🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3594 వార్తలు

శుక్రవారం రాశి ఫలాలు (01-05-2026)
పాత వార్త
తెలంగాణ

శుక్రవారం రాశి ఫలాలు (01-05-2026)

మేషం సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభం వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు. మిధునం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. కర్కాటకం ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూ

Admin6 రోజుల క్రితం👁 2
చరిత్ర ఎదురుచూస్తోంది
పాత
హైదరాబాద్‌ పోలీసుల ‘వ్యూహం’.. దేశానికే దిక్సూచి
పాత
తెలంగాణ

హైదరాబాద్‌ పోలీసుల ‘వ్యూహం’.. దేశానికే దిక్సూచి

ఢిల్లీని కదిలించిన ఆపరేషన్‌ ఆక్టోపస్‌ ఉన్నత స్థాయి సమీక్షకు దారితీసిన పోలీసుల తెగువ ‘మ్యూల్‌’ ఖాతాల వేటకు జాతీయ కార్యాచరణ రంగంలోకి ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనగరంలో తమ పంజా విసురుతున్న సైబర్‌ నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేం దుకు హైదరాబాద్‌ పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. 32 మంది బ్యాంక్‌ అధికారులను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర పోలీస్‌ యంత్రాంగం […] The post హైదరాబాద్‌ పోలీసుల ‘వ్యూహం’.. దేశానికే దిక్సూచి appeared first on Navatelangana.

అదిగో సెమీఫైనల్‌!
పాత
తెలంగాణ

అదిగో సెమీఫైనల్‌!

చైనీస్‌ తైపీతో క్వార్టర్స్‌ పోరు నేడుథామస్‌ కప్‌ 2026 హార్సెన్స్‌ (డెన్మార్క్‌) : ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ (ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌)ను మరోసారి దక్కించుకునేందుకు టీమ్‌ ఇండియా అడుగులు వేస్తోంది. గ్రూప్‌ దశలో కెనడాపై 4-1, ఆస్ట్రేలియాపై 5-0తో విజయాలు సాధించిన భారత పురుషుల జట్టు చైనా చేతిలో 2-3తో నిరాశపరిచినా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 2022లో థామస్‌ కప్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్‌.. నేడు క్వార్టర్‌ఫైనల్లో బలమైన చైనీస్‌తైపీతో తాడోపేడో తేల్చుకోనుంది. చైనీస్‌తైపీ సింగిల్స్‌ […] The post అదిగో సెమీఫైనల్‌! appeared first on Navatelangana.

హర్మూజ్ ని తెరవడానికి ట్రంప్ కొత్త ప్రణాళిక
పాత
పాక్ ఆర్థిక పురోగతిపై ఇరాన్ యుద్ధ తీవ్ర ప్రభావం : షెహబాజ్
పాత
తెలంగాణ

పాక్ ఆర్థిక పురోగతిపై ఇరాన్ యుద్ధ తీవ్ర ప్రభావం : షెహబాజ్

ఇస్లామాబాద్: గత రెండేళ్లలో తాము సాధించిన ఆర్థిక పురోగతిపై అమెరికాఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా దేశ చమురు దిగుమతి బిల్లు 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిపోయిందని , ఇది ఆర్థిక వ్యవస్థప పెనుభారం మోపుతోందని కేబినెట్ సమావేశంలో ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.దౌత్యమార్గాల ద్వారా ఇరాన్‌-అమెరికా చర్చలు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహిర్ ఆంద్రాబి మాట్లాడుతూ ,దౌత్యమార్గాల ద్వారా ఇరు వర్గాలతో చర్చిస్తున్నామని, శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. వారాంతపు సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌అమెరికా మధ్య రెండోసారి చర్చలు ఇంకా కార్యరూపం దాల్చని నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది.

బిజెపి ఇవిఎంల కబ్జా..  వీడియో విడుదల చేసిన టిఎంసి
పాత
తెలంగాణ

బిజెపి ఇవిఎంల కబ్జా.. వీడియో విడుదల చేసిన టిఎంసి

ఇవిఎంల కబ్జాకు దిగిన బిజెపి వీడియో విడుదల చేసిన టిఎంసి స్ట్రాంగ్ రూంలో దర్జాగా ఓట్ల తారుమారు? కేంద్రం, ఎన్నికల సంఘం కుమ్మక్కు స్టేడియం వద్దకు పార్టీ నేతలు కార్యకర్దల దండు అధినేత్రి మమత కూడా రంగంలోకి? కోల్‌కతా ః కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీవ్రస్థాయి ఎన్నికల ద్రోహానికి పాల్పడిందని టిఎంసి గురువారం ఆరోపించింది. లెక్కింపునకు సిద్ధంగా భద్రపర్చి ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలలో బిజెపి తెరిచిందని పేర్కొంటూ టిఎంసి తాజాగా ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే తాపత్రయంతో బిజెపి ఇప్పుడు ఏకంగా ఇవిఎంలకు తూట్లు పొడిచిందని టిఎంసి వర్గాలు దుయ్యబట్టాయి, ఇవిఎంల టేంపిరంగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. తమ దృష్టికి వచ్చిన ఈ ఇవిఎంల ఓపెన్ వీడియోను ప్రజల ముందుకు మీడియా ద్వారా తీసుకువస్తున్నట్లు టిఎంసి ఘాటైన పదజాలంతో ఎక్స్ సామాజిక మాధ్యమంలో వీడియోను పొందుపర్చింది.బిజెపి, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యాయని, ఈ తతంగం ఇప్పటి ఘటనతో పరాకాష్టకు చేరిందని విమర్శించారు. సర్‌తో ముందస్తు ఓట్ల చోరీకి దిగారు. ఇప్పుడు టేంపరింగ్‌తో తీర్పును ధ్వంసం చేస్తున్న

పడవ బోల్తా..ఏడుగురు మృతి
పాత
తెలంగాణ

పడవ బోల్తా..ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బర్గి డ్యామ్ వద్ద ఒక క్రూయిజ్ పడవ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఎడుగురు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులు వీచడంతో నదిలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. దీంతో పడవ నియంత్రణ కోల్పోయి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 35 నుండి 40 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.సుమారు 15 నుంచి 18 మంది వరకు నీటిలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే ఎస్డీఆర్‌‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు రంగంలోకి దిగాయి. 18 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు.గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

పడవ బొల్తా.. నలుగురు మృతి, పది మంది గల్లంతు
పాత
తెలంగాణ

పడవ బొల్తా.. నలుగురు మృతి, పది మంది గల్లంతు

జబల్పూరు : మధ్యప్రదేశ్‌లో ఓ నాటుపడవ బోల్తా పడిన ఘటనలో నలుగురు నీట మునిగి చనిపోయారు. ఇప్పటివరకూ 15 మందిని ప్రాణాలతో బయటుకు తీశారని అధికారులు తెలిపారు. బార్గీ డ్యామ్ రిజర్వాయర్‌లో ఈ నాటుపడవలో మొత్తం 29 మంది ప్రయాణికులు వెళ్లుతున్నారు. ఈ దశలో ఆకస్మాత్తుగా గాలి దుమారం వీచింది. దీనితో పడవ బోల్తా పడిందని వెల్లడైంది. జబల్పూరు జిల్లాలో నర్మదా నదిపై బార్గీ డ్యామ్ నిర్మించారు. రిజర్వాయర్‌లో తిరిగేందుకు వెళ్లిన పడవ ఈ ప్రమాదానికి గురైంది. ఘటనలో నలుగురు మృతి చెందారు, పది మంది జాడ తెలియకుండా ఉంది. నదీ ప్రవాహం లో వీరికోసం గాలిస్తున్నారు.ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. స్థానిక అధికార యంతాంగం హుటాహుటిన రంగంలోకి దిగిందని తెలిపారు. జబల్పూరు కలెక్టర్, ఎస్‌పి ఇతర ఉన్నతాధికారులు , విపత్తు నిర్వహణ దళాలు, ఇతర సహాయక బృందాల చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.

బెంగళూరుకు షాకిచ్చిన గుజరాత్..
పాత
తెలంగాణ

బెంగళూరుకు షాకిచ్చిన గుజరాత్..

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన దేవ్‌దుత్ పడిక్కల్ 24 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. కెప్టెన్ పటిదార్ 19 పరుగులు చేశాడు. రొమారియో షెఫర్డ్ (17), వెంకటేష్ అయ్యర్ (12), భువనేశ్వర్ కుమార్ (15) పరుగులు చేశారు.మిగతా వారు విఫలం కావడంతో బెంగళూరు ఆశించిన స్కోరును సాధించలేక పోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు, రషీద్, హోల్డర్‌లు రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. జోస్ బట్లర్ (39), తెవాటియా 27 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.

ఉధృతమౌతున్న బుద్ధగయ ఉద్యమం!
పాత
టివికె విజయ్‌తో అన్నాడిఎంకె మంతనాలు?
పాత
తెలంగాణ

టివికె విజయ్‌తో అన్నాడిఎంకె మంతనాలు?

చెన్నై: తమిళనాడులో టివికె అధినేత, హీరో విజయ్‌తో తెరవెనుక త్వరితగతి మంతనాలకు అన్నాడిఎంకె సిద్దం అయింది. ఈసారి రాజకీయ రంగ ప్రవేశంతోనే ఎక్కువ సీట్లతో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టివికె) రెండో స్థానంలో నిలుస్తుందని విశ్లేషణలు వెలువడ్డాయి. దీనితో అన్నాడిఎంకె సీనియర్ నేతలు కొందరు ఇప్పుడు విజయ్‌ను సంప్రదించి, డిఎంకెకు సవాలు విసరాలని వ్యూహాలకు దిగారని వెల్లడైంది.అయితే ఇంతకు ముందే విజయ్ తనకు సిఎం పదవి కావాలని కోరుకుంటూ వస్తున్నాడు. అయితే మే 4వ తేదీ ఫలితాల్లో విజయ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది నిర్థారణ అయితే, అప్పుడు ఆయన తదుపరి పాత్ర ఖరారు అవుతుంది. అన్నాడిఎంకె , బిజెపిల ఎన్‌డిఎ కూటమి ఇప్పుడు విజయ్ అడుగులపై ఆసక్తి కనపరుస్తోంది. చాణక్య ఫలితాలలో విజయ్ పార్టీకి రెండో స్థానం రానుంది. అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌లో విజయ్ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు రావచ్చునని తెలిపారు. ఇక డిఎంకె, కాంగ్రెస్ ఇతర పార్టీల స్పా కూటమికి 92 నుంచి 110 వరకూ వస్తాయని తెలిపారు. ఇక అన్నాడిఎంకె బిజెపిల ఎన్‌డిఎకు 22 నుంచి 32 రావచ్చునని విశ్లేషించారు. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ కింగ్ మేకర్ స్థాయిని మించి ఏకంగా వ

ఆర్సీబీపై రివేంజ్ తీర్చుకున్న టైటాన్స్.. ఘోరంగా ఓడిన బెంగళూరు
పాత
కార్మికుల చెమటచుక్కే ‘మేడే’
పాత
అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
పాత
తెలంగాణ

అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

నవతెలంగాణ – శాయంపేట: తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన తన కుమారుడు తిరుపతి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామ ఉపసర్పంచ్ రావుల శ్రీనివాస్ వార్డ్ మెంబర్లు యెన్నం కనకా రెడ్డి, చందనాల సునీల్ తక్కల్ల రమ్యకృష్ణ కొమ్ముల అమృత తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థులుగా గెలుపొందామని తెలిపారు. ఏప్రిల్ రెండవ తేదీ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరిగినట్లు తెలిపారు. సమావేశంలో గ్రామాభివృద్ధి […] The post అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. appeared first on Navatelangana.

ఎర్రజెండా సాక్షిగా…
పాత
తెలంగాణ

ఎర్రజెండా సాక్షిగా…

రక్తాక్షరాలతో లిఖించిన విప్లవ కావ్యం ఇది…చెమట చుక్కలు చెక్కిన చరిత్ర శిలాఫలకం ఇది!ఇది కేవలం క్యాలెండర్‌ మీద ఒక ఎర్రటి తేదీ కాదు!శ్రమదోపిడీపై శ్రామికుడు చేసిన గర్జన!!”హేమార్కెట్‌” వీధుల్లో చిందిన ఆ రక్తపు ఛారలు,ఇప్పటికీ గ్లోబలైజేషన్‌ గోడల మీద ప్రశ్నిస్తూనే ఉన్నాయి…ఎనిమిది గంటల పని హక్కు…అది ఎవడో పెట్టిన భిక్ష కాదు!ఉరికొయ్యలను ముద్దాడి సాధించుకున్నప్రాణ సమాన హక్కు!!పెట్టుబడిదారి కోరల్లో…కార్పొరేట్‌ అద్దాల మేడల కింద నలిగేది కేవలం మనిషి కాదు!అతని ఆత్మగౌరవం, ఆకలి నిండిన కుటుంబం!!లాభాల వేటలో నువ్వు […] The post ఎర్రజెండా సాక్షిగా… appeared first on Navatelangana.

మేడే అజరామరం!
పాత
విద్యార్థులకు డిక్షినరీలు అందజేత
పాత
తెలంగాణ

విద్యార్థులకు డిక్షినరీలు అందజేత

నవతెలంగాణ-మల్హర్ రావు.ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పది వార్షిక పరీక్ష ఫలితాల్లో భాగంగా మండలంలోని వల్లెంకుంట గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బొమ్మ రజిత,ఉప సర్పంచ్ కటకం స్వప్న,డేమక్రేటివ్ టీచర్ పెడరేషన్ జిల్లా కార్యదర్శి తిరుపతి,అధ్యాపకబృందం గురువారం డిక్షినరీలు అందజేసి,శాలువాలతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థులు కష్టపడి పై చదువుల్లో కూడా మెరిట్ను కనబరిచి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి,సమాజానికి మార్గదర్శకులుగా నిలబడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు. The post విద్యార్థులకు డిక్షినరీలు అందజేత appeared first on Navatelangana.

35 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా ప్రమోషన్.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక నిర్ణయం
పాత
కొత్త అఖిల్‌ని చూస్తారు
పాత
‘భోగి’లోకందుల సులోచన రాణిగా..
పాత
తెలంగాణ

‘భోగి’లోకందుల సులోచన రాణిగా..

హీరో శర్వానంద్‌, దర్శకుడు సంపత్‌ నంది కాంబోలో రూపొందు తున్న పాన్‌-ఇండియా పీరియడ్‌ యాక్షన్‌ సినిమా ‘భోగి’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ అనుపమ పరమేశ్వరన్‌ పాత్రను పరిచయం చేస్తూ కందుల సులోచన రాణిగా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ పల్లెటూరి యువతిగా సహజసిద్ధమైన లుక్‌లో కనిపిస్తుంది. మోదుగ ఆకులుతో ఆకుపళ్లెం తయారు చేస్తూ జీవనం సాగించే సులోచన […] The post ‘భోగి’లోకందుల సులోచన రాణిగా.. appeared first on Navatelangana.

మా రహస్య ఆయుధంతో అమెరికాకు గుండెపోటు ఖాయం.. ఇరాన్ వార్నింగ్
పాత
లోయలో పడ్డ జీపు..17  మంది మృతి
పాత
తెలంగాణ

లోయలో పడ్డ జీపు..17 మంది మృతి

నేపాల్‌లోని రోల్పా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ జీపు కొండ ప్రాంతంలో అదుపు తప్పి సుమారు 800 మీటర్ల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది.ఈ దుర్ఘటన రోల్పా జిల్లాలోని థవాంగ్ రూరల్ మునిసిపాలిటీ పరిధిలోని జల్‌జలా అనే ప్రాంతంలో జరిగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా జల్‌జలాలోని ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారి బురదమయంగా మారడంతో వాహనం అదుపు తప్పి జారిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మృతదేహాల వెలికితీత, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు.

టీఆర్‌ఎస్... నాకు రాసిపెట్టి ఉందేమో: కవిత ట్వీట్
పాత
తెలంగాణ

టీఆర్‌ఎస్... నాకు రాసిపెట్టి ఉందేమో: కవిత ట్వీట్

తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్)కు సిఇసి ఆమోదం తెలిపిందని ఆమె ఎక్స్ వేదిగా ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడవ ప్రాధాన్యతగా తాము ఇచ్చిన పేరును ఇసి ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం అని పేర్కొన్నారు. “టీఆర్‌ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో” అంటూ ట్వీట్ చేశారు.

Advertisement