🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3620 వార్తలు

అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన
పాత
తెలంగాణ

అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన

– యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం పరిశీలన– ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ– పలు శుభకార్యాలకు హాజరునవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు అవసరమైన స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. […] The post అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన appeared first on Navatelangana.

ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్‌ గా ప్రవీణ్ కుమార్
పాత
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్‌ గా ప్రవీణ్ కుమార్

– 600లో 574 మార్కులు సాధించిన పేద విద్యార్థి ప్రతిభకు ప్రశంసలునవతెలంగాణ – అశ్వారావుపేటలక్ష్యంతో చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులూ అద్భుత ఫలితాలు సాధించగలరని అశ్వారావుపేట మండలం మామిళ్ళవారిగూడెం విద్యార్థి మద్దాల ప్రవీణ్ కుమార్ నిరూపించాడు.  పదో తరగతి వార్షిక పరీక్షల్లో 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి ప్రభుత్వ రంగ పాఠశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. అశ్వారావుపేట మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి 236 మంది […] The post ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్‌ గా ప్రవీణ్ కుమార్ appeared first on Navatelangana.

నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు
పాత
తెలంగాణ

నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు

– 24 మందికి 24 మంది ఉత్తీర్ణత– ఇద్దరు విద్యార్థులకు అత్యధిక మార్కులు– సగం మంది 500 పైగా మార్కులతో ప్రతిభ– విద్యార్థులను అభినందించిన హెచ్‌ఎం వెంకటేశ్వరరావునవతెలంగాణ – అశ్వారావుపేటమండలంలోని నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించిన 2026 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఈ పాఠశాల నుంచి పరీక్షలకు హాజరైన 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. […] The post నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు appeared first on Navatelangana.

అశ్వారావుపేటలో బాలికలదే పైచేయి
పాత
పెళ్లి కానుకగా పెట్రోల్, డీజిల్
పాత
తెలంగాణ

పెళ్లి కానుకగా పెట్రోల్, డీజిల్

– కేటీఆర్ అభిమానుల వినూత్న నిరసన– పెళ్లి వేడుక లో చర్చనీయాంశంనవతెలంగాణ – అశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాత పేరాయిగూడెం గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక వినూత్న కానుక తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన నార్లపాటి వెంకటేశ్వరరావు – కన్నమ్మ దంపతుల కుమారుడు లక్ష్మణరావు కు మమత తో బుధవారం ఘనంగా వివాహం జరిగింది.ఈ వేడుకలో వధూవరులకు అందించిన ప్రత్యేక కానుక స్థానికంగా చర్చనీయాంశమైంది. వధూవరులను ఆశీర్వదించేందుకు హాజరైన టీఆర్ఎస్ […] The post పెళ్లి కానుకగా పెట్రోల్, డీజిల్ appeared first on Navatelangana.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు వివాదం..
పాత
తెలంగాణ

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు వివాదం..

– రైతుల ఆందోళనతో ఉద్రిక్తత– వైస్ ఛైర్పర్సన్ జూపల్లి జోక్యంతో కొలిక్కి వచ్చిన సమస్య నవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేట లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం తరుగు విషయంలో వివాదం చెలరేగి రైతుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులు కేంద్రంలో 5 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, అదనంగా ముఠా కూలీ కూడా చెల్లించాల్సి వస్తోందని ఆరోపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు […] The post ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు వివాదం..  appeared first on Navatelangana.

శ్రీరామమూర్తిని సన్మానించిన సర్పంచ్, కార్యదర్శి
పాత
తెలంగాణ

శ్రీరామమూర్తిని సన్మానించిన సర్పంచ్, కార్యదర్శి

నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో సూపర్ డెంట్ గా, ఇంఛార్జి ఎంపిడిఓ గా సుదీర్ఘకాలం విదులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ పొందిన సూపర్ డెంట్ దంపతులకు తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. శ్రీరామూర్తి దంపతులు ఆయురారోగ్యాలతో నిండు వందేళ్లు శేషాజీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీపీ సిబ్బంది పాల్గొన్నారు. The post శ్రీరామమూర్తిని సన్మానించిన సర్పంచ్, కార్యదర్శి appeared first on Navatelangana.

మండల టాపర్ ను సన్మానించిన సర్పంచ్ బండిస్వామి
పాత
శ్రీరామమూర్తి సేవలు అభినందనీయం: తహశీల్దార్
పాత
తెలంగాణ

శ్రీరామమూర్తి సేవలు అభినందనీయం: తహశీల్దార్

నవతెలంగాణ – మల్హర్ రావుమండల పరిషత్ ఉద్యోగంతోపాటు వివిధ పదవుల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి మండల సూపర్ డెంట్ గా ఉద్యోగ పదవి విరమణ పొందిన గంటి శ్రీరామమూర్తి సేవలు అభినందనీయమని మండల తహశీల్దార్ రవికుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యక్రమంలో ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి తహసీల్దార్ హాజరై సూపర్ డెంట్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల జిపిఓ గొట్టం నరేశ్, మహర్షి, పంచాయతీ కార్యదర్శులు మల్లిఖార్జున రెడ్డి, భాస్కర్ […] The post శ్రీరామమూర్తి సేవలు అభినందనీయం: తహశీల్దార్ appeared first on Navatelangana.

శ్రమ శక్తి అవార్డు అందుకోనున్న శారాజిపేట వాసి
పాత
తెలంగాణ

శ్రమ శక్తి అవార్డు అందుకోనున్న శారాజిపేట వాసి

నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి డాక్టరేట్ చిలుకు స్వామి ప్రతిష్టాత్మకమైన “శ్రమ శక్తి అవార్డు”ను మేడే సందర్భంగా అందుకోనున్నారు. గత 14 సంవత్సరాలుగా రైల్వే కార్మిక సంఘం ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తూ, ఎస్సీ విభాగ కార్యదర్శి స్థాయి నుంచి డివిజన్ స్థాయి ఉప కార్యదర్శిగా ఎదిగి కార్మికులకు అంకిత భావంతో సేవలందిస్తున్నారు. అలాగే గత రెండు సంవత్సరాలుగా సహకార క్రెడిట్ సంఘ ప్రతినిధిగా సభ్యుల సంక్షేమం కోసం కృషి […] The post శ్రమ శక్తి అవార్డు అందుకోనున్న శారాజిపేట వాసి appeared first on Navatelangana.

సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి సేవలు గొప్పవి
పాత
తెలంగాణ

సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి సేవలు గొప్పవి

మండల ఎంపీడీఓ క్రాంతికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుమండల పరిషత్ ఉద్యోగంతోపాటు వివిధ పదవుల్లో 35 సంవత్సరాలు సేవలందించి మండల సూపర్ డెంట్ గా ఉద్యోగ పదవి విరమణ పొందిన గంటి శ్రీరామమూర్తి సేవలు గొప్పవని మండల ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యక్రమంలో ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. మండల సూపర్ డెంట్ గా, ఇంఛార్జి ఎంపీడీఓ గా శ్రీరామూర్తి సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ […] The post సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి సేవలు గొప్పవి appeared first on Navatelangana.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం
పాత
తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం

మూడు ఏళ్లుగా నిలిచిన హెచ్ డిఎఫ్ నిధులసొంతంగా భరిస్తున్నామని డాక్టర్ల ఆవేదన నవతెలంగాణ-అచ్చంపేటప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నీటి వసతి, మౌలిక వసతులు కల్పించడానికి, టాయిలెట్లు చిన్నపాటి మరమ్మత్తులకు, వివిధ రకాల రిజిస్టర్లు నిర్వహణకు ప్రభుత్వం (హెచ్ డి ఎఫ్.) ఆస్పత్రి డెవలప్మెంట్ ఫండ్ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. కానీ గత మూడు ఏళ్లుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు సొంతంగా జీతం నుంచి ఖర్చు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. […] The post ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం appeared first on Navatelangana.

భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు రాష్ట్ర మ్యూజియం సంద‌ర్శ‌న‌
పాత
తెలంగాణ

భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు రాష్ట్ర మ్యూజియం సంద‌ర్శ‌న‌

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా పబ్లిక్ గార్డెన్స్‌లోని రాష్ట్ర మ్యూజియంను సందర్శించి, అక్కడి గ్యాలరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాంతీయ పురావస్తు-సాంస్కృతిక వారసత్వాన్ని సమగ్రంగా సంరక్షిస్తున్నందుకు అభినందించారు. “అమూల్యమైన వారసత్వానికి నిలయమైన నిధి”గా మ్యూజియాన్ని అభివర్ణించిన సుచిత్ర ఎల్లా , అక్కడి సేకరణల నుండి నేర్చుకోవడానికి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ వారసత్వాన్ని సంరక్షించడం సమిష్టి బాధ్యత అని ఆమె తెలిపారు. జ్ఞాన భాగస్వామ్యాలు, CSR […] The post భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు రాష్ట్ర మ్యూజియం సంద‌ర్శ‌న‌ appeared first on Navatelangana.

పోషకాహార లోపం నివారణకై బాల భరోసా పథకం
పాత
తెలంగాణ

పోషకాహార లోపం నివారణకై బాల భరోసా పథకం

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి నవతెలంగాణ-అచ్చంపేటఐదేండ్ల లోపు చిన్నపిల్లలలో పోషకాహార లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాల భరోసా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారులకు మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో చిన్న పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో బాల భరోసా మెడికల్ టెస్ట్ లు నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా 20 మంది చిన్నారులకు టెస్టులు నిర్వహించడం జరిగింది. పిల్లలకు […] The post పోషకాహార లోపం నివారణకై బాల భరోసా పథకం  appeared first on Navatelangana.

మోడీ పర్యటనలో.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం: కిషన్ రెడ్డి
పాత
తెలంగాణ

మోడీ పర్యటనలో.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: మే 10న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో భాగంగా రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్‌ను మోడీ ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నారు. హఫీజ్‌పేట, జోగులాంబ రైల్వేస్టేషన్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడు రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులున ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం
పాత
జిల్లా టాపర్లుగా మెరిసిన ఆదర్శ విద్యార్థులు
పాత
తెలంగాణ

జిల్లా టాపర్లుగా మెరిసిన ఆదర్శ విద్యార్థులు

నవతెలంగాణ-కాటారం పదో తరగతి ఫలితాల్లో కాటారం మండలానికి గర్వకారణంగా ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని అలిపిరెడ్డి మనోజ్ఞ నిలిచింది. 600/590 మార్కులు సాధించి భూపాలపల్లి జిల్లా టాపర్‌గా నిలిచారు. రాష్ట్రస్థాయిలోనూ ఉన్నత మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తెచ్చింది. గౌతంకృష్ణ 582 మార్కులు సాధించగా, ఆరాధ్య 577, సాయి చరణ్య 576, తనీష్ 576, యాప్నిక 575, చరణ్ 575, స్మిత 574, హర్షవి 573, మాధుర్య 570 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల నుండి […] The post జిల్లా టాపర్లుగా మెరిసిన ఆదర్శ విద్యార్థులు appeared first on Navatelangana.

ముంబైపై విజయం.. అరుదైన మైలురాయి చేరుకున్న సన్‌రైజర్స్
పాత
తెలంగాణ

ముంబైపై విజయం.. అరుదైన మైలురాయి చేరుకున్న సన్‌రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ముంబై ఇచ్చిన 244 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి.. ఆరు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలిచింది. ఇది సన్‌రైజర్స్‌కి వరుసగా ఐదో విజయం కావడం విశేషం. కాగా, ఈ విజయంతో సన్‌రైజర్స్ ఐపిఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు 100వ విజయం. 2013లో ఐపిఎల్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ ఇప్పటికవరనూ 205 మ్యాచ్‌లు ఆడింది. అందులో 100 మ్యాచుల్లో గెలవగా.. 104 మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక ఇప్పటివరకూ సన్‌రైజర్స్ రెండు సార్లు (2016, 2024) ఫైనల్స్‌కు చేరింది. 2016లో విజేతగా నిలిచింది. 2024లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంతేకాక.. నాలుగుసార్లు ప్లేఆఫ్‌కి కూడా చేసింది. దీంతో నిలకడైన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు తెచ్చుకుంది.

అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు టెకీ మృతి
పాత
తెలంగాణ

అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు టెకీ మృతి

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలో పని చేస్తున్న సురేష్ కుమార్ (41) అనే తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న సురేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే సురేష్ మరణించినట్లు తెలుస్తోంది. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఏడేళ్ల అబ్బాయికి ప్రత్యేక వైద్య సేవలు అవసరం. మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అతడి మిత్రులు, సన్నిహితులు ఆన్‌లైన్‌లో ఫండ్ రైజింగ్ చేపట్టారు.

కవిత పార్టీకి ఆమోదం.. అంకిత భావంతో పని చేస్తానని ప్రకటన
పాత
తెలంగాణ

కవిత పార్టీకి ఆమోదం.. అంకిత భావంతో పని చేస్తానని ప్రకటన

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 25న సొంత రాజకీయ పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తన పార్టీ పేరు ‘టిఆర్ఎస్’ అని ఆమె ప్రకటించారు. ఈ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ పూర్తి పేరుకు ఐదు పేర్లను పంపించగా.. ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరుకి ఆమోదం లభించింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందించారు. పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని సూచించారు. అదే విధంగా పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తమ దృష్టికి తీసుకురావాలని ఇసి తెలిపింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘‘టిఆర్ఎస్.. నాకు రాసి పెట్టి ఉందేమో. రెండు దశాబ్ధాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తా. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో పని చేస్తా’’ అని అన్నారు.

డ్రెస్సింగ్‌ రూంలో స్మోకింగ్ వివాదం.. రియాన్ పరాగ్‌కు భారీ జరిమానా
పాత
తెలంగాణ

డ్రెస్సింగ్‌ రూంలో స్మోకింగ్ వివాదం.. రియాన్ పరాగ్‌కు భారీ జరిమానా

డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కెమెరా కంటికి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇన్ని కెమెరాలు ఉన్నా కూడా.. రియాన్ నిర్లక్ష్యంగా వేప్ చేసిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీంతో బిసిసిఐ రియాన్‌పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అతడి మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఫీల్డ్ అంపైర్లు తన్మయ్ శ్రీవాత్సవ, నితిన్ మేనన్ నుంచి మ్యాచ్ రిఫరీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే సోషల్‌మీడియాలో ఒక్కసారిగా వీడియోలు వైరల్ కావడంతో ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనకు పాల్పడినట్లు తేల్చి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్‌ను పరాగ్ ఖాతాలో ఐపిఎల్ గవర్నింగ్ కమిటీ చేర్చినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వ వైఖరి రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది: రాంచందర్ రావు
పాత
తెలంగాణ

ప్రభుత్వ వైఖరి రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది: రాంచందర్ రావు

హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు. యాదాద్రి జిల్లాలో హన్మాపూర్ లో టిబిజెపి చీఫ్ రాంచందర్ రావు ధాన్యం సేకరణ కేంద్రం పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ వైఖరి రైతాంగానికి వ్యతిరేకంగా ఉందని, మిల్లర్లు, దళారులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల సమస్యలు ఎదురౌతున్నాయని మండిపడ్డారు. రైతులతో రాజకీయమా? అని ప్రశ్నించారు. మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలని రాంచందర్ రావు కోరారు.

‘కల్కి-2’లో కీలక పాత్ర.. జెడి చక్రవర్తి రియాక్షన్ ఇదే..!
పాత
తెలంగాణ

‘కల్కి-2’లో కీలక పాత్ర.. జెడి చక్రవర్తి రియాక్షన్ ఇదే..!

హైదరాబాద్: ‘కల్కి-2’లో కీలక పాత్ర.. జెడి చక్రవర్తి రియాక్షన్ ఇదే..!న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. తొలి భాగంలో చాలా మంది నటీనటులు, దర్శకులు ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సీక్వెల్‌లో కూడా చాలా కామియోలు ఉండే అవకాశం ఉంది. అందులో నటుడు జెడి చక్రవర్తి ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను జెడి చక్రవర్తి ఖండించారు. తన కొత్త చిత్రం ‘గాయపడిన సింహం’ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ సీక్వెల్‌లో నటించడం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలు విని ఎంజాయ్ చేశానని.. అందులో ఏ మాత్రం నిజం లేదన పేర్కోన్నారు. దీంతో ఈ రూమర్‌కి చెక్ పడింది.

Advertisement