23734 వార్తలు

న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పార్లమెంట్ ర్యాలీలో ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేసినందుకు ఢిల్లీ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారని పోలీసులు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల ఫుటేజీలు, నిరసనలకు సంబంధించిన అన్నిడిజిటల్ రికార్డులను భద్రపర్చాలని ఆదేశించింది. నిరసనకారులతో అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నాలుగు వారాల్లోగా పోలీసులు స్పందించాలని పేర్కొంది. సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను సవాల్ చేస్తూ నమోదైన పిటిషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు బాష్పవాయు ప్రయోగం, లాఠీ ఛార్జి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆందోళనకారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. పోలీసులే తమపై దాడి చేశారు కాబట్టి ఈ సంఘటనపై దర్యాప్తును వారికి అప్పగించకుండా ప్రత్యేక దర్యాప్తు దళాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.


ఆడుతూ పాడుతూ తిరగాల్సిన బాలుడు విధి ఆడిన నాటకానికి బలయ్యాడు. క్షణాల వ్యవధిలో జరిగిన అనూహ్య ప్రమాదం ఆ ఇంట్లో శోకాన్ని మిగిలించింది. బాలుడి చిలిపి చేష్టలు ప్రాణాల మీదికి తెచ్చి తల్లిదండ్రుల జీవితాల్లో చీకటి నింపిన హృదయ విదారక ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన నికాడి గణేష్ కుమారుడు లోకేష్(14) బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్న బ్యాటరీ ఆయన కంటపడింది. అది ఎంత ప్రమాదకరమైనదో తెలియని అతడు దానితో కలిపి కరెంట్ వైర్లతో ప్రయోగం చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్యాటరీ భారీ శబ్దంతో పేలిపోయింది. లోకేష్ ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న బాలుడిని చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ లబోదిబోమన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కౌటాల సీఐ సంతోష్, ఎస్‌ఐ కమలాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోల


న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంట్‌లో కలిశారు. అధికారుల సమాచారం ప్రకారం, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోక్‌సభలో ప్రకటించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ స్పీకర్‌ను కలిసి చర్చించారు. చర్చను ఏ నిబంధన కింద నిర్వహించాలి, ఎప్పుడు చేపట్టాలి, ఎంతసేపు కొనసాగించాలనే అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు సమాచారం.ఉదయం సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం తిరిగి సమావేశమైన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజును ప్రకటన చేయాలని స్పీకర్ ఆదేశించారు. అయితే కాంగ్రెస్ నేత కే.సీ. వేణుగోపాల్ జోక్యం చేసుకుని, నీట్ వ్యవహారంపై చర్చతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా ప్రతిపక్షం డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆర

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సర్ ఫారం నింపి బీఎల్ ఓ లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తప్పనిసరిగా సర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ వివరాలను సరిచూసుకొని నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

వాషింగ్టన్: ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇప్పట్లో ఆ దేశాన్ని వదలేది లేదని అన్నారు. ఇక నుంచి హర్మూజ్ జలసంధిలో ఒక నౌకపై టెహ్రాన్ దాడి చేస్తే ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులతో విరుచుకుపడతామని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలోని నౌకపై క్షిపణి, రాకెట్, డ్రోన్, ఇతర ఏ రకమైన పరికరాలు, ఆయుధాలతో ఇరాన్ దాడి చేసినా అందుకు మూల్యం తప్పదన్నారు. తాము సైతం ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులతో ప్రతిదాడి చేస్తామని, టెహ్రాన్, దాని సమీపంలో కూడా దాడులు చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్ట్ చేశారు. గత నెలలో తాత్కాలిక కాల్పుల విరమణకు జరిగిన ఒప్పందం కుప్పకూలడంతో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధిపై పట్టుకోసం పోరాటం మరింత తీవ్రమైంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం జోర్డాన్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. మరోవైపు, ఇరాన్ బ్రిడ్జిలు, విద్యుత్ ప్లాంట్లను టార్గెట్ చేస్తామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని, పౌర

ఢిల్లీలో ఎపి సిఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆగస్టు 1న ప్రారంభించనున్న భోగాపురం అంతర్జా తీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీని సిఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపిలు, లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఎపికి సంబంధించిన కేంద్ర నిధుల విడుదల, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి లభించాల్సిన సహాయ సహకారాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. మోడీని కలిసిన తర్వాత సిఎం చంద్రబాబు కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, పీయూష్ ఘోయల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా భేటీ అయ్యారు.

ఎసిబి వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో టిజి రెడ్కో డిఇ ముత్యం వెంకట రమణను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు టిజి రెడ్కో డిఇ ఇంట్లో ఎసిబి అధికారులు బుధ వారం సోదాలు చేపట్టారు. మాదాపూర్‌లోని వెంకటరమణ ఇళ్లు సహా 15 ప్రాంతాల్లో 8 బృందాలతో ఎసిబి సోదాలు నిర్వహించింది. మాదాపూర్ లోని వెంకట రమణ ఇంటితో పాటు మరో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మంలోనూ ఎసిబి సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో అధికారుల కళ్లు చెదిరేలా భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. డిఇ ముత్యం వెంకటరమణ నివాసాల్లో పెద్ద మొత్తంలో నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు, డైమండ్స్, విలువైన కార్లు, బ్యాంకు లాకర్‌లో ఉన్న మొత్తాన్ని అధికారులు లెక్కిం చారు. బహిరంగ మార్కెట్‌లో వందల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అవినీతి నిరోధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోదా లలో స్థిర, చరాస్తి పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా నాలుగు రెసిడెన్షియ ల్ ప్లాట్లు, జీ ప్లస్ 3 కమర్షియల్ భవనా లు, ఆంజనేయనగర్ మూసాపేటలో జీ ప్లస్ 5 కమర్షియల్ బిల్డింగ్, ఖానాపేట్,




మనతెలంగాణ / సిటిబ్యూరోః అంతరాష్ట్ర గంజాయి ముఠాను చార్మినార్ టాస్క్‌ఫోర్స్, బాలాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 22.22కిలోల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని షాహీన్‌నగర్, అమీనా మసీద్ ప్రాంతానికి చెందిన మీర్జా జాఫర్ బైగ్ అలియాస్ సద్దాం ( 35), బార్కస్, కొత్తపేటకు చెందిన అవాద్ బిన్ అలీ యాఫై అలియాస్ అవాద్, కిషన్‌బాగ్‌కు చెందిన సర్దార్ మన్ ప్రీత్ సింగ్ ధిల్లాన్ అలియాస్ ధిల్లాన్ కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మీర్జా జాఫర్ బైగ్ అలియాస్ సద్దాంపై బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడు. సద్దాం గతంలో హత్యలు, హత్యాయత్నాలతో సహా 22 కేసులు ఉన్నాయి. అవాద్ బిన్ అలీ యాఫైపై 10 దొంగతనాల కేసులు, సర్దార్ మన్ ప్రీత్ సింగ్ ధిల్లాన్ పై రెండు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. నిందితులకు పాత నేరస్థుడైన ఇబ్రహీం బామర్‌తో పరిచయం ఏర్పడింది. వీరందరూ కలిసి ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఇక్కడ వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ నెల 17వ త

నవతెలంగాణ-చండూరు: చర్లగూడెం భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీఎస్పీ పోరాటం ఆగదు అని మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఐతరాజు అభయేందర్ హెచ్చరించారు. బుధవారం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన చర్లగూడెం ప్రాజెక్టు వద్ద మర్రిగూడ మండల బీఎస్పీ అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఐతరాజు అభయేందర్ మాట్లాడుతూ చర్లగూడెం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 […] The post చర్లగూడెం భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీఎస్పీ పోరాటం ఆగదు appeared first on Navatelangana.


నవతెలంగాణ-కుభీర్మండలంలోని సిరిపెల్లి నంబర్ 3 గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. విజయ్ గత పది సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ సర్పంచుగా బాధ్యతలు స్వీకరించి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెంటనే స్తానిక ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడని ఆవేదనతో […] The post గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి appeared first on Navatelangana.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యూ, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎస్‌బి, ఎఐపిఎస్‌యూ సంఘాలు డిమాండ్ చేశాయి. దేశ రాజధాని ఢిలీల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని విద్యార్థి సంఘాల నేతలు ఖండించారు. 24న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు విద్యాసంస్థలు సహకరించాలని యాదవల్లి వెంకటస్వామి (ఎన్‌ఎస్‌యుఐ), కె. మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ (ఎఐఎస్‌ఎఫ్), టి. నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ), పల్లె మురళి (ఎఐఎఫ్‌డిఎస్) విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజలు సహకరించాలని హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా 24న విద్యాసంస్థల బంద్ పోస్టుర్‌ను విద్యార్థి సంఘాల నేతలు విడుదల చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన క్రూరమైన లాఠీచార్జీ విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని వెంకటస్వామి ఆరోపించారు. విద్యార్థులకు మద్దతుగ

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ’చలో సంసద్’ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు వ్యహరించిన తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పోలీసు చర్యపై తక్షణం జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని, వీడియోలు చూసే సమయం తమకు లేదని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించడంతో సీజేఐ సూటిగా స్పందించారు. వీడియోలపై తమకు అసక్తి లేదని, చూసే సమయం కాడా లేదని అన్నారు. ’మా సమయం వృథా చేయొద్దు, మీ సమయం కూడా వృథా చేసుకోకండి’ అని ఆయన సూచించారు.నీట్-యూజీ 2026 పేపర్ లీక్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో పరీక్షల నిర్వహణ, సంస్కరణలతో సహా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై విద్యార్థులు నిరసనలు చేపట్టినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా ’థాంక్యూ వెరీ మచ్’ అంటూ సీజేఐ అన్నారు. పోలీసుల దమనకాండపై వీడియోలను తిరిగి న్యాయవాది ప్రస్తావించగా, తమకు అంత సమయం లేదని, విడియోలు చూడాలని అనుకోవడం లేదని సీజ

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీఢిల్లీ జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, ఉద్యమకారులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం విశ్వవిద్యాలయాల విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ నిరసన ర్యాలీ, కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ […] The post కేంద్ర ప్రభుత్వ నిర్భంధ చర్యలను ఖండిస్తూ ఓయూ లో భారీ నిరసన, ర్యాలీ appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ: ఢిల్లీ జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై, ఉద్యమకారులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను ఖండిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం విశ్వవిద్యాలయాల విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ తీశారు.అనంతరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థి నాయకులు […] The post ఓయూలో భారీ ర్యాలీ appeared first on Navatelangana.

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్న ప్రముఖ సినీనటి రష్మిక మందన్నకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో ఆమె ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆగస్టు 2న జరిగే క్లోజింగ్ సెర్మనీలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌తో కలిసి రష్మిక గ్రాండ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. ఈ గ్రాండ్ సెర్మనీలో భారతీయ కళా వైభవం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆకట్టుకునే నృత్య, సంగీత ప్రదర్శనలు ఉండనున్నాయి. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతీయ కళా సంస్కృతిని ఆవిష్కరించే ఈ కార్యక్రమంలో రష్మిక భాగస్వామ్యం కావడం ఆమె అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గేమ్స్ అధికారిక ఫ్లాగ్‌ను భారత్‌కు అందించనున్నారు. 2030లో 100 ఏళ్ల శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.

నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఈనెల 28న ఉదయం 10 గంటలకు వరంగల్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ, తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆలేరు పట్టణంలో బుధవారం తెలంగాణ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. సభకు అధిక సంఖ్యలో సబ్బండ వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రైతు కూలి సంఘం […] The post రైతు కూలీ సంఘం కరపత్రాల ఆవిష్కరణ appeared first on Navatelangana.

భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మోత్కుపల్లి రవినవతెలంగాణ-ఆలేరు టౌన్ అసైన్డ్ భూములకు, లావన్ పట్టా, ఇనాం భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని , భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మోత్కుపల్లి రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామన్న హామీ, ప్రస్తుతం అధికారంలో ఉండగానే అసైన్డ్ భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరారు. యాజమాన్య హక్కు కోసం ఈ నెల 24న భువనగిరిలోని ఎస్వీ హోటల్ […] The post అసైండ్ భూములకు యాజమాన్య హక్కు కల్పించాలి appeared first on Navatelangana.