19702 వార్తలు

నీట మునిగిన సంగమేశ్వర ఆలయం మరో ఎనిమిది నెలల తర్వాత పునర్దర్శనం సోమశిలకు పోటెత్తిన పర్యాటకులు మన తెలంగాణ/ కొల్లాపూర్: శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ఉన్న చారిత్రక సోమశిల సంగమేశ్వరం దేవాలయం జలాధివాసానికి చేరువవుతోంది. సప్త నది సంగమమైన సంగమేశ్వర ఆలయం కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో నీట మునిగిపోనున్నది. సోమశిల వద్ద కృష్ణానదీ జలాలు పెరుగుతుండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున సోమశిలకు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. నదీ ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే నదిలో నీటిమట్టం పెరిగి సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఒకవేళ మునిగితే ఎనిమిది నెలల తర్వాతే భక్తులకు దర్శనం కానుంది. ప్రాజెక్టులో నీటిమట్టం 867 అడుగులకు చేరితే సంగమేశ్వరాలయం పూర్తిగా జలమయం కానున్నది.

మన తెలంగాణ/ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న దశ భవిష్యవాణి ఘట్టం సోమవారం ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఆలయ ప్రాంగణంలో పచ్చి మట్టి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు. అయితే, ఈసారి అధికారుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన మాట తప్పారని, ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. ఏటా చెప్పే మాటలను పట్టించుకోనప్పుడు తనను ప్రశ్నలడగడంలో అర్థం లేదని మండిపడ్డారు. రాబోయే కాల పరిస్థితుల గురించి చెప్తూ, ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవర్షాలు కురిసే అవకాశం ఉందని భవిష్యవాణి హెచ్చరించింది. ఊహించని వరదల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున పాలకులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ధర్మమార్గంలో నడుచుకునేవారిని అమ్మవారు




మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ వ్యాపార సంస్థ ’పాపులర్ షూమార్ట్’ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటు తో హఠాన్మరణం చెందారు. ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడంతో విజయవాడ వ్యాపార వర్గాలతో పాటు ఆయన సన్నిహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన ’పాపులర్ షూమార్ట్’ గత ఆరు దశాబ్దాలకు పైగా నాణ్యమైన సేవలతో ప్రజల విశేష ఆదరణను, విశ్వాసాన్ని పొంది ప్రముఖ వ్యాపార సంస్థగా చెరగని ముద్ర వేసింది. సంస్థ పురోగతిలో విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. విజయ్ కుమార్ మరణవార్త తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ వ్యాపార రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంపై రుద్దుతోందని కెటిఆర్ ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీ అప్పులను రాష్ట్ర ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకెళ్తే, వాటిని రేవంత్‌రెడ్డి రద్దు చేశారని విమర్శించారు. అప్పట్లో మెట్రో విస్తరణకు అభ్యంతరం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందో, మెట్రోను టేకోవర్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అనేక చిన్న పట్టణాలకు మెట్రోలను మంజూరు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ మెట్రో విస్తరణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా అన్యాయమే అని పేర్కొన్నారు.


మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం జిల్లా గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మసాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీతమ్మసాగర్ ప్రాజెక్టు పురోగతిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి అధికారులన

జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీం విచారణ‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ అనేది తీవ్రమైన నేరాలకే వర్తిస్తుందని స్పష్టత విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకువెళ్లబోమని కేంద్రం హామీ ఇచ్చిన హామీని బాధ్యతాయుతంగా అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను ముందుకు తీసుకువెళ్లమంటూ తామిచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జూలై 20న ఢిల్లీలో జరిగిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్లపై అత్యన్నత న్యాయస్థానం సోమవారంనాడు విచారణ జరిపింది. ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు ఇచ్చిన హామీని బాధ్యతాయుతంగా అమలు చేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తక్కిన విద్యార్థులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను చట్టప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఊరట లభించే అవకాశం ఉంది. అదేవిధంగా ‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ అనే పదంపై కూడా అత్యున్నత న్యాయస్థానం వివరణ ఇచ్చింది. ఈ పదం హత్య, అత్యాచారం, ఉగ్రవాదం వంటి తీవ్రమైన న

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్(బిసిసిఐ), ఇంగ్లండ్(ఇసిబి), ఆస్ట్రేలియా(సిఎ) సంపన్న బోర్డులని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వల్ల కానీ ఓ పనిని బిసిసిఐ మాత్రమే చేస్తూ చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. రిటైర్ అయిన ఆటగాళ్లు పెన్షన్ ఇవ్వడమే. అజింక్యా రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతడికి సీనియర్ టెస్ట్ క్రికెటర్ కావడంతో.. బిసిసిఐ రూ.70 వేలు పెన్షన్ ఇస్తుంది. అటు ఆస్ట్రేలియా కానీ, ఇటు ఇంగ్లండ్ బోర్డులు కానీ రిటైర్ అయిన ఆటగాళ్లకు పెన్షన్ ఇచ్చే సౌకర్యం కల్పించలేదు. దీంతో క్రికెట్ చరిత్రలోనే మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బిసిసిఐ చరిత్ర లిఖించింది.



న్యూఢిల్లీ: సీజేఐతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ఆర్డినెస్స్ స్థానే ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ సోమవారంనాడు ఆమోదం తెలిపింది. నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయం నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చర్చ లేకుండానే బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఆర్డినెన్స్ జారీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సైతం మూజువాణి ఓటుతో సభ తోసిపుచ్చింది. గత వారం కూడా సభలో ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి చర్చ లేకుండానే జనన మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సంక్షిప్తంగా సభకు వివరించారు. అనంతరం దీనిపై చర్చించాల్సిందిగా సభ్యులను సభాపతి ఓం బిర్లా కోరారు. అయితే విపక్షాలు నినాదాలు కొనసాగించడంతో బిల్లును సభాపతి ఓటింగ్‌కు పెట్టారు. దీంతో మూజువాణి ఓటుతో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం జడ్జిల సంఖ్యను పెంచేందుకు గత మేలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం దీనిపై ఆర్డినెన్స్ తీసుకువ

ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బిజెపికి షాక్ ఇచ్చారు. బిహార్‌లో కమలం పార్టీ కంచుకోటైన బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో అనూహ్య విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన ఆయన బిజెపి అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 18,964 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బిజెపి జాతీయ అధ్యక్షడు నితిన్ నబీన్‌కు అడ్డాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత బిజెపి ఓటమిపాలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన నితిన్ నబీన్ బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే, ఆయన రాజ్యసభకు కూడా నామినేట్ కావడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి రావడంతో బాంకీపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో జులై 30న ఉప ఎన్నిక నిర్వహించగా.. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టగా బిజెపి కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ విజయ బావుటా ఎగురవేశారు.

టీం ఇండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి క్రికెట్‌కు సంబంధించిన విషయంలో కాదు వ్యక్తిగత విషయంతో. అర్ష్‌దీప్ పంజాబీ మోడల్ సమ్రిన్ కౌర్‌తో డేటింగ్‌లో ఉన్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పని వల్ల ఈ ప్రచారం నిజమేనని తేలింది. సమ్రీన్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేయగా.. దానికి అర్ష్‌దీప్ స్పందించాడు. ఎలుగుబంటి, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. దీనికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్ సింబల్, లాక్ ఎమోజీలతో రిప్లే ఇచ్చింది.దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని బహిర్గతమైంది. ఆర్ష్‌దీప్ కొద్ది రోజుల క్రితం సమ్రీన్‌తో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ‘మై పర్సన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ తర్వాతే అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.




డిస్పూర్: అస్సాంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను అత్యాచరం చేసి.. హత్య చేశారు. అతి దారుణమైన స్థితిలో కుటుంబ సభ్యులే గుర్తించలేని స్థితిలో ఆమె ఇంట్లో శవమై కనిపించింది. అస్సాంలోని హైలాఖాండీ జిల్లాకు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లింది. అయితే అక్కడ తన కజిన్‌తో గొడవ కారణంగా తిరిగి ఇంటికి వచ్చేసింది. వేడుక అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి తమ కుమార్తెను ఆ స్థితిలో చూసి హతాశులయ్యారు. హత్య చేయడానికి ముందు తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె తల, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైందని, ప్రైవేటు భాగంలోకి రాడ్డు చొప్పించారని పోలీసు వర్గాలు తెలిపాయి. పోస్ట్ మార్టం అనంతరం లైంగిక దాడి జరిగిందా లేదా అనేది తెలుస్తుందని, హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని జాతీయ రహదారిని దిగ్భంధించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



రాంచీ: జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. సాహిబ్‌గంజ్ డివిజినల్ జైలు నుంచి కన్‌బాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మార్గమధ్యలో సుజిత్ మరుగుదొడ్డికి వెళ్లాలని కోరడంతో పోలీసులు వాహనం ఆపారు. అదే అదనుగా భావించిన అతడు ఓ పోలీసు వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని చీకట్లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు చేపట్టగా.. అతడు తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజన్ చేశారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఘటనపై సమీక్ష నిర్వహించారు. సుజిత్ సిన్హాపై హత్యలు, వసూళ్లు, ఇతర నేరాలకు సంబంధించిన అనేక కేసులు నమోదై ఉన్నాయి. చాలా కాలంగా అతడు జార్ఖండ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.