22778 వార్తలు


కామన్వెల్త్ గేమ్స్ షురూ గ్లాస్గో: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం లో ఆరంభోత్సవ వేడుకలు కనుల పండవగా జరిగాయి. పోటీలను బ్రిటన్ రాజు కింగ్ చార్లె స్ 111 అధికారికంగా ప్రారంభించారు. గ్లాస్గోలోని ఓవో హైడ్రోలో జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను కట్టి పడేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్‌షో, సాంస్కృతిక, సాహన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒలింపిక్ స్లైక్టిస్ట్ క్రిస్ హోయ్‌తో పాటు డాక్టర్ హూ టార్డిస్ నుంచి రాజు చార్లెస్‌తో పాటు రాణి కామిలా ప్రవేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటి టన్‌స్టాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమెతో పాటు కాల్లమ్ బిటి, నీనా నెస్‌బిట్, నాథన్ ఎవాన్స్, సెయింట్ ఫీనిక్స్ ఆరంభ వేడుకల్లో సందడి చేశారు. ఈ పోటీల్లో భారత్‌తో సహా 74 దేశాలు పోటీ పడుతున్నాయి. దాదాపు 3వేల మంది అథ్లెట్‌లు ఇండోర్ పరేడ్‌లో ఆఫ్ నేషన్స్‌లో పాల్గొన్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్ర మం పూర్తిగా ఓ భవనం లోపల జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆరంభోత్స వేడుకల్లో పాల్గొన్న భారత బృందానికి స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబయి చ






నేడు జింబాబ్వేతో రెండో టి20 హరారే: జింబాబ్వేతో శనివారం జరిగే రెండో టి20 సమరానికి టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. అయితే కిందటి మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలం కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా అభిషేక్ తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో విధ్వంసక హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్దమయ్యాడు. వైభవ్ చెలరేగితే టీమిండియాకు ఎదురే ఉండదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, బిష్ణోయ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు జింబాబ్వేకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్‌లో నిలవాంటే ఈ మ్యా

మన తెలంగాణ/లక్ష్మణచాంద: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్(డబ్లు) గ్రామానికి చెందిన గన్ను విశ్వరూప శ్రీనివాస్ దంపతుల కుమారుడు గన్ను నిత్యానందరెడ్డి (26) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. గత శనివారం ఆమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాలు కాగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోధనలు మిన్నంటాయి. మృతదేహాం స్వగ్రామానికి చేరుకోవడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ జెఇఇ ప్రవేశ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ప్రక్షాళనకు నడుం బిగించింది. అందులోని 47మంది అధికారులను తొలగిస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వారిపై లీ గల్, క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసింది. ప్రక్షాళనలో ఇది తొలి అడుగని, మొత్తం నెల రోజుల్లో ఎన్‌టిఎ ప్రక్షాళన పూర్తవుతుందని విద్యాశాఖ వెల్లడించింది. భవిష్యత్‌లో పేపర్ల లీకులకు అవకాశం లేకుండా ఔట్‌సోర్సింగ్ విధానంలో మార్పులు చే యాలని నిర్ణయించినట్లు తెలిపింది. కాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, ఆయనను పదవి నుంచి తప్పించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సాగిన మంత్రివర్గం సమావేశంలో ప్రధాన్‌కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాల సమాచారం పేరిట జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ‘రాజీనామా చేయించడం అన్నింటికం టే సులభమైన నిర్ణయం. కానీ ప్రభుత్వం మంత్రికి అండగా ఉంది

న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) స్పష్టం చేసింది. ఆయన స్వచ్ఛందంగా పద వి నుంచి తప్పుకోవాలని, లేకపోతే కేంద్ర ప్రభు త్వం ఆయనను తొలగించాలని డిమాండ్ చేసిం ది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు శనివారం మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరినట్లు వెల్లడించింది. అప్పటివరకు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతాయని తెలిపింది.ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు,సీజేపీ నేతల మధ్య రెండో విడత చర్చలు జరిగాయి. కేం ద్రం తరఫున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ న డ్డా, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రంకా హాజరయ్యారు. “ధర్మేంద్ర ప్ర ధాన్ రాజీనామా డిమాండ్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వర కు సమయం కోరింది. ఆయనను త్వరలోనే పద వి నుంచి తొలగిస్తారని ఆశిస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం, విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. నీట్ పేపర్ లీక్, తదనంతర పరిణామాల నేపథ్యంలో మోదీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపరు లీక్‌లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన శుక్రవారంనాడు జరిగిన మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నపత్రాల లీక్‌ల ఘటనలో దోషులకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.10కోట్ల వరకూ జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిం ది. పార్లమెంటులో వచ్చే వారం ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పేపరు లీక్‌లపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ భేటీలో చర్చలు జరిపారు. 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి కీలక సవరణలు చే యాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టం కింద ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగతత కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నారు. వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5 నుంచి 10 ఏళ్ల జైలు

మన తెలంగాణ/హైదరాబాద్: క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ ధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇ ప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లా రు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకొని, వేరేచోట సంబంధిత శాఖలకు స్థలాన్ని కేటాయించాలని సిఎం ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకా శం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. అలా కా కుండా పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా చూడాలన్నారు. దీనివల్ల నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని సిఎం తెలిపారు. ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో క్యూర్ ఏరియాలో పలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయ పార్టీల జెండాలు, ఎజెండాలతో యువత పోరాటాన్ని మలినం చేయవద్దని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హితవు పలికా రు. నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహి స్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర ధాన్ వెంటనే రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసు లు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నా రు. అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేసి తె లంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా విద్యార్థుల ఉద్యమానికి తాము అండగా ఉండాలనుకున్నామని తెలిపారు. ఢిల్లీలో వి ద్యార్థులపై జరిగిన దాష్టికాన్ని అణచివేతను చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందే అని పేర్కొన్నారు. విద్యార్థులు అడిగిన దాంట్లో అన్యాయం ఏమున్నది..? అని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయమని తమ భవిష్యత్తును కాపాడమని విద్యార్థులు అడుగుతున్నారని చెప్పారు. యువతరం ప్రధాని కుర్చీ అడిగారా.. కేంద్రమంత్రి కుర్చీ అడిగారా..? అని నిలదీశారు. నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం(బిఆర్‌ఎస్‌వి) ఆ

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరినా, కోరకపోయినా గ్లోబరీనా సంస్థ అక్రమాల గుట్టు విప్పుతామని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ హెచ్చరించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరినా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యిందని ఆయన శుక్రవారం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. 20కి పైగా విద్యార్థుల ప్రాణాలు పోవడానికి గ్లోబరినా సంస్థ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరినా సంస్థ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. గ్లోబరినా సంస్థ ఇప్పుడు పేరు మా ర్చుకొని విద్యార్థుల జీవితంతో ఆటలు ఆడుతోందని ఆయన విమర్శించారు. గ్లోబరినాలో కెటిఆర్ ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో లీకుల పర్వం సాగిందని ఆయన దుయ్యబట్టారు. పద్నాలుగు వందల కోట్లు బిఆర్‌ఎస్ ఖాతాలో మూలుగుతున్నందున అందులో నుంచి చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా కెటిఆర్‌కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తె

రైల్ నిలయం ముందు టీడబ్ల్యూజేఎఫ్ నిరసనపూర్తి రాయితీతో ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంకు వినతిపత్రంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈసారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దు చేయడంతో పాత్రికేయుల విధులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని తెలియజేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట టీడబ్లూజేఎఫ్ ఆద్వర్యంలో […] The post జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి appeared first on Navatelangana.

కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు,పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బనాయించిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ వద్ద ఆయా […] The post ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే appeared first on Navatelangana.

ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలు, పోరాట సూర్తిని, ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువలను కాపాడేందుకు యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో టీపీఎస్‌కేలో కెప్టెన్ లక్ష్మి సెహగల్ 14వ వర్ధంతి అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగింది. ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ లక్ష్మి సెహగల్ తల్లీతండ్రులిద్దరూ […] The post కెప్టెన్ లక్ష్మి సెహగల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి appeared first on Navatelangana.

ప్రతి ఇంటికీ 5 మొక్కలు ఉచితంహెచ్‌ఎండీఏ పరిధిలోని 44 నర్సరీల ద్వారా సరఫరానగరంలో పచ్చదనం, ప్రజారోగ్యానికి పెద్దపీటత్వరలో తెల్లాపూర్, ఉప్పల్ భగాయత్‌లో ఉచిత ‘మొక్కల మేళా’ఈ ఏడాది 4.5 కోట్ల మొక్కలు నాటడమే టార్గెట్‌నవతెలంగాణ-సిటీబ్యూరోమహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి వ్యాధులకు చెక్ పెడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘వనమహోత్సవం–2026’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, కాలుష్య నియంత్రణతో పాటు నగరవాసులకు రసాయన రహిత పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా […] The post లక్ష కుటుంబాలే లక్ష్యం appeared first on Navatelangana.

చట్టం తీసుకొస్తే సరిపోతుంది కదా?మిగతావెందుకు?హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ సహా అన్ని శాఖల అధికారులు హైడ్రా కమిషనర్ వెంట ఎందుకు వెళ్తున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం తీవ్రంగా ప్రశ్నించింది. రెవెన్యూ చట్టంలోనే ఆక్రమణలను తొలగించే నిబంధనలు ఉన్నప్పుడు ప్రతి అంశంలో హైడ్రాను ఎందుకు రంగంలోకి దింపుతున్నారని నిలదీసింది. ఇలా కొనసాగితే రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక చట్టాలు నిరర్థకంగా మారిపోతాయని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు అన్ని చట్టాలను […] The post హైడ్రా అధికారాలు ఏమిటి? appeared first on Navatelangana.

ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించండి: ఆయిల్‌ఫెడ్ అధికారుల సమావేశంలో మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయిల్ ఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, నర్సరీల నిర్వహణ, మొక్కల లభ్యత, రైతులకు అందుతున్న సేవలు, డ్రిప్ ఇరిగేషన్ అమలు, భవిష్యత్ […] The post ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి appeared first on Navatelangana.

ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్: మహేశ్ కుమార్ గౌడ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌజ్ కు పరిమితమయ్యారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ మూసేసిన ధర్నాచౌక్ లో ధర్నా […] The post విద్యార్థుల కోసం ఖర్గే పోరాటం appeared first on Navatelangana.

జాతీయ సైబర్ భద్రతా ప్రమాణాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలి : వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత ప్రమాణాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని […] The post సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌తోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట appeared first on Navatelangana.