24868 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. The post తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు..ఎల్లో అలర్ట్ appeared first on Navatelangana.

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలుఐదు కీలక బిల్లులతో వస్తున్న ప్రభుత్వం అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం వాంగ్‌చుక్, అయోధ్య విరాళాల అవకతవకలపై నిలదీసేందుకు విపక్షం రెడీ నేడు అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడీవేడిగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సోమవారంనాటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాల కోసం అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త బిల్లులతో సిద్ధమవుతూనే అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లులను ప్రవేశపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. మరోవైపు డీలిమిటేషన్, మహిళా బిల్లులతో ప్రభుత్వం మళ్లీ సభ ముందుకు వస్తే ఎలాగైనా ఎండగట్టాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు గట్టిపట్టుదలతో ఉన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను బలవంతంగా భగ్నం చేయడం, అయోధ్యలోని రామమందిరం విరాళాల్లో అవకతవకల అంశం ఈ సారి పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకోవాలని విపక్షం భావిస్తోంది. అదే సమయంలో విపక్షాన్ని సమర్థంగా ఎదుర్కొనే తాము ఆశించిన బిల్లులను ఆమోదింపజేసుకోవా

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘విక్రమ్-1’ ఆర్బిటాల్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారంనాడు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి మ ధ్యాహ్నం 12:05 గంటలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. తొలుత ఉదయం 11.30గంటలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగం సాంకేతికలోపం కారణంగా 35నిమిషాలపాటు ఆలస్యమైంది. శాస్త్రవేత్తలు ఇంధన వ్యవస్థలో లోపాన్ని గుర్తించి సరిచేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత రాకెట్ నిర్దిష్ట కక్షలోకి చేరింది. అనంతరం ‘హల్ స్పేస్.. విక్రమ్1 వచ్చేసింది’ అని స్కైరూట్ ఎక్స్‌లో పోస్టు చేసిన ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది. మిషన్ ఆగమన్ పేరిట స్కైరూట్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్‌కు ఆ పేరు పెట్టింది. అంతరిక్షంలోకి ఏమేం మోసుకెళ్లింది.. విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్‌డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమానిస్ట్రేషన్

ఈ నెల 21నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఈసారి ఇదివరకటి రాజకీయ స్థితి కన్నా బలమైన రాజకీయ స్థాయితో ఈ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పునర్నిర్మాణం జరిగి లోక్‌సభలో పొత్తుల బలం పెరిగింది. దీంతో పార్లమెంట్‌లో తమ కార్యకలాపాలకు అంతగా ప్రతిఘటన ఉండకపోవచ్చన్న ధీమా ఎన్‌డిఎలో కనిపిస్తోంది. కానీ సభ్యుల సంఖ్య ఒక్కటే పాలనా సామర్ధానికి గ్యారంటీ ఇవ్వదు. అధికార పార్టీకి ఎంతబలం ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై సజావుగా చర్చలు జరిగి, ప్రయోజనకరంగా చట్టాలను రూపొందించేలా పార్లమెంట్‌ను నిర్వహించినప్పుడే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఎప్పటిలాగే రానున్న సమావేశాలు కూడా నినాదాల హోరుతో, అంతరాయాలతో, రాజకీయ నాటకంతో ముగిస్తే చివరకు నష్టపోయేది ప్రజలే. ప్రతి చిన్న విషయానికీ వాదించుకుని సభను వాయిదా వేయించడానికి పార్లమెంట్‌ను యుద్ధభూమిగా మార్చాలని అనుకోకూడదు. జాతీయ స్థాయిలో ప్రయోజనాలు సిద్ధించేలా చర్చలు సాగించడం, జవాబుదారీతనం ప్రదర్శించడం, చట్టాలు రూపొందించడం ఇవన్నీ నెరవేర్చగలిగే అత్యున్నత వ్యవస్థే పార్లమెంట్. గత దశాబ్దాల్లో వాజ్‌పేయ్, చం

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి గ్రావిటి ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించి తీరుతామని ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా కొన్ని వందల సార్లు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నొక్కి వక్కాణించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలు ఆ బ్యారేజీ పూర్తి అయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతాయని రెండున్నర ఏండ్లుగా చకోర పక్షుల్లా కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండున్నర ఏండ్లలో తుమ్మిడిహట్టి వ్యవహారం కొయ్యగుర్రం లెక్కకిందకు మీదకు ఊగుతున్నదే తప్ప ముందుకు కదలడం లేదు. డిసెంబర్ 2023లో ఎక్కడ ఉండిందో అక్కడనే ఉన్నది. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుకు కడతారా? లేక 151/150 మీటర్లకు కడతారా స్పష్టత లేదు. 2016లోనే 148 మీటర్ల గరిష్ట మట్టంతో బ్యారేజీ నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కాబట్టి 148 మీటర్లకు పైబడి ఏ ఎత్తుకు కట్టాలన్నా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం తప్పనిసరి అవసరం. ఈ సంగతి ప్రభుత్వానికి తెలియదని అనుకోలేము. అయితే ఈ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగినట్టు సంకేతాలు అయితే ఏమీ లేవు. మొక్కుబడిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖలు రాసినట్టు, ఆయన నుం

మన తెలంగాణ/హైదరాబాద్/ఘట్‌కేసర్: మీ హయాంలో నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాలు ఎం దుకు భర్తీ చేయలేదు, తాము ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించామని సిఎం రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే వా రికి ఉద్యోగాలు ఇచ్చిన మీరు(బిఆర్‌ఎస్) తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా అని నిలదీశారు. మేం నోటిఫికేషన్లు ఇస్తే వాటిని భర్తీ చేశామని సిఎం రేవంత్ రెడ్డి ని స్సిగ్గుగా మాట్లాడుతున్నారని కెటిఆర్ చేసిన వ్యా ఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందె శ్రీ జయంతి సందర్భంగా శనివారం ఘట్‌కేసర్ లో ఆయన స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమం త్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప పరీక్ష లు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం(కెసిఆర్) ఏనాడైనా ఆలోచించిందా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నిరుద్యోగుల పట్ల మీరెప్పుడైనా మనుషుల్లా ప్రవర్తించారా? మానవీయ కోణంలో చూశారా? అని విరుచుకుపడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంక

వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడంవల్ల ఏర్పడే ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో దక్షిణ పశ్చిమ రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండగా, తెలంగాణ రాష్ట్రం కూడా దీని ప్రభావానికి అతీతం కాదు. తెలంగాణలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా కొనసాగుతోంది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు వంటి పంటలు సకాలంలో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమవడం, తక్కువగా కురవడం లేదా అసమానంగా పడడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు విత్తనాలు వేసిన తర్వాత మొలకలు దెబ్బతినడం, పంట దిగుబడి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్‌నినో ప్రభావం కేవలం వ్యవసాయానికే పరిమితం కాదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. భూగర్భ జలాల మట్టం పడిపోవడం, చెరువులు, రిజర్వాయర్లలో నీటినిల్వలు తగ్గడం, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కావడం వంటి పరిణ

తెలంగాణలో సుమారు పదివేల పాఠశాలలు మూతపడతాయనే ప్రాథమిక సమాచారం అటు ఉపాధ్యాయులు, ఇటు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా తెలంగాణలో 2021లో కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన పాఠశాలలు హేతుబద్ధీకరణ జిఒ 25 ప్రకారం 0-19 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉనికిలో ఉన్నాయి. అట్లాంటి ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 10వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో 10 శాతం పిల్లల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎక్కడా టార్గెట్ చేరుకోలేదు. ఉన్న నమోదునే మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 10మంది కంటే తక్కువ నమోదు ఉంటే జిఒ ఎంఎస్ నెంబర్ 25, 2021 ప్రకారం పాఠశాల మూసివేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలిస్తారు. గత ఏడాది ఈ విధంగా 1400 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. కేంద్ర విద్యా గణాంకాలు ప్రకారం గత ఏడాది 1920 ప్రభుత్వ బడులు మూతపడితే అందులో 14 వందలు ఏకోపాధ్యాయ పాఠశాలలే మూత పడ్డాయి. వాస్తవంగా గత ప్రభుత్వాలు సర్వశిక్షా అభియాన్ నిబంధనలు ప్రకారం ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కి.మీ

మన తెలంగాణ/హైదరాబాద్: తమ పాలనలో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగంగానే అంగీకరించారు. అయితే, ఆ తప్పులను కేవలం గుర్తించడమే కాకుండా, బాధ్యులైన వారి పై తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నది కూడా తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అప్పట్లో టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీకైతే తమ పోలీసులే పట్టుకున్నారని, బయటవాళ్లెవరూ పట్టుకోలేదని చెప్పా రు. అయితే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ వ్యవహారం లో మరింత వేగంగా స్పందించాల్సి ఉండేదని అ న్నారు. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వా టిని సవరించుకుంటామని, కచ్చితంగా వచ్చే ఎ న్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో యువత ఆలోచనలకు, అవకాశాలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ అలా జరగకుండా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల అన్నగా తాను బాధ్యత తీసుకుని తమ ప్రభుత్వం వచ్చాక యువత కోసం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ హయాంలో 2,32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని కెటిఆర్ తెలిపారు. దీంతో పాటు దాదాపు 27 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నార

మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో ‘హైడ్రా’ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ పోలీసు బ లగాలతో రంగంలోకి దిగిన ‘హైడ్రా’ 840 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడి ఫెన్సింగ్ వేసింది. ఈ భూ ముల విలువ రూ.30వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నగర శి వార్లలోని శేరిలింగంపల్లి మండల ప రిధి రాయదుర్గం సర్వేనెంబర్ 46 లోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా.. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. రాయదు ర్గం ఐటీ కారిడార్‌లో టీ హబ్‌కు కూతవేటు దూ రంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో కన్నేసి సమీపంలో అరెకరం ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కాజేయాలని చూడటంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో జీఎల్‌ఆర్ (జనరల్ ల్యాండ్ రిజిష్టర్) నెంబర్ 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మైనింగ్ కార్యకలాపాలతో పాటు వణ్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ

మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్/మఠంపల్లి: నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో వెలుగుచూసిన ఈ నకిలీ ఎరువుల వ్యవహారం అక్కడి పోలీసులు కూపీ లాగితే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ తయారీ కేంద్రం డొంక కదిలింది. హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు కథనం ప్రకారం.. సూ ర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో విచ్చలవిడిగా నకిలీ గ్రోమా ర్ డీఏపీ, ఇతర ఎరువులను విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన ఓ రైతుకు అనుమానం రావడంతో గ్రోమోర్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. దాంతో సం స్థ ప్రతినిధులకు అనుమానం వచ్చి డీఏపిలోని ఎరువును, బ్యాగును పరిశీలించగా అనుమానం వచ్చి వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. తదనంతరం వారు సదరు డీఏపీ బ్యాగులోని శాంపిల్స్‌ను సేకరించి పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం నకిలీ ఎరువుగా గుర్తించారు. అనంతరం వ్యవసాయాధికారి శ్రీనివాస్ మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగి రైతుకు గ్రోమార్ ఎరువు అమ్మినవారిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు.విచారణలో హైదరాబాద్ శివారులో సరఫరా కేంద

నిబంధనలు పాటించని వాహనాల సీజ్‌మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత కట్టుదిట్టం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, […] The post రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరింత కట్టుదిట్టం appeared first on Navatelangana.

రమణమూర్తిపై దాడిచేసిన మతోన్మాది కశ్యప్‌రెడ్డిని అరెస్టు చేయాలిఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద 30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసననవతెలంగాణ – ముషీరాబాద్హిందూ ధర్మం వేరు.. మతోన్మాదులు వేరని, టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త రమణమూర్తిపై దాడి చేసిన కశ్యప్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద శనివారం సుమారు 30 ప్రజా […] The post హిందూ ధర్మం వేరు..మతోన్మాదులు వేరు appeared first on Navatelangana.

డీజీపీ సి.వి. ఆనంద్నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్‌లో ఇప్పటివరకు ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేదని, ఇదే బోర్డు విశ్వసనీయతకు నిదర్శనమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. పోలీసు నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శమని కొనియాడారు. సీసీటీఎన్‌ఎస్ జాతీయ స్థాయి బెంచ్‌మార్క్‌ను చేరుకోవాలంటే అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త టెక్నాలజీ వాడాలనీ, అన్ని యాప్‌లూ వినియోగించాలని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ […] The post పోలీస్ నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శం appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: చాలా కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు బిజెపి రాష్ట్ర నాయకులు ఎట్టకేలకు చేతులు కలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య సంధి కుదిరింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, పార్టీ జాతీయ ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చొరవ తీసుకుని ఇరువురి నేతల మధ్య వైరాన్ని తొలగించి సయోధ్య కుదిర్చారు. శనివారం మధ్యాహ్నం తారామతిపేటలోని డాక్టర్ లక్ష్మణ్ నివాసం ఈ సంధికి వేదిక అయ్యింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఉదయమే నేరుగా లక్ష్మణ్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. మూడు గంటలకు పైగా నలుగురి మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రి బండి వ్యవహారిస్తున్న తీరుపై ఎంపీ ఈటల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోగడ తాను ఎమ్మెల్యేగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గానికి వెళితే, బండి సంజయ్ అడ్డు చెప్పడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. ఆ నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధం పేగుబంధం వంటిదని, దానిని తొలగించుకోవడం తేలికైన పని కాదన్నారు. కేంద్

మన తెలంగాణ/-శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మం డల పరిధిలోని బహుదూర్‌గూడ గ్రామంలో శనివారం నాడు హైటెన్షన్ కొనసాగింది. గ్రామంలోకి హైడ్రా రాకతో ఉద్రిక్తత మొదలైంది. భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేపట్టారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు భారీ బందోబస్తు మధ్య ప్రికాస్ట్ గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. హైడ్రా బలగాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను, స్థానిక రైతులను పోలీసులు అరెస్టు చేశారు. చేవెళ్ల, మహేశ్వరం డీసీపీలు దగ్గరుండి మరీ పరిస్థితిని సమీక్షించారు. బహదూర్‌గూడలోని సర్వేనెంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు మొత్తం 650 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి, రైతులకు మధ్య వివాదం ఏండ్ల తరబడి కొనసాగుతున్నది.ఈ నేపథ్యంలో 650 ఎకరాలను అధీనంలోకి తీసుకునేందుకు 10-.07.-2026 నాడు రాజేంద్రనగర్ ఆర్డిఓ హైడ్రా అధికారులకు లేఖ రాశారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు హైడ్రా, రెవెన్యూ అధికారులు బహదూర్‌గూడకు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వబోమని కొన్ని రోజులుగా దీక్షలు చేపట్టారు.

మేష రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది. చేసిన పనిని మళ్లీమళ్లీ చేయవలసి వస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాలు బాగున్నాయి. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి. తుని రంగంలో ఉన్నవారికి మంచి స్థాయి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం కాకుండా మీరు సొంతంగా చేసే వ్యాపారాలు కలుసుబాటుగా ఉంటాయి. ఆదాయం బాగున్నప్పటికీ, అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శనికి తైలాభిషేకం చేయించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.వృషభ రాశి వారికి చాలావరకు అ

మనతెలంగాణ/సిటీబ్యూరోః హైదరాబాద్ మహానగరంలో ‘హైడ్రా’ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో శనివారం భారీ పోలీసు బలగాలతో రంగంలోకి దిగిన ‘హైడ్రా’ 840 ఎకరాల ప్రభుత్వం భూములను కాపాడి ఫెన్సింగ్ వేసింది. ఈ భూముల విలువ రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నగర శివార్లలోని శేరిలింగంపల్లి మండల పరిధి రాయదుర్గం సర్వేనెంబర్ 46లోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా...భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో టి హబ్‌కు కూతవేటు దూరంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో కన్నేసి సమీపంలో అరెకరం ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి...పక్కనే ఉన్న ప్రభుత్వభూమిని కాజేయాలని చూడటంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో జిఎల్‌ఆర్(జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నెంబర్ 243,255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మైనింగ్ కార్యకలాపాలతో పాటు వణ్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తూ కబ్జాదారులు ఆక్రమణలు చేస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా కబ్జాల

పరారీలో ఆరుగురు నిందితులురూ.10లక్షల విలువైన దగ్గు టానిక్, ట్యాబ్లెట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన అదనపు సిపి శ్రీనివాస్ మనతెలంగాణ / సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసి ట్యాబ్లెట్లు, చోకో దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ కమిషనరేట్ సిసిఎస్ స్పెషల్ క్రైం టీం, హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉండగా, రూ.10లక్షల విలువైన 77,700 టాబ్లెట్లు, 170 సిరప్ బిటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, మాంగర్‌బస్తీకి చెందిన మహ్మద్ సర్వర్ అలియాస్ రహీమ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, మహ్మద్ రబ్బానీ బ్యాండ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు, జమ్ము భాయ్, మహధారి, వీర్ధారి, ఇచ్ఛాధారి, అమన్ లాల్, బీదర్‌కు చెందిన కోహినూర్ కలిసి నిట్రాజోమ్ ట్యాబ్లెట్లు, చోకో కాఫ్ సిరప్‌లను నిల్వ చేస్తున్నారు. మహ్మద్ సర్వర్, రబ్బానీని పోలీసులు అరెస్టు చేయగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు కర్నాటక రాష్ట్రం బీదర్‌లోని తమకు తెలిసిన వారి వద్

మనతెలంగాణ / సిటిబ్యూరోః నల్గొండ ఎక్స్ రోడ్డు నుండి ఒవైసీ జంక్షన్ కారిడార్ వరకు సమగ్ర అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. సైదాబాద్ జంక్షన్ నుండి యాదగిరి థియేటర్ వరకు కుడి వైపున ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరిగే కాలంలో సైదాబాద్ వై జంక్షన్ నుండి యాదగిరి థియేటర్ వరకు ఒకవైపు రహదారిని పూర్తిగా మూసివేస్తారు. నల్గొండ ఎక్స్ రోడ్ నుండి ఒవైసీ ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డు నుంచి ప్రయాణించవద్దు. నల్గొండ ఎక్స్ రోడ్ నుండి చంద్రాయణగుట్ట వైపు వెళ్లే వాహనాలు సైదాబాద్ వై జంక్షన్ వద్ద మళ్లిస్తారు. సైదాబాద్ వై జంక్షన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని డిసిపి ఈస్ట్ జోన్ ఆఫీస్, సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ , సరస్వతి నగర్ కమాన్, శంకేశ్వర్ బజార్, ఇండియన్ పెట్రోల్ బంక్ (కుడి మలుపు), సింగరేణి కాలనీ, ఓనస్ రోబోటిక్ ఆస్పత్రి, చంపాపేట్ మె

జాతీయ ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి జాతీయ ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరంలో విడుదలైన వైవిధ్యభరితమైన 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ సౌత్ ఫిల్మ్‌మేకర్ జయరాజ్ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 (హిందీ) నిలిచింది. ఇక జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి (భ్రమయుగం), కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్) సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా యామి గౌతమ్ (ఆర్టికల్ 370), ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్)లను జాతీయ అవార్డులు వరించాయి. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా ’కమిటీ కుర్రోళ్లు’ ఈ అవార్డుకు ఎంపికైంది. జాతీయ ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (దర్శకుడు నాగ్ అశ్వ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఒత్తిడి పరిస్థితులలో కణాలను రక్షించడం, కండరాల పనితీరును కాపాడటం, దీర్ఘాయువును పెంచడంలో పతంజలి వారి ప్రత్యేక చ్యవన్‌ప్రశ్‌కు విశేష గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రిక ‘ఎక్స్‌పెరిమెంటల్ జెరోంటాలజీ’లో సంబంధిత అధ్యయనం ప్రచురితమైంది. ఈ క్రమంలో పతంజలి శాస్త్రవేత్తలు కీలక శాస్త్రీయ మైలురాయిని సాధించినట్లయింది. శాస్త్రీయ సమాజంలో ఆయుర్వేదాన్ని ఒక ఆధార-ఆధారిత వైద్య విధానంగా స్థాపించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ పతంజలి శాస్త్రవేత్తలు ఈ శాశ్వతమైన సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ ఆలోచనలు మరియు వివేకంతో బలపరిచి, పరిశోధన మరియు సాంకేతికత ద్వారా ఈ ప్రాచీన కథనానికి తిరిగి జీవం పోశారని ప్రశసించారు. అధ్యయనం గురించి పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ మాట్లాడుతూ పరిశోధనను ఆయుర్వేదం మరియు సమకాలీన శాస్త్రాల అద్భుతమైన సమ్మేళనంగా అభివర్ణించారు.

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెట్టాల్సిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. పేపర్ లీకుల పాలన మీదైతే...కొలువుల జాతర తమది అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఖాళీలు భర్తీ చేయకుండా పదేళ్ళు కాలం గడిపి, ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయమైపోతున్నదని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తొలుత యువతకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించాలన్నారు. కెటిఆర్ చేసిన ఆరోపణలకు అధికారిక గణాంకాలతో ఉద్యోగాల వివరాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.యువ సంగ్రామ సభలో చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, యువతను మభ్యపెట్టే రాజకీయ ప్రయత్నాలు ఇకపై సాగవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లి విద్యార్థుల సమస్యలు వినని నాయకులు, ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ చూపించడం రాజకీయ అవకాశవాదమేనని అన్నారు.