🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

19902 వార్తలు

కెసిఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించారు: కెటిఆర్
తెలంగాణ

కెసిఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించారు: కెటిఆర్

లష్కర్ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్‌ను గతంలో ఎవరూ పట్టించుకోలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కెసిఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కెటిఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వెళ్లిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కెటిఆర్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని అన్నారు. బోనాలు కులాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కెసిఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 1800 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అద్భతంగా నిర్మించామని తెలిపారు. బోనాల సందర్భంగా ప్రతి ఆలయ కమిటీకి నిధులు కేటాయించి, పండుగలను ఘనంగా నిర్వహించామని చె

Admin5 రోజుల క్రితం👁 0
కాక్రోచ్ జనతా పార్టీ నిధుల సేకరణపైనా ఈసీకి ఫిర్యాదు
తెలంగాణ

కాక్రోచ్ జనతా పార్టీ నిధుల సేకరణపైనా ఈసీకి ఫిర్యాదు

సూరత్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విదేశాల్లో ఉన్నత విద్య ఎలా అభ్యసించారనే అంశంపై విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన అభిజీత్ తండ్రి భగవన్‌రావు దిప్కే తన కుమారుడి విదేశీ విద్యకు నిధులు ఎలా సమకూర్చారనే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను కోరారు. అదే సమయంలో, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన ఆందోళనల్లో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటున్న సీజేపీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించిన రూ.1 కోట్ల నిధిపైనా ఎన్నికల సంఘం, పన్నుల శాఖలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కాక్రోచ్ జనతా పార్టీ చట్టబద్ధంగా నమోదు కానప్పటికీ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ విరాళాలు స్వీకరించడం సరైనదేనా అనే అంశాన్ని కూడా ఎన్నికల సంఘం పరిశీలించాలని అమిత్ తివారీ కోరారు. “కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల సంఘంలో నమోదు కాని సంస్థ. అయినప్పటికీ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని న్యాయ సహాయ నిధికి ర

5 రోజుల క్రితం
0
మోడీ అన్నీ బాగుచేస్తుంటే మీరు దుబాయ్‌లో ఎందుకుంటున్నారు: రాజ్‌థాక్రే
తెలంగాణ

మోడీ అన్నీ బాగుచేస్తుంటే మీరు దుబాయ్‌లో ఎందుకుంటున్నారు: రాజ్‌థాక్రే

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే ఇద్దరు సినీ నటులపై విరుచుకుపడ్డారు. బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్‌లపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించే వారు విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారని ప్రశ్నించారు. ముంబైలో ఎంఎన్‌ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ ఠాక్రే... దేశంలో అన్నీ బాగున్నాయని, దేశాన్ని మోడీ అభివృద్ధి చేస్తున్నారని చెబుతున్న వివేక్ ఒబెరాయ్, మాధవన్ తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు? అని ప్రశ్నించారు. అయితే తన కుమారుడు వేదాంత్ ఈత శిక్షణ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు మాధవన్ వెల్లడించారు. భారత్‌లో టాక్స్‌లు చెల్లిస్తున్నానని, తన వృత్తిపరమైన అనుబంధం కూడా భారతదేశంతోనే కొనసాగుతోందన్నారు. వ్యాపార కార్యకలాపాల కోసమే దుబాయ్‌లో నివసిస్తున్నట్టు వివేక్ ఒబెరాయ్ గతంలో ప్రకటించారు.

5 రోజుల క్రితం
0
ఫెర్రీలో ఘోర అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి
తెలంగాణ

ఫెర్రీలో ఘోర అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ని మదురా ద్వీపం సమీప సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 41 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరికొందరిని సురక్షితంగా కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరమైన తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సర్‌కు వెళ్తుండగా ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంటల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు ప్రయాణికులు ఫెర్రీ నుంచి సముద్రంలోకి దూకడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.

5 రోజుల క్రితం
0
కారుతో బీభత్సం సృష్టించిన బాలుడు
తెలంగాణ

కారుతో బీభత్సం సృష్టించిన బాలుడు

కారు డ్రైవింగ్ చేసి బీభత్సం సృష్టించడంతో ఓ ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన యూసుఫ్‌గూడలోని కార్మికనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ, కార్మికనగర్‌కు చెందిన రాజ్‌కుమార్(60), ప్రభాకర్(55) ఇద్దరు సోదరులు స్కూటీపై వచ్చి ఓ ఇంటి ముందు బైక్‌పార్క్ చేస్తుండగా కారు నడుపుకుంటూ వచ్చిన బాలుడు(17) వారిని ఢీకొట్టాడు. కారుపై అదుపు కోల్పోవడంతో వారిని ఢీకొట్టి ముందుకు వెళ్లడంతో రాజ్‌కుమార్ కారుతో పాటు ఈడ్చుకుపోయాడు. దీంతో ఏడుబైక్‌లు ధ్వంసం కావడంతోపాటు రాజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రాజ్‌కుమార్‌పై కారు వెను టైర్ ఆగిఉండడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు కారును పైకి లేపి రాజ్‌కుమార్‌ను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. బాలుడికి డ్రైవింగ్ రాకున్నా కారును నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవింగ్ చేసిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

5 రోజుల క్రితం
2
రంజాన్‌కు రూ. 33 కోట్లు...బోనాలకు రూ. 20 కోట్లా?: బండి సంజయ్
తెలంగాణ

రంజాన్‌కు రూ. 33 కోట్లు...బోనాలకు రూ. 20 కోట్లా?: బండి సంజయ్

ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులు బిక్షమెత్తుకోవాలా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగ్రహంగా ప్రశ్నించారు. రంజాన్‌కు రూ. 33 కోట్లు కేటాయించి, బోనాలకు రూ. 20 కోట్లే కేటాయించిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని ఆమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. జంట నగరాల్లోనే 3 వేల పైచిలుకు దేవాలయాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హిందువుల పండుగలంటే ఎందుకంత చులకన అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం అన్నారు.గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించిందని ఆయన తూర్పారపట్టారు. జనాభా ప్రాతిపదికన పండుగలు, ఉత్సవాలకు నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో హిందు పండుగలు, ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులంతా బిచ్చమెత్తుకునే దుస

5 రోజుల క్రితం
2
అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించిన సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించిన సిఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

5 రోజుల క్రితం
2
గోదావరి ఉగ్రరూపం.. లంక గ్రామాల్లోకి నీరు
తెలంగాణ

గోదావరి ఉగ్రరూపం.. లంక గ్రామాల్లోకి నీరు

ముమ్మిడివరం: గోదావరి ఉద్ధృతి కారణంగా లంక గ్రామాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని శేరిలంక, కమిని, పశువులలంక, గురజాపులంక, కూనలంక, తానేలంక, పొట్టిలంకల్లోకి వరుద నీరు చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పలు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని ఇళ్లను ఖాళీ చేయించారు. కొన్ని చోట్ల మరబోట్లను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.

5 రోజుల క్రితం
0
బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి
తెలంగాణ

బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి

బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి

5 రోజుల క్రితం
0
కుటుంబకలహాలతో.. భార్యను కత్తితో పొడిచిన భర్త
తెలంగాణ

కుటుంబకలహాలతో.. భార్యను కత్తితో పొడిచిన భర్త

కుటుంబకలహాలతో.. భార్యను కత్తితో పొడిచిన భర్త

5 రోజుల క్రితం
0
హైదరాబాద్లో మరో చిట్టీల మోసం.. రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన దంపతులు
తెలంగాణ

హైదరాబాద్లో మరో చిట్టీల మోసం.. రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన దంపతులు

హైదరాబాద్లో మరో చిట్టీల మోసం.. రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన దంపతులు

5 రోజుల క్రితం
0
మణికొండలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కాపాడిన అధికారులు
తెలంగాణ

మణికొండలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కాపాడిన అధికారులు

మణికొండలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కాపాడిన అధికారులు

5 రోజుల క్రితం
0
పక్కింటికి వెళ్లి వచ్చేలోపే.. మేడ్చల్ లోపట్టపగలే చోరీ.. 9తులాల బంగారంఎత్తుకెళ్లిన దొంగలు
తెలంగాణ

పక్కింటికి వెళ్లి వచ్చేలోపే.. మేడ్చల్ లోపట్టపగలే చోరీ.. 9తులాల బంగారంఎత్తుకెళ్లిన దొంగలు

పక్కింటికి వెళ్లి వచ్చేలోపే.. మేడ్చల్ లోపట్టపగలే చోరీ.. 9తులాల బంగారంఎత్తుకెళ్లిన దొంగలు

5 రోజుల క్రితం
0
విధ్వంసం సృష్టించిన అభిషేక్.. 91 బంతుల్లో 233 పరుగులు
తెలంగాణ

విధ్వంసం సృష్టించిన అభిషేక్.. 91 బంతుల్లో 233 పరుగులు

భారత క్రికెటర్ అభిషేక్ శర్మ పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే మ్యాచ్‌లో అదరిపోయే ప్రదర్శన చేశాడు. అమృత్‌సర్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ (233, 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 533 పరుగులు చేసింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మధ్యకాలంలో అభిషేక్ ఆశించిన మేరకు రాణించలేదు. జింబాబ్వేతో జరిగిన మూడు టి-20ల సిరీస్‌లో కేవలం 11 పరుగులే చేశాడు. అంతకు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతడు తన 10 ఇన్నింగ్స్‌ల్లో 191 పరుగులు మాత్రమే చేశాడు.

5 రోజుల క్రితం
9
శ్రీలంకతో సిరీస్‌ ముందు భారత్‌కు షాక్.. బుమ్రా ఇంకా కోలుకోలేదు..
తెలంగాణ

శ్రీలంకతో సిరీస్‌ ముందు భారత్‌కు షాక్.. బుమ్రా ఇంకా కోలుకోలేదు..

శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌ కోసం జట్టుతో జత కట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. అందులో ఈ సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశం ఉంది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో మూడో వన్డేకి అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే కొద్ది రోజుల క్రితం అతడు ఫిట్‌నెస్ సాధించాడని బిసిసిఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తాజాగా తెలుస్తోంది. బుమ్రా మోకాలి వాపు మొదట్లో కనిపించిన దానికంటే తీవ్రంగా ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో టీం ఇండియా షెడ్యూల్ వరుస మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ఈ మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించాలంటే బుమ్రా కీలకం. దీంతో ఇప్పుడు రిస్క్ వద్దని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోని స్పోర్ట్స్ సైన్స్ బృందం సూచించినట్లు తెలుస్తోంది. లంకతో టెస్ట్ సిరీస్ నాటికి బుమ్రా ఫిట్‌నెస్ సాధించినా.. నేరుగా టెస్టు మ్యాచ్‌లు ఆడించడానికి బిసిసిఐ మెడికల్ టీం సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

5 రోజుల క్రితం
9
‘ఎల్లమ్మ’ నుంచి అప్‌డేట్.. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్‌లుక్ విడుదల
తెలంగాణ

‘ఎల్లమ్మ’ నుంచి అప్‌డేట్.. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్‌లుక్ విడుదల

సంగీత దర్శకుడిగా ఎన్నో మరపురాని ఆల్బమ్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన హీరోగా పరిచయం అవుతున్న ‘ఎల్లమ్మ’ మూవీ టీం సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి దేవి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆయన చేతిలో కిరీటం పట్టుకొని రెట్రో లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాత్ర పేరు ‘పర్షి’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ‘‘ఎల్లమ్మ’.. నుంచి పర్షిని పరిచయం చేస్తున్నాం. మట్టి నుంచి పుట్టిన ఈ పాత్రను మీరెప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ ప్రయాణాన్ని కూడా మీరెప్పటికీ మర్చిపోలేరు. ఆయన సంగీతాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దాంతో పాటు, ఈసారి వెండితెరపై ఆయన నటనను కూడా వేడుకగా జరుపుకొందాం. రాక్‌స్టార్ డిఎస్‌పికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే అద్భుతాను ఈ ప్రపంచం అస్సలు ఊహించలేదు’’ అని ఎల్లమ్మ టీం పేర్కొంది. ‘బలగం’ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత వేణు యెల్దండి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో దేవీ డప్పు కళాకారుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. వెంకటేశ్వర క్రియేషన్స్

5 రోజుల క్రితం
10
Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వానలు..18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ

Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వానలు..18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వానలు..18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

5 రోజుల క్రితం
8
జెన్-Z కు ఎర్లీగా బట్టతల.. స్టార్టప్లకు బిలియన్ డాలర్ అవకాశం.. పోటీపడుతున్న కంపెనీలు
తెలంగాణ

జెన్-Z కు ఎర్లీగా బట్టతల.. స్టార్టప్లకు బిలియన్ డాలర్ అవకాశం.. పోటీపడుతున్న కంపెనీలు

జెన్-Z కు ఎర్లీగా బట్టతల.. స్టార్టప్లకు బిలియన్ డాలర్ అవకాశం.. పోటీపడుతున్న కంపెనీలు

5 రోజుల క్రితం
9
Yellamma: బలగం వేణు నుంచి మరో సెన్సేషన్.. ‘ఎల్లమ్మ’ నుంచి ‘DSP’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘పర్షి’ కథ ఇదేనా?
తెలంగాణ

Yellamma: బలగం వేణు నుంచి మరో సెన్సేషన్.. ‘ఎల్లమ్మ’ నుంచి ‘DSP’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘పర్షి’ కథ ఇదేనా?

Yellamma: బలగం వేణు నుంచి మరో సెన్సేషన్.. ‘ఎల్లమ్మ’ నుంచి ‘DSP’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘పర్షి’ కథ ఇదేనా?

5 రోజుల క్రితం
9
ఫోటో ఫీచర్: బోనమెత్తిన లష్కర్.. ఉజ్జయిని అమ్మవారి సేవలో భక్త జనం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..
తెలంగాణ

ఫోటో ఫీచర్: బోనమెత్తిన లష్కర్.. ఉజ్జయిని అమ్మవారి సేవలో భక్త జనం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

ఫోటో ఫీచర్: బోనమెత్తిన లష్కర్.. ఉజ్జయిని అమ్మవారి సేవలో భక్త జనం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

5 రోజుల క్రితం
0
పాకిస్థాన్ మరోసారి చిత్తు.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక
తెలంగాణ

పాకిస్థాన్ మరోసారి చిత్తు.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక

డంబుల్లా: శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ మహిళ క్రికెట్ జట్టు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. గతంలో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన ఆ జట్టు తాజాగా మూడు టి-20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో కోల్పోయింది. డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో శ్రీలంక.. పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. శ్రీలంక బౌలింగ్‌లో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక 176 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 17.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో సంజనా 46, ఆటపట్టు 40, హర్షిత 37 (నాటౌట్), విష్మి 31 పరుగులు చేశారు. పాక్ బౌలింగ్‌లో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంజనాకు ప్లేయర్ ఆఫ

5 రోజుల క్రితం
0
డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడాలి: మోడీ
తెలంగాణ

డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడాలి: మోడీ

వారణాశి: డ్రగ్స్ సమస్యను అందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొందామని ప్రధాని నరేంద్ర మోడీ యువతకు సూచించారు. జాతీయ ఉద్యమంలో అందరం భాగమవుదామని అన్నారు. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో మోడీ ప్రారంభించారు. డ్రగ్స్ నిర్మూలనపై 100 వారాల ఉద్యమానికి మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో యువతకు అవగాహన కల్పించాలని యువతకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని అన్నారు. డగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారని, డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడాలని, విద్యాసంస్థల్లో ర్యాలీలు చేపట్టాలని, డ్రగ్స్ తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయని, కానీ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయని యువతకు సూచించారు. ప్రతి ఆదివారం క్రీడలు, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని మోడీ పేర్కొన్నారు.

5 రోజుల క్రితం
0
తెలంగాణ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (TGCGTA) నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ

తెలంగాణ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (TGCGTA) నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (TGCGTA) నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

5 రోజుల క్రితం
0
స్కూటీ హెడ్ లైట్ లో జొర్రిన పాము.. భయంతో వణికిపోయిన ఓనర్
తెలంగాణ

స్కూటీ హెడ్ లైట్ లో జొర్రిన పాము.. భయంతో వణికిపోయిన ఓనర్

స్కూటీ హెడ్ లైట్ లో జొర్రిన పాము.. భయంతో వణికిపోయిన ఓనర్

5 రోజుల క్రితం
6
← వెనుక39 / 830తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి