19915 వార్తలు


భారత క్రికెటర్ అభిషేక్ శర్మ పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే మ్యాచ్‌లో అదరిపోయే ప్రదర్శన చేశాడు. అమృత్‌సర్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ (233, 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 533 పరుగులు చేసింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మధ్యకాలంలో అభిషేక్ ఆశించిన మేరకు రాణించలేదు. జింబాబ్వేతో జరిగిన మూడు టి-20ల సిరీస్‌లో కేవలం 11 పరుగులే చేశాడు. అంతకు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతడు తన 10 ఇన్నింగ్స్‌ల్లో 191 పరుగులు మాత్రమే చేశాడు.

శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కోసం జట్టుతో జత కట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. అందులో ఈ సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశం ఉంది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో మూడో వన్డేకి అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే కొద్ది రోజుల క్రితం అతడు ఫిట్‌నెస్ సాధించాడని బిసిసిఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తాజాగా తెలుస్తోంది. బుమ్రా మోకాలి వాపు మొదట్లో కనిపించిన దానికంటే తీవ్రంగా ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో టీం ఇండియా షెడ్యూల్ వరుస మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ఈ మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించాలంటే బుమ్రా కీలకం. దీంతో ఇప్పుడు రిస్క్ వద్దని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోని స్పోర్ట్స్ సైన్స్ బృందం సూచించినట్లు తెలుస్తోంది. లంకతో టెస్ట్ సిరీస్ నాటికి బుమ్రా ఫిట్‌నెస్ సాధించినా.. నేరుగా టెస్టు మ్యాచ్‌లు ఆడించడానికి బిసిసిఐ మెడికల్ టీం సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సంగీత దర్శకుడిగా ఎన్నో మరపురాని ఆల్బమ్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన హీరోగా పరిచయం అవుతున్న ‘ఎల్లమ్మ’ మూవీ టీం సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి దేవి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆయన చేతిలో కిరీటం పట్టుకొని రెట్రో లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాత్ర పేరు ‘పర్షి’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ‘‘ఎల్లమ్మ’.. నుంచి పర్షిని పరిచయం చేస్తున్నాం. మట్టి నుంచి పుట్టిన ఈ పాత్రను మీరెప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ ప్రయాణాన్ని కూడా మీరెప్పటికీ మర్చిపోలేరు. ఆయన సంగీతాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దాంతో పాటు, ఈసారి వెండితెరపై ఆయన నటనను కూడా వేడుకగా జరుపుకొందాం. రాక్‌స్టార్ డిఎస్‌పికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే అద్భుతాను ఈ ప్రపంచం అస్సలు ఊహించలేదు’’ అని ఎల్లమ్మ టీం పేర్కొంది. ‘బలగం’ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత వేణు యెల్దండి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో దేవీ డప్పు కళాకారుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. వెంకటేశ్వర క్రియేషన్స్





డంబుల్లా: శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ మహిళ క్రికెట్ జట్టు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. గతంలో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన ఆ జట్టు తాజాగా మూడు టి-20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో కోల్పోయింది. డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో శ్రీలంక.. పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. శ్రీలంక బౌలింగ్‌లో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక 176 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 17.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో సంజనా 46, ఆటపట్టు 40, హర్షిత 37 (నాటౌట్), విష్మి 31 పరుగులు చేశారు. పాక్ బౌలింగ్‌లో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంజనాకు ప్లేయర్ ఆఫ

వారణాశి: డ్రగ్స్ సమస్యను అందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొందామని ప్రధాని నరేంద్ర మోడీ యువతకు సూచించారు. జాతీయ ఉద్యమంలో అందరం భాగమవుదామని అన్నారు. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో మోడీ ప్రారంభించారు. డ్రగ్స్ నిర్మూలనపై 100 వారాల ఉద్యమానికి మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో యువతకు అవగాహన కల్పించాలని యువతకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని అన్నారు. డగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారని, డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడాలని, విద్యాసంస్థల్లో ర్యాలీలు చేపట్టాలని, డ్రగ్స్ తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయని, కానీ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయని యువతకు సూచించారు. ప్రతి ఆదివారం క్రీడలు, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని మోడీ పేర్కొన్నారు.





షాహిద్ కపూర్ హీరోగా, రష్మిక, కృతి సనన్ హీరోయన్లుగా నటించిన చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. హోమీ అదజానియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ జూన్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2026లో విడుదలై తొలి వీకెండ్‌లో రూ.50 కోట్లు దాటిన హిందీ సినిమాల్లో ‘కాక్‌టెయిల్ 2’ ఒకటిగా నిలిచింది.


హైదరాబాద్: మధురానగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచ్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బాలుడు కారుతో ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందింది. మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


బాలానగర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మా నగర్ లోని ఫేస్1 లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద పడి బాలిక మృతి చెందారు. బైక్ పై తన మామ తో వెళ్తున్న వేద శ్రీ(4) లారీ టైర్ కింద పడటంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాపిక్ కు అంతరాయం లేకుండా వాహనాన్ని అక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు. పగటి సమయంలో భారీ వాహనాలు హైదరాబాద్ లోకి రావడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


హైదరాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది. విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతయ్యారు. యువతి, యువకుడు అలల తాకిడికి కొట్టుకపోయారు. నీతూ, రాము అనే యువతి, యువకుడు స్నేహితులతో కలిసి విశాఖ పట్నం బీచ్ కు వచ్చారు. ఫోటోలు తీస్తుండగా నీతు నీళ్లలో పడిపోతుంగా రాము కాపాడాబోయారు. ఇద్దరు నీళ్లలో పడిపోవడంతో అలల తాకిడికి కొట్టుకపోయారు. ఇద్దరి కోసం గాలింపు పోలీసులు, రెస్క్యూసిబ్బంది గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు విశాఖ పట్నం జిల్లా పెదజాలరిపేట చెందిన వారిగా గుర్తించారు.

గాజువాక: స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలోని పాత గంగవరం బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫొటోషూట్ కోసం బీచ్‌కు వెళ్లిన స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్ దామోదర్, జాలరిపేటకు చెందిన నీతూతో పాటు మరో ఐదుగురు స్నేహితులు ఆదివారం పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నీతూ, దామోదర్ సముద్రంలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై న్యూ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్: కులాలకు అతీతంగా జరిపే అద్భుతమైన పండుగ బోనాలు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కెటిఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కెటిఆర్ కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కెటిఆర్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో బోనాలను పట్టించుకోలేదని, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించలేదని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక మాజీ సిఎం కెసిఆర్ బోనాలకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చారని, తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతోనని కెసిఆర్ చెప్పారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గుడికి రూ. 25 కోట్లు విడుదల చేశామని, ఆలయ కమిటీలకు డబ్బులిచ్చి పండుగలను ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని తల్లికి మొక్కుకున్నామని, రాష్ట్రం పచ్చగా ఉండాలని, రైతు బాగుండాలని అమ్మను వేడుకున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.