22893 వార్తలు

కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రివర్గం నుంచి బిట్టూ రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ఆమోదించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో విదేశాల్లో ఉన్నారు.2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న బిట్టూ..వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన బిట్టూ 2024లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రాజీనామాతో ఖాళీ అయిన రాజస్థాన్ రాజ్యసభ స్థానంలో మిగిలిన పదవీకాలానికి బిట్టూను నామినేట్ చేశారు.



ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌కు లేదని, పైగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అక్కడికి వెళ్ళడం విడ్డూరంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పేరుతో బిఆర్‌ఎస్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే ’ధర్నా చౌక్’నే ఎత్తివేసిన దౌర్భాగ్యపు చరిత్ర బిఆర్‌ఎస్‌దని ఆయన తూర్పారపట్టారు. అలాంటి పార్టీకి ఈరోజు ధర్నా చౌక్ వద్ద మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన విమర్శించారు. పేపర్ లీకేజీలపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 పరీక్షల లీకేజీలతో పాటు నియామకాలే జరగని పరిస్థితి నెలకొందన్నారు. గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంలో పడి 27 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం ఏమిటని

న్యాయస్థానాల్లో విచారణలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడిముబ్బడిగా షేర్ చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ అనుమతులు, లేదా సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ అనుమతి తీసుకున్నాకే వీటిని డిజిటల్ వేదికల్లో షేర్ చేయడం, మానిటైజేషన్‌కు పెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యూస్ రిపోర్టింగ్‌కు మాత్రం ఈ నిబంధన వర్తించదని వివరణ ఇచ్చింది. కోర్టు కార్యకలాపాల వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్నారంటూ ఓ జర్నలిస్టు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారంనాడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ మోహనన్‌ల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్న కోర్టు వీడియోల కారణంగా న్యాయస్థానాల గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం న్యాయస్థానంలో ఒక న్యాయవాది తన చేతిలోని కాగితాలను గాల్లోకి విసరిన వీడియోలు వైరల్‌గా మారాయని పిటిషనర్ కోర్

మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్‌లో ’సామజవరగమన’ ఫేమ్ హాసిత్ గోలి ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో రాబోతున్న ఈ పక్కా మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రవితేజకు జోడీగా పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక రవితేజతో పూజా నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. టాలీవుడ్‌లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పూజా హెగ్డేకు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఒక వైపు కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, మరోవైపు హాసిత్ గోలి మార్క్ కామెడీ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక శ్రీ విష్ణు సరసన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో సూసైడ్ నోట్ రాసి దంపతులు మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటి కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దంపతులు వడియాల శ్రీనివాస్ (59) భార్య వడియాల జ్యోతి (52) మున్సిపాలిటీ కేంద్రంలో కిరాణా షాపు నడిపిస్తూ జీవనం పొందుతున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, అప్పుల భాధతో మనస్థాపం చెంది తన సొంత ఇంట్లో రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఒకేసారి దంపతులు మృతి చెందారు. ఈ విషయం శుక్రవారం ఉదయం ఆరు గంటలకు తన కుమారుడు వడియాల శ్రావన్ ఇంటికి వెళ్లి చూడగా రెండు ఫ్యాన్లకు తల్లిదండ్రులు చనిపోయి వేలాడుతూ కనిపించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఇంట్లో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది చేరుకొని వివరాలు సేకరించగా సూసైడ్ నోట్ బయటపడింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, ఆయనను పదవి నుంచి తప్పించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. శుక్రవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సాగిన మంత్రివర్గం సమావేశంలో ప్రధాన్‌కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాల సమాచారం పేరిట జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ‘రాజీనామా చేయించడం అన్నింటికంటే సులభమైన నిర్ణయం. కానీ ప్రభుత్వం మంత్రికి అండగా ఉంది. ప్రజలు మాకు అధికారం అప్పగించారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నత స్థాయి వ్యక్తి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కీలక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో ఉన్న సమస్యలను గుర్తించి ప్రక్షాళన జరపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడుతున్న అనేక ముఠాల గుట్టు రట్టు చేశామని, మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపాయి.శుక్రవారంనాడు ఈ విషయాలు వెల్లడైన కాసేపటికే కేంద్ర


బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండేళ్లు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగారు. మాజీ ప్రధానమంత్రి, భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు షాబుద్దీన్ సన్నిహితుడు. ‘తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. గుండె, రక్తపోటు, డయాబెటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. ఇటీవలి వైద్య పరీక్షల్లో న్యూరో సమస్యలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా విధుల్లో కొనసాగలేను’ అని స్పీకర్‌కు రాసిన లేఖలో షాబుద్దీన్ పేర్కొన్నారు. హసీనాపై బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత షాబుద్దీన్ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ ఆహ్మద్ కొనసాగనున్నారు.

కొండపై నుంచి భారీ బండరాళ్లు విరిగి, దొర్లుతూ కదులుతున్న వాహనంపై పడటంతో ఆరు నెలల చిన్నారి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో ఉదయ్‌పూర్-పాంగి రహదారిపై శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కులూ నుంచి కిల్లార్‌కు వెళుతున్న ఎస్‌యూవీలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. కాడు నాలా సమీపానికి చేరుకోగానే పక్కనే ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాళ్లు వాహనంపై పడ్డాయి. వాటి ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అనంతరం వాహనం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. జిల్లా కేంద్రం కీలాంగ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, ఆర్మీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో వాహనం దాదాపు పూర్తిగా నలిగిపోయి, మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలను ఘటనాస్థలికి పంపించారు. సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పోలీసులు తెలిప

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి (ఈనెల 25వ తేదీ)ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని అందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఇది రైతుల పండుగ అని అభివర్ణిస్తూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రైతు భరోసాతో రైతు కుటుంబాలన్నీ ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.





రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్- 4, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ నియామక పరీక్షలు రాసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబిసి, అనాథ అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో నిర్వహించే ఈ పరీక్షకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబిసి, అనాథలు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించింది.ఈ కోచింగ్ 125 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపింది. ఆన్‌లైన్‌లో ఈ నెల 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, దరఖాస్తులు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 14 అని పేర్కొంది. కాగా కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 18న వెల్లడించనున్నట్లు పేర్కొంది. అనంతరం ఆగస్టు 20 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి కోచింగ్ ఇస్తారని పేర్కొంది.అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇవీ:

రాష్ట్రంలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పల్లెవాసుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా, సేవలను వారి ముంగిటకే చేర్చాలనే దృఢ సంకల్పంతో వైద్య ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు గాను 1,569 నూతన ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవన నిర్మాణాలను చేపట్టనున్నారు. అంతేకాకుండా, సాధారణ వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రజలు ఇకపై పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉచిత నిర్ధారణ (డయాగ్నస్టిక్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను త్వరగా గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అయ్యే వైద్య ఖర్చుల భారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించనుంది. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగ

అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం పాలయ్యాడు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి(26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణిం చినట్లు వైద్యులు నిర్ధారించారు. అమెరికాలో నిత్యానంద రెడ్డి ఎంఎస్ పూర్తి చేశాడు. మిషిగన్ స్టేట్‌లోని డెట్రాయిట్‌లో ఉంటున్న నిత్యానంద రెడ్డి ఈ నెల 18న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో నిత్యానందరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితు లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. జులై 23న నిత్యా నంద రెడ్డి బర్త్‌డే కావడంతో అతని స్నేహితులు ఆసుపత్రి బెడ్ పైనే యువకుడు పుట్టిన రోజు వేడు కలు నిర్వహిం చారు. పరిస్థితి విష మించడం తో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. పుట్టినరోజు నాడే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీర య్యారు. ఎమ్మెస్ చేసేందుకు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. మృత దేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని

జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, దానిని అవమానించినా నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వామపక్షాలతోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు.దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’కు ఈ బిల్లు ద్వారా సవరణలు చేయనున్నారు. జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జనగణమన’ను అపవిత్రం చేయడం లేదా అగౌరవపరచడం ఈ చట్టం ప్రకారం నేరం. ఇందుకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.తాజా సవరణ ద్వారా జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా కల్పించాలని కేంద్రం ప్రతిపాదించింది.‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో అప్పటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ‘వందేమాతరం’ ప్


