21395 వార్తలు

ఆర్ఎంపి వైద్యుడు దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లో చోటుచేసుకుంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఆర్ఎంపి డాక్టర్ మల్లయ్య( 57) ప్రథమ చికిత్స కేంద్రంలో ఉండగా గుర్తుతెలియని ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు తమతో తెచ్చుకున్న కారం కంట్లో చల్లి కత్తులతో దాడి చేసి పరారైయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్ఎంపి మల్లయ్యకు స్థానికంగా ఉండే కొంతమందికి కొన్ని సంవత్సరాలుగా భూమి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో కూడా అతనిపై కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతని భార్య మన్నెమ్మ గ్రామంలో కొంతమంది తమ భూమిపై కన్నేసి తన భర్తను హత్య చేయడం జరిగిందని తెలిపింది. జన సమూహంలో హత్యకు పాల్పడడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది


నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా వంటి భారీ చిత్రాల షూటింగ్‌లలో వరుసగా పాల్గొంటోంది. ఈ సినిమాలకు సంబంధించిన కఠినమైన యాక్షన్ సీక్వెన్సులు, విపరీతమైన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లు ఆమె చేస్తోంది. అయితే తాజాగా ‘మైసా’ చిత్రానికి సంబంధించిన ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఆమె తీవ్ర గాయానికి గురైంది. రష్మిక తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు అయిన ఈ గాయం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందట. సాధారణంగా క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి టెండన్ గాయాలు కనిపిస్తాయని, ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి రష్మిక కనీసం 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. రష్మికకు ప్రత్యేక రీహాబిలిటేషన్ చికిత్స కూడా అవసరమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ రణబాలి, మైసా చిత్రాలు చేయడంతో పాటు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆమెకు ఈ తీవ్ర గాయం కావడంతో సినిమాల షూటింగ్‌లు, అడ్వర్టైజ్‌మెంట్ చిత్రీకరణలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక మందన్న త్వరగా కోలుకుని, మ


అకస్మాత్తుగా పెరిగిన గోదావరి వరద ఉధృతి వల్ల ఇసుక ర్యాంప్‌లో పనిచేసే కూలీలు ప్రమాద బారినపడటంతో వారిని రక్షించడానికి మండల అధికార యంత్రాంగం అంతా సంఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షించడానికి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఎగువ ప్రాంతంలోని వరద ఉధృతి పెరగడంతో గోదావరి నది పొంగింది. శుక్రవారం ఉదయం గోదావరి వరద ఉధృతి తీవ్రం కావడంతో మండల పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతం వీరాపురం వద్ద ఇసుక రాంప్‌ల్లో పనిచేసే కూలీలు నది మధ్యలో చిక్కుకొని తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అనుకోని సంఘటనతో గోదావరి నదిలో చిక్కుకున్న కూలీల కుటుంబ సభ్యులు ఒడ్డున చేరి తమ వారిని రక్షించాలంటూ పలువురిని వేడుకొన్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఈదయ్య, సీఐ రాజువర్మ, ఎస్సై ఆర్.నర్సిరెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని గోదావరి నది మధ్యలో చిక్కుకున్న 30 మంది కూలీలు, ఎనిమిది మంది లారీ డ్రైవర్లను రక్షించడానికి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. బాధితులను రక్షించేందుకు చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సై.ఆర్ నర్సిరెడ్డి తెప్


మెట్రోరైలు ప్రయాణీకులకు రోజు వారీ, నెలవారీ పాస్ లను ప్రవేశపెట్టడానికి తగు మార్గాలను అన్వేషించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు అఫ్ డైరెక్టర్ల చైర్మన్ గా సంజయ్ జాజు తొలి సారిగా మెట్రో రైల్ నిర్వహణ, అభివృద్ధిపై శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అన్నిటిలోను ఒకే టికెట్‌పై ప్రయాణించే విధానాన్ని అమలు చేసేలా తగు ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. ఉమ్మడి యాప్‌ని అభివృద్ధి చేసేలా టీజీఎస్‌ఆర్టీసీతో చర్చించాలని సీఎస్ తెలిపారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ అనుమతుల తాజా ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశంలో చర్చించారు. అదనపు బోగీలను వీలైనంత త్వరగా సమీకరించడానికి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బోర్డు అఫ్ డైరెక్టర్లు మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి, రోడ్లు, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీపీ (శాంతి భద్రతలు) మహేష్

రేషన్‌కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ- కేవైసీ పూర్తి చేయడానికి గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఈ -కేవైసీ చేయడానికి శుక్రవారం ఆఖరి రోజు కావడంతో ఆ గడువును ఆగష్టు 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ ప్రకటించింది.ఈ కేవైసీ చేయనప్పటికీ ఆగస్టు 31 వరకు రేషన్ పొందవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31వ తేదీ వరకు వరకు పొడిగించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్‌ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయించిందని, బియ్యం ఉచితంగా, గోధుమలను కిలోకు రూ.7 చొప్పున పంపిణీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాంపల్లిలోని ఏసిబి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మార్చిలో ఛార్జ్‌షీట్ దాఖలైన అనంతరం ఆయన తొలిసారిగా కోర్టు ఎదుట హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు ఆదేశాల మేరకు కెటిఆర్ లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించగా, తదుపరి విచారణ రోజు లక్ష రూపాయల చొప్పున మరో రెండు పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కెటిఆర్‌తో పాటు నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి సైతం కోర్టులో పూచీకత్తు సమర్పించారు. విచారణలో కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌తో పాటు ఇతర పత్రాలను మాత్రమే అందజేయగా, కేసు మెరిట్స్‌పై ఎలాంటి విచారణ జరగలేదు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 25కు వాయిదా వేసింది. కాగా, అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది మార్చిలో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కెటిఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి సహా మరో ఇద్దరి పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. కాగా,

మహారాష్ట్రలోని థానే జిల్లా భివండీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు, ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ భవనాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు గతంలోనే ‘ప్రమాదకరమైనది’గా గుర్తించడం గమనార్హం.పవర్‌లూమ్ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన భివండీలోని బాలాజీ నగర్‌లో ఉన్న కోహినూర్ భవనంలోని ఓ భాగం గురువారం రాత్రి 11.20 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలింది. భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ నాలుగు అంతస్తుల భవనంలో ఒక్కో అంతస్తులో 12 చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి. గురువారం రాత్రి 9 గంటల సమయంలో భవనం నుంచి పెద్దఎత్తున పగుళ్ల శబ్దాలు వినిపించాయని అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు వెంటనే అనేక కుటుంబాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మరికొందరు బయటకు వస్తుండగానే భవనంలోని ‘బి’ వింగ్ కుప్పకూలింది.భివండీ నిజాంపూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌సీఎంసీ) ఈ

హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్సన్నగర్ ప్రాంతంలో ఓ యువకుడిపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో మహ్మద్ ముబీన్ అనే వ్యక్తికి కాలికి గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు నిజాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పనపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని లోబర్చుకుని తనను మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యేపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కంతారావు తనను ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి 2022లో హైదరాబాద్‌కు వచ్చి ఓ మీడియా సంస్థలో ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావును ఇంటర్వూ చేసేందుకు యువతి వెళ్లింది. యువతిది తన జిల్లా అని తెలుసుకున్న రేగా కాంతారావు అప్పుడే మాటలు కలిపి మచ్చిక చేసుకున్నాడు. యువతి వివాహం చేసుకుంటానని చెప్పాడు. భార్య పిల్లలు ఉండగా ఎలా చేసుకుంటావని యువతి ప్రశ్నించగా, తన భార్యతో విభేదాలు ఉన్నాయని, ఆమెకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి నమ్మింది. అంతేకాకుండా యువతికి యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తానని చెప్పాడు, అప్పటి నుంచి ఇద్దరు శారీరకంగా తరచూ కలుసుకునేవారు. అమీర్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న యువతి కాంతారావు హైదరాబా


ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరుతో పాటు ఇతర రిజర్వాయర్లకు త్వరలో నీరు విడుదల చేయబోతున్నామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించుకున్నామని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. గ్రావిటీ ద్వారా వరద నీటి తీసుకుని వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు డిజైన్ చేశాయని ఆయన వివరించారు. కెసిఆర్ మాత్రం రివర్స్ పంపింగ్ పేరిట లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారని, దీని కోసం భారీ విదుత్తు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు వరద జలాలతో నిండిందని, దీనికి కెటిఆర్ ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ రాష్ట్రంలో కరవు ఉండాలని కోరుకుంటున్నదని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ నేతలు దురాలోనతో ఉన్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు తనకు నెల రోజుల సమయం ఇస్తే నీళ్ళు ఎత్తిపోస్తానని పొంకనాలు కొట్టాడని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఎత్తిపోతలు లేకుండానే ఎల్లంపలికి నీళ్ళు వచ్చాయని, దీనికి హరీష్ రావు ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఉత్తర తెలంగాణ రైతులు అత్





హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10 తేదీ వరకూ పొడిగిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

ఎల్‌ఆర్‌ఎస్ గడువు మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, ఛార్జీల్లో 25శాతం రాయితీ గడువును 30 నవంబర్ వరకు పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 1మే నుంచి 31జూలై వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, ఓటర్లకు సంబంధించిన స్పెషల్ ఇన్ టెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. అయితే, గతేడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ 31మార్చి 2026 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మూడు సార్లు గడువు పొడిగించినా ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఎస్‌ఐఆర్ కారణంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడంలో ఆలస్యం కావడంతో మరో నాలుగు నెలలపాటు 1ఆగస్టు నుంచి 30నవంబర్ వరకు గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు దరఖాస్తుదారులు కూడా ఆశించిన స్థాయిలో ఫీజులు చెల్లించకపోవ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీని వీడారు. వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీని వీడినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా లేఖను సమర్పించినట్టు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన చురుకుగా ఉండటమే కాకుండా ప్రధానమంత్రి మోదీకి బలమైన మద్దతుదారుగా పేరుంది. రాజీనామా నేపథ్యంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో బయో వివారాలు మార్చేశారు. ప్రధానికి జీవితాంతం ఫాలోవర్‌గా ఉంటానని అందులో పేర్కొన్నారు. అయితే పూనావాలా ఇన్‌స్టాగ్రామ్ బయోలో మాత్రం బీజేపీ జాతీయ ప్రతినిధిగానే ఆయన పేరు ఉంది.వృత్తి రీత్యా లాయర్, పౌరహక్కుల కార్యకర్త అయిన 38 ఏళ్ల పూనావాలా కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఆయన వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని ఎన్నుకునే ప్రక్రియ ఒక నాటకమని, అది అంతకుముందే ఖరారైందని పూనావాలా ఆరోపించారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, అర్హత ఆధారంగా కాకుండా కుటుంబ నేపథ్యంతోనే పదవులు ఇస్తున్నారని విమర్శించారు. అనంతరం ఆయన బీజేప

2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేరం జరిగిన తీరు అత్యంత క్రూరమైనదని శిక్ష ఖరారు చేస్తూ కోర్టు వ్యాఖ్యానించింది. “హత్యతోనే ఆ క్రూరత్వం ముగిసిపోలేదు. ద్వేషం ఇంకా చల్లారనట్లుగా అంకిత్ శర్మ మృతదేహాన్ని సమీపంలోని మురుగు కాలువలోకి లాక్కెళ్లారు. ఈ నేరం అత్యంత అరుదైన కేసుల కోవకు చేరువగా ఉంది. నేరంలోని అమానవీయత.. శిక్ష తగ్గించేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితుల కంటే తీవ్రంగా ఉంది” అని కోర్టు పేర్కొంది. అయితే దోషులు మారే అవకాశం పూర్తిగా లేదని నిర్ధారించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. నేరంలో దోషుల వ్యక్తిగత పాత్ర స్పష్టంగా లేకపోవడం శిక్ష తగ్గింపునకు పరిగణించాల్సిన ముఖ్యమైన అంశమని పేర్కొంది. వారి విద్యా నేపథ్యం, తప్పుడు సమాచారంతో కూడిన వాతావరణం ప్రభావానికి లోనయ్యే పరిస్థితులు కూడా శిక్ష తగ్గింపునకు అనుకూల అంశాలేనని అభిప్రాయపడింది.ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల అంకిత్