20198 వార్తలు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ రాజకీయ ప్రధాన లక్ష్యమని, అధికారం కోసం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు, ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడటమే ఉద్యమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మక్డుం భవన్ లో సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కూనంనేని సాంబాశివరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, విద్యా-వైద్య రంగాల ప్రైవేటీకరణ, కార్మిక-రైతు వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున నిరంతరం పోరాడుతూ, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. ఈ నెల 6 నుండి 14 వరకు పార్టీ నిర్వహించే ప్రచార యాత్రలను అన్ని నియోజకవర్గాల్లో, డివిజన్లలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయడం సి

మేషంచేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. వృషభం సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. మిధునం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పన

ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగడం సందేహంగా మారింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా త్వరలో శ్రీలంక వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీమిండియాలో సీనియర్ బౌలర్ బుమ్రాకు చోటు కల్పించారు. అయితే బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించక పోవడంతో అతను సిరీస్‌లో ఆడడం కష్టంగా మారింది. ఇదే జరిగితే ఇది టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలువాలంటే ఈ సిరీస్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇలాంటి స్థితిలో బుమ్రా సేవలు అందుబాటులో లేకుంటే టీమిండియాకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.

బెంగళూరు: కావేరీ జలాల వివాదంపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బెంగళూరులో జరపాల్సిన పర్యటనను తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కొనసాగడానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం కావేరీ జలాలపై నెలకొన్న అంతర్‌రాష్ట్ర వివాదంపై విజయ్‌తో డీకే శివకుమార్ సోమవరంనాడు చర్చలు జరపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన పర్యటన వాయిదా వేసుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు.కావేరీ వివాదంపై ఆదివారంనాడు జరిగిన అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో డీకే మాట్లాడుతూ.. ‘విజయ్ అంటే నాకెంతో గౌరవం ఉంది. ఆయన రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఎంతో ధైర్యం కలిగిన నేత. పర్యటన వాయిదా వేసుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తున్నాను. తమ మధ్య రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ఆయన కర్ణాటక రావాలనుకున్నారు. మరింత సుహృద్భావ వాతావరణంలో కలుద్దామని రిక్వస్ట్ చేశాను. తాము పరస్పరం గౌరవించుకుంటూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అంతిమంగ


రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను వేగవంతం చేయడం, మెట్రో రైలు రెండో దశ విస్తరణతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా రాబట్టడం వల్ల తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిందని ఆయన వివరించారు. అమెరికాలోని తెలుగు ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సిఎం పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసి) ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలకు ఆయన వివరించారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్లాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కాలే యాదయ్య, దొంతి మాధవరెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ గుత్


గ్లాస్గో: స్కాట్లాండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించింది. భారత్‌కు పతకాల పంట పండించే రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ పోటీలకు ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కలేదు. దీంతో భారత్‌కు ఈ పోటీల్లో పతకాలు లభించడం అంత సులువు కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ భారత్ మాత్రం అసాధారణ ఆటతో అలరించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి సత్తా చాటింది. బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ రెండు విభాగాల్లో భారత్ స్వర్ణాల పంట పండించింది. అంతేగాక వెయిట్‌లిఫ్టింగ్‌లో కూడా పెద్ద సంఖ్యలో పతకాలను గెలుచుకుంది. బాక్సింగ్‌లో అయితే ఏకంగా ఏడు పసిడి పతకాలు సాధించి ఔరా అనిపించింది. బాక్సింగ్‌లో సాక్షి చౌదరి, ప్రీతి పవార్, జస్మయిన్ లంబోరియా, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి, సచిన్, అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాలు సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. అంతేగాక లవ్లీనా బొర్గాహెయిన్, నరేందర్, జడుమణి సింగ్‌లు రజతాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పసిడితో మెరిసింది. జూడోలో హర్ష్ సింగ్, అస్మితలు

యువతలో మోడీ పాపులారిటీ చూసి రాహుల్ భయపడుతున్నారుఇంకెంతోకాలం ఆయన యువనేతగా చెలామణి కాలేరు ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యువతలో పెరుగుతున్న ఆదరణను చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నారని, తనను తాను యువనేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ క్రమంగా యువతలో ఆదరణ కోల్పోతుండటమే ఆ భయానికి కారణమమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యువ ఓటర్ల మద్దతు బీజేపీకే ఉందని, జెన్ జీ యువత ఎప్పుడూ తమతోనే ఉందని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నేత మోడీ అని చెప్పారు. యువతతో నిరంతరం మమేకం కావడం, సోషల్ మీడియా వేదికలపై ఆయన చురుకుగా ఉండటం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మోడీకి పెరుగుతున్న ఆదరణ కారణంగానే యువతకు చేరువ కావాలని రాహుల్ తాపత్రయపడుతున్నారని, తనను తాను యువనేతగా ఆయన అనుకుంటున్నప్పటికీ మోదీ అంత పాపురాలిటీ ఆయనకు లేదనే విషయం నిరూపితమైందని అన్నారు. ఓటర్లు పదేపదే కాంగ్రెస్ సహా విపక్షాలను తోసిపుచ్చడంతో నిరాశానిస్పృహలతో ఆ పార్టీలు ఉన్నాయన్నారు. పేపర్ లీక్ సవరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ తదితర విపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: టీమిండియాలో మళ్లీ జట్టు లభిస్తుందనే ఆశలు పెద్దగా లేవని సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో తనకు టీమిండియాలో తిరిగి స్థానం లభిస్తుందనే నమ్మకం లేదన్నాడు. దేశవాళీతో పాటు ఐపిఎల్‌లో మెరుగ్గానే రాణిస్తున్నానని, అయితే టీమిండియాలో చోటు లభించక పోవడం కాస్త బాధగానే ఉందన్నాడు. అయితే తనకు చోటు దక్కనందుకు ఎవరిని తప్పుపట్టనని స్పష్టం చేశాడు. ఇప్పటికే జాతీయ జట్టు తరఫున చాలా క్రికెట్ ఆడానని, తానెంటో నిరూపించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే ఒక వేళ ఛాన్స్ లభిస్తే మాత్రం అరుదైన గౌరవంగా భావిస్తానని భువీ పేర్కొన్నాడు.

బిహార్‌లోని పూర్ణయా నియోజకవర్గం ఎంపీ పప్పు యాదవ్‌పై ఆదివారంనాడు దాడి జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ విరాళాల చోరీపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ వద్ద పప్పూ యాదవ్ ఇటీవల ఒక స్కిట్ ప్రదర్శించారు. దీంతో మతపరమైన మనోభావాలను గాయపరచారంటూ పప్పూ యాదవ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్‌పై వారణాసిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ పరిణామాలపై పప్పూ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, రాముడిని అవమానించారంటూ ఒక వ్యక్తి ఆయనను నిలదీస్తూ చెప్పు విసిరాడు. దీంతో అతనికి, ఎంపీ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్యాయత్నమే.. కాగా ఈ ఘటనపై పప్పూ యాదవ్ స్పందిస్తూ, తనపై హత్యాయత్నం జరిగినట్టు చెప్పారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 34 ఏళ్ల సుమిత్‌గా గుర్తించామని, ఘజియాబాద్‌లో ఇనుప సామానుల వ్యాపారం చేస్తుంటాడని, అతనిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పు

అత్యవసర డయల్ 100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ (హెచ్‌సీ-661)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. యం.రమేష్ సస్పెండ్ చేశారు. ఆగస్టు 1 అర్ధరాత్రి గచ్చిబౌలి ఐకియా సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో బాధితుడు డయల్ 100కు రెండు సార్లు ఫోన్ చేసి పోలీసు సహాయం కోరాడు. ఇన్‌చార్జిగా ఉన్న హెచ్‌సీ సయ్యద్ యూనస్ సంఘటనా స్థలానికి వెళ్లకుండా "కాలర్ వల్ల ఇబ్బంది" అంటూ రెండు ఫిర్యాదులను మూసివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన పై సయ్యద్ యూనస్‌ను సైబరాబాద్ సిపి తక్షణమే సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సైబరాబాద్ సిపి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకానికి రూ.116 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదల అనంతరం త్వరలో టెండర్ల ద్వారా ప్రక్రియ పూర్తి చేసి చెరువుల్లోకి ఉచితంగా చేప, పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


బొగోటా: పెరూలోని నజ్కా సిటీ సివార్లలో పర్యాటకుల విమానం కుప్పకూలింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు జర్మనీ, ఇద్దరు స్పెయిన్, ఏడుగురు ఇటలీ, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రఖ్యాత నజ్కా లైన్స్‌ను ఆకాశం నుంచి చూసేందుకు వీరంతా విమానం ఎక్కారు. పెరూవియన్ కంపెనీ ఏరోడియానా ఆపరేట్ చేస్తున్న విమానం శనివారంనాడు ఐకా నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక పొలంలో కుప్పకూలినట్టు నజ్కా మునిస్పిల్ గవర్నమెంట్ ధ్రువీకరించింది. అయితే తమ సంస్థ 14 ఏళ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాలను ఉపయోగించి విజయవంతంగా సర్వీసులను నడుపుతున్నట్టు పెరూవియన్ కంపెనీ ఏరిడియాన్ తెలిపింది. పర్యాటక విమాన దుర్ఘటనపై పెరూ అధ్యక్షుడు ఫుజుమోరి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. పెరూ ఎడారి నేల మీద వేల ఏళ్ల కిందట చెక్కిన నాజ్కా లైన్స్‌ను ఆకాశం నుంచి చూడటం పర్యాటకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుంటుంది.

న్యూఢిల్లీ : జంతర్ మంతర్ నిరసనల సందర్భంగా తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికతోపాటు యువతను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి ఆ బాలిక తల్లి ఆదివారంనాడు ధన్యవాదాలు తెలియజేశారు. ‘మోడీజీ.. నా కూతురికి పునర్జన్మ కల్పించారు. ఆమె జీవితాన్ని కాపాడారు’ అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఢిల్లీలోని ఇటీవలి నిరసన కార్యక్రమంలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో సదరు బాలికపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అనంతరం ఆమె వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ, తాను చేసిన తప్పును అంగీకరించింది. ఇకపై ఇలాంటి పొరపాటు చేయనని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలిక తల్లి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ ఎంతో పెద్ద మనసుతో మా కుమార్తెను క్షమించారన్నారు. ఆయన చూపిన కరుణను జీవితాంతం మర్చిపోలేమని, మా కూతురికి కొత్త జీవితం ఇచ్చినట్లే అని అన్నారు. తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ను కూడా ఉపసంహరించుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో తన కుమార్తె పేరు, వయస్సు వంటి వివరాలు కూడా సరిగా నమోదు కాలేదని తెలిపారు. 18ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడి

9 నెలల చిన్నారిని తల్లి చెరువులో ముంచి చంపిన సంఘటన బైరామల్‌గూడలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటలకు జరిగింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు లోకసాని అనురాధ (9 నెలలు)గా గుర్తించారు. మృతురాలు లోకసాని రాజేశ్వరి (34), ఇంజాపూర్ నివాసి.ఘటన సమయంలో తల్లి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాపోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి వెంకటేశ్వర్లునవతెలంగాణ -పరకాల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలను అవలంబిస్తోందని, వాటికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం పరకాల పట్టణంలోని ఎఫ్‌జే ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల రెండో రోజు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల చక్రపాణి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపతి వెంకటేశ్వర్లు “మతం – మతోన్మాదం” […] The post మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్ గూడాలో దారుణం చోటు చేసుకుంది. రాజేశ్వరి అనే మహిళ తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువులో ముంచి చంపేసింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post హైదరాబాద్ లో దారుణం..9 నెలల చిన్నారిని నీటిలో ముంచి చంపిన తల్లి appeared first on Navatelangana.

నవతెలంగాణ – పెద్దవంగర ఆర్ఎంపీ, పీఎంపీ మండల నూతన అధ్యక్షుడిగా బొమ్మకల్ గ్రామానికి చెందిన పొడిశెట్టి సైదులు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల మండల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా సుధగాని రామ్మూర్తి, ఉపాధ్యక్షుడిగా పులుగుజ్జ రామచంద్రు, కోశాధికారిగా కనుకుంట్ల సంపత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సైదులు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు అర్హతలు, నిబంధనలకు లోబడి మాత్రమే వైద్య సేవలు అందించాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో […] The post ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడిగా సైదులు గౌడ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త, రామేశ్వర్‌పల్లి వాస్తవ్యులు ముద్దసాని రాజు – మాలతి దంపతులు, వారి కుమార్తె వర్షిత, కుమారుడు రోహన్ కలిసి ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం గ్రానైట్‌తో పాటు గర్భగుడికి అవసరమైన టైల్స్‌ను విరాళంగా అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంత్రి చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.3,36,000 అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో […] The post రామ మందిర నిర్మాణానికి విరాళం appeared first on Navatelangana.

నవతెలంగాణ – మునిపల్లి మండలంలోని బొడిశేట్పల్లి గ్రామ సర్పంచ్ పొట్టిగారి మల్లేశ్వరి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితురాలై అదేవిధంగా గ్రామ అభివృద్ధికి గాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సర్పంచ్ మల్లేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ నాయకులు రాంరెడ్డి తదితరులు ఉన్నారు. The post కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బొడిశేట్పల్లి సర్పంచ్ appeared first on Navatelangana.