22778 వార్తలు

రాష్ట్రంలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పల్లెవాసుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా, సేవలను వారి ముంగిటకే చేర్చాలనే దృఢ సంకల్పంతో వైద్య ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు గాను 1,569 నూతన ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవన నిర్మాణాలను చేపట్టనున్నారు. అంతేకాకుండా, సాధారణ వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రజలు ఇకపై పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉచిత నిర్ధారణ (డయాగ్నస్టిక్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను త్వరగా గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అయ్యే వైద్య ఖర్చుల భారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించనుంది. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగ

అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం పాలయ్యాడు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి(26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణిం చినట్లు వైద్యులు నిర్ధారించారు. అమెరికాలో నిత్యానంద రెడ్డి ఎంఎస్ పూర్తి చేశాడు. మిషిగన్ స్టేట్‌లోని డెట్రాయిట్‌లో ఉంటున్న నిత్యానంద రెడ్డి ఈ నెల 18న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో నిత్యానందరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితు లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. జులై 23న నిత్యా నంద రెడ్డి బర్త్‌డే కావడంతో అతని స్నేహితులు ఆసుపత్రి బెడ్ పైనే యువకుడు పుట్టిన రోజు వేడు కలు నిర్వహిం చారు. పరిస్థితి విష మించడం తో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. పుట్టినరోజు నాడే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీర య్యారు. ఎమ్మెస్ చేసేందుకు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. మృత దేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని

జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, దానిని అవమానించినా నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వామపక్షాలతోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు.దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’కు ఈ బిల్లు ద్వారా సవరణలు చేయనున్నారు. జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జనగణమన’ను అపవిత్రం చేయడం లేదా అగౌరవపరచడం ఈ చట్టం ప్రకారం నేరం. ఇందుకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.తాజా సవరణ ద్వారా జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా కల్పించాలని కేంద్రం ప్రతిపాదించింది.‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో అప్పటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ‘వందేమాతరం’ ప్





రూ. 100 కోట్లకు పైగా జిఎస్‌టి ఎగవేతకు సంబంధించిన కేసులో ఎకోరిన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్నను జిఎస్‌టి అధికారులు అరెస్టు చేశారు. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయంలో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అరెస్టు జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం, సదరు కంపెనీ రూ. 100 కోట్లకు పైగా జిఎస్‌టిని ఎగవేసిందని అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి, టర్నోవర్‌ను తారుమారు చేయడం ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ పన్ను మోసానికి లక్ష్మీ ప్రసన్నే ప్రధాన బాధ్యురాలని నిర్ధారించుకున్న అధికారులు ఆమెను అరెస్టు చేసి, తదుపరి విచారణను ప్రారంభించారు. ఇతర వ్యక్తుల పాత్ర, ఇతర సంస్థలతో కంపెనీ జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ కొనసాగుతోంది.

దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్.. అంచనాలను పెంచేసింది. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ డీల్‌తో మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో ఇది వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరిన్ సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యిందని ఆయన శుక్రవారం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. కెటిఆర్ కనీసం పుట్టిన రోజునైనా నిజాలు మాట్లాడకుండా అన్నీ అబద్దాలే మాట్లాడారని ఆయన విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌దని, అయినా కెటిఆర్ అక్కడికి వెళ్ళి విద్యార్థులతో పాటు ధర్నాలో పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పైగా అక్కడ అన్నీ అబద్దాలే మాట్లాడారని ఆయన విమర్శించారు.ధర్నా చౌక్‌లో ముక్కు నేలకు రాసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి వేదికపైకి వెళితే బాగుండేదన్నారు. ధర్నా చౌక్‌ను బిఆర్‌ఎస్ ఎత్తి వేస్తే తాము ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని మళ్లీ పునరుద్దరించామని ఆయన గుర్తు చేశారు. ఎనబై ఏళ్ళ వయసులో మల్లికార్జున ఖర్గే విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే, మీ తండ్రి కెసిఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆయన తూర్పారపట్టార



ఇప్పటివరకూ ఎందరో పురుష, మహిళ క్రీడాకారుల బయోపిక్‌లు మనం తెరమీద చూశాం. అయితే చాలామందికి తెలియని ఓ మహిళ అథ్లెట్ బయోపిక్ త్వరలో ఒటిటిలో సందడి చేయనుంది. ఆ చిత్రమే ‘సుమో దీదీ’. భారత దేశ తొలి సుమో రెజ్లర్ ‘హేతల్ దవే’ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమే ఇది. ఈ చిత్రానికి జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు. ‘హేతల్ దవే’ పాత్రలో శియం భగ్నానీ నటించారు. టోక్యో ఫిలిమ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్ సహా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా త్వరలో ‘జి5’ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘‘నువ్వు బరువు తగ్గకపోతే, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు’ అంటూ కుటుంబ సభ్యులు హేతల్ దవేని కుటుంబ సభ్యులు ప్రశ్నించడం ఈ టీజర్ ప్రారంభం అవుతోంది. చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే ఇష్టపడే హేతల్ దవే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొనే వరకూ ఆమె ఎలాంటి కష్టాలు, అవమానాలు ఎదురుకున్నారు అనేది సినిమాలో ఎలా చూపిస్తారో.. టీజర్‌లో ఓ శాంపిల్‌గా చూపించారు. ఇక పోతే ముంబైకి చెందిన హేతల్ దవే.. భారతదేశంలోనే తొలి సుమో రెజ్లర్ మాత్రమే కాదు.. ప్రపంచంలో టాప్-5లో ఒక

ఢాకా: బంగ్లాదేశ్ అధ్యక్షు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారని పేర్కొంటూ స్థానిక మీడియా వెల్లడించింది. మాజీ న్యాయవాది, అవామీ లీగ్ పార్టీకి చెందిన షాబుద్దీన్ 2023 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి అదే స్థానంలో కొనసాగుతున్నారు. పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు ఉన్నప్పటికీ.. ముందుగానే అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. షేక్ హసీనా పదవీచ్యుతురాలైనప్పటి నుంచి షాబుద్దీన్ తన అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు పలుమార్లు బహిరంగానే వెల్లడించారు.



షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లాహౌల్-స్పితి జిల్లాలో ఓ వాహనంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పంగీ-కిలాద్ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కుల్లు నుంచి పంగీ వైపు వెళ్తున్న టాటా సుమోపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనం వెనుక భాగంలో మంటలు తలెత్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో వాహనంలో 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో వాహనం నుజ్జునుజ్జయింది. పంగీ-కిలాద్ రోడ్డులో గురువారం కూడా కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని మూసివేశారు. మరమ్మతుల అనంతరం ఈ ఉదయమే రాకపోకలను పునరుద్దరించారు. ఈ క్రమంలోనే నేడు మళ్లీ కొండచరియలు విరగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. వాహన శిథిలాల కింద తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.




అందాల తార కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’. కల్తీ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, దేశవ్యాప్తంగా కల్తీ వల్ల జరిగే నష్టాలు ఏంటీ. కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుంది అనేది దానిపై ఈ సినిమా తీశామని కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో పాటు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తనని ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు కానీ.. తన కుమారుడికి మాత్రం పాలు ఇవ్వను అని తెలిపింది. ఈ విషయంలో తనని అందరూ కసాయి తల్లి అనుకున్న సరే.. పర్లేదు అని తెలిపింది. అంతేకాక తాను ఇంట్లోనే పన్నీరు తయారు చేస్తానని కాజల్ తెలిపింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తన దేశంలో ఆహార కల్తీ విపరీతంగా ఉందని కాజల్ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఓ ప్రాజెక్టు రీసెర్చ్‌లో తాను షాకింగ్ విషయాలు తెలుసుకున్నానని.. ఇటీవల ఓ కేసు గురించి తెలిసి పుచ్చకాయ తినడం మానేశానని చెప్పుకొచ్చింది.

