🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

23627 వార్తలు

సిజెపి నిరసనలపై కఠిన చర్యలు.. వారి పాస్‌పోర్టులు రద్దు!
తెలంగాణ

సిజెపి నిరసనలపై కఠిన చర్యలు.. వారి పాస్‌పోర్టులు రద్దు!

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు హింసాత్మకంగా మారుతుండటంపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్టులు రద్దు చేసే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అల్లర్లు, ఇతర హింసాత్మక ఘటనల్లో ప్రమేయమున్న వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లు, ఇతర సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనట్టు చెబుతున్నారు. హింసలో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించి లీగల్ నిబంధనల ప్రకారం వారి పాస్‌పోర్టులు రద్దు చేయనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యావ్యవస్థలో అవకతవకలకు నిరసగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది సీజేపీ ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, సీసాలతో ఆందోళనకారులు దాడి చేయడంతో ఇద్దరు ఏసీపీలతో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలను పోలీసులు

Adminజూలై 23, 2026 - గురువారం👁 2
విద్యార్థులకు అన్సర్లు చెబుతూ దొరికిపోయిన ఇన్విజిలేటర్లు
తెలంగాణ

విద్యార్థులకు అన్సర్లు చెబుతూ దొరికిపోయిన ఇన్విజిలేటర్లు

జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన డిగ్రీ పరీక్షలో ఇన్విజిలేటర్లే విద్యార్థులకు జవాబులు చెబుతూ దొరికిపోయారు. జై నారాయణ వ్యాస్ యూనివర్సిటీకి చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ ఉదంతం బయపడింది. విద్యార్థుల 93 సమాధాన పత్రాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.

జూలై 23, 2026 - గురువారం
1
సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ లీగల్ నోటీసులు
తెలంగాణ

సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ లీగల్ నోటీసులు

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా సిఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. గ్లోబరీనా సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమన్య హక్కులు లేవు. గ్లోబరీన నా బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్ఇ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ లబ్ధికోసమే నా ప్రతిష్ఠను దెబ్బ తీసేలా దురుద్ధేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. గడువులోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కెటిఆర్ అన్నారు.

జూలై 23, 2026 - గురువారం
1
నీట్ అక్రమాలపై కుభీర్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో
తెలంగాణ

నీట్ అక్రమాలపై కుభీర్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో

– విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన నేతలు..నవతెలంగాణ-కుభీర్నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రమైన కుభీర్ వివేకానంద విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష […] The post నీట్ అక్రమాలపై కుభీర్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో appeared first on Navatelangana.

జూలై 23, 2026 - గురువారం
14
కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ

కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి

శవపాడెతో నిరసన వ్యక్తం చేసిన కొత్తూరు శంకర్ నవతెలంగాణ-కుభీర్మారుమూల మండలమైన కుబీర్ మండలానికి ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో మండల ప్రజలు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్తూరు శంకర్ గురువారం మండల కేంద్రమైన వివేకానంద చౌరస్తాలో శవ పాడేతో నిరసన చేపట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో భైంసా ఆస్పత్రికి కుబీర్ మండల ప్రజలు వెళ్లాలంటే దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సొస్తుందన్నారు. అక్కడికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని శవ పాడే ముందు […] The post కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.

జూలై 23, 2026 - గురువారం
17
పోరాడిన జింబాబ్వే.. భారత్ లక్ష్యం ఎంతంటే..
తెలంగాణ

పోరాడిన జింబాబ్వే.. భారత్ లక్ష్యం ఎంతంటే..

హరారే: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న తొలి టి-20 జింబాబ్వే భారత బౌలర్లను ఎదురుకుంటూ గౌరవప్రద స్కోర్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. అయితే ఇన్నింగ్స్ తొలి బంతికే జింబాబ్వే వికెట్ కోల్పోయింది. ఒక దశలో 64 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తడివానషే మరుమాని (27 నాటౌట్), వెస్లీ మధెవెరే(39)లు కలిసి పోరాడారు. వీరిద్దరు కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో మయాంక్, ప్రిన్స్‌లు చెరి రెండు వికెట్లు.. శివమ్ దూబె, రవి బిష్ణోయ్‌లు తలో వికెట్ తీశారు.

జూలై 23, 2026 - గురువారం
17
కుభీర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్
తెలంగాణ

కుభీర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్

నవతెలంగాణ-కుభీర్ ఎల్ నీ నో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం అతి తక్కువగా నమోదు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోటు వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలసిరి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం మండలంలోని డోడర్న గ్రామంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పర్యటించి, పంట కుంట (ఫార్మ్ ఫండ్) పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వర్షపు చుక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు […] The post కుభీర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ appeared first on Navatelangana.

జూలై 23, 2026 - గురువారం
0
విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి

జిల్లా విద్యాధికారి భోజన్న..నవతెలంగాణ-కుభీర్ప్రభుత్వ పాఠశాలలో చదువులకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. గురువారం మండలంలోని పార్డి( బి ) ప్రభుత్వ ఉన్నాత పాఠశాల ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఉన్నత పాఠశాల విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం […] The post విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి appeared first on Navatelangana.

జూలై 23, 2026 - గురువారం
0
25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి
తెలంగాణ

25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి

నవతెలంగాణ-మరికల్మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 25 దుకాణాలను కార్యదర్శి మల్లేష్ గురువారం ఖాళీ చేయించారు. ఈ విషయమై ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. గత మార్చి నెలలో గ్రామ పంచాయతీ పరిధిలో 25 దుకాణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న వారికి అప్పగించామని పేర్కొన్నారు. అయితే వారు మార్చి నుంచి జూలై వరకు ఆ దుకాణాలకు అద్దె చెల్లించలేదని తెలిపారు. ఈ నెలలో 15 రోజుల ముందు ఖచ్చితంగా దుకాణాల కిరాయి చెల్లించాలని నోటీసులు కూడా జారీ […] The post 25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి appeared first on Navatelangana.

జూలై 23, 2026 - గురువారం
0
ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే.. నిరసనకారులకు కేంద్రం అహ్వానం
తెలంగాణ

ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే.. నిరసనకారులకు కేంద్రం అహ్వానం

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసింది. చర్చలకు రావాలని విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) నేతలను మరోసారి ఆహ్వానించింది. ‘మీకు అనుకూలంగా ఉండే సమయంలో ఎప్పుడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ‘‘ఆందోళనకారులకు కేంద్రం నాలుగు ప్రతిపాదనలు చేసింది. వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆందోళనకారుల తరఫున కొందరు వచ్చి ప్రభుత్వంతో చర్చించవచ్చు. మీరు ఎప్పుడైనా రావొచ్చు. ప్రభుత్వం తరఫున నేను, జెపి నడ్డా చర్చల్లో పాల్గొంటాం’’ అని జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. నడ్డా కార్యాలయంలో కానీ, ఆయన నివాసంలో కానీ చర్చిద్దామని న్నారు. తొలుత చర్చ ప్రారంభిస్తేక్ర.క్రమంగా పరిష్కరం లభిస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

జూలై 23, 2026 - గురువారం
19
నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తాం
తెలంగాణ

నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తాం

నవతెలంగాణ-హైదరాబాద్: నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానని ముంబయి పోలీసులు విద్యార్థులను బెదిరించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. సిజెపికి మద్దతుగా ముంబయిలోనూ కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే వారిపై పోలీసులసు బెదిరింపులకు దిగారు. నిరసనల్లో మళ్లీ మీరు నాకు కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తా. అప్పుడపు మీ జీవితం నాశనమవుతుంది. బెయిల్ కూడా రాదు. జైల్లోనే మగ్గిపోవాల్సి వుంటుంది. అని విద్యార్థులను ఉద్దేశించి ఒక పోలీస్ అధికారి చెబుతున్నట్లు వీడియోలో […] The post నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తాం appeared first on Navatelangana.

జూలై 23, 2026 - గురువారం
0
భారత్‌తో మ్యాచ్‌.. మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే
తెలంగాణ

భారత్‌తో మ్యాచ్‌.. మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే

హరారే: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టి-20లో జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ జింబాబ్వేని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన జింబాబ్వే తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో బ్రెయిన్ బెన్నెట్(0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్ వేసిన 4వ ఓవర్ రెండో బంతికి బెన్ కర్రన్ (10) వైభవ్ సూర్యవంశీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోసారి మయాంక్ బౌలింగ్‌లో డియాన్ మేయర్స్(6) శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజ్‌లో సికందర్ రజా(0), రియాన్ బర్ల్(1) ఉన్నారు.

జూలై 23, 2026 - గురువారం
21
విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు
తెలంగాణ

విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు

నవతెలంగాణ-హైదరాబాద్: నిరసన చేపడుతున్న విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు ప్రకటించింది. నీట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలు, ఢిల్లీలో ఆందోళనకారులపై జరిగిన పోలీసుల చర్యలను ఖండిస్తూ న్యాయవాదుల బృందం బుధవారం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి’ అనే ప్రచారంలో భాగంగా సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ పీఠికను చదివారు. న్యాయవాద వర్గం విద్యార్థులకు మద్దతుగా నిలిచిందని సీనియర్‌ న్యాయవాది, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌. మురళీధర్‌ ఉద్ఘాటించారు. హక్కుల […] The post విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు appeared first on Navatelangana.

జూలై 23, 2026 - గురువారం
0
ఆస్తి వేలం వివాదం.. బండ్ల గణేశ్‌కు సుప్రీంలో షాక్
తెలంగాణ

ఆస్తి వేలం వివాదం.. బండ్ల గణేశ్‌కు సుప్రీంలో షాక్

హైదరాబాద్: ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేశ్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంకు చర్యలను సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసి స్వాధీనం చేసుకోవడంపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

జూలై 23, 2026 - గురువారం
19
మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ

మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

మన తెలంగాణ/మోత్కూర్: కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీక్ నిరుద్యోగం విద్యార్ధుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన లోక్ సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిఅరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు మండల మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తు వాటి ద్వారా ప్రతిపక్ష నాయకులను వేధించడం వారికి పరిపాటిగా మారిందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంత ల విమల వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ పేలంపూడి వెంకటేశ్వర్లు , మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్

జూలై 23, 2026 - గురువారం
22
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ

మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన రాజగోపాల్ రెడ్డి

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ–యాదయ్య దంపతుల కుమారుడు సందీప్ గత నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడు సందీప్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాను కుటుంబానికి అండగా ఉంటానని, అధైర్యపడవద్దని యాదయ్య, పార్వతమ్మలను రాజగోపాల్ రెడ్డి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు పైల్ల సోమిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, నాయకులు పర్రెపాటి యుగంధర్, తండ సత్తయ్య, నారగొని అంజయ్య, కారుపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జూలై 23, 2026 - గురువారం
14
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
తెలంగాణ

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మహిషానపుటాలో వద్ద గురువారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని దేంకానిల్ ఆసుపత్రికి తరలించారు. మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్ రాహులుగా గుర్తించారు. బుధవారం రాత్రి వీరు ఓ వివాహానికి హాజరై, స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ్రమాంం చోటుచేసుకుంది.

జూలై 23, 2026 - గురువారం
14
OTT Thriller Review: చూడటం స్టార్ట్ చేస్తే వదలరు.. ఓటీటీలో ఉత్కంఠరేపుతున్న క్రైమ్ థ్రిల్లర్
తెలంగాణ

OTT Thriller Review: చూడటం స్టార్ట్ చేస్తే వదలరు.. ఓటీటీలో ఉత్కంఠరేపుతున్న క్రైమ్ థ్రిల్లర్

OTT Thriller Review: చూడటం స్టార్ట్ చేస్తే వదలరు.. ఓటీటీలో ఉత్కంఠరేపుతున్న క్రైమ్ థ్రిల్లర్

జూలై 23, 2026 - గురువారం
26
సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఓట్లు పోయే అవకాశముంది : రేవంత్
తెలంగాణ

సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఓట్లు పోయే అవకాశముంది : రేవంత్

హైదరాబాద్: ఓటు ప్రక్షాళన ముఖ్యమని పార్టీ నాయకులకు గట్టిగా చెప్పానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 70 శాతం ఎస్ఐఆర్ పూర్తి..మరో 30 శాతం చేయాలని ఆదేశించానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నచిన్న తేడాలు ఉన్నా ఓటరు సవరణ సరికాదని, తనకు రెండు ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదు ఇవ్వమనండి అని అన్నారు. తప్పుడు ఫిర్యాదు అయితే లోపల వేయిస్తానని హెచ్చరించారు. తన ఓటు బదిలీ చేయించుకున్నానని, కలెక్టర్ కు దరఖాస్తు చేసే బదిలీ చేయించుకున్నానని తెలియజేశారు. గతంలో కర్ణాటకలో కొడంగల్ ఉందని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినపుడు తెలంగాణలోకి వచ్చిందని అన్నారు. బిఎల్ వొలకు అనుసంధానంగా పార్టీ వాళ్లు ఓట్లు పోకుండా చూస్తున్నారని, ఎస్ఐఆర్ పై అవగాహనారాహిత్యం వల్లే బిఎల్ ఎలను పెట్టామని అన్నారు. బిఎల్ఎలు పరిశీలన చేసి ఓట్లు పోకుండా చేస్తారని, ఓట్లు లేకుండా ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు? ప్రక్షాళన పేరుతో ఓట్లను తొలగించే అవకాశం ఉందని, గతంలో జిహెచ్ ఎంసి పరిధిలో ఆంధ్ర ఓట్లన్ని తొలగించారని అన్నారు. కాంగ్రెస్ కోర్టుకెళితే నాటి జిహెచ్ఎంసి కమీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్

జూలై 23, 2026 - గురువారం
26
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి బాలీవుడ్ సపోర్ట్..  ఆలియా, సల్మాన్ ఎమోషనల్ పోస్టులు!
తెలంగాణ

ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి బాలీవుడ్ సపోర్ట్.. ఆలియా, సల్మాన్ ఎమోషనల్ పోస్టులు!

ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి బాలీవుడ్ సపోర్ట్.. ఆలియా, సల్మాన్ ఎమోషనల్ పోస్టులు!

జూలై 23, 2026 - గురువారం
24
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు.. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన
తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు.. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు.. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన

జూలై 23, 2026 - గురువారం
0
ట్రక్కుల్లో రాళ్లు తీసుకొస్తుంది పోలీసులు.. రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలు: CJP చీఫ్
తెలంగాణ

ట్రక్కుల్లో రాళ్లు తీసుకొస్తుంది పోలీసులు.. రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలు: CJP చీఫ్

ట్రక్కుల్లో రాళ్లు తీసుకొస్తుంది పోలీసులు.. రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలు: CJP చీఫ్

జూలై 23, 2026 - గురువారం
0
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అభిషేక్
తెలంగాణ

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అభిషేక్

టీం ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం టీం ఇండియా జంబాబ్వే పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టి-20ల్లో తలపడనుంది. తొలి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయిత ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఓ రికార్డు సాధించే అవకాశం ఉంది. అభిషేక్ ఈ మ్యాచ్‌లో 16 పరుగులు చేస్తే. టి-20ల్లో 6వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భలుగో భారత క్రికెటర్‌గా మారుతాడు. అతడి కంటే ముదు కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ మాత్రమే ఈ ఫీట్‌ని సాధించారు. ప్రస్తుతం అభిషేక్ 203 మ్యాచుల్లో 199 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 53 మ్యాచులు భారత తరఫున ఆడాడు.

జూలై 23, 2026 - గురువారం
0
శ్రీవాణి దర్శన టికెట్ల భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
తెలంగాణ

శ్రీవాణి దర్శన టికెట్ల భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..

శ్రీవాణి దర్శన టికెట్ల భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..

జూలై 23, 2026 - గురువారం
0
← వెనుక265 / 985తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి