23819 వార్తలు

దేశంలో విద్యావ్యవస్థ అక్రమాలకూ, నీట్ 2026 పేపర్ లీక్‌కూ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధరేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ – ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఇటీవల భారీ ధర్నా చేపట్టింది. దానికి మద్దతు తెలుపుతూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం 17 జులై […] The post వాంగ్ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి! appeared first on Navatelangana.

ప్రధాని మోడీ ఇంటి ముందు నిరసనఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులురాహుల్, ప్రియాంక బలవంతంగా తరలింపున్యూఢిల్లీ: ప్రధాని నివాసం ముందు మూడు గంటలకుపైగా రాహుల్ సాగుతున్న ఆందోళనను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. కాసేపటికి రాహుల్, ప్రియాంక గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, అఖిలేష్ యాదవ్, కర్నాటక, కేరళ ముఖ్యమంత్రులు సహా పలువురు ఎంపిలు, నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు. పోలీసులు తరలిస్తున్న క్రమంగా రాహుల్ తీవ్రంగా ప్రతిఘటించారు. నేలపై పడుకున్న ఆయనను పైకి లేపేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. తోపులాట క్రమంలో రాహుల్ కంటి కింద స్వల్పగాయం కావడంతో పాటు ముక్కు రక్తం బయటికి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన కాళ్లు, చేతులకు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుత పరిస్థితి ఇదీ’ అని రాహుల్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇక ప్రియాంక గాంధీని వాళ్లను తరలించే బస్సు కదులుతుండగానే బలవంతంగా ఎక్కించారు. ఆమె మెట్ల వద్ద వేలాడుతూనే పయనించారు. అనంతరం రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియం స్టేషన్‌కు, ప్రియాంకను మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు, ఎంపిలను క

న్యూఢిల్లీ: నీట్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనను బహిరంగంగా సమర్ధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు చేపట్టిన ధర్నాను విమర్శించింది. బీజేపీ ప్రభుత్వంతో జుగల్ బందీగా దీనిని అభివర్ణించింది. సీజేపీ ఆందోళనను రాహుల్ గాంధీ బలహీనపరుస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, నెలరోజులుగా సీజేపీ, సోనమ్ వాంగ్‌చుక్ నిరసనలు తెలుపుతున్నా మాట్లాడేందుకు నిరాకరించిన ప్రధాని మోదీ రాహుల్‌ను మాత్రం తన నివాసం వద్ద ధర్మాకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇది జరిగిన గంటలోనే మోదీ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడటం తమకు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సీజేపీ నిరసనను బలహీనపరచేందుకే తన ఇంటి ముందు ధర్నాకు రాహుల్‌ను మోదీ అనుమతించారని ఆప్ మరో నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ సైతం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. నీట్ లీక్‌పై జరుగుతున్న ఉద్యమంపై కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని, ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు సీజేప

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడేందుకు ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సొంత పార్టీలో తిరుగుబాటు సృష్టించిన ద్రోహులను మాత్రం మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. బీజేపీకి మద్దతుగా ఉండాలంటే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని, ఎంత మంది వెళ్లిపోయినా తనకు సంతోషమేనని అన్నారు. యువనాయకులతో ఆ స్థానాలను భర్తీ చేసుకుంటామని చెప్పారు. టీఎంసీని బలహీనపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి సువేందు అధికారి దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీలో గత దశాబ్దకాలంగా ఆయన చేసిన పనులను బహిర్గతం చేస్తానని, ఆయన ముసుగు తొలగిస్తానని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ఓటమి చవిచూస్తే బిహార్‌లోనూ పునాదులు కదులుతాయని అన్నారు. టీఎంసీకి తానే వ్యవస్థాపక అధ్యక్షురాలిని అయినందున దానిని చేజిక్కుంచుకోవడం తిరుగుబాటు నేతలకు కుదరదని స్పష

పెళ్ళికి ముందే మరోకరితో ఉన్న ప్రేమ వ్యవహారం నేపధ్యంలో ఒ భార్య కట్టుకున్న భర్త ఆత్మహత్యకు పాల్పడే విధంగా వ్యవహరించి చివరికి ఆ నవవరుడి ప్రాణాలనే తీసింది. వివాహంజరిగిన మూడు నెలలకే భార్య వేధింపులు తాళ లేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రఘునాథపాలెం మండలంలోని రాంక్య తండాలో వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంక్య తండాకు చెందిన సదర్ లాల్ కు ఈ ఏడాది మే నెలలో ఇదే మండలంలోని ఒక యువతితో వివాహమైంది. నూరేళ్ల పంటగా సాగాల్సిన వారి వైవాహిక జీవితంలో పెళ్లయిన మూడో రోజు నుంచే విషాదం అలుముకుంది. నీకు మగతనం లేదు అంటూ భార్య కట్టుకున్న భర్తను తీవ్రంగా అవమానించడం, ప్రారంభించింది.మగ తనం లేదని ప్రతి రోజు నిందిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదర్ లాల్, తనపై వచ్చిన నిందను తుడిచేసుకోవడానికి, తన సమర్థతను నిరూపించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్టులు కూడా చేయించుకున్నాడు. వైద్య పరీక్షల్లో సదర్ లాల్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు స్పష్టం చేసినప్పటికీ, భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కట్టుకున్న భార్య ప్రతి రోజు నిత్యం సెల్ ఫోనో లో ఛాటింగ్ చేయడం,ఫోన్ మాట్లాడటం,విడియో కాల్స్

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తూర్పు అఫ్గానిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. 20 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. మరో 100 మంది జాడ గల్లంతైనట్టు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. నూరిస్థాన్ ప్రావిన్స్‌లోని పరున్ సిటీ, ఇతర ప్రాంతాల్లో వరదల తాకిడికి భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ప్రతినిధి యూసఫ్ హమ్మద్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అఫ్గనిస్థాన్‌లోని 2024లో సంభవించిన భారీ వరదల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది మొదట్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి సుమారు 110 మంది మరణించారు.

దుబాయ్ : ఇరాన్‌అమెరికా మధ్య హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం వరుసగా దాడులు సాగుతున్నాయి. మంగళవారం ఉదయం జలసంధి లోని ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఆ ట్యాంకర్‌ను సిబ్బంది విడిచిపెట్టేలా ఒత్తిడి తెచ్చింది. అయితే జలసంధిపై గట్టి పట్టున్న ఇస్లామిక్ రిపబ్లిక్‌ను టార్గెట్ చేసుకుని అమెరికా పదోసారి దాడులు చేసింది. అయినా జలసంధిపై ఇరాన్ పట్టును సడలించలేకపోయింది. ఇరాన్ మిలిటరీ స్థావరాలపైన, సాగర సామర్థాలపైన, క్షిపణులు, డ్రోన్లు ప్రయోగ క్షేత్రాలపైన, వైమానిక రక్షణ వ్యవస్థలపైన వరుసగా దాడులు చేసినట్టు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ మంగళవారం వెల్లడించింది. దాడులకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేసింది. నావికా సిబ్బందిపై అనవసరంగా దాడులు చేయడాన్ని ఉద్దేశిస్తూ , హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛగా రవాణాజరిగేలా వీలు కల్పించేందుకు ఇరాన్‌ను జవాబుదారీ చేయాలన్నదే తమ లక్షంగా అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.కువాయిట్‌పై మళ్లీ ఇరాన్ దాడులు కువాయిట్ లోని విద్యుత్ ,డిశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ మళ్లీ దాడులు చేసిందని కువాయిట్ మంగళవారం వెల్లడించింది. ఈమేరకు కువాయిట్ ఎలక్ట్రిసిటీ, వాటర్, రెన్యుబల్ ఎనర్జీ మంత్రి

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష, దానికి సంబంధించిన ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం మంగళవారం ప్రకటించింది. అయితే ఈ అంశంపై చర్చను కోరిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అనంతరం తన డిమాండ్లను మార్చారని కేంద్రం ఆరోపించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నా సందర్భంగా, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. అనంతరం జితేంద్ర సింగ్ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.పార్లమెంట్‌లో నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే తాను వెంటనే ధర్నాను విరమిస్తానని రాహుల్ గాంధీ తొలుత చెప్పారని జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వ అత్యున్నత నాయకత్వంతో మాట్లాడిన అనంతరం ఆ డిమాండ్‌ను అంగీకరించి, నీట్ పరీక్షతో పాటు దానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్‌కు తెలియజేశామని చెప్పారు. అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకుని,




రాష్ట్రంలో బుధవారం ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్మిక హక్కులు, సామాజిక భద్రత కోసం పోరాటం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కు దిగుతామని రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల అసోసియేషన్ హెచ్చరించింది. వీరికి మద్దతుగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో కూడా సమ్మె బాట పట్టే అవకాశం ఉందని సమాచారం.

న్యూఢిల్లీ: విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన అత్యాచార వైఖరి, పరీక్షల వ్యవహారంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు విపక్ష ఎంపీలు మంగళవారం కోరారు. సభ ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్.కే. ప్రేమచంద్రన్ తదితరులు స్పీకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి తమ విజ్ఞప్తిని వినిపించారు. అనంతరం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల దాడి, పరీక్షల సంక్షోభంలో ప్రభుత్వ పూర్తి బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్‌లో విసృ్తతంగా చర్చ జరగాలని కోరాం అని తెలిపారు.తమ భవిష్యత్తుకు సంబంధించిన సముచిత ప్రశ్నలు అడిగినందుకే విద్యార్థులపై దాడులు జరిగాయని రాహుల్ ఆరోపించారు. దేశ యువత భవిష్యత్తుపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగకపోతే, ఆ సభ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. విద్యార్థుల గొంతును అణచివేయడానికి ప్రతిపక్షం అవకాశం ఇవ్వదని, వారి సమస్యలు వీధుల్లోనే కాకుండా పార్లమెంట్‌లోనూ మారుమోగేలా చేస్తామని ఆయన స


బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్‌హామ్ క్యాబినెట్‌లో భారత మూలాలున్న ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. బ్రిటిష్ ఇండియన్ కనిష్క నారాయణ్ యూకే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బిహార్‌లో జన్మించిన 36 ఏళ్ల కనిష్క నారాయణ్ 2024 జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వేల్స్ నుంచి ఎంపీగా గెలిచారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో ఆన్‌లైన్ భద్రత, కృత్రిమ మేథ విభాగాన్ని ఆయన పర్యవేక్షించేవారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏఐ మంత్రిగా నియమితులయ్యారు. కాగా, భారత మూలాలున్న లీసా నాండీకి సైతం బర్న్ హామ్ క్యాబినెట్‌లో చోటు దక్కింది. కీర్ స్మార్టర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లీసా నాండీకి మరోసారి ఆ పదవి దక్కింది.


కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో పాటు ఇతర నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య హక్కుపై జరిగిన దాడి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్న యువతకు కాంగ్రెస్ కుటుంబం, దేశం మొత్తం అండగా నిలుసా ్తయన్నారు. ‘మీరు మమ్మ ల్ని జైలులో పెట్టవచ్చు, మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించవచ్చు; కానీ న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న లక్షలాది మంది భారతీయ యువత ఆగ్రహాన్ని మాత్రం మీరు అణచివేయలేర’ని అన్నారు.


న్యూఢిల్లీ : కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే రానున్న ఎన్నికల్లో భీమ్ ఆర్మీ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే జోస్యం చెప్పారు. ప్రతి ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను తయారు చేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా ప్రధాని నరేంద్రమోడీయే తమ నాయకుడుగా భావిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం మోడీ వైపు చూస్తోందని పేర్కొన్నారు. “ప్రతి ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను తయారు చేస్తుంది. జెపీ ఉద్యమం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులను తయారు చేసింది. అన్నా హజారే ఉద్యమం నుంచి కేజ్రీవాల్ నాయకుడయ్యారు” అని ఆయన ఉదహరించారు. నేపాల్‌లో కూడా ఎవరైతే జెన్ జెడ్ ఉద్యమంతో పాలుపంచుకున్నారో వారు రాజకీయ పార్టీలో చేరడం తప్పనిసరి అయ్యిందన్నారు. ఎన్‌డిఎ పార్లమెంటరీ సమావేశంలో మంగళవారం ప్రధాని మోడీ యువతకు సంబంధించిన సమస్యలపై మాట్లాడారని ప్రస్తావించారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల పాశవిక చర్యలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడాన్ని అడగ్గా , దానికి బదులు కాంగ్రెస్ 1975లో ఎమర్జెన్సీ విధించినందుకు ప్రజలకు క

న్యూఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాధార సూచికలు (వైటల్ పారామీటర్లు) స్థిరంగా ఉన్నాయని, అయితే ఇంట్రావీనస్ ద్రవాలు, గ్లూకోజ్ తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వర్గాలు మంగళవారంనాడు తెలిపాయి. ఈ మేరకు ఒక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన రక్తంలో చక్కెర స్థాయి ఇంకా తక్కువగానే ఉందని, సీరమ్ పొటాషియం స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువగా 3.2 ఎంఈక్యూ/ఎల్‌గా నమోదైందని తెలిపింది. నోటి ద్వారా పొటాషియం మందులు ఇస్తున్నామని తెలిపింది. అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించింది. అయితే దీర్ఘకాల ఉపవాసం, డీహైడ్రేషన్, రక్త పరీక్షల్లో కనిపిస్తున్న ఫలితాల కారణంగా ఆయనను నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచి వరుస పరీక్షలు నిర్వహించడం అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

ఇన్-సర్వీస్ టీచర్స్- కోసం టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గురుకులాలు, సంక్షేమ శాఖ విద్యాసంస్థలు, మోడల్ స్కూళ్లు, తదితర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. టీచర్ల అర్హతలను నిర్ధారించడం, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అర్హులైన ఉపాధ్యాయులు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచిన నిబంధనలు, షెడ్యూల్‌ను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బుధవారం నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రెండు పేపర్లుగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం..ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సర్వీసులో కొనసాగడానికి, తదుపరి పదోన్నతులు పొందడానికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. సాధారణంగా ఏడాదికి నిర్వహించే రెండు టెట్‌లతో పాటు ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్‌లు నిర్వహించే


గ్యాంగ్‌టక్: సిక్కిం నామ్చి జిల్లా లోని జోలుంగే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గంలో కొండచరియలు విరిగి పడడంతో ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఈ సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. అక్కడ శిథిలాల తొలగింపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు వెల్లడించారు. ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ సొరంగంలో కొండచరియలు విరిగి పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రాజెక్టు అధికారులు, కార్మికులతోపాటు మొత్తం 25 మంది సొరంగంలో చిక్కుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అకస్మాత్తుగ సోమవారం కొండచరియలు విరిగి పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 కి పది మృతదేహాలను వెలికి తీసినట్టు , వీరిలో ఏడుగురిని గుర్తించినట్టు ఇంకా గుర్తింపు కాని మూడు మృతదేహాలను జిల్లా ఆస్పత్రి సింగ్టమ్, ఎస్‌టిఎన్‌ఎం ఆస్పత్రికి పంపినట్టు జిల్లా అధికారులు వివరించారు. గుర్తించిన ఏడు మృతదేహాల్లో న