20604 వార్తలు

ప్రతి సంవత్సరం ఆగస్టు 3ను భారతదేశంలో జాతీయ హృదయ మార్పిడి దినోత్సవంగా పాటిస్తారు. ఈ రోజు ఉద్దేశ్యం అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా గుండె దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చనే అవగాహన కల్పించడం.గుండె వైఫల్యం చివరి దశకు చేరుకున్న రోగులకు మందులు, యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ శస్త్రచికిత్సలు కూడా ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ప్రాణాలను కాపాడే మార్గంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు మరణం చెందిన దాత గుండెను సరైన రోగికి మార్పిడి చేయడం ద్వారా అతనికి కొత్త జీవితం అందించవచ్చు. భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం కలిగిన కార్డియాక్ సర్జన్లు, సమర్థవంతమైన అవయవ రవాణా వ్యవస్థ వల్ల ఈ చికిత్స విజయవంతంగా జరుగుతోంది. అయినప్పటికీ, మన దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య ఇంకా అవసరానికి చాలా తక్కువగా ఉంది. ఫలితంగా అనేక మంది రోగులు సరైన సమయంలో గుండె దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంలో అత్యంత కీలకమైన అంశం బ్రెయిన్ డెత్‌ను గుర్తించడం, కుటుం

బెంగళూరు: చిప్స్ ప్యాకెట్ లోని చిన్న బంతి బాలుడి ప్రాణం తీసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గౌరీపుర గ్రామంలో సంతోష్, ఐశ్వర్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మయూర్(3) అనే బాలుడు ఉన్నాడు. ఇంటికొచ్చిన బంధువులలో ఒకరు మయూర్ కు చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు. చిప్స్ తింటుండగా ప్యాకెట్ లో ఉన్న బంతి నోట్లో పెట్టుకున్నాడు. బంతి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. చిప్స్ ప్యాకెట్ చిన్నారి ప్రాణం తీసిందని బంధువులు రోదిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.












మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని,మొక్కులు చెల్లించుకున్నారు.తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం నివాసంలో బోనాల విందుకు సిఎం సికింద్ర

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌తో పాటు ఇతర అం డర్‌గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 202627 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది.ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అఖిల భారత కోటా పరిధిలోని డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు జరుగుతుంది. ఈ విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 22లోగా కళాశాలల్లో చేరాలి. రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, మూ డో విడత సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. ఖాళీగా మిగిలిన సీట్ల కోసం ప్రత్యేక (స్ట్రే వెకెన్సీ) విడతను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనుండగా, అందులో ఎంపికైన వారు అక్టోబర్ 10లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటా సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 28లోగా చేరాలి. రెండో విడత ఆగస్టు 31

మన తెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద సందిగ్ధానికి అధిష్టానం తెరదించింది. పార్టీలో కొత్త, పాతవారిని కలుపుకొని పోయేలా మధ్యేమార్గంగా అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఫార్మూలా ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఇక నుం చి నామినేటెడ్ పోస్టుల నియామకంలో పాత వారికి 60శాతం, కొత్తవారికి 40తం పదవు లు దక్కేలా ఎంపిక జరగాలని ఇటీవల ఢిల్లీ లో సమావేశమైన రాష్ట్ర సమన్వయ కమిటీకి అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా, అలాగే అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి లో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో పాత వా రికి కాకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారి కే పదవులు దక్కుతున్నాయన్న విమర్శలు దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఉత్పన్నం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు చెం దిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కం డువా కప్పుకున్నారు. వీరిలో పటాన్‌చెరు ఎ మ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మినహా మిగతా తొమ్మిది ఎమ్మెల్యేలు సాంకేతికంగా కాకపోయినప్పటికీ అనధికారికంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నార

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్స్ రివిజన్(సర్) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల పరిశీలన, డిజిటైజేషన్ ప్రక్రియ డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను ఏరివేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఈ తొలగింపుల ప్రక్రియ భవిష్యత్తు ఎన్నికల్లో తమ గెలుపోటములను ఎలా ప్రభావితం చే స్తుందో అని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లు ఉండగా, అందులో ఇప్పటివరకు సుమారు 80శాతం మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. కాగా, మొత్తం ఓటర్లలో 50 లక్షల నుంచి కోటి వరకు ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను తొలగించడం, మరణించిన వారిని ఓట్లు తొలగించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ అర్హులైన వారి ఓట్లు తొలగిస్తారనే అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు అర్హులైన ఓట్లు తొలగిస్తారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటరు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యూరి యా ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమై న మేరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్య వసాయ శాఖ ఆదివారం బులిటెన్‌లో వెల్లడించిం ది. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 73.99 లక్షల బ స్తాల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో మార్క్‌ఫెడ్ గిడ్డంగుల్లో 52.35 లక్ష ల బస్తాలు, రిటైలర్ల వద్ద 13.99 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.49 లక్షల బస్తాలు, ఇ తర గిడ్డంగుల్లో 2.16 లక్షల బస్తాలు నిల్వగా ఉ న్నాయని వివరించింది. యూరియా బుకింగ్ యా ప్ ద్వారా ఇప్పటివరకు 28.71 లక్షల మంది రై తులు నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకున్నారని, మొత్తం 110.77 లక్షల బస్తాల యూ రియా బుక్ కాగా, అందులో 99.04 లక్షల బస్తా లు ఇప్పటికే కొనుగోలు చేశారని, దీంతో యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాలో 89.42 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని పేర్కొంది. యూరి యా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ముందుగానే బుకింగ్ చేసుకుని సమీప విక్రయ కేంద్రాల్లో ఎరువులు పొందే అవకాశం కల్పించడంతో పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. రైతులు క్యూలో నిలబడాల్స

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు 70నుంచి 80శాతం వరకు కళాశాలల్లో రిపోర్ట్ చే సినట్లు తెలిసింది. మిగతా 20 శాతం కళాశాలల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో 79,891 సీట్లు కేటాయించగా, 8,162 మిగిలాయి. సీట్లు పొందిన వా రిలో 19,325 మంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చే యలేదు. దాంతో మొత్తం సీట్లతో పాటు అదనం గా అందుబాటులోకి వచ్చిన 4,347 సీట్లను రెం డో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 80,167 సీట్లు కేటాయించగా, 71,452 మంది విద్యార్థు లు రిపోర్టింగ్ చేయగా, 8,710 మంది రిపోర్టింగ్ చేయలేదు. తుది విడత కౌన్సెలింగ్‌లో 22,972 అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం ముగిసింది.ఈ నెల 5వ తేదీన చివరి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఎప్‌సెట్‌లో ర్యాంకు సాధించి ఎప్‌సెట్‌తో పాటు ఇతర కౌన్సెలింగ్‌లలో కూడా పాల్గొంటున్న మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటి వంటి జాతీ య సంస్థలలో సీటు లభిస్తే అక్కడికే వెళ్తున్నారు. ఈసారి టాప్ కళాశాలల్లో సీట్లకు కూడా ఇదివరకు ఉన్న డిమాండ్ కనిపిం

మన తెలంగాణ/హైదరాబాద్: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో అంతర్జాతీయ ముఠాలు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నాయి. ఒకప్పుడు రహ స్య సమావేశాలు, మధ్యవర్తుల ద్వారా జరిగే డ్రగ్స్ వ్యాపారం ఇప్పుడు డిజిటల్ వేదికలకు మారింది. ఇటీవల కాలంలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఆపరేషన్లలో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. మాదకద్రవ్యా ల రవాణా, వాటి ద్వారా అర్జించిన సొమ్మును త రలించేందుకు స్మగ్లర్లు ఎంచుకున్న మార్గాలు అధికారులనే ఆశ్చర్యపోయేలా చేశాయి. డార్క్ వెబ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా గ్రూపులు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల సహాయంతో మత్తు పదార్థాలను నేరుగా వినియోగదారుల ఇం టి వద్దకే చేరవేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవలి కాలంలో జరిగిన డ్రగ్స్ స్వాధీనం కేసుల విచారణలో ఈ కొత్త తరహా నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి చిన్న చిన్న పార్సిళ్ల రూపంలో మత్తు పదార్థాలను పంపించి, కొరియర్ సేవలు లేదా డెలివరీ ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు చేరవేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ వస్తువుల మాదిరిగా ప్యాకింగ్ చేయడం వల్ల వీటిని గుర్తించడం కష్టం గా మారుతోంది. ఇంటర

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమిన ల్ వేస్ట్’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కు కాం గ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించాలని బి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. భారత ఇం జినీర్లు అంతర్జాతీయంగా సత్తా చాటుతుంటే రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దివారం రాహుల్‌గాంధీకి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒకవై పు భారతదేశ ఇంజినీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అం తరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే.. అలాంటి వారిని ‘కిమినల్ వేస్ట్’ అని రేవంత్‌రెడ్డి అనడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండటమంటే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం... ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేత రాహుల్ గాంధీ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ‘బీరు-బిర్యానీ బ్యాచ్’ అంటూ అవమానించారు తెలంగాణ యువత ఓట్లు అడిగి వారిని మభ్య

కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఎఎ23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. అయితే అందులో ఒక చిన్న విషయం బన్నీ వ్యక్తిగతమైన భావాన్ని తెలియజేసింది. అదేంటంటే ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితమైన నలుగురు స్నేహితులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా మారారు. ఇది కేవలం ఒక ప్రొడక్షన్ క్రెడిట్ మాత్రమే కాదు. ఇది స్నేహానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం. ఇది ఫ్రెండ్ షిప్ డే స్పెషల్‌గా మారింది. అల్లు అర్జున్ ఎఎ23 సినిమా కోసం సహ నిర్మాతలుగా మారిన స్నేహితుల్లో బన్నీ వాస్ కూడా ఉన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో ఆయన స్కూల్ డేస్‌లో స్నేహితులైన సందీప్ రామినేని, నటరాజ్ కూడా చేరారు. వీరితోపాటు అతని కజిన్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా భాగమయ్యారు. వీరి స్నేహ బంధం పేరు.. రికార్డులు, పాన్ ఇండియా విజయాల కంటే చాలా ముందే మొదలైంది.

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ రాజకీయ ప్రధాన లక్ష్యమని, అధికారం కోసం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు, ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడటమే ఉద్యమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మక్డుం భవన్ లో సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కూనంనేని సాంబాశివరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, విద్యా-వైద్య రంగాల ప్రైవేటీకరణ, కార్మిక-రైతు వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున నిరంతరం పోరాడుతూ, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. ఈ నెల 6 నుండి 14 వరకు పార్టీ నిర్వహించే ప్రచార యాత్రలను అన్ని నియోజకవర్గాల్లో, డివిజన్లలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయడం సి