🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3616 వార్తలు

బెంగాల్లోని 77 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ కి డిమాండ్
పాత వార్త
తెలంగాణ

బెంగాల్లోని 77 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ కి డిమాండ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ అనంతరం దక్షిణ 24 పరగణా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 77 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని వచ్చిన డిమాండ్లను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని గురువారం ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ తర్వాత ఫాల్టా నియోజకవర్గం నుంచి అత్యధికంగా 32 ఫిర్యాదులు అందాయి. అనంతరం డైమండ్ హార్బర్ నుంచి 29, మగ్రాహట్ నుంచి 13, బడ్జ్ బడ్జ్ నుంచి మూడు ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈవీఎంల లోపాలు, బూత్ ఆక్రమణ, ఓటర్ల బెదిరింపులు, గోప్యత ఉల్లంఘన వంటి ఆరోపణల ఆధారంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు లేదా పరిశీలకులు సాధారణంగా రీపోలింగ్ డిమాండ్ చేస్తుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన ఫిర్యాదుల్లో ఈవీఎంలతో చెలగాటం, యంత్రాలపై పదార్థాలు చల్లడం, సీసీ కెమెరాలను అడ్డుకునే ప్రయత్నాలు వంటి ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుల తీవ్రత, సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రత్యేక

Admin6 రోజుల క్రితం👁 1
సిఎం సీటుకు విజయ్‌కు 37 శాతం,స్టాలిన్‌కు 35 శాతం
పాత
తెలంగాణ

సిఎం సీటుకు విజయ్‌కు 37 శాతం,స్టాలిన్‌కు 35 శాతం

తమిళనాడుకు తరువాతి సిఎం ఎవరు అనే సర్వేల్లో కూడా విజయ్ ఇతరులతో పోలిస్తే ముందున్నారు. ఆయనకు సిఎం పదవి విషయంలో 37 శాతం మద్దతు ఉందని, తరువాతి స్థానంలో స్టాలిన్‌ను 35 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపారు. విజయ్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. రాజకీయాల్లో పేరు మార్మోగింది. 18 నుంచి 19 సంవత్సరాల లోపు తొలిసారి ఓటర్లలో ఏకంగా విజయ్‌కు 68 శాతం మంది మద్దతు ఇచ్చారని వెల్లడైంది. నిరుద్యోగ యువత, అర్బన్ ఓటర్లు, ప్రత్యేకించి బిసిలు, మైనార్టీ ఓటర్లు , ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలోని నియోజకవర్గాలలో కూడా విజయ్‌కు మంచి ఆదరణ ఉందని తేల్చారు.ఈ విషయాలను కేంద్రంలోని బిజెపి వర్గాలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడైంది. ఇక తమిళనాడులో అధికార మార్పిడికి ఎక్కువగా జనం మొగ్గుచూపుతున్నారు. ఇది ప్రధాన అంశం అయింది. డిఎంకె లేదా అన్నాడిఎంకెలతో జనం విసిగిపోయారు. విజయ్‌కు మద్దతు ఇస్తున్న వారిలో 35 శాతం మంది వరకూ రాష్ట్రంలో అధికార మార్పిడిని ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఇతర పక్షాలతో పోలిస్తే టివికె విజయ్‌కు మద్దతు ఇప్పుడు 77 శాతం జనం మద్ధతు ఉందని పలు అంశాల విశ్లేషణలతో వెల్లడైంది.

దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు: మంత్రి పొంగులేటి
పాత
తెలంగాణ

దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు: మంత్రి పొంగులేటి

దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అక్రడిటేషన్ల జారీఅక్రిడిటేషన్ల సంఖ్య తేలితే జర్నలిస్ట్‌లకు మరిన్ని సౌకర్యాల కల్పన గతం కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో అక్రిడిటేషన్ల మంజూరు మే 10 లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు మే 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్టర్లకు ఆదేశం మే 31 వరకు అందరికీ బస్సు పాస్‌ల పొడిగింపు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు అక్రిడిటేషన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గురువారం సమాచార శాఖ ఆధ్వర్యాన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన అక్రి డిటేషన్ కార్డులను ఇంతవరకు పొడిగించామని, దేశంలో, ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ఊచకోత.. 155 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ
పాత
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో... వెలుగులోకి సంచలన విషయాలు
పాత
తెలంగాణ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో... వెలుగులోకి సంచలన విషయాలు

మనతెలంగాణ, సిటిబ్యూరోః సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ బయటికి రావడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి. తన భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సీతారాం నోట్ ద్వారా వెల్లడించాడు. ఇలాంటి సంబంధాలు వద్దని భార్యకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని సీతారాం పేర్కొన్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, సీతారాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.సీతారాం భార్య, పిల్లలతో కలిసి బాచుపల్లిలో స్థిరపడ్డారు. అయితే రేణుక తన భర్తకు తెలియకుండా ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకుంది. భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న రేణుక రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకుంది

విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తాపడి నలుగురు మృతి..11 మంది గల్లంతు.!
పాత
226కు పైగా సీట్లు గెలుస్తాం:  మమతా బెనర్జీ
పాత
తెలంగాణ

226కు పైగా సీట్లు గెలుస్తాం: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఆధిక్యం వస్తుందని వెల్లడైన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ అంచనాలను పూర్తిగా తిరస్కరిస్తూ, తమ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 226కి పైగా స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు వీడియో సందేశం ద్వారా మమతా కీలక సూచనలు చేశారు. మే 4న జరిగే ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులు, సీనియర్ నాయకులు స్వయంగా కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరూ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమానంగా, అప్రమత్తంగా నిఘా పెట్టాలి. అవసరమైతే నేను కూడా నా భవానీపూర్ నియోజకవర్గంలో స్వయంగా కాపలా కాస్తాను అని మమతా తెలిపారు.బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆమె రాజకీయ కుట్రగా అభివర్ణించారు. టీఎంసీ కార్యకర్తల్లో నిరుత్సాహం కలిగించేందుకే ఇలాంటి అంచనాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మేము 226కి పైగా సీట్లు గెలవబోతున

ఓ ఇంటి వాడైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
పాత
తెలంగాణ

ఓ ఇంటి వాడైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ఆధ్యాత్మికతతో కూడిన పవిత్ర తిరుమలలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య వివాహ బంధంలో అడుగుపెట్టారు. కర్ణాటక భవన్‌లో జరిగిన ఈ వేడుక సంప్రదాయం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో ఓ అద్భుతమైన వేడుకగా నిలిచింది. బెల్లంకొండ శ్రీనివాస్, - కావ్య వివాహ కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని అనుసరించి, అన్ని సంప్రదాయ క్రతువులతో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెళ్లి వేదికను ఆలయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా అలంకరించారు. పూల అలంకరణలు, స్వర్ణ వర్ణ అలంకారాలు, సంప్రదాయ అలంకరణ కలిసి ఒక పవిత్రమైన దృశంగా నిలిచాయి. వధూవరుల కోసం ప్రత్యేకంగా డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన వస్త్రాలు వేడుకకు మరింత అందాన్ని తెచ్చాయి. కావ్య అందమైన పట్టు చీరలో, నాజూకైన ఆభరణాలతో మెరిశారు, సాయి శ్రీనివాస్ సంప్రదాయ వేషధారణలో క్లాసిక్‌గా కనిపించారు. సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం ఎంతో ఆత్మీయంగా సాగింది. శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్నేహితులు, ఆత్మీయులు పాల్గొనే ఈ కార్యక్రమం మరింత వైభవంగా జరగనుంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 15 లోపు  యూనిఫాంలు, పుస్తకాలు: సీఎం రేవంత్ రెడ్డి
పాత
Weekend OTT Release: వీకెండ్ వినోదం: ఒకే రోజు ఓటీటీలో 20 సినిమాలు స్ట్రీమింగ్.. థియేటర్లలో ఎన్ని రిలీజ్ అంటే?
పాత
గగన్ విహార్‌లో ఏసీబీ దాడులు..కీలక ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం
పాత
కార్మిక ఐక్యతకు ప్రతీక మేడే
పాత
పదిలో టాప్ విద్యార్థులకు సత్కారం
పాత
తెలంగాణ

పదిలో టాప్ విద్యార్థులకు సత్కారం

నవతెలంగాణ – మల్హర్ రావుఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదోవతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల జంగిడిపల్లిలోగల తెలంగాణ అదర్శ పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన బొంతల మనస్విని, అలీ నిశిత, బొగ నిఖిల్, కాళీ వర్ష, శనిగల సౌమ్యశ్రీ, భోగే సశ్రిత, కందునూరి హర్షిత, భేతిని ఆకాయ్, బుఖ్య మహేందర్ తదితర తొమ్మిదిమంది విద్యార్థులను గురువారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు, అధ్యాపకులు […] The post పదిలో టాప్ విద్యార్థులకు సత్కారం appeared first on Navatelangana.

నా ప్రేమ సరిపోలేదా..! నీకు  శృంగారమే కావాలా..?
పాత
ప్రపంచ కార్మికులకు పండుగ దినం మేడే
పాత
తెలంగాణ

ప్రపంచ కార్మికులకు పండుగ దినం మేడే

ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ కుమార్ యాదవనవతెలంగాణ – మల్హర్ రావుప్రపంచ కార్మిక లోకానికి పండుగ దినం మేడే అని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. మేడే పురస్కరించుకుని గురువారం ఆయన మాట్లాడారు. ప్రపంచ కార్మిక లోకానికి వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగిన రోజు మేడేన్నారు. కార్మికుల రక్తం నుండి ఎర్రజెండా ఉడవించిన రోజన్నారు. దేశంలో కార్మికుల హక్కుల పరి రక్షణ కొరకు ఆర్టీఐ శ్రమిస్తుందన్నారు. కార్మికుల సమస్యల […] The post ప్రపంచ కార్మికులకు పండుగ దినం మేడే appeared first on Navatelangana.

పాత బిల్డింగ్ లు కనిపిస్తే.. ఈ నంబర్ కు ఫోటోలు, లొకేషన్ షేర్ చెయ్యండి
పాత
ఆన్సాన్పల్లి గ్రామ ప్రజల సమస్యలను వినేదెవరు.?
పాత
తెలంగాణ

ఆన్సాన్పల్లి గ్రామ ప్రజల సమస్యలను వినేదెవరు.?

అందుబాటులో ఉండని కార్యదర్శిబిఆర్ఎస్ నాయకుల ఆరోపణనవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఆన్సాన్పల్లి గ్రామ ప్రజల సమస్యలను వినేదేవరుని బిఆర్ఎస్ నాయకులు బానోతు రాజ్ కుమార్ (ఢిల్లీరాజు), తొట్ల సమ్మయ్య, గుగులోతు రాజు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి, పారిశుధ్య సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు పొందడానికి పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్ళితే ఎప్పుడు కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. అసలు గ్రామానికి కార్యదర్శి ఉన్నట్లా.?లేనట్టా.? అని గ్రామ […] The post ఆన్సాన్పల్లి గ్రామ ప్రజల సమస్యలను వినేదెవరు.? appeared first on Navatelangana.

ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత
పాత
తెలంగాణ

ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత

నవతెలంగాణ – మల్హర్ రావుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదోవతరగతి పరీక్ష ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామపరిధి జంగిడిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 98శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో మొత్తం 48 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా విడుదలైన ఫలితాల్లో 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారని తెలిపారు. ఉత్తమమైన ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థులకు, […] The post ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత appeared first on Navatelangana.

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్..  RCB ఫస్ట్ బ్యాటింగ్
పాత
మున్సిపల్ వెండింగ్ కమిటీ సమావేశం
పాత
తెలంగాణ

మున్సిపల్ వెండింగ్ కమిటీ సమావేశం

– రోజువారీ మార్కెట్ వసూళ్లలో స్వల్ప మార్పులునవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట పురపాలక సంఘ పరిధిలో రహదారుల ఇరువైపులా వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారుల నుంచి వసూలు చేసే రోజువారీ సంత మార్కెట్ రుసుములపై మున్సిపల్ వెండింగ్ కమిటీ గురువారం సమావేశమైంది. పాలకవర్గం ఆమోదంతో నిర్వహించిన ఈ సమావేశంలో గతంలో నిర్ణయించిన వసూళ్లపై స్వల్ప మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ జూపల్లి శశికళ అధ్యక్షతన టౌన్ వెండింగ్ కమిటీ (టీవీసీ) ఆధ్వర్యంలో […] The post మున్సిపల్ వెండింగ్ కమిటీ సమావేశం appeared first on Navatelangana.

పది ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
పాత
అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన
పాత
తెలంగాణ

అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన

– యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం పరిశీలన– ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ– పలు శుభకార్యాలకు హాజరునవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు అవసరమైన స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. […] The post అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన appeared first on Navatelangana.

ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్‌ గా ప్రవీణ్ కుమార్
పాత
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్‌ గా ప్రవీణ్ కుమార్

– 600లో 574 మార్కులు సాధించిన పేద విద్యార్థి ప్రతిభకు ప్రశంసలునవతెలంగాణ – అశ్వారావుపేటలక్ష్యంతో చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులూ అద్భుత ఫలితాలు సాధించగలరని అశ్వారావుపేట మండలం మామిళ్ళవారిగూడెం విద్యార్థి మద్దాల ప్రవీణ్ కుమార్ నిరూపించాడు.  పదో తరగతి వార్షిక పరీక్షల్లో 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి ప్రభుత్వ రంగ పాఠశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. అశ్వారావుపేట మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి 236 మంది […] The post ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్‌ గా ప్రవీణ్ కుమార్ appeared first on Navatelangana.

నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు
పాత
తెలంగాణ

నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు

– 24 మందికి 24 మంది ఉత్తీర్ణత– ఇద్దరు విద్యార్థులకు అత్యధిక మార్కులు– సగం మంది 500 పైగా మార్కులతో ప్రతిభ– విద్యార్థులను అభినందించిన హెచ్‌ఎం వెంకటేశ్వరరావునవతెలంగాణ – అశ్వారావుపేటమండలంలోని నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించిన 2026 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఈ పాఠశాల నుంచి పరీక్షలకు హాజరైన 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. […] The post నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు appeared first on Navatelangana.

Advertisement