21764 వార్తలు


రాష్ట్రంలో మెగా పోలీసు నియామకాలుపోలీసు, ఎస్‌పిఎఫ్, ఫైర్, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల త్వరలో ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్ వెల్లడించిన పోలీస్ నియామక మండలి బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్), ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్, జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి.వి శ్రీనివాసరావు బుధవారం నాలుగు వేర్వేరు నియామక నోటిఫికేషన్లు విడుదల చేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలోపేతంతో పాటు వివిధ భద్రతా విభాగాల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు చైర్మన్ తెలిపారు. ఈ నియామకాల్లో పోలీసు శాఖకే అత్యధిక పోస్టులు కేటాయించారు. 148 సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్),14 రిజర్వ్ ఎస్‌ఐ (ఏఆర్), 12 రిజర్వ్ ఎస్‌ఐ (టిజిఎస్‌పి), మూడు రిజర్వ్ ఎస్‌ఐ (ఎస్‌ఏఆర్‌సిపిఎల్),27 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పిబి) పో


నవతెలంగాణ-హైదరాబాద్ : ద ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ (ఒడిషా AM/NS KHPC), పూరీ ఎంతో వైభవోపేతమైన వేడుకతో తమ రెండవ వార్షికోత్సవాన్ని సంబరం చేసింది. దీనిలో భాగంగా జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై తమ సామర్థ్యం ప్రదర్శించిన సెంటర్ యొక్క అథ్లెట్స్ కు సత్కారం మరియు ఖో ఖో ఎంపిక ట్రయల్స్ 2026 ద్వారా ఆశాజనక అథ్లెట్స్ యొక్క కొత్త బ్యాచ్ ను చేర్చుకోవడం వంటివి ఉన్నాయి. భారతదేశపు భవిష్య […] The post ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్ స్టోరీ టీవీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన అడుగులను మరింత బలోపేతం చేస్తోంది. ఎలోఎలో గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో తెలుగు కంటెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈరోజు ప్రేక్షకులు మొబైల్‌లోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తమ భాషలో, తమ సంస్కృతికి, […] The post దక్షిణాదిపై స్టోరీ టీవీ భారీ అడుగు appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో తమ రెండవ స్టోర్ ను, దేశవ్యాప్తంగా తమ 19వ స్టోర్‌ను ప్రారంభించినట్లు మిస్సమ్మ ప్రకటించింది. ఈ స్టోర్ ప్రారంభంతో పాటుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సాంప్రదాయ వస్త్రాలను ప్రదర్శించే ప్రత్యేక ఫెస్టివ్ షోకేస్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. భారతదేశంలో పండుగల వస్త్రధారణ ఒకే సాధారణ శైలిని అనుసరించదు. ప్రతి ప్రాంతానికి రంగు, వస్త్రం, నమూనాలు, అంచులు మరియు సందర్భానుసారంగా చీరను ధరించే విధానంలో దాని స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. మిస్సమ్మ యొక్క పండుగ ప్రదర్శన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు సంబంధించిన కలెక్షన్ ల ద్వారా ఈ వైవిధ్యాన్ని […] The post విజయవాడలో నూతన స్టోర్‌ను ప్రారంభించిన మిస్సమ్మ.. appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణను ఆగస్టు 17కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంలో న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా ఈ కేసులోని ముగ్గురు నిందితులు కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం విదితమే. విచారణలో భాగంగా ఛార్జ్జిషీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు, ఎలక్టానిక్ ఆ రాలు, సిసిటివి ఫుటేజీలను తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయస్థానం చార్జిషీట్‌లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, వీడియో ఫుటేజీలు, పత్రాల కాపీలను తదుపరి విచారణ నాటికి నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

– సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల హర్షంనవతెలంగాణ-సత్తుపల్లి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక తీర్పుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మైలురాయి లాంటి ‘సీతమ్మ సాగర్’ బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి, దాదాపు 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా […] The post ‘సీతమ్మసాగర్’ ప్రాజెక్టుకు బిగ్ రిలీఫ్ appeared first on Navatelangana.

ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి...!హైకోర్టులోనూ చుక్కెదురు : నాలుగు వారాలకు వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సహచర మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితు డు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వర కు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, అం తకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్, ప్రాసిక్యూషన్ (పిపి) మధ్య సుదీర్ఘంగా వాదనలు సాగాయి. డిఫెన్స్ అడ్వ కేట్ వాదనలు వినిపిస్తూ పోలీసులు బిఎన్‌ఎస్ సెక్షన్ 35(3) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని, తన క్లయింట్‌కు ఎలాంటి ముందస్తు నోటీ సులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారన్నారు. సరైన ప్రాథమిక విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం చట్ట ప్రకారం చెల్లదని, తగిన ఆధారాలు లేక పోయినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి రిమాండ్‌ను తిరస్క రించి బెయిల్ మంజూరు చేయాల


ఖరగ్‌పూర్: ఐఐటి ఖరగ్‌పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి(36) బుధవారం మధ్యాహ్న సమయంలో క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. సమాచారం అందుకున్న హిజ్లీ ఔట్ పోస్టు పోలీసులు వెంటనే క్యాంపస్‌లోని బిసి రాయ్ అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన గదిని పోలీసులు సీల్ చేసి దర్యాప్తు చేపట్టారు.


మనతెలంగాణ/హైదరాబాద్: హైడ్రాకు అందమైన భాష్యం చెప్పి, తమ ఇష్టాలకు అనుగుణంగా వాడుకుంటూ, పెద్దల భూములను రక్షించుకుంటూ పేదల ఇళ్లు కూలగొడుతూ ఎంతో మందిని రోడ్డున పడేశారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తీసివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం కోసమే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కాపాడినట్లు రంగనాథ్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. దుర్గంచెరువు వద్ద ఉన్న నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజీ లాంటి వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ఆయన మండిపడ్డారు. హిమాయత్ సాగర్, గండిపేట ఎఫ్‌టిఎల్‌లో ఉన్న ఇళ్ల వద్దకు హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. రంగనాథ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. హైడ్రాను బ్లాక్ మెయిలింగ్‌కు సాధనంగా వాడుకోవటం సబబు కాదని, మంత్రులు అబద్ధాలు మాని పరిపాలనపై దృష్టి



మన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థులను ‘ఇడియట్స్‘ అని అవమానించిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థులను అవమానించడం భావ్యం కాదని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులను అవమానించినందుకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘నీట్’ సంస్కరణలపై చర్చను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మందికి పైగా విద్యార్థుల మరణాలకు కారణం కాంగ్రెస్సేనని ఆయన తూర్పారపట్టారు. అప్పడు కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం చేసిన ప్రకటన, యూ-టర్న్‌తో విద్యార్థులు ఆత్మబలిదానాలకు దిగారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తుపాకీ గుళ్లకు బలైన విద్యార్థులపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణకు వచ్చి ’యూత్ డిక్లరేషన్’ పేరిట ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. యువతను మభ్య


పోలీసు చర్యపై రాజ్యసభలోనూ దుమారంవిద్యార్థులపై దాడి చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్నారన్న ఖర్గే పోలీసు చర్య కేవలం సాధారణ శాంతి భద్రతల సమస్యేనన్న జేపీ నడ్డా ఎమర్జెన్సీ కాలాన్ని మరిచిపోయారా అంటూ నిలదీసిన మంత్రి న్యూఢిల్లీ: సీజేపీ, విదార్థులు జూలై 20న జరిపిన ఛలో పార్లమెంటు మార్చ్‌పై పోలీసుల లాఠీచార్జి వివాదం రాజ్యసభలోనూ బుధవారం తీవ్ర దుమారం రేపింది. పోలీసుల దౌర్జనాన్ని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఖండించగా, పోలీసుల చర్య చట్టబద్ధమేనని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమర్ధించారు. దీంతో ఇటు అధికారపక్ష సభ్యులు, అటు విపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.శాంతియుతంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి, బలప్రయోగం చేశారని, విద్యార్థులపై దాడి చేసిన వారు రోడ్లపై బహిరంగంగా తిరుగుతున్నారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్‌లు ప్రయోగించారంటూ వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై హోం మంత్రి అమిత్‌షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి జరిపి

గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకూ భారత్ 12 పతకాల(2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల బాక్సింగ్ 51 కెజిల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖరారైంది. ఈ బౌట్‌లో ఆరంభం నుంచి సాక్షి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్‌లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది.




టీం ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐసిసి టి-20 ర్యాంకింగ్స్‌లో టాప్-50లోకి అడుగుపెట్టాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ అదరగొట్టాడు. మూడు వన్డేల్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో తాజాగా ప్రకటించిన ఐసిసి టి-20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలను ఎగబాకి 536 రేటింగ్ పాయింట్లతో 48 స్థానానికి చేరుకున్నాడు. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో భారత క్రికెటరే ఉన్నాడు. 910 పాయింట్లతో ఇషాన్ కిషన్ నెం.1గా నిలిచాడు. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఫర్వాలేదు అనిపించిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే సిరీస్‌లో తేలిపోయాడు. దీంతో ఒక స్థానం కోల్పోయి 819 పాయింట్లతో మూడో ర్యాంకుకు పడిపోయాడు. పాకిస్థాన్ ఆటగాడు సహిబ్జాద ఫర్హాన్ (848) రెండో ర్యాంకుకు చేరాడు. తిలక్ వర్మ (750) రెండు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇక టి-20 బౌలింగ్‌లో టాప్-10లో కేవలం ఒక ఆటగాడు మాత్రమే ఉన్నాడు. 663 పాయింట్లతో మూడు స్థానాలు కోల్పోయి వరుణ్ చక్రవర్తి 9వ ర్యాంకులో స్థిరపడ్డాడు. బుమ్రా ఐదు స్థానాలను కోల్పోయి 17వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.