19558 వార్తలు






నవతెలంగాణ – హైదరాబాద్ : యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, అయితే అందులోని 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మంది సురక్షితంగా బయటపడ్డారని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ‘ఎంఎస్‌వి ఫైజే నూరే ఓలియా’ అనే భారత జెండాతో ఉన్న నౌకపై ఆగస్టు 4న ప్రొజెక్టైల్ (క్షిపణి లాంటిది)తో దాడి […] The post ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి.. appeared first on Navatelangana.


మనతెలంగాణ/హైదరాబాద్: పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డిజిపి సివి ఆనంద్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సిఎం అధికారులను ఆదేశించారు. నియమ, నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాపై అప్రమత్తంగా... ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం ఆదేశ


నేటి 5 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లుమనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్) ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నీట్ యుజి -2026 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు బుధవారం(ఆగస్టు 5) ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు tsmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ సూచించింది సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం తెలిపింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అన్

21 ఏళ్లకే చట్టసభలకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించే అవకాశం 17నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు సిఎం విదేశీ పర్యటన పెట్టుబడుల ఆకర్షణే లక్షంగా యూకే, అమెరికా, జర్మనీ, చైనాలో పర్యటనక్రీడలు, శిక్షణా సంస్థల భాగస్వామ్యంపై విదేశీ ప్రతినిధులతోనూ చర్చలు మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 16వ తే దీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. 17వ తేదీ నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తున్నందున అంతకు ముం దు రోజే అసెంబ్లీ నిర్వహించి 21ఏళ్లకే చట్టసభల కు పోటీచేసే అవకాశంపై తీర్మానం చేసే అవకా శం ఉన్నట్టుగా తెలిసింది. కాగా, రాష్ట్రంలో ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను తీసుకురావడం, యువతలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా నాలుగు దేశాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ మొదటివారం వరకు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనున్నట్టుగా తెలిసింది. విదేశీ పర్యటనలో భాగంగా యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాలకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలతో సిఎం సమావేశం కానున్నట్టుగా సమాచారం. సిఎం రేవంత్‌రెడ్డి బృందం ముందుగా యునైటెడ్ కింగ

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం, రాంపూర్ పంప్‌హౌజ్ వద్ద ఎస్పారెస్పీకి కాళేశ్వరం జలాలు ఎదురెక్కతున్న వీడియోను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు భరోసాను ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు అని పేర్కొన్నారు.

నేడు, రేపు విచారణకు రావాలని ఆదేశాలున్యూఢిల్లీ : ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్ల మీద సమన్లు జారీ చేస్తోంది. మెటా గ్లోబల్ ఇండియా బృందానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం మనో సారి నోటీసులు జారీ చేసింది. సంస్థ పబ్లిక్ పాలసీ చీఫ్ జో కాప్లన్‌కు సమన్లు ఇచ్చింది. ఆయనతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణకు రావాలని వారిని ఆదేశించించింది. సిస్టమ్స్ అనుకున్న రీతిలోనే సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మెటాదేనని కేంద్ర ఐటి కార్యదర్శి ఎస్. కృష్ణన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారిక ఖాతా పోస్ట్‌ను ఆటోమేటెడ్ సిస్టమ్స్ డిలీట్ చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా ఇండియా పాలసీ టీమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికాలోని గ్లోబల్ లీడర్‌షిప్‌ను నేరుగా ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, కంటెంట్‌కు అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందని, ఈ నేపథ్యంలో మెటా ఆల్గారిథమ్ ఏ పద్ధతిలో పనిచేస్తోందో తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తునట్లు నోటీసులు పేర్కొన్నారు.

వాషింగ్టన్: ఇరాన్‌తో కొత్తగా ప్రారంభమవుతున్న చర్చలు ఆ దేశానికి చివరి అవకాశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుని, దాడులు మరింత తీవ్రం కాకుండా చూసుకోవాలని సూచించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, వాషింగ్టన్‌టెహ్రాన్ మధ్య జరుగనున్న చర్చలు ప్రధానంగా హార్మూజ్ జలసంధిని మళ్లీ పూర్తిగా తెరవడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాకు ఉన్న ఆందోళనలను పరిష్కరించే దిశగా సాగుతాయని చెప్పారు. చర్చల పురోగతిపై ఈరోజు లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. మొదటి దశ హార్మూజ్ జలసంధిని తెరవడం. రెండో దశ ఇరాన్ అణు నిరాయుధీకరణ. దీనికి కొంత సమయం పడుతుంది అని ట్రంప్ పేర్కొన్నారు.గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా దాడులతో ఇరాన్ సైనిక నాయకత్వం, వైమానిక దళం, నౌకాదళానికి భారీ నష్టం వాటిల్లిందని ట్రంప్ చెప్పారు. అయితే, అమెరికాలో ఆయుధ నిల్వలు తగ్గిపోవడం, నవంబర్ మధ్యంతర ఎన్నికల ముందు యుద్ధంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని ఇరాన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారం ఇరాన్‌పై రెండో ప్రపంచ యు

రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో పెరుగుతున్న నీటిమట్టం ౮౭ జలాశయాల్లో 40.89 శాతం వరకు చేరిన నీటి నిల్వలు ఆల్మట్టి నారాయణ్‌పూర్ ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ పరవళ్లుజూరాల మీదుగా శ్రీశైలానికి భారీగా వరద గోదావరి బేసిన్ జలాశయాల్లో 142 టిఎంసిల చేరిక మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం అడుగంటిన ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళను సంతరించుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 40 శాతాన్ని దాటాయి. 87 జలాశయాల్లో పూర్తి సామర్థ్యమైన 1,059 టిఎంసీలకు గాను ప్రస్తుతం 40.89 శాతం మేర 433.15 టిఎంసీల నీరు నిల్వ ఉంది. ముఖ్యంగా కర్ణాటకలో కురుస్తున్న విస్తారమైన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల పెరగడంతో జూరాల మీదుగా శ్రీశైలానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 62 టిఎంసీల వరద నీరు జలాశయంలోకి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 100 టిఎంసీలకు చేరువైంది. పూర్తి సామర్థ్యం 215.81 టిఎంసీలకు గాను ప్ర

కెసిఆర్ హయాంలో సింగరేణికి రూ.54వేల కోట్ల బకాయిలుఈ మొత్తాన్ని రేవంత్ సర్కార్ నుంచి వసూలు చేస్తాంకేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టీకరణమన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థకు రూ. 54 వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తామని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. తాజాగా సింగరేణికి వరుసగా మూడో కోల్ బ్లాక్ దక్కిందని ఆయన ఉదహరించారు. మణుగూరు పికెఒసి-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషంగా ఉందన్నారు. బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యమా అని సింగరేణి కార్మికులకు సంబంధించిన రూ. 54 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బకాయిలు వెంటనే ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తాను సింగరేణికి అన్యాయం చేశానని కెటిఆర్ మాట్లాడడం వింతగా ఉందన్నారు. సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమా? మీ కుటుంబం పుణ

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సమస్యలను కిందిస్థాయిలోనే పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల వినతిపత్రాలు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి మండల కేంద్రాల్లోనూ నిర్వహించాలని ఆదేశిస్తూ పౌరసంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ప్రజావాణికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, వేగవంతమైన పరిష్కారమే లక్షంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్, ఎంపీఓ, ఎంఏఓ, ఎంఈఓ, పీహెచ్‌సీ వైద్యాధికారి, సీడీపీఓ, సంక్షేమ అధికారులు, విద్యుత్, నీటి పారుదల, ఆర్‌డబ్లూఎస్, రోడ్లు,భవనాలు, అటవీ శాఖలతో పాటు ఇతర అన్ని ముఖ్య శాఖలకు చెందిన దాదాపు 23 రకాల మండల స్థాయి అధికారులందరూ తప్పినసరిగా ప్రజావాణిలో పాల్గొనాలని ఉత్తర్వు స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిల్వలను దారి మళ్లీస్తే కఠిన చర్యలు పెండింగ్ సిఎంఆర్ బకాయిలను మిల్లులవారీగా సమీక్షిస్తాం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు ఆటంకం ఉండదుసమీక్షా సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ నిల్వలను దారి మళ్లీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పెండింగ్ సిఎంఆర్ బకాయిలను మిల్లులవారీగా సమీక్ష చేస్తామని నీటిపారుదల, ఆహార- పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతామని రైతుల ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు ఎలాంటి ఆటం కం ఉండదని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధా న్యం గింజకు లెక్క తేల్చడం, కస్టమ్ మిల్లింగ్ వ్య వస్థలో పూర్తి పార దర్శకతను తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెంది న ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లీంచ డం,

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా తాజా పర్యటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. నేడు సిఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలిసింది. కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, భూపేంద్ర యాదవ్‌తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతో సిఎంతో భేటీ కానున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, రీజనల్ రింగ్‌రోడ్డు భూసేకరణ, మెట్రో రైలు రెండో దశ విస్తరణకు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే నిధులు, అనుమతులపై సంబంధిత కేంద్ర మంత్రులతో సిఎం చర్చించనున్నట్టుగా సమాచారం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఎం రేవంత్‌రెడ్డి కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, ప్యాకేజీలతో పాటు పండిన పంటలకు మద్దతు ధర, ఎరువుల సరఫరా వంటి అం

నెలాఖరులో అదనపు చార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్ నేతల పేర్లు చేర్చాలా? వద్దా? అన్నదానిపై మల్లగుల్లాలుమన తెలంగాణ/సిటీ బ్యూరో: రాష్ట్రంలో సంచల నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలు పు తిరగబోతున్నట్లు తెలిసింది. దర్యాప్తు పూర్తిచేసిన సిట్ అధికారులు త్వరలోనే కోర్టులో అదనపు చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. రా ష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ నా యకులు, ప్రముఖులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసి విచారణ చేయించింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు 600 మందికిపైగా నోటీసులు జారీచేసి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈ నెల చివరలో అదనపు చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అదనపు చార్జిషీట్‌లో రాజకీయ నాయకుల పేర్లు చేర్చాలా, వద్దా? అనే అంశంపై సిట్ అధికారులు తర్జనభర్జ న పడుతున్నట్లు తెలిసింది. అయితే, ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంపై ఇప్పటివరకు సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. టెలిఫోన్ యాక్ట్ జోడించి చార్జిషీట్ వేయనున్నట్లు తెలిసింది. ఈ యాక్ట్‌ను జోడ

ఏఐసీటీఈ అప్పీలుపై హైకోర్టునవతెలంగాణ -హైదరాబాద్‌సుల్తాన్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా జరిగిన అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతులకు సంబంధించిన ప్రధాన రిట్ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారించి పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచించింది. కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్ జడ్జి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని […] The post తుదితీర్పునకు లోబడే ముఫకంజా కాలేజీ అడ్మిషన్లు appeared first on Navatelangana.

ఢిల్లీ నిరసనల్లో పోలీసు చర్యపై రెండు వారాలైనా స్పందించని కేంద్రంపార్లమెంటు సమావేశాలకు డుమ్మాఅమిత్ షా రావాలంటూ ప్రతిపక్షం పట్టు పార్లమెంటు ఉభయసభల్లో వరుస ఆందోళనలువాటిమధ్యే కీలక బిల్లుల ఆమోదం మోడీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. ప్రజాస్వామ్య దేశానికి కీలకమైన పార్లమెంటుతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. ‘హలో ఫ్రెండ్స్’ అంటూ ప్రధాని మోడీ రీల్స్‌లో బిజీగా ఉంటున్నారు. ఇక ఢిల్లీలో గతనెల 20న జరిగిన ‘పార్లమెంట్ […] The post రీల్స్‌లో మోడీ బిజీ.. ముఖం చాటేస్తున్న షా appeared first on Navatelangana.

తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్త్వరలో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకట్ రెడ్డి అధ్యక్షతన అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 2023 జులై 1 నుంచి రావలసిన పీఆర్సీని ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు డీఆర్ లు కూడా […] The post పీఆర్సీ ప్రకటించాలి appeared first on Navatelangana.