🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3542 వార్తలు

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత
పాత
పుస్తక జ్ఞానంతోపాటు ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌లూ కీలకం : బాలకిష్టారెడ్డి
పాత
అప్పుడు తల్లి, ఇప్పుడు కూతురు..  దేవి సినిమాతో వనిత.. అగధ చిత్రంతో జోవికా
పాత
ప్రతి విజయానికి మూలం శ్రమ,  ప్రతి అభివృద్ధికి బలం కార్మికులు : రేవంత్ రెడ్డి
పాత
తెలంగాణ

ప్రతి విజయానికి మూలం శ్రమ, ప్రతి అభివృద్ధికి బలం కార్మికులు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్: శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపునిచ్చే ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ (May Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టం చేసిన ప్రతి చేతి విలువను గుర్తించి, సమానత్వం, న్యాయం, గౌరవం కోసం కలిసి ముందుకు సాగుదామని సిఎం పిలుపునిచ్చారు. “ప్రతి కార్మికుడి చెమట చుక్కలో మన సమాజ భవిష్యత్తు దాగి ఉంది. కార్మికుల అంకితభావం, కష్టపడే మనస్తత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికుల హక్కులను కాపాడటంలో ప్రజాప్రభుత్వం నిరంతరం పాటుపడుతుంది” అని రేవంత్ చెప్పారు.కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం, వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమాన

మహిళపై అత్యాచారం... పోలీసుల విచారణ... పరారీలో సిఐ మల్లయ్య
పాత
తెలంగాణ

మహిళపై అత్యాచారం... పోలీసుల విచారణ... పరారీలో సిఐ మల్లయ్య

అమరావతి: మహిళపై సిఐ అత్యాచారం చేసిన కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సిఐ మల్లయ్య పరారీలో ఉన్న సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రాహ్మణపల్లిలో చిలకలూరిపేట సిఐ మల్లయ్య తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి చిలకలూరి పేటలో న్యాయమూర్తి ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలాన్నీ తీసుకున్నారు. సిఐ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి బ్రాహ్మణపల్లికి విచారణకు వెళ్తుండగా సిఐ మల్లయ్య గ్రామం నుంచి పారిపోయాడు. బ్రాహ్మణపల్లి గ్రామంలో పలువురు మహిళలను సిఐ వేధించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. సిఐ మల్లయ్య తనని లైంగికంగా వేధించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. మరో మహిళ వైపు కన్నెత్తి చూడకుండా అతడిని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. సదరు సిఐకి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని పలువురు మహిళలపై సిఐ అత్యాచారం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పరువుపోతు

డాక్టర్ రేప్, మర్డర్ నేపథ్యంగా..
పాత
తెలంగాణ

డాక్టర్ రేప్, మర్డర్ నేపథ్యంగా..

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రి యేషన్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘హంట్’ తెలుగులో ‘డాక్టర్ కీర్తి‘, ఎంబీబీఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవుతోంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూ పొందిన ఈ మూవీని సంచలనం సృష్టించిన కోల్‌కతాలో జరిగిన డాక్టర్ రేప్. మర్డర్ నేపథ్యంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పీవీఆర్ సినిమాస్ తో కలిసి స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ్ రెడ్డి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ “కోల్‌కతాలో సంచలనం సృష్టించిన డాక్టర్ రేప్, మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. డాక్టర్ పాత్రలో నటి భావన అద్భుతంగా నటించారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ సాయివెంకట్, ప్రభాకర్ పాల్గొన్నారు.

ఫస్ట్ టైం’ ట్రైలర్ విడుదల
పాత
తెలంగాణ

ఫస్ట్ టైం’ ట్రైలర్ విడుదల

హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ టైం’. సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అని క్క విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన అందాల తార పాయల్ రాజ్‌పుత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా నిర్మాత, దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి ప్రభ గౌడ్, జి చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్, హీరో అభినవ్ శౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ “మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాము. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

IPL-2026: నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోరు
పాత
గాంధీ హాస్పిటల్ లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్
పాత
చర్లపల్లిలో యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్
పాత
యాదగిరిగుట్ట దేవస్థానంలో ముగిసిన నారసింహుడి జయంతి ఉత్సవాలు
పాత
ఇరాన్ పై సైనిక చర్యతో ప్రపంచానికి ముప్పు
పాత
కొనసాగుతున్న భరోసా అవగాహన
పాత
రజత్ పాటీదర్ ఔట్‌పై వివాదం... మండిపడుతున్న ఆర్‌సిబి అభిమానులు
పాత
తెలంగాణ

రజత్ పాటీదర్ ఔట్‌పై వివాదం... మండిపడుతున్న ఆర్‌సిబి అభిమానులు

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఆర్‌సిబిపై జిటి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్‌సిబి తొలుత 19.2 ఓవర్లలో 155 పరుగులు చేసి ఆలౌటైంది. జిటి జట్టు 15.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలిచింది. ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన్ తీరుపై వివాదం నెలకొంది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో బంతిని రజత్ పాటీదార్ లైగ్ సైడ్ కొట్టాడు. బౌండరీ దగ్గర జేషన్ హోల్డర్ బంతిని పట్టుకొని కిందపడ్డాడు. బంతి చేతిలో ఉన్నప్పడు నేలకు తాకంది. థర్డ్ ఎంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అధికారితో వాగ్వాదానికి కూడా దిగాడు. బంతిని పట్టుకున్న తరువాత నేలకు ఎలా తాకిన కూడా ఔట్ ఎలా ప్రకటిస్తారని ఆర్‌సిబి అభిమానులు మండిపడుతున్నారు.

జూరాలలో సిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగించేందుకు చర్యలు
పాత
అంబేద్కర్ కాలేజీకి ప్రతిష్టాత్మక అవార్డులు
పాత
మైక్రో ఫైనాన్స్ కేసు.. మంగ్లీ తమ్ముడి అకౌంట్కు డబ్బులు!
పాత
నీటి వనరుల పునరుద్ధరణతోనే నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం !
పాత
నెలాఖరు వరకు డబుల్ బెడ్రూం ఇండ్లు..అనర్హులు ఉన్న ఇండ్లను అర్హులకు కేటాయిస్తం: మంత్రి పొంగులేటి
పాత
అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత
పాత
తెలంగాణ

అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈవీఎంల భద్రత విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె స్వయంగా కోల్‌కతాలోని ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద మూడు గంటలకు పైగా ఉన్నారు. దక్షిణ కోల్‌కతాలోని సాఖావత్ మెమోరియల్ స్కూల్‌లో భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్‌రూమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, […] The post అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత appeared first on Navatelangana.

పుట్టిన రోజు వేడుకలలో ముగ్గురు స్నేహితులను చంపిన నిందితుడు ఎన్‌కౌంటర్
పాత
తెలంగాణ

పుట్టిన రోజు వేడుకలలో ముగ్గురు స్నేహితులను చంపిన నిందితుడు ఎన్‌కౌంటర్

లక్నో: బర్త్ డే పార్టీలో ముగ్గురును హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్‌శహర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జీతూ సైనీ అనే యువకుడు ఏప్రిల్ 25న తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ముగ్గురు స్నేహితులు అమరదీప్(30), మనీశ్(28), ఆకాశ్(18) జీతూ ముఖానికి కేక్ పూయడంతో గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో గన్ తీసుకొని ముగ్గురు స్నేహితులపై జీతు కాల్పులు జరిపాడు. ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జీతూపై రూ.50 వేల రివార్డును కూడా ప్రకటించారు. నిందితుడు కోసం ఖుర్జు గ్రామ శివారులో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా అతడు ఎదురుపడ్డాడు. వెంటనే గన్‌తో పోలీసులపై కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు కాల్పులో జీతూ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీతూ చనిపోయాడు.

ప్రేమ వివాహం.... పసికందును గోడకేసి కొట్టి హత్య
పాత
తెలంగాణ

ప్రేమ వివాహం.... పసికందును గోడకేసి కొట్టి హత్య

అమరావతి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పసికందును ప్రియుడు గోడకేసి కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని గన్నవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గన్నవరానికి చెందిన యువకుడు, వాంబేకాలనీ చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఐదు సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2025 జనవరిలో ఓ పాప జన్మించింది. భర్త స్నేహితుడు కనిజం వంశీతో యువతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి పలుమార్లు వంశీతో కలిసి సహజీవనం చేస్తుంది. పసి పాపతో కలిసి ఒక రోజు వంశీ గదికి వెళ్లిన క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. 18 నెలల పాపను ప్రియుడు వంశీ దారుణంగా గోడకేసి కొట్టి చంపాడు. పాప ఘటనా స్థలంలోనే చనిపోవడంతో అత్తామామలకు జరిగిన విషయం ఫోన్ లో చెప్పింది. ఎక్కడున్నావని వారు అడగగా, మహిళ పొంతన లేని సమాధానం చెప్పడంతో అత్తామామలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలించారు. చుట్టుగుంట సమీపంలో చనిపోయిన పాపతో నిందితులను పోలీసులకు పట్టుకున్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వివాహేతర సంబంధ

పెట్రోల్ బంకులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
పాత
తెలంగాణ

పెట్రోల్ బంకులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్ : నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలోని మార్వెల్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగడంతో ఒక ఆటో పూర్తిగా దగ్ధమైపోగా, మరో ఆటో పాక్షికంగా దెబ్బతింది. పోలీసుల వివరాల ప్రకారం.. 3146 నంబర్ గల ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో […] The post పెట్రోల్ బంకులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.

Advertisement