19902 వార్తలు

యువతలో మోడీ పాపులారిటీ చూసి రాహుల్ భయపడుతున్నారుఇంకెంతోకాలం ఆయన యువనేతగా చెలామణి కాలేరు ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యువతలో పెరుగుతున్న ఆదరణను చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నారని, తనను తాను యువనేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ క్రమంగా యువతలో ఆదరణ కోల్పోతుండటమే ఆ భయానికి కారణమమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యువ ఓటర్ల మద్దతు బీజేపీకే ఉందని, జెన్ జీ యువత ఎప్పుడూ తమతోనే ఉందని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నేత మోడీ అని చెప్పారు. యువతతో నిరంతరం మమేకం కావడం, సోషల్ మీడియా వేదికలపై ఆయన చురుకుగా ఉండటం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మోడీకి పెరుగుతున్న ఆదరణ కారణంగానే యువతకు చేరువ కావాలని రాహుల్ తాపత్రయపడుతున్నారని, తనను తాను యువనేతగా ఆయన అనుకుంటున్నప్పటికీ మోదీ అంత పాపురాలిటీ ఆయనకు లేదనే విషయం నిరూపితమైందని అన్నారు. ఓటర్లు పదేపదే కాంగ్రెస్ సహా విపక్షాలను తోసిపుచ్చడంతో నిరాశానిస్పృహలతో ఆ పార్టీలు ఉన్నాయన్నారు. పేపర్ లీక్ సవరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ తదితర విపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: టీమిండియాలో మళ్లీ జట్టు లభిస్తుందనే ఆశలు పెద్దగా లేవని సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో తనకు టీమిండియాలో తిరిగి స్థానం లభిస్తుందనే నమ్మకం లేదన్నాడు. దేశవాళీతో పాటు ఐపిఎల్‌లో మెరుగ్గానే రాణిస్తున్నానని, అయితే టీమిండియాలో చోటు లభించక పోవడం కాస్త బాధగానే ఉందన్నాడు. అయితే తనకు చోటు దక్కనందుకు ఎవరిని తప్పుపట్టనని స్పష్టం చేశాడు. ఇప్పటికే జాతీయ జట్టు తరఫున చాలా క్రికెట్ ఆడానని, తానెంటో నిరూపించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే ఒక వేళ ఛాన్స్ లభిస్తే మాత్రం అరుదైన గౌరవంగా భావిస్తానని భువీ పేర్కొన్నాడు.

బిహార్‌లోని పూర్ణయా నియోజకవర్గం ఎంపీ పప్పు యాదవ్‌పై ఆదివారంనాడు దాడి జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ విరాళాల చోరీపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ వద్ద పప్పూ యాదవ్ ఇటీవల ఒక స్కిట్ ప్రదర్శించారు. దీంతో మతపరమైన మనోభావాలను గాయపరచారంటూ పప్పూ యాదవ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్‌పై వారణాసిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ పరిణామాలపై పప్పూ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, రాముడిని అవమానించారంటూ ఒక వ్యక్తి ఆయనను నిలదీస్తూ చెప్పు విసిరాడు. దీంతో అతనికి, ఎంపీ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్యాయత్నమే.. కాగా ఈ ఘటనపై పప్పూ యాదవ్ స్పందిస్తూ, తనపై హత్యాయత్నం జరిగినట్టు చెప్పారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 34 ఏళ్ల సుమిత్‌గా గుర్తించామని, ఘజియాబాద్‌లో ఇనుప సామానుల వ్యాపారం చేస్తుంటాడని, అతనిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పు

అత్యవసర డయల్ 100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ (హెచ్‌సీ-661)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. యం.రమేష్ సస్పెండ్ చేశారు. ఆగస్టు 1 అర్ధరాత్రి గచ్చిబౌలి ఐకియా సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో బాధితుడు డయల్ 100కు రెండు సార్లు ఫోన్ చేసి పోలీసు సహాయం కోరాడు. ఇన్‌చార్జిగా ఉన్న హెచ్‌సీ సయ్యద్ యూనస్ సంఘటనా స్థలానికి వెళ్లకుండా "కాలర్ వల్ల ఇబ్బంది" అంటూ రెండు ఫిర్యాదులను మూసివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన పై సయ్యద్ యూనస్‌ను సైబరాబాద్ సిపి తక్షణమే సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సైబరాబాద్ సిపి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకానికి రూ.116 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదల అనంతరం త్వరలో టెండర్ల ద్వారా ప్రక్రియ పూర్తి చేసి చెరువుల్లోకి ఉచితంగా చేప, పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


బొగోటా: పెరూలోని నజ్కా సిటీ సివార్లలో పర్యాటకుల విమానం కుప్పకూలింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు జర్మనీ, ఇద్దరు స్పెయిన్, ఏడుగురు ఇటలీ, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రఖ్యాత నజ్కా లైన్స్‌ను ఆకాశం నుంచి చూసేందుకు వీరంతా విమానం ఎక్కారు. పెరూవియన్ కంపెనీ ఏరోడియానా ఆపరేట్ చేస్తున్న విమానం శనివారంనాడు ఐకా నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక పొలంలో కుప్పకూలినట్టు నజ్కా మునిస్పిల్ గవర్నమెంట్ ధ్రువీకరించింది. అయితే తమ సంస్థ 14 ఏళ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాలను ఉపయోగించి విజయవంతంగా సర్వీసులను నడుపుతున్నట్టు పెరూవియన్ కంపెనీ ఏరిడియాన్ తెలిపింది. పర్యాటక విమాన దుర్ఘటనపై పెరూ అధ్యక్షుడు ఫుజుమోరి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. పెరూ ఎడారి నేల మీద వేల ఏళ్ల కిందట చెక్కిన నాజ్కా లైన్స్‌ను ఆకాశం నుంచి చూడటం పర్యాటకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుంటుంది.

న్యూఢిల్లీ : జంతర్ మంతర్ నిరసనల సందర్భంగా తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికతోపాటు యువతను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి ఆ బాలిక తల్లి ఆదివారంనాడు ధన్యవాదాలు తెలియజేశారు. ‘మోడీజీ.. నా కూతురికి పునర్జన్మ కల్పించారు. ఆమె జీవితాన్ని కాపాడారు’ అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఢిల్లీలోని ఇటీవలి నిరసన కార్యక్రమంలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో సదరు బాలికపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అనంతరం ఆమె వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ, తాను చేసిన తప్పును అంగీకరించింది. ఇకపై ఇలాంటి పొరపాటు చేయనని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలిక తల్లి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ ఎంతో పెద్ద మనసుతో మా కుమార్తెను క్షమించారన్నారు. ఆయన చూపిన కరుణను జీవితాంతం మర్చిపోలేమని, మా కూతురికి కొత్త జీవితం ఇచ్చినట్లే అని అన్నారు. తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ను కూడా ఉపసంహరించుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో తన కుమార్తె పేరు, వయస్సు వంటి వివరాలు కూడా సరిగా నమోదు కాలేదని తెలిపారు. 18ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడి

9 నెలల చిన్నారిని తల్లి చెరువులో ముంచి చంపిన సంఘటన బైరామల్‌గూడలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటలకు జరిగింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు లోకసాని అనురాధ (9 నెలలు)గా గుర్తించారు. మృతురాలు లోకసాని రాజేశ్వరి (34), ఇంజాపూర్ నివాసి.ఘటన సమయంలో తల్లి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాపోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి వెంకటేశ్వర్లునవతెలంగాణ -పరకాల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలను అవలంబిస్తోందని, వాటికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం పరకాల పట్టణంలోని ఎఫ్‌జే ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల రెండో రోజు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల చక్రపాణి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపతి వెంకటేశ్వర్లు “మతం – మతోన్మాదం” […] The post మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్ గూడాలో దారుణం చోటు చేసుకుంది. రాజేశ్వరి అనే మహిళ తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువులో ముంచి చంపేసింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post హైదరాబాద్ లో దారుణం..9 నెలల చిన్నారిని నీటిలో ముంచి చంపిన తల్లి appeared first on Navatelangana.

నవతెలంగాణ – పెద్దవంగర ఆర్ఎంపీ, పీఎంపీ మండల నూతన అధ్యక్షుడిగా బొమ్మకల్ గ్రామానికి చెందిన పొడిశెట్టి సైదులు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల మండల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా సుధగాని రామ్మూర్తి, ఉపాధ్యక్షుడిగా పులుగుజ్జ రామచంద్రు, కోశాధికారిగా కనుకుంట్ల సంపత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సైదులు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు అర్హతలు, నిబంధనలకు లోబడి మాత్రమే వైద్య సేవలు అందించాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో […] The post ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడిగా సైదులు గౌడ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త, రామేశ్వర్‌పల్లి వాస్తవ్యులు ముద్దసాని రాజు – మాలతి దంపతులు, వారి కుమార్తె వర్షిత, కుమారుడు రోహన్ కలిసి ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం గ్రానైట్‌తో పాటు గర్భగుడికి అవసరమైన టైల్స్‌ను విరాళంగా అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంత్రి చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.3,36,000 అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో […] The post రామ మందిర నిర్మాణానికి విరాళం appeared first on Navatelangana.

నవతెలంగాణ – మునిపల్లి మండలంలోని బొడిశేట్పల్లి గ్రామ సర్పంచ్ పొట్టిగారి మల్లేశ్వరి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితురాలై అదేవిధంగా గ్రామ అభివృద్ధికి గాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సర్పంచ్ మల్లేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ నాయకులు రాంరెడ్డి తదితరులు ఉన్నారు. The post కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బొడిశేట్పల్లి సర్పంచ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – మునిపల్లి మండల పరిధిలోనిమల్లికార్జున్ పల్లి గ్రామంలో బోనాల పండుగను గ్రామ సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎస్ఐ అరవింద్ పాల్గొని పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా బోనాలను మహిళలు ఎత్తుకొని పురవీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు. The post మల్లికార్జున్ పల్లిలో బోనాల పండుగ appeared first on Navatelangana.

ఘనంగా 1990 బ్యాచ్ స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం నవతెలంగాణ-ఆలేరు టౌన్ఆలేరు మండలంలో భావోద్వేగాల వెల్లువ మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదని ఆలేరు పట్టణానికి చెందిన 1990 బ్యాచ్ స్నేహితులు మరోసారి నిరూపించారు. జీవిత ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో స్థిరపడినా, చిన్ననాటి జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్న మిత్రులు ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ పాఠశాల రోజుల సంఘటనలను ఒకరితో ఒకరు […] The post తరాలు మారిన తరగని స్నేహబంధం appeared first on Navatelangana.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని , ఉన్నది ఒకటే కేసీఆర్ గ్రూప్ మాత్రమే అని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. పత్రికా సమావేశంలో ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపులు ఉన్నాయంటూ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. […] The post బీఆర్ఎస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు తగవు appeared first on Navatelangana.


నవతెలంగాణ-ఆలేరు టౌన్ భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా 4వ మహాసభలు విజయవంతం చేయాలని, మహిళా సమైక్య మండల నాయకురాలు, మాటూరు జానమ్మ అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య 1931లో ఏర్పడి , నాటి నుండి దేశంలో రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, అసమానతలు, అత్యాచారాలు, అన్యాయాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతు ఉద్యమ చరిత్ర లిఖించిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూనే 2023 పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఉద్యమించామన్నారు. సిపిఐ జిల్లా […] The post భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా 4వ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ appeared first on Navatelangana.

ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు అఖిలపక్ష కమిటీ విజ్ఞప్తి నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేర్ రెవెన్యూ డివిజన్ ఈ లిమిటేషన్ తో సంబంధం లేకుండా వెంటనే ఏర్పాటు చేస్తూ గెజిట్ ప్రకటించాలని, ఆలేర్ రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ, అఖిలపక్ష కమిటీ సభ్యులు ముక్త కంఠంతో, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆలేరు రెవెన్యూ డివిజన్ విషయంపై చర్చించడానికి ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అఖిలపక్ష […] The post వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ గెజిట్ ను ప్రకటించాలి appeared first on Navatelangana.

నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లను బిఆర్‌ఎస్ నేతలు ఆదివారం సందర్శించారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బిఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, టిజిబికెఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సుంకే రవిశంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ తదితరులకు ధర్మారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ధర్మారం అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. నంది మేడారంలోని నంది పంపుహౌస్‌ల వద్ద నీటిని ఎత్తిపోస్తున్న విధానాన్ని నేతలు పరిశీలించారు. అనంతరం బోయిన పల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. సిఎం రేవంత్‌రెడ్డికి నీటిపై అవగాహన లేదని అన్నారు. ఢిల్లీలో ఎన్డీఎస్ అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి నీటిపారుదుల శాఖపై ఏ మాత్రం అవగాహన లేదని, నీటి గురించి, ప్రాజెక్టుల గురించి కనీసం ఎ,బి,సి,డిలు తెలవని.. ఉత్త మంత్రిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆదివారం ఫలాంబరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లతో అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించారు. వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకొని భోజనాలు చేశారు.