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 41 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరికొందరిని సురక్షితంగా కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరమైన తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సర్‌కు వెళ్తుండగా ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంటల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు ప్రయాణికులు ఫెర్రీ నుంచి సముద్రంలోకి దూకడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.

కారు డ్రైవింగ్ చేసి బీభత్సం సృష్టించడంతో ఓ ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన యూసుఫ్‌గూడలోని కార్మికనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ, కార్మికనగర్‌కు చెందిన రాజ్‌కుమార్(60), ప్రభాకర్(55) ఇద్దరు సోదరులు స్కూటీపై వచ్చి ఓ ఇంటి ముందు బైక్‌పార్క్ చేస్తుండగా కారు నడుపుకుంటూ వచ్చిన బాలుడు(17) వారిని ఢీకొట్టాడు. కారుపై అదుపు కోల్పోవడంతో వారిని ఢీకొట్టి ముందుకు వెళ్లడంతో రాజ్‌కుమార్ కారుతో పాటు ఈడ్చుకుపోయాడు. దీంతో ఏడుబైక్‌లు ధ్వంసం కావడంతోపాటు రాజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రాజ్‌కుమార్‌పై కారు వెను టైర్ ఆగిఉండడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు కారును పైకి లేపి రాజ్‌కుమార్‌ను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. బాలుడికి డ్రైవింగ్ రాకున్నా కారును నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవింగ్ చేసిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులు బిక్షమెత్తుకోవాలా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగ్రహంగా ప్రశ్నించారు. రంజాన్‌కు రూ. 33 కోట్లు కేటాయించి, బోనాలకు రూ. 20 కోట్లే కేటాయించిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని ఆమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. జంట నగరాల్లోనే 3 వేల పైచిలుకు దేవాలయాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హిందువుల పండుగలంటే ఎందుకంత చులకన అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం అన్నారు.గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించిందని ఆయన తూర్పారపట్టారు. జనాభా ప్రాతిపదికన పండుగలు, ఉత్సవాలకు నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో హిందు పండుగలు, ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులంతా బిచ్చమెత్తుకునే దుస

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముమ్మిడివరం: గోదావరి ఉద్ధృతి కారణంగా లంక గ్రామాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని శేరిలంక, కమిని, పశువులలంక, గురజాపులంక, కూనలంక, తానేలంక, పొట్టిలంకల్లోకి వరుద నీరు చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పలు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని ఇళ్లను ఖాళీ చేయించారు. కొన్ని చోట్ల మరబోట్లను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.


