
3599 వార్తలు
హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో రూపొందు తున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సినిమా ‘భోగి’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ కందుల సులోచన రాణిగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ పల్లెటూరి యువతిగా సహజసిద్ధమైన లుక్‌లో కనిపిస్తుంది. మోదుగ ఆకులుతో ఆకుపళ్లెం తయారు చేస్తూ జీవనం సాగించే సులోచన […] The post ‘భోగి’లోకందుల సులోచన రాణిగా.. appeared first on Navatelangana.


నేపాల్‌లోని రోల్పా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ జీపు కొండ ప్రాంతంలో అదుపు తప్పి సుమారు 800 మీటర్ల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది.ఈ దుర్ఘటన రోల్పా జిల్లాలోని థవాంగ్ రూరల్ మునిసిపాలిటీ పరిధిలోని జల్‌జలా అనే ప్రాంతంలో జరిగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా జల్‌జలాలోని ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారి బురదమయంగా మారడంతో వాహనం అదుపు తప్పి జారిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మృతదేహాల వెలికితీత, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్)కు సిఇసి ఆమోదం తెలిపిందని ఆమె ఎక్స్ వేదిగా ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడవ ప్రాధాన్యతగా తాము ఇచ్చిన పేరును ఇసి ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం అని పేర్కొన్నారు. “టీఆర్‌ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో” అంటూ ట్వీట్ చేశారు.

మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోదాతో విహెచ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వి.హనుమంతరావుకు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లించనుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో నెలకు రూ. 50,000 ఇంటి అద్దె భత్యాన్ని పొందే వీలుంది. విధి నిర్వహణలో సొంత వాహనాన్ని ఉపయోగిస్తే నెలకు రూ. 30,000 కన్వేయన్స్ అలవెన్స్‌తో పాటు, రూ. 15,000 ఇంధన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. దీనికి అదనంగా, డ్రైవర్‌తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని పొందే వెసులుబాటు కూడా ఆయనకు ఉంటుంది. అఖిల భారత సర్వీసు ఐఏఎస్ అధికారులు, మంత్రులతో సమానంగా వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా విహెచ్‌కు వర్తిస్తుంది.కార్యాలయ సిబ్బంది కేటాయింపు.. బిసి సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారు కార్యకలాపాల నిర్వహణ కోసం బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. ఇందులో ఒక ప్రైవేట్ సెక్రటరీ (పిఎస్), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బిఆర్‌ఎస్ ప్రభుత్వం, సబ్బండ కులాల కర్షక కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని అన్నారు. సింగరేణి, ఆర్‌టిసి, భవన నిర్మాణ రంగం సహా పలు రంగాలకు చెందిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కెసిఆర్ గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టించడంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కెసిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాటి పదేండ్ల ప్రగతి కార్యాచరణను మరింత పటిష్టంగా అమలుచేయడమే రాష్ట్ర కార్మిక లోకానికి మనమిచ్చే గొప్ప కానుక అని కెసిఆర్ స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ అనంతరం దక్షిణ 24 పరగణా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 77 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని వచ్చిన డిమాండ్లను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని గురువారం ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ తర్వాత ఫాల్టా నియోజకవర్గం నుంచి అత్యధికంగా 32 ఫిర్యాదులు అందాయి. అనంతరం డైమండ్ హార్బర్ నుంచి 29, మగ్రాహట్ నుంచి 13, బడ్జ్ బడ్జ్ నుంచి మూడు ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈవీఎంల లోపాలు, బూత్ ఆక్రమణ, ఓటర్ల బెదిరింపులు, గోప్యత ఉల్లంఘన వంటి ఆరోపణల ఆధారంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు లేదా పరిశీలకులు సాధారణంగా రీపోలింగ్ డిమాండ్ చేస్తుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన ఫిర్యాదుల్లో ఈవీఎంలతో చెలగాటం, యంత్రాలపై పదార్థాలు చల్లడం, సీసీ కెమెరాలను అడ్డుకునే ప్రయత్నాలు వంటి ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుల తీవ్రత, సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రత్యేక

తమిళనాడుకు తరువాతి సిఎం ఎవరు అనే సర్వేల్లో కూడా విజయ్ ఇతరులతో పోలిస్తే ముందున్నారు. ఆయనకు సిఎం పదవి విషయంలో 37 శాతం మద్దతు ఉందని, తరువాతి స్థానంలో స్టాలిన్‌ను 35 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపారు. విజయ్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. రాజకీయాల్లో పేరు మార్మోగింది. 18 నుంచి 19 సంవత్సరాల లోపు తొలిసారి ఓటర్లలో ఏకంగా విజయ్‌కు 68 శాతం మంది మద్దతు ఇచ్చారని వెల్లడైంది. నిరుద్యోగ యువత, అర్బన్ ఓటర్లు, ప్రత్యేకించి బిసిలు, మైనార్టీ ఓటర్లు , ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలోని నియోజకవర్గాలలో కూడా విజయ్‌కు మంచి ఆదరణ ఉందని తేల్చారు.ఈ విషయాలను కేంద్రంలోని బిజెపి వర్గాలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడైంది. ఇక తమిళనాడులో అధికార మార్పిడికి ఎక్కువగా జనం మొగ్గుచూపుతున్నారు. ఇది ప్రధాన అంశం అయింది. డిఎంకె లేదా అన్నాడిఎంకెలతో జనం విసిగిపోయారు. విజయ్‌కు మద్దతు ఇస్తున్న వారిలో 35 శాతం మంది వరకూ రాష్ట్రంలో అధికార మార్పిడిని ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఇతర పక్షాలతో పోలిస్తే టివికె విజయ్‌కు మద్దతు ఇప్పుడు 77 శాతం జనం మద్ధతు ఉందని పలు అంశాల విశ్లేషణలతో వెల్లడైంది.

దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అక్రడిటేషన్ల జారీఅక్రిడిటేషన్ల సంఖ్య తేలితే జర్నలిస్ట్‌లకు మరిన్ని సౌకర్యాల కల్పన గతం కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో అక్రిడిటేషన్ల మంజూరు మే 10 లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు మే 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్టర్లకు ఆదేశం మే 31 వరకు అందరికీ బస్సు పాస్‌ల పొడిగింపు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు అక్రిడిటేషన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గురువారం సమాచార శాఖ ఆధ్వర్యాన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన అక్రి డిటేషన్ కార్డులను ఇంతవరకు పొడిగించామని, దేశంలో, ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్


మనతెలంగాణ, సిటిబ్యూరోః సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ బయటికి రావడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి. తన భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సీతారాం నోట్ ద్వారా వెల్లడించాడు. ఇలాంటి సంబంధాలు వద్దని భార్యకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని సీతారాం పేర్కొన్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, సీతారాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.సీతారాం భార్య, పిల్లలతో కలిసి బాచుపల్లిలో స్థిరపడ్డారు. అయితే రేణుక తన భర్తకు తెలియకుండా ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకుంది. భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న రేణుక రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకుంది


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఆధిక్యం వస్తుందని వెల్లడైన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ అంచనాలను పూర్తిగా తిరస్కరిస్తూ, తమ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 226కి పైగా స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు వీడియో సందేశం ద్వారా మమతా కీలక సూచనలు చేశారు. మే 4న జరిగే ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులు, సీనియర్ నాయకులు స్వయంగా కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరూ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమానంగా, అప్రమత్తంగా నిఘా పెట్టాలి. అవసరమైతే నేను కూడా నా భవానీపూర్ నియోజకవర్గంలో స్వయంగా కాపలా కాస్తాను అని మమతా తెలిపారు.బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆమె రాజకీయ కుట్రగా అభివర్ణించారు. టీఎంసీ కార్యకర్తల్లో నిరుత్సాహం కలిగించేందుకే ఇలాంటి అంచనాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మేము 226కి పైగా సీట్లు గెలవబోతున

ఆధ్యాత్మికతతో కూడిన పవిత్ర తిరుమలలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య వివాహ బంధంలో అడుగుపెట్టారు. కర్ణాటక భవన్‌లో జరిగిన ఈ వేడుక సంప్రదాయం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో ఓ అద్భుతమైన వేడుకగా నిలిచింది. బెల్లంకొండ శ్రీనివాస్, - కావ్య వివాహ కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని అనుసరించి, అన్ని సంప్రదాయ క్రతువులతో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెళ్లి వేదికను ఆలయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా అలంకరించారు. పూల అలంకరణలు, స్వర్ణ వర్ణ అలంకారాలు, సంప్రదాయ అలంకరణ కలిసి ఒక పవిత్రమైన దృశంగా నిలిచాయి. వధూవరుల కోసం ప్రత్యేకంగా డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన వస్త్రాలు వేడుకకు మరింత అందాన్ని తెచ్చాయి. కావ్య అందమైన పట్టు చీరలో, నాజూకైన ఆభరణాలతో మెరిశారు, సాయి శ్రీనివాస్ సంప్రదాయ వేషధారణలో క్లాసిక్‌గా కనిపించారు. సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం ఎంతో ఆత్మీయంగా సాగింది. శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్నేహితులు, ఆత్మీయులు పాల్గొనే ఈ కార్యక్రమం మరింత వైభవంగా జరగనుంది.



యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుమే డే కార్మిక ఐక్యతకు, పోరాటానికి ప్రతీక అని యువైఏప్ఐ రాష్ట్ర కార్యదర్శి అక్కల బాపు యాదవ్ అన్నారు. కార్మిక హక్కులను సాధించుకునేందుకు మే డే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. బీజేపీ కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. The post కార్మిక ఐక్యతకు ప్రతీక మేడే appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదోవతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల జంగిడిపల్లిలోగల తెలంగాణ అదర్శ పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన బొంతల మనస్విని, అలీ నిశిత, బొగ నిఖిల్, కాళీ వర్ష, శనిగల సౌమ్యశ్రీ, భోగే సశ్రిత, కందునూరి హర్షిత, భేతిని ఆకాయ్, బుఖ్య మహేందర్ తదితర తొమ్మిదిమంది విద్యార్థులను గురువారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు, అధ్యాపకులు […] The post పదిలో టాప్ విద్యార్థులకు సత్కారం appeared first on Navatelangana.

ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ కుమార్ యాదవనవతెలంగాణ – మల్హర్ రావుప్రపంచ కార్మిక లోకానికి పండుగ దినం మేడే అని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. మేడే పురస్కరించుకుని గురువారం ఆయన మాట్లాడారు. ప్రపంచ కార్మిక లోకానికి వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగిన రోజు మేడేన్నారు. కార్మికుల రక్తం నుండి ఎర్రజెండా ఉడవించిన రోజన్నారు. దేశంలో కార్మికుల హక్కుల పరి రక్షణ కొరకు ఆర్టీఐ శ్రమిస్తుందన్నారు. కార్మికుల సమస్యల […] The post ప్రపంచ కార్మికులకు పండుగ దినం మేడే appeared first on Navatelangana.

అందుబాటులో ఉండని కార్యదర్శిబిఆర్ఎస్ నాయకుల ఆరోపణనవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఆన్సాన్పల్లి గ్రామ ప్రజల సమస్యలను వినేదేవరుని బిఆర్ఎస్ నాయకులు బానోతు రాజ్ కుమార్ (ఢిల్లీరాజు), తొట్ల సమ్మయ్య, గుగులోతు రాజు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి, పారిశుధ్య సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు పొందడానికి పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్ళితే ఎప్పుడు కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. అసలు గ్రామానికి కార్యదర్శి ఉన్నట్లా.?లేనట్టా.? అని గ్రామ […] The post ఆన్సాన్పల్లి గ్రామ ప్రజల సమస్యలను వినేదెవరు.? appeared first on Navatelangana.