23620 వార్తలు




వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న హౌతీలు మరోసారి దాడులకు దిగారు. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన చమురు నౌకపై యెమెన్ సమీపంలో హౌతీలు బుధవారం రాత్రి క్షిపణితో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. తామే ఈ దాడి చేసినట్టు హౌతీలు ప్రకటించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు దాడులకు పాల్పడినా టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, సైనిక చర్య చేపడతామని హెచ్చరించారు. గత ఏడాది వాణిజ్య నౌకలపై దాడి జరిపిన హౌతీలకు అమెరికా గట్టి బుద్ధి చెప్పిందని, మళ్లీ ఇప్పుడు దాడులు మొదలుపెట్టారని ట్రంప్ పేర్కొన్నారు. హౌతీలు ఇరాన్ ప్రతినిధులే అయినందున ఈ దాడులకు ఇరాన్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇకనుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని కూడా ట్రంప్ ఇంతకుముందు హెచ్చరించారు. అయితే దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. పౌర వ్యవస్థలపై అమెరికా దాడి చేస్తే దెబ్బ





మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో వైసిపి నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఆయనను బుధవారం అరెస్ట్ చేసి, గురువారం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ కేసులో తన 18 ఏళ్ల కుమారుడిని కాపాడేందుకు అప్పలరాజు ప్రయత్నించారని పోలీసు లు ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన తన కుమారుడి స్థానంలో సిద్ధార్థ్ అనే మరో కుర్రాడిని నిందితుడిగా చిత్రీకరించేందుకు ఆయన యత్నించారని అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా మృతుడి కుటుంబాన్ని డబ్బుతో ప్రలోభపెట్టాలని చూశారని, కేసుకు సంబంధించిన కీల క సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంతో న్యాయవాదులు, వ్యాజ్యదారులు సుప్రీంకోర్టుకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) చేసిన విజ్ఞప్తిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ స్పందించారు. మధ్యాహ్న భోజన విరామంలోగా సమస్య పరిష్కారం కాకపోతే తానే నేరుగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు.గురువారం ఉదయం విచారణ ప్రారంభంలోనే ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌తో పాటు ఇతర స్టేషన్లను మూసివేయడంతో న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది కోర్టుకు చేరుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. కనీసం వీరికి పరిమిత ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా న్యాయవాదులు హాజరు కాలేకపోయిన సందర్భాల్లో వారి గైర్హాజరును మాత్రమే కారణంగా చూపి ఏ కేసులోనూ ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయరాదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.వికాస్ సింగ్ ఓ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కూడా సూచించారు. సుప్రీంకోర

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డిఇ ముత్యం వెంకటరమణకు నాంపల్లి ఎసిబి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆరున్నర దశాబ్దాల చరిత్రలో ఎసిబి తొలిసారి అతి ఖరీదైన అవినీతి తిమిం గలాన్ని పట్టుకొంది. రెడ్కోకో డీఈగా పనిచేస్తున్న వెంకటరమణ నివాసాలలో ఎసిబి అధికారులు బుధవారం సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఆయనతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. తనిఖీల సమయంలో వెంకటరమణ భారీ గా అక్రమాస్తులు సంపాదిం చినట్లు గుర్తించారు. 7 ప్రాంతాల్లో ఏకకాల దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కేజీల బంగారం, బ్యాంకు బ్యాలెన్స్‌లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్య పేరిట పలు కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, అనేక భవ నాలు, ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.400 కోట్లకు పైగా ఉంటుందని ఎసిబి అధికారులు తాజాగా అంచనా వేశారు. బుధవారం రెడ్కో డిఇ ముత్యం వెంక ట రమణను అరెస్టు చేసిన ఎసిబి అధికారులు గురువారం ఉదయం నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధిం చారు. దీంతో చంచల

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ 50వ జన్మదినం పురస్కరించుకుని గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేత, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గురువారం కింగ్ కోఠిలోని ఎల్లెన్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినులకు 50 సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ ముఖ్యఅతిథులు హాజరై విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం బిషప్ విద్యాసాగర్, రామ్ కోటి సిఎస్‌ఐ చర్చి సీనియర్ పాస్టర్ల సమక్షంలో కెటిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, బిఆర్‌ఎస్ నేతలు దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం మాటలకే పరిమితం అయిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 6 లక్షలు తీసుకుని సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెబుతోందని చెప్పారు. సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తేల్చిచెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లుగా పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే సిఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 30 నెలలు అయినా హైదరాబాద్ నగరంలో ఒక్క ఇళ్లు నిర్మించలేదు..కానీ, సిఎం మాత్రం ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ళు కడతామని మంత్రులు హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. భారీ హోర్డింగ్‌లు, ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కె.పి.వివేకానంద, మాధవరం కృష్ణా రావు,ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎంఎల్‌సిలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవిలతో కలిసి ఆయన మీడియ

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో బాధ్యత వహించాల్సిన వారి జవాబుదారీతనం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విమర్శించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను మరోసారి స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా, కఠిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని మోదీ గురువారం ఉదయం ఎక్స్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోతో పాటు హాయ్... నా పేరు నథింగ్ అనే వ్యాఖ్యను పోస్టు చేశారు. మరోవైపు సీజేపీ అధికారిక ఖాతా నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పక రాజీనామా చేయాలి అంటూ పోస్టు చేసింది. సీజేపీ జాతీయ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ, ప్రధాని స్పందనను స్వాగతిస్తున్నామని, అయితే దాదాపు నెలన్నర రోజుల నిరసనల తర్వాత ఈ స్పందన రావడం విచారకరమన్నారు. అంతేకాకుండా, ప్రశ్నపత్రాల లీకేజీలకు అసలు కారణం ఏమిటనే కీలక ప్రశ్నకు సమాధానం ఇవ్వలే

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో భద్రతా కారణాల రీత్యా ఢిల్లీలోని 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రెండో రోజైన గురువారంనాడు కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు వందలాది మంది ఎక్కడికక్కడే నిలిచిపోగా, కొందరు ఖరీదైన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగిస్తుండటంచో కీలక మార్గాలను తాత్కాలికంగా మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నిర్ణయించింది. లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ్, జన్‌పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాఘ్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ మూసివేయనున్నట్టు డీఎంఆర్‌సీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపింది. ఆ తర్వాత ఝుండేవాలన్ మెట్రో స్టేషన్ సర్వీసును కూడా డీఎంఆర్‌సీ మూసివేసింది. బుధవారంకూడా ఈ 17 మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి.

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు హింసాత్మకంగా మారుతుండటంపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్టులు రద్దు చేసే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అల్లర్లు, ఇతర హింసాత్మక ఘటనల్లో ప్రమేయమున్న వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లు, ఇతర సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనట్టు చెబుతున్నారు. హింసలో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించి లీగల్ నిబంధనల ప్రకారం వారి పాస్‌పోర్టులు రద్దు చేయనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యావ్యవస్థలో అవకతవకలకు నిరసగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది సీజేపీ ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, సీసాలతో ఆందోళనకారులు దాడి చేయడంతో ఇద్దరు ఏసీపీలతో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలను పోలీసులు

జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన డిగ్రీ పరీక్షలో ఇన్విజిలేటర్లే విద్యార్థులకు జవాబులు చెబుతూ దొరికిపోయారు. జై నారాయణ వ్యాస్ యూనివర్సిటీకి చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ ఉదంతం బయపడింది. విద్యార్థుల 93 సమాధాన పత్రాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా సిఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. గ్లోబరీనా సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమన్య హక్కులు లేవు. గ్లోబరీన నా బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్ఇ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ లబ్ధికోసమే నా ప్రతిష్ఠను దెబ్బ తీసేలా దురుద్ధేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. గడువులోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కెటిఆర్ అన్నారు.

– విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన నేతలు..నవతెలంగాణ-కుభీర్నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రమైన కుభీర్ వివేకానంద విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష […] The post నీట్ అక్రమాలపై కుభీర్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో appeared first on Navatelangana.

శవపాడెతో నిరసన వ్యక్తం చేసిన కొత్తూరు శంకర్ నవతెలంగాణ-కుభీర్మారుమూల మండలమైన కుబీర్ మండలానికి ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో మండల ప్రజలు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్తూరు శంకర్ గురువారం మండల కేంద్రమైన వివేకానంద చౌరస్తాలో శవ పాడేతో నిరసన చేపట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో భైంసా ఆస్పత్రికి కుబీర్ మండల ప్రజలు వెళ్లాలంటే దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సొస్తుందన్నారు. అక్కడికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని శవ పాడే ముందు […] The post కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.

హరారే: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న తొలి టి-20 జింబాబ్వే భారత బౌలర్లను ఎదురుకుంటూ గౌరవప్రద స్కోర్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. అయితే ఇన్నింగ్స్ తొలి బంతికే జింబాబ్వే వికెట్ కోల్పోయింది. ఒక దశలో 64 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తడివానషే మరుమాని (27 నాటౌట్), వెస్లీ మధెవెరే(39)లు కలిసి పోరాడారు. వీరిద్దరు కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో మయాంక్, ప్రిన్స్‌లు చెరి రెండు వికెట్లు.. శివమ్ దూబె, రవి బిష్ణోయ్‌లు తలో వికెట్ తీశారు.

నవతెలంగాణ-కుభీర్ ఎల్ నీ నో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం అతి తక్కువగా నమోదు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోటు వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలసిరి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం మండలంలోని డోడర్న గ్రామంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పర్యటించి, పంట కుంట (ఫార్మ్ ఫండ్) పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వర్షపు చుక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు […] The post కుభీర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ appeared first on Navatelangana.