
3732 వార్తలు
బహుముఖ పోరాటాలతోనే కులరహిత సమాజం :కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబునవతెలంగాణ-ఖమ్మంకుల వ్యవస్థ నిర్మూలన జరగకపోతే మానవ సమానత్వం సాధ్యం కాదని, సమానత్వం లేకుండా సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు తెలిపారు. మతాలు, పాలకులు మారినా దేశంలో కులవ్యవస్థ మాత్రం మారలేదన్నారు. ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ”కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల” ముగింపు కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. […] The post కుల వ్యవస్థ నిర్మూలన లేకుండా సమానత్వం అసాధ్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-గండిపేట్‌హైదరాబాద్ గౌలిదొడ్డి గురుకులం బాలికలు టెన్త్‌లో రాష్ట్రస్థాయిలో ఫలితాలు సాధించారని జిల్లా డీసీఓ కల్పన తెలిపారు. బుధవారం ఆమె పది ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గౌలిదొడ్డి బాలికల సీఓఈలో 76 మంది పరీక్షకు హాజరుగా 76 మంది పాస్ అయినట్టు తెలిపారు. రాష్ట్రస్థాయిలో అత్యధికంగా కె.స్వేచ్చదాస్ 584, కె.తులసి 583 మార్కులను సాధించినట్టు తెలిపారు. మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ క్రమశిక్షణతో కూడిన బోధన ఇవ్వడంతో రాష్ట్రస్థాయిలో గౌలిదొడ్డి […] The post గౌలిదొడ్డి గురుకులంలోరాష్ట్ర స్థాయి ఫలితాలుజిల్లా డీసీఓ కల్పన appeared first on Navatelangana.
వ్యవసాయానికి తీవ్ర నష్టం :రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌మిగులు ఉత్పత్తి అమ్ముకోవడానికే యుద్ధాలు : వ్యకాస రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఏ.మధుసూదన్ రెడ్డి నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి”విదేశీ వాణిజ్య ఒప్పందాలు ప్రజల సమక్షంలో చేసుకోవాలని దొడ్డిదారిన ఒప్పందాలు చేసుకుని ప్రకటించడం సరికాదు.. ఈ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది.. ఇరాన్‌పై యుద్ధం వల్ల అమెరికాకు ఒరిగిందేం లేదు.. అమెరికాలో ఆర్థిక సంక్షేమం ఏర్పడింది” అని తెలంగాణ […] The post దొడ్డిదారి వాణిజ్య ఒప్పందాలొద్దు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అనుమతి లేని లే ఔట్లను (ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద) రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, చార్జీల్లో 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. మే01 వ తేదీ నుంచి 31 జూలై వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ బుధవారం జీఓ ఎంఎస్ నెం.131 జారీచేశారు. గతంలో సుమారు 6లక్షలకుపైగా దరఖాస్తుదారులు ఫీజు చెల్లించినా 2లక్షల మందికి మాత్రమే ప్రొసిడింగ్స్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26.15లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు రాగా, 6.04లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 20.11లక్షల దరఖాస్తులకు సంబంధించి ఫీజు చెల్లించాలని అధికారులు లేఖలు పంపించారు. ఇప్పటి వరకు 6.26 లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. వీటిలో సుమారు 2లక్షల మందికి అధికారులు ప్రొసిడింగ్స్ జారీచేశారు. లే ఔట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)కు ఆశించిన స్థాయిలో స్పందలేదు. కానీ, భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వాటి ద్వారా ప్రభుత్వం రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని అ
అదే బాటలో రేవంత్‌రెడ్డి సర్కార్ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డినవతెలంగాణ- మిర్యాలగూడటౌన్‌కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిస్సిగ్గుగా అమలు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తుంగలో తొక్కి నాలుగు […] The post కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు appeared first on Navatelangana.
98.99శాతం ఉత్తీర్ణత,రెండో స్థానంలో బీసీ గురుకులాలు204 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణతఅత్యధికంగా 588 మార్కులుసాధించిన నితీషా, శ్రీనిధి587 మార్కులు సాధించినసాయిమనోజ్ రెడ్డి, లాస్య580 కన్నా ఎక్కువ మార్కులుసాధించిన 60 మంది570కి పైగా మార్కులు సాధించిన364 మంది విద్యార్థులు3598 మంది విద్యార్థులకు90 శాతానికి పైగా మార్కులు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి విజయఢంకా మోగించారు. అత్యధిక మార్కులు 588 ఇద్దరు […] The post పదో తరగతి ఫలితాల్లోబీసీ గురుకుల విద్యార్థుల విజయదుందుభి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని, పంట కొనుగోళ్లలోనూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేసేదొకటి, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని హరీశ్‌రావు విమర్శించారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సిఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని హరీశ్‌రావు ఈ లేఖలో ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500ల బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే
భారీ గాలులకు మామిడికాయలు నేలమట్టంవర్షానికి తడిసి ముద్దయిన మొక్కజొన్న, ధాన్యంనవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధిఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలు అకాల వర్షానికి నేలపాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులకు మామిడికాయలు నేలమట్టమైతే.. గంటపాటు కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మక్క నీటిపాలయింది. మార్కెట్లో దారి వెంట ఉంచిన మక్కలు గుగ్గిళ్లుగా మారాయి. పొద్దంతా వర్షం వచ్చే సూచనలేమీ లేకపోవడంతో రైతులు మొక్కలను కుప్పలుగా పోయలేదు. కానీ, రాత్రి ఒక్కసారిగా భారీ […] The post మక్కలు, మామిడి వర్షార్పణం appeared first on Navatelangana.
అంతర్జాతీయ సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ ప్రారంభోత్సవంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్య మయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా, స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్‌మ్యాప్‌ను […] The post పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములవ్వండి appeared first on Navatelangana.
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3,103 కోట్ల నికర లాభాలు సాధించింది. చెన్నరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంక్ గతేడాది ఇదే సమయంలో రూ. 2,956 కోట్లుగా నమోదయ్యింది. గడిచిన క్యూ4లో రిటైల్ వ్యాపారం 18.72 శాతం పెరిగి రూ. 1,41, 396 కోట్లకు చేరింది. మొండి బకాయిలు 1.98 శాతానికి తగ్గి ఆస్తుల […] The post ఇండియన్ బ్యాంక్‌కు రూ.3,103 కోట్ల నికర లాభాలు appeared first on Navatelangana.
దేశవ్యాప్తంగా తెలంగాణ రెవెన్యూ జేఏసీ అధ్యయనంబెంగళూరులో రెవెన్యూ క్లబ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంముఖ్యఅతిథిగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేఏఎస్), రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో రెవెన్యూ క్లబ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో […] The post సమర్థ భూపరిపాలనే లక్ష్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ -హైదరాబాద్‌ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఎంటీఆర్ తమ కొత్త మినిట్ ఫ్రెష్ బ్యాటర్ శ్రేణిని విడుదల చేసింది. బుధవారం హైదరాబాద ్‌లో వీటిని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈఓ సునరు బాసిన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా దోసె, రైస్ రవ్వ ఇడ్లీ పిండి ప్యాకెట్లను రూ.60 నుంచి రూ.150 మధ్య వివిధ పరి మాణాల్లో అందుబాటులోకి తెచ్చా మన్నారు. తొలుత వీటిని క్విక్ -కామర్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ల ద్వారా అందుబాటులో […] The post ఎంటీఆర్ ‘మినిట్ ఫ్రెష్’ బ్యాటర్ శ్రేణి విడుదల appeared first on Navatelangana.
జైలుశాఖలో ఉద్యోగం గురుతర బాధ్యత : డీజీపీ శివధర్‌రెడ్డిచంచల్‌గూడ సికాలో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి శిక్షణ ప్రారంభం నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిజైలుశాఖలో ఉద్యోగం అనేది కేవలం ఖైదీలను నాలుగు గోడల మధ్య బంధించడం మాత్రమే కాదని, వారిలో పరివర్తన తీసుకువచ్చి తిరిగి సమాజంలో కలిపే గురుతర బాధ్యత అని తెలంగాణ డీజీపీ బి.శివధర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. చంచల్‌గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో బుధవారం ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల ప్రాథమిక […] The post ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలి appeared first on Navatelangana.
సామాన్యులను ముందుకు నెట్టి కబ్జాదారుల ఆక్రమణలుతాత్కాలిక షెడ్లల్లో ఉన్నవారితో నేరుగా మాట్లాడిన హైడ్రా10 రోజులు గడువిచ్చిన అధికారులుఎఫ్‌టీఎల్ పరిధిని పరిరక్షించేందుకు చర్యలు నవతెలంగాణ-సిటీబ్యూరో‘మీరంతా ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో ఉన్నారు. ఇక్కడ తాత్కాలిక షెడ్డుల్లో ఉంటున్నారు. మిమ్ములను పావులుగా వాడుకుని చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూములను కొట్టేయాలని కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలు, మట్టి పోసి చెరువు స్వరూపాన్ని మార్చేసి బడా నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను […] The post ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రానున్న సందర్భంగా బిజెపి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా విఫలమైనందున ప్రజలు ఆగ్రహంగా ఉన్నందున తమ బహిరంగ సభకు ‘జన ఆగ్రహ సభ’ పేరు పెట్టాలని నిర్ణయించామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై బహిరంగ సభ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జన ఆగ్రహ సభ వాల్ పోస్టర్‌నూ ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ మే 10న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు రానున్న సందర్భంగా నగరంలో దాదాపు రూ. 7,700 కోట్ల నుంచి రూ. 8,000 కోట్ల వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న జన ఆగ్రహ సభలో ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు ఆయన తెలిపారు. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా
– ఎమ్మెల్సీ కోదండరామ్– ఘనంగా జనసమితి ఆవిర్భావ వేడుకలునవతెలంగాణ – ముషీరాబాద్‌తెలంగాణ జనసమితి ఎనిమిదేండ్లుగా జనం పక్షాన నిలబడి నిలదొక్కుకున్నదని, ప్రజా సమస్యలే వేదికగా ఉద్యమిస్తున్నదని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్‌నగర్ గుండు, రాంనగర్ మీసేవ ప్రాంతాల్లో బుధవారం ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని జెండా ఆవిష్కరణలు చేసి ప్రసంగించారు. డబ్బు కేంద్రంగా నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పక్షాన, ప్రజాసమస్యలపై నిత్యం […] The post ప్రజాసమస్యలే వేదికగా టీజేఎస్ appeared first on Navatelangana.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 235 గురుకుల విద్యా సంస్థల నుంచి మొత్తం విద్యార్థులు 16,845 అందులో బాలురు 6,211, బాలికలు 10,634 ఉన్నారు. అందులో 16,693 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 6,127 మంది ఉత్తీర్ణత సాధిస్తే, బాలికలు 10,566 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 99.1 కాగా అందులో బాలుర ఉత్తీర్ణత శాతం 98.65, బాలికల ఉత్తీర్ణత శాతం […] The post పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థుల సత్తా appeared first on Navatelangana.
– తెలంగాణ టెన్త్ ఫలితాల్లో 597/600 సాధించిన నలుగురులో ఒకరు ఈ విద్యాసంస్థ విద్యార్థే– జంటనగరాల్లోనూ టాప్ మార్క్..– రాష్ట్రంలో 530.26 సగటు మార్కులు సాధించిన ఘనత ఈ సంస్థదే..– 84 బ్రాంచీలలో 100పాస్ పర్సంటేజ్– అన్ని సబ్జెక్టుల్లో ‘ఎ’ గ్రేడ్స్ సాధించిన 44,222 మందినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ఎస్‌ఎస్‌సీ-2026 ఫలితాల్లో నారాయణ హవా కొనసాగింది. ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో పైచేయి సాధించారు. స్టేట్‌లోనే టాప్ మార్కులతో నారాయణ విద్యార్థి మేఘాన్స్ శ్రీరామ్ […] The post మరోసారి టాప్‌మార్క్‌తో చరిత్ర సృష్టించిన నారాయణ appeared first on Navatelangana.
వేసవిలో పెరుగుతున్న కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్‌ఫెక్షన్లుడీహైడ్రేషన్‌ను తేలికగా తీసుకుంటే ప్రమాదం : వైద్యుల హెచ్చరికనవతెలంగాణ-సిటీబ్యూరోవేసవికాలం అంటే చాలా మందికి గుర్తొ చ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల మౌనంగా దెబ్బతినే అవయవాల్లో కిడ్నీలు ముందుంటాయని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. ప్రతి ఏడాదీ ఉష్ణో గ్రతలు పెరిగేకొద్దీ కిడ్నీ రాళ్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రంలో మంట, మూత్రం తగ్గిపోవడం, నడుము-పక్క భాగంలో తీవ్రనొప్పి వంటి సమస్యలతో ఆస్పత్రు లకు వచ్చే వారిసంఖ్య గణనీయంగా […] The post ఎండలతో కిడ్నీలకే మొదటి దెబ్బ appeared first on Navatelangana.
– ఇరాన్ అణు కార్యక్రమంపై తెలివిగా వ్యవహరించాలి : ట్రంప్వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి తీవ్రంగా బెదిరించారు. నిలిచిపోయిన అణు కార్యక్రమం చర్చలపై ఇరాన్ త్వరగా తేల్చాలని, తెలివిగా వ్యవహరించాలని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో తుపాకితో ఉన్న ఫొటోను పోస్టు చేశారు. దీంతో ఇది నెట్టింట వైరల్ అయింది. అయితే యుద్ధం ముగిసిన తరువాతే అణు కార్యక్రమంపై చర్చలని ఇరాన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత […] The post ఇక నుంచి మంచోడిగా ఉండను appeared first on Navatelangana.
ఓటింగ్ నుంచి సామాజిక బాధ్యత వరకు అన్నింటా నిరాశ, నిస్పృహలు గ్రామాల్లో వెల్లివిరుస్తున్న రాజకీయ భాగస్వామ్యం, పరస్పర సహకారం తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ కుల సర్వే (సీపెక్) వెల్లడినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఒకే వీధిలో ఉంటారు… ఒకే అపార్ట్‌మెంట్లో పక్కపక్క ప్లాట్లల్లో నివసిస్తుంటారు. కాని ఒకరి పేరు మరొకరికి తెలియదు… ఎదురుపడ్డప్పుడు మొహమాటానికి హలో అని పలకరించు కుంటారు. రాజకీయ చైతన్యం, పౌరస్పందన అంతంత మాత్రమే. హైదారాబాద్‌తో పాటు రాష్ట్రంలోని టూటైర్ నగరాల్లోని పరిస్థితి ఇది. తెలంగాణ […] The post పట్టణాల్లో కొరవడిన రాజకీయ చైతన్యం appeared first on Navatelangana.
కృత్రిమ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద భారీ లైన్లు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిపై సీపీఐ(ఎం) ఆగ్రహం..హెచ్‌పీసీఎల్ రీజనల్ కార్యాలయం ఎదుట ధర్నాకార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌కు వినతి నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టించి, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చమురు కంపెనీలు దోచుకుం టున్నాయని సీపీఐ(ఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండదం డలతోనే ఈ బ్లాక్ మార్కెటింగ్ జరుగు తోందని ఆరోపించింది. కృత్రిమ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ […] The post చమురు కంపెనీల దోపిడీ appeared first on Navatelangana.
ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణతబాలికలు 96.26 శాతం, బాలురు 94.07సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం పాస్5,731 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణతములుగు ఫస్ట్…హైదరాబాద్ లాస్ట్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2.19 శాతం అధిక ఉత్తీర్ణతతో బాలుర కంటే బాలికలుపై చేయి సాధించారు. బాలికలు 96.26 శాతం, బాలురు 94.07 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాలల యాజమాన్యాల వారీగా చూస్తే సాంఘిక సంక్షేమ […] The post పదిలో అమ్మాయిలదే పైచేయి appeared first on Navatelangana.