54 వార్తలు


మేరీల్యాండ్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న ఆటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల, కన్వీనర్ శ్రీధర్ బానాల తదితర ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.

SAT కోచింగ్ రంగంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ప్రొఫెషనల్ ట్యూటర్లు ఈ శిక్షణను అందించనున్నారు. విద్యార్థుల నైపుణ్య స్థాయిని బట్టి బిగినర్, అడ్వాన్స్డ్ విభాగాలుగా తరగతులు నిర్వహించబడతాయి. ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం 2026 జూన్ 6 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతి వారాంతంలో (శని, ఆదివారాలు) కొనసాగుతుంది.



అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, 2026న అమెరికాలోని జార్జియా రాష్ట్రం మిల్టన్ నగరంలోని ఫౌలర్ పార్క్ / కాలే క్రీక్ పార్క్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి యోగా సెషన్లు, సంబరాలు, కమ్యూనిటీ కార్యక్రమాలు జరగనున్నాయి.


గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం. 2026 జూన్ 13న ఫ్రిస్కో నగరంలోని ఇండిపెండెన్స్ పార్క్‌వే వేదికగా ఈ మహోత్సవం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది.














