19649 వార్తలు

ఆధారాలు లేవన్న ఢిల్లీ కోర్టు హైకోర్టును ఆశ్రయిస్తాం: మహిళా రెజ్లర్లు న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన కేసులో మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది. కేసులో తగిన ఆధారాలు లేవని, సాక్షుల వాంగ్మూలాల్లో పరస్పర విరుద్ధతలు ఉన్నాయని పేర్కొంటూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా అదనపు ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ నిర్దోషిగా విడుదల చేశారు. ఈ కేసు 2023లో ఆరుగురు మహిళా రెజ్లర్లు, వారిలో ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత వినేశ్ ఫొగాట్ కూడా ఉండగా, చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్‌లో తీర్పు వెలువరించిన న్యాయస్థానం, కేసులో సమర్పించిన ఆధారాలు సరిపోవని, సాక్షుల వాంగ్మూలాల్లో స్థిరత్వం లేదని పేర్కొంది. నిందితుల తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ మాట్లాడుతూ, సాక్ష్యాల్లోని వైరుధ్యాలు, సంఘటనల సాధ్యాసాధ్యాలు, నిందితులు సంఘటన జరిగిన సమయంలో అక్కడ

కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ పాగాబంకీపూర్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిపై ఘన విజయంఎన్నికల రాజకీయాల్లో బోణీ కొట్టిన జన్ సురాజ్ అధినేత బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అడ్డాలో 30 ఏళ్ల తర్వాత కమలం పార్టీకి ఓటమి 19,324 ఓట్ల ఆధిక్యంతో పికె గెలుపు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇది సంకేతం విజయం తర్వాత ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్య గుజరాత్, మధ్యప్రదేశ్‌లో బిజెపి, కాంగ్రెస్ చెరో స్థానంలో గెలుపున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠతో రేపిన బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదైంది. బంకీపూర్ నుంచి పోటీ చేసిన జన్‌సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థిని ఓడించి విజయకేతనం ఎగురవేశారు. దీంతో బీజేపీ కంచుకోటలో ఆయన పాగా వేసినట్టయింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పీకే పాల్గొని గెలవడం, పార్టీకి సైతం ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల ఆధిక్యంతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. సిన్హాకు 44,827 ఓట్లు రాగా, ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ అభ్య

లేబర్ కోడ్‌ల పేరుతో కార్పొరేట్లకు ఊడిగంఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వీబీగ్రామ్ జీ చట్టం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్యనవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక […] The post 10న జైల్‌భరోను జయప్రదం చేయండి appeared first on Navatelangana.

ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహయాదాద్రిలో గాయని జానకి,నాగన్నల సంస్మరణ సభనవతెలంగాణ-భువనగిరిప్రజా కళల్ని ప్రోత్సహించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ప్రముఖ గాయని జానకి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ట నరసింహ మాట్లాడుతూ.. గాయని జానకి వేలాది పాటలు పాడి గొప్ప గాయనిగా గుర్తింపు పొందారని చెప్పారు. అభ్యుదయ ఆలోచనలతో ఉన్న జానకికి అనేక అవార్డులు […] The post ప్రజాకళల్ని ప్రోత్సహించాలి appeared first on Navatelangana.

వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘటనమెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునవతెలంగాణ-రాయపర్తివరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 25మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే వారిని ఆశ్రమ పాఠశాల సిబ్బంది వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని […] The post ఆహారం వికటించి 25 మంది విద్యార్థులకు అస్వస్థత appeared first on Navatelangana.

చివరివారంలో పరిశ్రమకు చేరుతున్న వైనంనూనె దిగుబడిపై ప్రభావం ధరల విధానమే కారణమా..? నవతెలంగాణ-అశ్వారావుపేటఆయిల్ ఫెడ్ పరిశ్రమకు నెల చివరివారంలో పామాయిల్ గెలలు అధికంగా వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ధరల విధానమే కారణమని తెలుస్తోంది. జూన్, జులై రెండు నెలల్లోనూ చివరి వారంలోనే రైతులు అత్యధిక గెలలు పరిశ్రమకు తరలించారు. జూన్‌లో మొత్తం 11,224.165 టన్నుల గెలలు సేకరణ జరగగా, అందులో ఒక్క చివరి వారంలోనే 5,119.525 టన్నులు (45.61 శాతం) వచ్చాయి. జులైలో మొత్తం 14,471.980 […] The post అధికంగా పామాయిల్ గెలల సేకరణ appeared first on Navatelangana.

ఆదివాసుల భారీ ర్యాలీ, ధర్నా1/70 పీసా చట్టాల పటిష్ట అమలుకు డిమాండ్‌నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్ఆదిలాబాద్ జిల్లా సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఏజీఎస్(తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం), రాయిసెంటర్ సార్మేడీలు, పటేల్స్, సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం అధికారికి వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించి 5వ షెడ్యూల్‌లో భాగంగా అన్ని […] The post సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి appeared first on Navatelangana.

గీతన్నల చైతన్యయాత్రలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లునవతెలంగాణ-మరిపెడగీత కార్మిక సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్ల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘గీత వృత్తిలో అమరుల యాది’ చైతన్యయాత్ర సోమవారం రెండవరోజుకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నెల్లికుదురు, తొర్రూరు, కేసముద్రం మండలాల్లో […] The post గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌ను విడుదల చేయాలి appeared first on Navatelangana.

శనివారం అర్ధరాత్రి పరారైన విద్యార్థులునవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి పారిపోయిన ఇద్దరు విద్యార్థులు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో గోడ దూకి మరో ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు పరారయ్యారు. తిరుపతి చూసేందుకు వెళ్లామంటూ విద్యార్థులు చెప్పడం గమనార్హం.సంస్థాన్‌నారాయణపురం మండలం కొతులాపురం గ్రామానికి చెందిన ఇరుగంటి నవదీప్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుగ్యాల గ్రామానికి చెందిన […] The post తిరుపతిలో సర్వేల్ గురుకుల విద్యార్థులు ప్రత్యక్షం appeared first on Navatelangana.

తద్వారా అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలిటి-ఫైబర్ పనులను గడువులోగా పూర్తి చేయాలి : అధికారులకు సీఎస్ సంజయ్‌జాజు ఆదేశంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ […] The post మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలి appeared first on Navatelangana.

తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ పిలుపునవతెలంగాణ – బంజారాహిల్స్ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) స్కాలర్ల సమస్యల పరిష్కారం, స్టైఫండ్ పెంపు కోసం మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ బి. రాజేష్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి. శ్రవణ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. […] The post నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె appeared first on Navatelangana.

గోదావరి వరదలపై తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డను కూల్చి గోదావరిపై రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి వరదలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ప్రచారం […] The post మేడిగడ్డను కూల్చి… ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా? appeared first on Navatelangana.

మేషంఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మాతృ వర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. వృషభం ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. మిధునం మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక,సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.


మన తెలంగాణ/హైదరాబాద్‌ః బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఘోర పరాజయంతో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని తేలిపోయిందని, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా ఇంటి దారి పట్టాల్సిందేనని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బంకిపూర్ ఉప ఎన్నిక తీర్పు బిజెపి అహంకారానికి గట్టి దెబ్బ అని ఆయన సోమవారం ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని దతియ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామిక విజయం అన్నారు. బీహార్‌లోని బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, ఇది దేశ రాజకీయాల్లో ఒక కీలక మార్పుకు తెర లేపిందని ఆయన తెలిపారు.కేంద్రంలోనూ, బీహార్‌లోనూ అధికారంలో ఉన్న బిజెపి నియంతృత్వ విధానాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ లోగడ ప్రాతినిథ్యం వహించారని, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లడంతో రాజీనామా చేశారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బిజెపికి కంచుకోటగా ఉన్న ఈ స్థానం ప్రజల తీర్పుతో చేజారడం అధికార అహంకారానికి ఎదురుదెబ్బ అన్నారు


మనతెలంగాణ / సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 15మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కమిషనర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లో పనిచేస్తున్న బలరాం నుంచి ఉమెన్ అండ్ సిఎస్‌డబ్లూకు, గిరీష్ కుమార్ కూకట్‌పల్లి నుంచి మాదాపూర్ పిఎస్‌కు, శ్వేతను మాదాపూర్ నుంచి బాలానగర్‌కు, ఈఓడబ్లూలో పనిచేస్తున్న కృష్ణను మేడ్చల్ పిఎస్‌కు, వినోద్‌కుమార్‌ను ఈఓడబ్లూకు, రాయదుర్గంలో పనిచేస్తున్న ప్రణయ్‌తేజ్ రెడ్డిని కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.

మన తెలంగాణ/వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహంలో ఆదివారం రాత్రి నుంచి వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సోమవారం ఉదయాన్నే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విద్యార్థినిలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరన్ తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ జడ్పీసీఈవో రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి, వర్ధన్నపేట తహశీల్దార్ విజయసాగర్ సందర్శించి బాలికల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వైద్యసేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన వసతిగృహాన్ని సందర్శించి వంటగదిని, డైనింగ్ హాల్‌ను, కూరగాయలను పరిశీలించి తగు సూచనలు చేశారు. బాలికల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


నీట మునిగిన సంగమేశ్వర ఆలయం మరో ఎనిమిది నెలల తర్వాత పునర్దర్శనం సోమశిలకు పోటెత్తిన పర్యాటకులు మన తెలంగాణ/ కొల్లాపూర్: శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ఉన్న చారిత్రక సోమశిల సంగమేశ్వరం దేవాలయం జలాధివాసానికి చేరువవుతోంది. సప్త నది సంగమమైన సంగమేశ్వర ఆలయం కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో నీట మునిగిపోనున్నది. సోమశిల వద్ద కృష్ణానదీ జలాలు పెరుగుతుండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున సోమశిలకు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. నదీ ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే నదిలో నీటిమట్టం పెరిగి సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఒకవేళ మునిగితే ఎనిమిది నెలల తర్వాతే భక్తులకు దర్శనం కానుంది. ప్రాజెక్టులో నీటిమట్టం 867 అడుగులకు చేరితే సంగమేశ్వరాలయం పూర్తిగా జలమయం కానున్నది.

మన తెలంగాణ/ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న దశ భవిష్యవాణి ఘట్టం సోమవారం ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఆలయ ప్రాంగణంలో పచ్చి మట్టి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు. అయితే, ఈసారి అధికారుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన మాట తప్పారని, ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. ఏటా చెప్పే మాటలను పట్టించుకోనప్పుడు తనను ప్రశ్నలడగడంలో అర్థం లేదని మండిపడ్డారు. రాబోయే కాల పరిస్థితుల గురించి చెప్తూ, ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవర్షాలు కురిసే అవకాశం ఉందని భవిష్యవాణి హెచ్చరించింది. ఊహించని వరదల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున పాలకులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ధర్మమార్గంలో నడుచుకునేవారిని అమ్మవారు

